కర్ణాటకలోని శివమొగ్గ (Shivamogga)లో ఓ వ్యక్తి ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ను తన కారు బ్యానెట్‌ (Car Bonnet)పైకి ఎక్కించుకొని అలాగే కొంతదూరం ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మిథున్‌ అనే వ్యక్తి తన ఎస్‌యూవీ కారులో అతివేగంగా వెళ్తుండగా అదే రూట్‌లో వాహనాలను చెక్‌ చేస్తున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్ ప్రభు‌.. మిథున్‌ వాహనానికి అడ్డంగా వెళ్లి పక్కకు ఆపమన్నాడు. దీంతో అతను కారును రోడ్డు పక్కకు ఆపాడు. కానిస్టేబుల్‌ ఆ కారు ముందు నిల్చొని ఏదో చెక్‌ చేస్తుండగా.. మిథున్‌ కారును ఒక్కసారిగా ముందుకు పోనిచ్చే ప్రయత్నం చేశాడు.

అప్రమత్తమైన కానిస్టేబుల్‌ వెంటనే కారు బ్యానెట్‌పైకి ఎక్కాడు. అనంతరం కారును మిథున్‌ తన కారును అలాగే ముందుకు పోనిచ్చా డు. దాదాపు 100 మీటర్ల వరకూ వెళ్లి ఆపేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై శివమొగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సదరు నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

స్నేహితులతో మాట్లాడుతూనే గుండెపోటుతో కుప్పకూలిన యువకుడు, షాకింగ్ వీడియో ఇదిగో..

SUV Driver Refuses To Stop, Drags Cop On Bonnet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)