బ్రెజిల్‌లో నెల్లూరు జాతి ఆవు చరిత్ర సృష్టించింది. బ్రెజిల్‌లో జరిగిన వేలంపాటలో ఈ ఒంగోలు జాతి ఆవు దాదాపు 40 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. జపాన్‌కు చెందిన వాగ్యు, మన దేశంలో బ్రాహ్మణ్‌ పేరు గల ఆవులకు గతంలో రికార్డు ధరలు దక్కిన సంగతి విదితమే. తాజాగా బ్రెజిల్‌లోని మినాస్‌ గెరైస్‌లో జరిగిన వేలంలో నెల్లూరు జాతికి చెందిన వియాటినా-19 అనే ఆవు 4.8 మిలియన్‌ డాలర్లకు అమ్ముడుపోయి వరల్డ్ రికార్డు నెలకొల్పింది.

వీడియో చూస్తే ఒళ్లు జలదరించడం ఖాయం, భారీ కొండ చిలువను ఎలా ప్రశాంతంగా పట్టుకున్నాడో మీరో చూడండి

ఇది సుమారు 1,101 కిలోల బరువు కలిగి ఉంది. వియాటినా-19 అత్యధిక ధర పలికిన ఆవుగా గిన్నిస్‌ బుక్‌లో చోటు దక్కించుకుంది.గతంలో కండరాల నిర్మాణం, అత్యంత అరుదైన జన్యువులు కలిగి ఉన్నందుకు గానూ ‘ఛాంపియన్స్‌ ఆఫ్‌ ది వరల్డ్‌’లో ‘మిస్‌ సౌత్‌ అమెరికా’ పురస్కారమూ పొందింది ఈ ఆవు.ఇక అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే సామర్థ్యం ఉన్న వీటికి ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో భారీ డిమాండ్‌ ఉంది. 1800లలో ఈ జాతి ఆవులు బ్రెజిల్‌కు ఎగుమతి అయ్యాయి. కండరాల నిర్మాణం, రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటంతో వీటివైపే అందరూ చూస్తున్నారు.

Nellore Breed Cow Viatina-19 Sold for Rs 40 Crore in Brazil

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)