క్రీడలు

IPL 2023: ఒకే జట్టుకు 200 మ్యాచ్‌ల్లో నాయకత్వం వహించిన తొలి కెప్టెన్‌గా ధోనీ సరికొత్త రికార్డు, అత్యధిక ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్ల జాబితాలో తొలి స్థానంలో మిస్టర్ కూల్

Hazarath Reddy

చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఐపీఎల్‌లో ఒకే జట్టుకు 200 మ్యాచ్‌ల్లో నాయకత్వం వహించిన తొలి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌-2023లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు కెప్టెన్‌ హోదాలో మైదానంలో అడుగుపెట్టిన మిస్టర్‌ కూల్‌ ఈ ఘనతను సాధించాడు

IPL 2023: వీడియో ఇదిగో, ధోని సిక్స్‌ల దెబ్బకి బద్దలైన పాత రికార్డులు, ధోనీ బ్యాటింగ్‌కు రాగానే రూ.2 కోట్ల మార్క్‌ను దాటిన జియో సినిమా వ్యూస్

Hazarath Reddy

ఐపీఎల్‌-2023లో రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓటమి పాలైనప్పటికీ.. ఆ జట్టు కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని సిక్స్ ల దెబ్బకి రేటింగ్ ఆకాశానికి ఎగబాకింది. ధోని ఆఖరి వరకు క్రీజులో ఉన్నప్పటికీ తన జట్టును గెలిపించలేకపోయాడు.

IPL 2023: చెన్నైకి భారీ షాక్, మోకాలి గాయంతో బాధపడుతున్న ధోనీ, అందుకే చివరి బంతికి ఫోర్ కొట్టి గెలిపించలేకపోయాడని తెలిపిన సీఎస్‌కే హెడ్‌ కోచ్‌ స్టీఫెన్ ఫ్లెమింగ్

Hazarath Reddy

ఐపీఎల్‌-2023లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ రెండో పరాజయం చవిచూసింది. చెపాక్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో సీఎస్‌కే ఓటమి పాలైంది

IPL 2023, CSK vs RR: రాజస్థాన్ రాయల్స్‌తో ఉత్కంఠ భరితమైన మ్యాచులో చేతులెత్తేసిన చెన్నై సూపర్ కింగ్స్, విజయానికి 3 పరుగుల దూరంలో నిలిచి పోయిన ధోనీ సేన

kanha

రాజస్థాన్‌తో జరిగిన టీ 20 ఐపీఎల్ మ్యాచ్‌లో CSK మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది. సందీప్ శర్మ చివరి మూడు బంతుల్లో 7 పరుగులు డిఫెండ్ చేయడంలో అద్భుత ప్రదర్శన చేశాడు

Advertisement

LSG Players At Ram Mandir Site In Ayodhya: అయోధ్య రామాలయాన్ని సందర్శించిన లక్నో సూపర్ జెయింట్స్ టీం, నేడు LSG vs PBKS మ్యాచ్

Hazarath Reddy

లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టు పంజాబ్ కింగ్స్ (PBKS)తో జరగబోయే మ్యాచ్‌కు ముందు బుధవారం అయోధ్య రామాలయాన్ని సందర్శించింది. వైరల్ అవుతున్న చిత్రంలో LSG జట్టు సభ్యులు, ఆటగాళ్ళు ఆలయం ముందు నిలబడి ఉన్నారు, దీని నిర్మాణం ఇప్పటికీ కొనసాగుతోంది.

ICC ODI World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌‌కు సర్వం సిద్ధం, ఆ రెండు స్టేడియాల్లోనే పాక్ ఆడుతుందట, భారత్ ఆసియా కప్ ఆడకుంటే ప్రపంచకప్ మేము ఆడమని తేల్చేసిన దాయాది దేశం

Hazarath Reddy

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ టోర్నీకి (ICC One Day World Cup) భారత్‌ (Bharath) ఆతిథ్యమివ్వనుంది. అక్టోబర్‌ 5న టోర్నీ ఆరంభమవుతుంది. నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ తో ముగుస్తుంది. ఫైనల్‌ సహా మొత్తం 46 మ్యాచ్‌లను 12 వేదికల్లో నిర్వహించనున్నారు.

Rohit Sharma Video Call Wife: వీడియో ఇదిగో, ముంబై విజయం తర్వాత భార్యకు వీడియో కాల్ చేసిన రోహిత్ శర్మ, ఇది ఒక క్రేజీ గేమ్ అని తెలిపిన రితికా

Hazarath Reddy

IPL 2023లో ముంబై ఇండియన్స్ తమ మొదటి విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో తమ ఖాతాని తెరిచింది. రోహిత్ శర్మ బ్యాట్‌తో హాఫ్ సెంచరీ సాధించి ముంబై ఇండియన్స్ విజయానికి వేదికగా నిలిచాడు. మ్యాచ్ తర్వాత, రోహిత్ భార్య రితికా సజ్దేహ్‌కి వీడియో కాల్ చేసి, సీజన్‌లో కష్టతరమైన మొదటి విజయంపై చాట్ చేశాడు. ఇది ఒక క్రేజీ గేమ్ అని రితికా పేర్కొంది. వీడియో ఇదిగో..

