మధ్యప్రదేశ్‌కు చెందిన పరుశురామ్ కళ్యాణ్ బోర్డు (Parshuram Kalyan Board) అధ్యక్షుడు పండిట్ విష్ణు రజోరియా (Pandit Vishnu Rajoria) కీలక ప్రకటన చేశారు. బ్రాహ్మణ యువ జంటలు నలుగురు పిల్లలను కంటే రూ.లక్ష బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. రాష్ట్ర క్యాబినెట్ హోదాలో ఉన్న ఆయన ఇలాంటి ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించిన కార్యక్రమంలో రజోరియా మాట్లాడుతూ.. దేశంలో నాస్తికుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నదని..దీనికి కారణం మనం కుటుంబాలపై దృష్టి సారించకపోవడమే అని తెలిపారు.
నాకు యువత మీద చాలా ఆశలు ఉన్నాయి. వయసుపైడిన వారిపై పెద్దగా ఆశలు పెట్టుకోలేం. భవిష్యత్ తరాన్ని రక్షించాల్సిన బాధ్యత మీపైనే ఉందన్నారు. యువత జీవితంలో సెటిలై ఒక సంతానంతో సరిపెట్టుకుంటున్నారు. ప్రతి జంట నలుగురు పిల్లలను కనాలని నేను మిమ్ములను కోరుతున్నా’ అని రజోరియా సూచించారు. అయితే ఈ ప్రకటన పూర్తిగా తన వ్యక్తిగతమని, ఈ ప్రకటనతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. బ్రాహ్మణ కులానికి సంబంధించిన కార్యక్రమంలో తాను ఈ ప్రకటన చేశానని చెప్పారు.
Have 4 children, get Rs 1 lakh: Pandit Vishnu Rajoria
#MP#Brahman Couple Produces Four Kids, Get One Lakh: Pandit Vishnu Rajoriya, Chairman, MP #Parashuram_Kalyan Board-a Govt body and BJP leader. pic.twitter.com/91nX4aeTlS
— काश/if Kakvi (@KashifKakvi) January 13, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)