ఐసీసీ మెన్స్ ప్లేయ‌ర్ ర్యాంకింగ్స్ లో భారత రైట్ హ్యాండ్ స్టార్ బ్యాట‌ర్ శుభ‌మ‌న్ గిల్‌(Shubman Gill).. వ‌న్డేల్లో నెంబ‌ర్ వ‌న్ ర్యాంక్ సాధించాడు. పాకిస్థాన్ బ్యాట‌ర్ బాబ‌ర్ ఆజ‌మ్‌ను వెన‌క్కి నెట్టి గిల్ ఆ ప్లేస్‌ను సొంతం చేసుకున్నాడు. చాంపియ‌న్స్ ట్రోఫీ ప్రారంభం కావ‌డానికి ముందు.. ఐసీసీ తాజా వ‌న్డే ర్యాంక్ లిస్టును రిలీజ్ చేసింది. కాగా వ‌న్డే క్రికెట్లో శుభ‌మ‌న్ గిల్ నెంబ‌ర్ వ‌న్ ర్యాంక్‌లో నిల‌వ‌డం ఇది రెండోసారి. 2023 ఐసీసీ వ‌ర‌ల్డ్‌క‌ప్ స‌మ‌యంలోనూ.. బాబ‌ర్‌ను దాటేసి గిల్ ఆ ర్యాంక్‌ను పొందాడు. ఇండియ‌న్ బ్యాట‌ర్ రోహిత్ శ‌ర్మ మూడ‌వ స్థానంలో ఉన్నాడు. అయిదో స్థానికి కివీస్ ప్లేయ‌ర్ డారెల్ మిచెల్ చేరుకున్నాడు.టాప్ టెన్ ర్యాంకులో లంక బ్యాట‌ర్ అస‌లంక కూడా చేరుకున్నాడు.

 క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ఇక పండుగే! ఐపీఎల్ -2025 షెడ్యూల్‌ వచ్చేసింది, హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడెప్పుడు ఉన్నాయంటే?

ఇక వ‌న్డేల్లో టాప్ బౌల‌ర్‌గా శ్రీలంక స్పిన్న‌ర్ మ‌హేశ్ తీక్ష‌ణ నిలిచాడు. ఆఫ్ఘ‌న్ బౌల‌ర్ ర‌షీద్ ఖాన్‌ను అత‌ను వెన‌క్కినెట్టేశాడు. రెండో స్థానంలో ఆఫ్ఘ‌న్ స్పిన్న‌ర్ రిజ్వాన్ నిలిచాడు. నాలుగో స్థానంలో కుల్దీప్ యాద‌వ్‌, ఆరో స్థానంలో కేశ‌వ్ మ‌హారాజ్‌, ఏడో స్థానంలో మిచెల్ సాంట్న‌ర్ ఉన్నారు. ఆఫ్ఘ‌నిస్తాన్ ప్లేయ‌ర్ మ‌హ‌మ్మ‌ద్ న‌బీ .. వ‌న్డే ఆల్‌రౌండ‌ర్ ర్యాంకుల్లో ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. టాప్ టెన్‌లోకి సాంట్న‌ర్ వ‌చ్చేశాడు.

Shubman Gill Dethrones Babar Azam To Become Number One Batter in ICC ODI Rankings 2025

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)