Asia Cup 2023: భారత్ ఆసియా కప్ కోసం పాకిస్తాన్ రాకుంటే.. మా జట్టు ఆసియా కప్ బహిష్కరిస్తే రూ.25 కోట్లు నష్టపోతాం, పీసీబీ ఛైర్మెన్ నజామ్‌ సేథీ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(PCB) ఛైర్మెన్‌ నజామ్‌ సేథీ (Najam Sethi) సంచలన వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా కప్‌ను (Asia Cup) మా జట్టు బహిష్కరిస్తే పీసీబీ ఆదాయంలో మూడు అమెరికన్‌ మిలియన్‌ డాలర్లు(సుమారు రూ.25 కోట్ల రూపాయలు) నష్టపోతుందని తెలిపారు.

Advertisement

IPL 2023: నీవు దేనికి పనికిరావా, సూర్యకుమార్ యాదవ్ మళ్లీ డకౌట్‌‌పై మండిపడుతున్న ముంబై ఫ్యాన్స్ , గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో నాలుగు సార్లు గోల్డెన్‌ డకౌట్‌

Hazarath Reddy

ముంబై ఇండియన్స్‌ స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ గోల్డెన్‌ డకౌట్ల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సూర్యకుమార్‌ గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు. ఢిల్లీ బౌలర్ ముకేశ్‌ కుమార్‌ బౌలింగ్‌లో అనవసరమైన షాట్‌కు యత్నించి కుల్దీప్‌ యాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో సూర్యకు ఇది నాలుగో గోల్డెన్‌ డక్‌ కావడం గమనార్హం.

IPL 2023: నీకు బుర్ర ఉందా..ఏం చేస్తున్నావసలు, లలిత్‌ యాదవ్‌పై మండిపడిన డేవిడ్ వార్నర్, ముంబైపై ఓటమితో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన ఢిల్లీ

Hazarath Reddy

ఐపీఎల్‌-2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తమ పరాజయాల పరంపరను కొనసాగిస్తోంది. అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ ఓటమిపాలైంది. పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో లలిత్‌ యాదవ్‌పై ఢిల్లీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ కోపంతో ఊగిపోయాడు.

DC v MI: ఢిల్లీ కాపిటల్స్ జట్టుపై ముంబై ఇండియన్స్ సంచలన విజయం..రెండు ఓటముల తర్వాత బోణీ కొట్టిన రోహిత్ సేన

kanha

ఐపీఎల్ 2023లో ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ విజయం ఖాతా తెరిచింది. IPL 16వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC v MI)ని 6 వికెట్ల తేడాతో ఓడించడం ద్వారా ముంబై ప్రస్తుత సీజన్‌లో మొదటి విజయాన్ని నమోదు చేసింది.

IPL 2023: కెఎల్ రాహుల్‌పై విరుచుకుపడుతున్న లక్నో ఫ్యాన్స్, ఈ ఆటకు రూ. 17 కోట్లు తీసుకున్నావా అంటూ ట్రోల్, టెస్టు మ్యాచ్ కాదిది అంటూ కామెంట్స్

Hazarath Reddy

సోమవారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్ KL రాహుల్ మళ్లీ విఫలమయ్యాడు.LSG కెప్టెన్ భారీ ఛేజింగ్‌లో 20 బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేయగలిగాడు. బ్యాటర్‌గా RCBకి పై రాహుల్ అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు.

Advertisement

BCCI Domestic Schedule 2023-24: మరో సమరానికి రెడీ, దులీప్ ట్రోఫీ, రంజీ ట్రోపీ షెడ్యూల్‌ను ప్రకటించిన బీసీసీఐ

Hazarath Reddy

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రానున్న దేశవాళీ సీజన్ షెడ్యూల్‌ను ప్రకటించింది.2023-24 దేశవాళీ సీజన్ జూన్ 28న దులీప్ ట్రోఫీ టోర్నమెంట్‌తో ప్రారంభం కానుంది. రంజీ ట్రోపీ వచ్చే ఏడాది జనవరి 5 నుంచి మొదలవనున్నది. గత సీజన్‌లో సౌరాష్ట్ర జట్టు బెంగాల్‌ను ఓడించి రంజీ ట్రోఫీని కైవసం చేసుకుంది.

