Sports

IPL 2022 Auction: జాక్ పాట్ కొట్టేసిన శ్రీలంక క్రికెట‌ర్ వ‌నిందు హ‌స‌రంగ, రూ. 10.75 కోట్ల‌కు సొంతం చేసుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగుళూరు

Hazarath Reddy

ఐపీఎల్ 2022 వేలంలో శ్రీలంక క్రికెట‌ర్ వ‌నిందు హ‌స‌రంగ జాక్ పాట్ కొట్టేశాడు. ఆల్‌రౌండ‌ర్ హ‌స‌రంగ‌ను రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగుళూరు జ‌ట్టు సొంతం చేసుకున్న‌ది. అత‌న్నిరూ. 10.75 కోట్ల‌కు ఆ టీమ్ ఖ‌రీదు చేసింది. కోటి రూపాయ‌ల క‌నీస ధ‌ర‌తో హ‌స‌రంగ బిడ్డింగ్ జ‌రిగింది.

IPL 2022 Auction: ఐపీఎల్‌ -2022 మెగా వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఇషాన్‌ కిషన్‌, రూ. 15.25 కోట్లు పెట్టి సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్‌

Hazarath Reddy

ఐపీఎల్‌ -2022 మెగా వేలంలో టీమిండియా యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ దుమ్ములేపాడు. అత్యధికంగా 15. 25 కోట్ల రూపాయలు పలికాడు. రిటెన్షన్‌లో అతడిని వదిలేసిన ముంబై ఇండియన్స్‌ వేలంలో పోటీ పడి మరీ దక్కించుకుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఢీకొట్టి ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ను సొంతం చేసుకుంది.

IPL 2022 Auction: నికోలస్ పూరన్‌ను రూ. 10.75 కోట్లకు కొనుగోలు చేసిన హైదరాబాద్, కెకెఆర్ కూడా పోటీ పడినప్పటికీ సన్ రైజర్స్ సొంతం

Hazarath Reddy

నికోలస్ పూరన్‌ను హైదరాబాద్ రూ. 10.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఆటగాడి కోసం కెకెఆర్ కూడా పోటీ పడినప్పటికీ సన్ రైజర్స్ సొంతం చేసుకుంది.

IPL 2022 Auction: రూ. 4.6 కోట్లకు అమ్మడుబోయిన మనీష్‌ పాండే, వేలంలో కొనుగోలు చేసిన లక్నో సూపర్‌ జెయింట్స్‌, రూ. 6.75 కోట్లకు క్వింటన్‌ డికాక్‌ కొనుగోలు

Hazarath Reddy

ఐపీఎల్ వేలం 2022 ప్రారంభమైంది. మనీష్‌ పాండేను లక్నో సూపర్‌ జెయింట్స్‌ రూ. 4.6 కోట్లకు కొనుగోలు చేసింది. అతని కనీస ధర రూ. కోటిగా ఉంది. గత సీజన్‌ వరకు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన క్వింటన్‌ డికాక్‌ కనీస ధర రూ. 2 కోట్లు. కాగా లక్నో సూపర్‌జెయింట్స్‌ రూ. 6.75 కోట్లకు డికాక్‌కు కొనుగోలు చేసింది.

Advertisement

IPL 2022 Auction: వెస్టిండీస్‌ హిట్టర్‌ షిమ్రోన్‌ హెట్‌మైర్‌కు వేలంలో మంచి ధర, రూ. 8.25 కోట్లకు దక్కించుకున్న రాజస్తాన్‌ రాయల్స్‌

Hazarath Reddy

ఐపీఎల్ వేలం 2022 ప్రారంభమైంది. వెస్టిండీస్‌ హిట్టర్‌ షిమ్రోన్‌ హెట్‌మైర్‌కు వేలంలో మంచి ధరే దక్కింది. అతని కనీస ధర రూ. 1.50 కోట్లు కాగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ పోటీపడ్డాయి. చివరకు రాజస్తాన్‌ రాయల్స్‌ రూ. 8.25 కోట్లకు హెట్‌మైర్‌ను దక్కించుకుంది.

