బీహార్‌లోని బంకాలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులు కాలేజీ మెస్‌లో తమకు అందించిన ఆహారంలో చనిపోయిన పాము కనిపించిందని పేర్కొన్నారు. కనీసం 11 మంది విద్యార్థులు ఆహారం తిన్న తర్వాత వికారం, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.ఆహారంలో పాము లాంటి జీవి కనిపించిన భోజనం ఫోటో సోషల్ మీడియాలో కనిపించింది.మరోవైపు ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం సత్వర చర్యలు చేపట్టింది.ఆహారం విక్రయించే వ్యక్తిని మార్చడమే కాకుండా భారీగా జరిమానా విధించింది. దీంతో పాటు ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు ప్రతిరోజూ విద్యార్థులతో కలిసి భోజనం చేసేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ వీడియో చూస్తే బిర్యానీ పార్సిల్ అంటే భయపడిపోవాల్సిందే, బల్లిని కూడా చికెన్ ముక్కలాగా ఎలా పార్సిల్ చేశారో మీరే చూడండి
Here's News
A dead snake found in the meal at government engineering College banka, bihar. Immediately after consuming the food students experienced vomiting and nausea. Even after visit of local authority no appropriate action was taken. pic.twitter.com/hOapcBNwlU
— Rishi singh (@FFire1008) June 16, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)