ఏపీలో ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో బ‌ర్డ్ ఫ్లూ వైర‌స్ వ్యాప్తి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఈ వైర‌స్ కార‌ణంగా ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో సుమారు 50 లక్ష‌లకు పైగా కోళ్లు మృతి చెందిన‌ట్లు స‌మాచారం. బ‌ర్డ్ ఫ్లూపై సోష‌ల్ మీడియా వేదిక‌గా విస్తృత ప్ర‌చారం, అధికారుల హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో ఏపీలో చికెన్ ధ‌ర‌లు భారీగా ప‌డిపోయాయి. అటు క‌స్ట‌మ‌ర్లు రాక‌పోవ‌డంతో చికెన్ సెంట‌ర్లు బోసి పోతున్నాయి.

ఏలూరు జిల్లాలో మనిషికి బర్డ్ ఫ్లూ సోకిందనే వార్త పూర్తిగా అబద్దం, సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను నమ్మకండని తెలిపిన ఏపీ ఫ్యాక్ట్ చెక్

ఈ క్ర‌మంలో తాజాగా వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బ‌ర్డ్ ఫ్లూపై ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని ప్ర‌క‌టించారు. ఉడికించిన చికెన్‌, గుడ్లు తింటే ప్ర‌మాదం ఏమీలేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. బ‌ర్డ్ ఫ్లూపై సోష‌ల్ మీడియా, కొన్ని ప‌త్రిక‌లు భ‌యాందోళ‌న‌లు సృష్టిస్తున్నాయ‌ని, అలాంటి వాటిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. కేంద్రం, శాస్త్ర‌వేత్త‌ల‌తో చ‌ర్చించామ‌ని చెప్పిన మంత్రి.. కోళ్ల‌కు వ్యాధి సోకిన ప్రాంతానికి ఒక కిలోమీట‌ర్ వ‌ర‌కే ఇది ప‌రిమితం అవుతుంద‌ని చెప్పిన‌ట్లు అచ్చెన్నాయుడు వెల్ల‌డించారు.

No Need for Panic about Bird Flu says Andhra Pradesh Minister Kinjarapu Atchannaidu

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)