IPL 2022 Mega Auction: సరోజినీ నగర్ మార్కెట్లో ఢిల్లీ కేపిటల్స్ బార్ గెయిన్, డేవిడ్ వార్నర్‌ విలువపై సంచలన ట్వీట్ సంధించిన మాజీ క్రికెటర్ వసీం జాఫర్

Hazarath Reddy

శనివారం బెంగళూరులో జరుగుతున్న IPL 2022 మెగా పబ్లిక్ సేల్‌లో డేవిడ్ వార్నర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ (DC) రూ. 6.25 కోట్లకు కొనుగోలు చేసింది. DC అనుచరులు సోషల్ మీడియాలో వార్నర్ రాకను స్వాగతిస్తుండగా, మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తనదైన శైలిలో ట్విట్టర్లో ట్వీట్ చేశారు.

IPL 2022 Mega Auction: వేలంలో డేవిడ్‌ వార్నర్‌‌కి ఘోర అవమానం, భారీ ధరకు పోతాడని భావిస్తే.. రూ. 6.25 కోట్లకు ఢిల్లీ చేతుల్లోకి వెళ్లిన ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు

Hazarath Reddy

భారీ ధరకు అమ్ముడుపోతాడని భావించిన ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ రూ. 6.25 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్‌కు(Delhi Capitals Squad for IPL 2022) అమ్ముడుపోయాడు. అతని కనీస ధర రూ. 2 కోట్లుగా ఉంది. అయితే వార్నర్‌ ఇంత తక్కువ ధరకు అమ్ముడుపోతాడని ఎవరు ఊహించలేదు

IPL 2022 Auction: జేసన్‌ రాయ్‌ను రూ. 2 కోట్లకు దక్కించుకున్న గుజరాత్‌ టైటాన్స్‌, రూ. 2 కోట్లకు సీఎస్‌కే కు అమ్ముడుపోయిన టీమిండియా సీనియర్‌ ఆటగాడు రాబిన్‌ ఊతప్ప

Hazarath Reddy

ఐపీఎల్ మెగా వేలం ప్రారంభమైంది. ఈ వేలంలో ఇంగ్లండ్‌ ఆటగాడు జేసన్‌ రాయ్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ రూ. 2 కోట్ల కనీస ధరకు దక్కించుకుంది. ఇక టీమిండియా సీనియర్‌ ఆటగాడు రాబిన్‌ ఊతప్పను కనీస ధర రూ. 2 కోట్లకు సీఎస్‌కే కొనుగోలు చేసింది.

Advertisement

Hugh Edmeades Health Update: వేలంలో షాక్.. కళ్లు తిరిగిపడిపోయిన ఆక్షనీర్‌ ఎడ్మెడేస్, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపిన బీసీసీఐ, మధ్యాహ్నం మూడున్నర గంటలకు వేలం ప్రారంభం

Hazarath Reddy

ఐపీఎల్ వేలం జరుగుతుండగా వేలం నిర్వహించే అధికారి Hugh Edmeades కళ్లు తిరిగి కిందపడిపోయిన సంగతి విదితమే. ప్రస్తుతానికి అతనికి ఏమి ప్రమాదం లేదని అధికారులు తెలిపారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని బిడ్డింగ్ రూ. 3.30కు జరుగుతుందని బీసీసీఐ తెలిపింది.

IPL 2022 Auction: దక్షిణాఫ్రికా స్టార్‌ పేసర్‌ కగిసో రబడా కోసం గట్టి పోటీ, రూ. 9.25 కోట్లు పెట్టి దక్కించుకున్న పంజాబ్‌​ కింగ్స్‌, రూ. 6.25 కోట్లకు మహ్మద్‌ షమీని సొంతం చేసుకున్న గుజరాత్

Hazarath Reddy

ఐపీఎల్‌ మెగా వేలం-2022 (IPL 2022 Auction) ఆరంభమైంది. దక్షిణాఫ్రికా స్టార్‌ పేసర్‌ కగిసో రబడా (Kagiso Rabada) కనీస ధర రూ. 2 కోట్లు. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున ప్రాతినిధ్యం వహించిన రబాడపై ఫ్రాంచైజీలు ఆసక్తికరంగా ఉన్నాయి. దీంతో అతని కోసం ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి.

