Mekapati Goutham Reddy Death Anniversary: ఐ మిస్‌ యూ గౌతమ్‌ అంటూ వైఎస్ జగన్ ఎమోషనల్ ట్వీట్, నా ప్రియమైన స్నేహితుడంటూ భావోద్వేగ సందేశం

దివంగత మేకపాటి గౌతమ్‌ రెడ్డి మూడవ వర్ధంతి సందర్భంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ.. నా ప్రియమైన స్నేహితుడంటూ భావోద్వేగ సందేశం ఉంచారు

Mekapati Goutham Reddy Death Anniversary: ఐ మిస్‌ యూ గౌతమ్‌ అంటూ వైఎస్ జగన్ ఎమోషనల్ ట్వీట్, నా ప్రియమైన స్నేహితుడంటూ భావోద్వేగ సందేశం
Jagan and Goutham Reddy (Photo/X/Jagan)

దివంగత మేకపాటి గౌతమ్‌ రెడ్డి మూడవ వర్ధంతి సందర్భంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ.. నా ప్రియమైన స్నేహితుడంటూ భావోద్వేగ సందేశం ఉంచారు. నా ప్రియ మిత్రుడు మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati Goutham Reddy) మూడో వర్ధంతి సందర్భంగా.. నేను ఆయన్ని మనసారా గుర్తు చేసుకుంటున్నా. ఐ మిస్‌ యూ గౌతమ్ అంటూ ఎక్స్‌ ఖాతాలో సందేశం ఉంచారు.

గుండెపోటుతో మేకపాటి గౌతమ్‌రెడ్డి కన్నుమూత, ఇటీవలే కోవిడ్‌ బారిన పడి కోలుకున్న ఏపీ ఐటీశాఖ మంత్రి

ఆత్మకూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ఏపీ ఏపీ ఐటీ, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి (49) 2022 ఫిబ్రవరి 21వ తేదీన హైదరాబాద్‌(Hyderabad) లోని తన నివాసంలో గుండెపోటుతో కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా.. వైద్యులు తీవ్రంగా శ్రమించినా.. ఫలితం లేకపోయింది. గౌతమ్‌ రెడ్డి మరణంతో తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి కుమారుడైన గౌతమ్‌ రెడ్డి.. 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున ఆయన విజయం సాధించారు.

Jagan Tweet on Mekapati Goutham Reddy Death Anniversary

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 21, 2025 02:16 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).