టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం డాకు మహారాజ్ నుంచి దబిడి దిబిడే" అనే పాటని మేకర్స్ యూట్యూబ్ లో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కంపోజ్ చేశాడు. అలాగే యంగ్ సింగర్ వాగ్దేవి తో కలసి పాడాడు. ప్రముఖ లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించాడు. ఊలాల, ఊలాల అంటే మొదలయ్యే లిరిక్స్, బాలయ్య బాబు ఊర్వశితో కలసి వేసిన స్టెప్పులు ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాకి తెలుగు ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వం వహించగా స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మించాడు. బ్యూటిఫుల్ హీరోయిన్లు ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్, ఉర్వశి రౌతేలా(బాలీవుడ్) తదితరులు బాలయ్యకి జంటగా నటించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 12న రిలీజ్ కాబోతోంది.
Dabidi Dibidi Full Video Song out:
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)