IPL 2022 Auctioneer Collapses: ఐపీఎల్ వేలంలో కింద పడిపోయిన Hugh Edmeades, ఒక్కసారిగా షాక్ తిన్న ఫ్రాంచైజీలు, ఆలస్యమైన బిడ్డింగ్

Hazarath Reddy

IPL 2022 వేలం నిర్వహించే వ్యక్తి Hugh Edmeades వేలం నిర్వహిస్తుండగా కుప్పకూలిపోయాడు. అతను ఒక్కసారిగా పడిపోవడంతో ఫ్రాంచైజీలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాయి. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో వేలం ఆలస్యమైంది. అయితే అతనికి ఏమీ కాలేదని సమాచారం.

IPL 2022 Mega Auction: సురేశ్‌ రైనాకు కష్టకాలం, ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు, రైనాతో పాటు స్టీవ్‌ స్మిత్‌, మిల్లర్‌ యాక్సిలరేటెడ్‌ లిస్ట్‌ తదుపరి వేలంలోకి..

Hazarath Reddy

ఐపీఎల్‌ మెగా వేలం-2022 ఆరంభమైంది. టీమిండియా మాజీ ఆటగాడు సురేశ్‌ రైనాతో పాటు.. ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌, దక్షిణాఫ్రికా ఆటగాడు మిల్లర్‌ను ఏ ఫ్రాంచైజీ కొనడానికి ఆసక్తి చూపలేదు. యాక్సిలరేటెడ్‌ లిస్ట్‌లో ఈ ముగ్గురు మరోసారి వేలంలోకి రానున్నారు.

Advertisement

IPL 2022 Mega Auction: మళ్లీ చెన్నై గూటికే డ్వేన్‌ బ్రేవో, రూ. 4.40 కోట్లకు దక్కించుకున్న సీఎస్‌కే

Hazarath Reddy

ఐపీఎల్‌ మెగా వేలం-2022 ఆరంభమైంది. వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవోను సీఎస్‌కే మరోసారి దక్కించుకుంది. రూ. 4.40 కోట్లకు సీఎస్‌కే బ్రేవోను దక్కించుకుంది.టీమిండియా అన్‌క్యాప్‌డ్‌ ఆటగాడు నితీష్‌ రాణాను మరోసారి కేకేఆర్‌ సొంతం చేసుకుంది. రూ. 8 కోట్లకు రాణాను సొంతం చేసుకోవడం విశేషం. గత సీజన్‌లో నితీష్‌ రాణా మంచి ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే.

IPL 2022 Mega Auction: ఐపీఎల్‌ మెగా వేలం-2022, నితీష్‌ రాణాను రూ. 8 కోట్లకు సొంతం చేసుకున్న కెకెఆర్

Hazarath Reddy

ఐపీఎల్‌ మెగా వేలం-2022 ఆరంభమైంది. టీమిండియా అన్‌క్యాప్‌డ్‌ ఆటగాడు నితీష్‌ రాణాను మరోసారి కేకేఆర్‌ సొంతం చేసుకుంది. రూ. 8 కోట్లకు రాణాను సొంతం చేసుకోవడం విశేషం. గత సీజన్‌లో నితీష్‌ రాణా మంచి ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే.

IPL 2022 Mega Auction: జాక్‌పాట్ కెట్టేసిన జాసన్‌ హోల్డర్‌, ఏకంగా రూ. 8.75 కోట్లకు సొంతం చేసుకున్న లక్నో సూపర్‌జెయింట్స్‌

Hazarath Reddy

ఐపీఎల్‌ మెగా వేలం-2022 ఆరంభమైంది. వెస్టిండీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ జాసన్‌ హోల్డర్‌ వేలంలోకి వచ్చాడు. అతని కనీస ధర రూ.1.50 కోట్లుగా ఉంది. కాగా హోల్డర్‌కు జాక్‌పాట్‌ తగిలింది. రూ. 8.75 కోట్లకు లక్నో సూపర్‌జెయింట్స్‌ దక్కించుకుంది.

