సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బన్నీని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పీఎస్ కు తరలించారు. పీఎస్ లో అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. పోలీసులు ప్రస్తుతం రిమాండ్ రిపోర్టును తయారు చేస్తున్నారు. మరోవైపు వైద్య పరీక్షల కోసం బన్నీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బన్నీపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదయింది. ఆయన న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఇంకోవైపు, చిక్కడపల్లి పీఎస్ కు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, సోదరుడు శిరీష్ చేరుకున్నారు. ఇక షూటింగ్ మధ్యలో ఆపి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చిరంజీవి బయలుదేరారు. చిరంజీవిని పోలీస్ స్టేషన్‌కు రావొద్దని పోలీసులు అభ్యర్థించారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ వద్దకు నిర్మాత దిల్ రాజు చేరుకున్నారు.
police requested Chiranjeevi not to come to the police station
చిరంజీవిని పోలీస్ స్టేషన్‌కు రావొద్దని అభ్యర్థించిన పోలీసులు
పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న నిర్మాత దిల్ రాజు https://t.co/wEpkufa5pI pic.twitter.com/bSuocMLHhH
— Telugu Scribe (@TeluguScribe) December 13, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)