IPL 2023: ఐపీఎల్‌ 2023లో ఫాస్టెస్ట్‌ ఫిప్టీ వీడియో ఇదిగో, బెంగుళూరు బౌలర్లను ఉతికి ఆరేసిన పూరన్, ఐపీఎల్‌లో చరిత్రలో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ చేసిన రెండో ఆటగాడిగా రికార్డు

Hazarath Reddy

ఐపీఎల్‌లో-2023లో రాయల్స్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆర్సీబీపై లక్నో ఒక్క వికెట్ తేడాతో గెలుపొందింది.టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది

IPL 2023: లాస్ట్ బాల్ డ్రామా వీడియోలు ఇవిగో, ర‌స‌వ‌త్త‌ర పోరులో చివరి బంతికి గెలిచిన లక్నో, వర్కవుట్ కాని హ‌ర్ష‌ల్ ప‌టేల్ ప్లాన్

Hazarath Reddy

ఐపీఎల్‌లో బెంగుళూరుతో జ‌రిగిన ర‌స‌వ‌త్త‌ర పోరులో .. ల‌క్నో(Lucknow Super Giants) జ‌ట్టు చివ‌రి బంతికి అనూహ్య రీతిలో విక్ట‌రీ కొట్టింది. అయితే హ‌ర్ష‌ల్ ప‌టేల్(Harshal Patel) వేసిన ఆ ఓవ‌ర్‌లో హైడ్రామా చోటుచేసుకున్న‌ది.మొద‌టి 5 బంతుల్లో వుడ్‌, ఉన‌ద్క‌త్ ఔట్ కాగా నాలుగు ర‌న్స్ వ‌చ్చాయి

IPL 2023: ఓటమి బాధలో ఉన్న బెంగళూరుకు భారీ షాక్, కెప్టెన్ డుప్లెసిస్‌కు రూ. రూ.12 లక్షల జరిమానా, అతిగా ప్రవర్తించిన లక్నో ఆటగాడు అవేశ్ ఖాన్‌కు వార్నింగ్

Hazarath Reddy

బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ (RCB), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చివరి వరకు బెంగళూరుదే విజయం అనుకుంటే పూరన్ (Nicholas Pooran) సంచలన ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌కు (Faf du Plessis) డబుల్ షాక్ తగిలింది.

Advertisement

IPL 2023: వీడియో ఇదిగో, మళ్లీ ట్రోలింగ్‌కు చిక్కిన గౌతం గంభీర్, ఫ్యాన్స్ వైపు చూస్తూ నోటిపై చేతులు వేసి సైలెన్స్ అంటూ సంజ్ఞలు

Hazarath Reddy

అత్యంత ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుపై లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ అనూహ్య విజయం సాధించింది.లక్నో టీమ్ విజయం సాధించిన అనంతరం ఆ జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) బాగా ఎమోషన్‌కు గురయ్యాడు. మ్యాచ్ అనంతరం మైదానంలోకి వచ్చినపుడు స్టేడియంలోని ఫ్యాన్స్ వైపు చూస్తూ నోటిపై చేతులు వేసి ``సైలెన్స్`` అని సంజ్ఞలు చేశాడు.

IPL 2023: రెండోసారి చతికిలపడిన బెంగుళూరు, ఓటమి తట్టుకోలేక స్టేడియంలోనే ఏడ్చేసిన అభిమానులు, వైరల్ అవుతున్న వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఐపీఎల్‌లో బెంగుళూరుతో జ‌రిగిన ర‌స‌వ‌త్త‌ర పోరులో .. ల‌క్నో(Lucknow Super Giants) జ‌ట్టు చివ‌రి బంతికి అనూహ్య రీతిలో విక్ట‌రీ కొట్టింది.అయితే సీజన్ మారినా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ (RCB) తీరు మాత్రం మారడం లేదు. మ్యాచ్ చివరి క్షణాల్లో ఒత్తిడిని జయించలేక చతికిల పడడం ఆర్సీబీ ఆటగాళ్లకు అలవాటుగా మారిపోయింది.

RCB vs LSG, IPL 2023: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన హైవోల్టేజీ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ 1 వికెట్ తేడాతో విజయం

kanha

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన హైవోల్టేజీ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ 1 వికెట్ తేడాతో విజయం సాధించింది. RCB 213 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది, లక్నో చివరి బంతికి 9 వికెట్ల నష్టానికి సాధించింది.

IPL 2023: చెన్నై సూపర్‌కింగ్స్‌ను వెంటాడుతున్న గాయాలు, తాజాగా తొడ కండరాల గాయంతో ఆస్పత్రిపాలైన ఫాస్ట్‌బౌలర్‌ దీపక్‌ చాహర్‌, ఇప్పటికే ఇద్దరు దూరం

Hazarath Reddy

చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఒకరి తర్వాతర ఒకరికి గాయాలు వెంటాడుతున్నాయి. తాజాగా ఆ జట్టు ఫాస్ట్‌బౌలర్‌ దీపక్‌ చాహర్‌ కు తొడ కండరాల గాయమైంది. అతడికి స్కాన్‌లు తీయనున్నారు. శనివారం ముంబయితో మ్యాచ్‌లో చాహర్‌.. ఒకే ఒక్క ఓవర్‌ బౌలింగ్‌ చేసి మైదానాన్ని వీడాడు.

Advertisement
Advertisement