IPL 2022 Mega Auction: డేవిడ్ వార్నర్‌కు భారీ షాక్, శ్రేయస్‌ అయ్యర్‌ కోసం రూ. 12.25 కోట్లు వెచ్చించిన కెకెఆర్, రూ. 5 కోట్లకు రవిచంద్రన్‌ అశ్విన్‌ వేలం, పూర్తి లిస్ట్ ఇదే..

Hazarath Reddy

ఐపీఎల్‌ మెగా వేలం-2022 ఆరంభమైంది. అగ్రశ్రేణి ఆటగాళ్ల (మార్కీ ప్లేయర్లు) జాబితాలో మొదటి వరుసలో ఉన్న టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ముందుగా వేలంలోకి (IPL 2022 Mega Auction) వచ్చాడు. ఈ క్రమంలో పంజాబ్‌ కింగ్స్‌ 8. 25 కోట్లు వెచ్చించి గబ్బర్‌ను కొనుగోలు చేసింది.

Advertisement

IPL 2022 Auction Rules: ఐపీఎల్ మెగా వేలం రూల్స్ ఇవే! రెండు రోజు మెగా ఈవెంట్‌ కు సర్వం సిద్ధం, కొత్త టీమ్‌ల రాకతో ఆసక్తికరంగా వేలం

Naresh. VNS

ఐపీఎల్‌ మెగా వేలం-2022కు (IPL 2022 Auction) రంగం సిద్ధమైంది. శని, ఆదివారాల్లో బెంగళూరు వేదికగా ఈ మెగా ఈవెంట్‌ జరుగనుంది. ఇక ఈసారి రెండు కొత్త జట్లు గుజరాత్‌ టైటాన్స్‌ , లక్నో సూపర్‌జెయింట్స్‌ లీగ్‌లో ( Lucknow Super Giants ) ఎంట్రీ ఇవ్వనున్నాయి. దీంతో మొత్తంగా 10 జట్లు పోటీ పడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఉన్న రైట్‌ టు మ్యాచ్‌ (RTM) కార్డ్‌ను వేలం నుంచి తొలగించారు

IND vs WI ODI Series: రోహిత్ సేన చేతిలో విండీస్ చిత్తు, 3-0 తేడాతో సిరీస్ కైవసం, అన్ని విభాగాల్లోనూ టీమిండియాదే పైచేయి..

Krishna

వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ని టీమిండియా 3-0తో క్లీన్‌స్వీప్ చేసేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన ఆఖరి వన్డేలో ఆల్‌రౌండర్ ప్రదర్శన కనబర్చిన టీమిండియా 96 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.

The Great Khali Joins BJP: కాషాయపు కండువా కప్పుకున్న డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌ స్టార్ గ్రేట్ ఖలీ, ప్రధాని మోదీ విధానాల పట్ల ఆకర్షితుడై రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటన

Hazarath Reddy

డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌ స్టార్, ప్రముఖ భారత రెజ్లర్‌ ది గ్రేట్ ఖలీ(49) అలియాస్‌ దలీప్‌ సింగ్‌ రాణా రాజకీయ అరంగేట్రం చేశాడు. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో కాషాయ కండువా కప్పుకున్నాడు. ప్రధాని మోదీ విధానాల పట్ల ఆకర్షితుడై రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించాడు.

India vs West Indies 2nd ODI Highlights: విండీస్‌తో వన్డే సిరీస్‌ భారత్ కైవసం, రెండో వన్డేలో దుమ్మురేపిన ప్రసిద్ధ్ కృష్ణ, ఇక మూడో వన్డే నామమాత్రమే

Naresh. VNS

వెస్టిండిస్ తో జరిగిన రెండో వన్డేలో (India vs West Indies) టీమిండియా ఘన విజయం సాధించింది. 44 పరుగుల తేడాతో వెస్టిండిస్ పై భారత్ గెలిచింది. భారత్ (Team India) నిర్ధేశించిన 238 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బ్యాటింగ్ కు దిగిన విండీస్‌ 46 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విజయంతో వన్డే సిరీస్ భారత్ సొంతమైంది.

Advertisement
Advertisement