Sports

Tokyo Olympic Games 2020: భారత్ ఖాతాలో మరో పతకం, రెజ్లింగ్‌ 65 కేజీల ఫ్రీస్టైల్‌ విభాగంలో కాంస్య పతకం సాధించిన భజరంగ్‌ పూనియా, టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇప్పటివరకు ఆరు పతకాలు

Hazarath Reddy

టోక్యో ఒలింపిక్స్‌లో భజరంగ్‌ పూనియా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆడిన తొలి ఒలింపిక్స్‌లోనే (Tokyo Olympic Games 2020) కాంస్యంతో అదరగొట్టాడు. రెజ్లింగ్‌ 65 కేజీల ఫ్రీస్టైల్‌ విభాగంలో సెమీస్‌లో ఓడినప్పటికి కాంస్య పతక (Bajrang Punia Wins Bronze Medal) పోరులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు.

Aditi Ashok: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ నుంచి అదితి అశోక్ సంచలనం, గోల్ఫ్‌లో పతకం చేజారినా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న గోల్ఫ‌ర్, అదితిపై ప్రశంసల వర్షం కురిపించిన రాష్ట్రపతి, ప్రధాని తదితర ప్రముఖులు

Hazarath Reddy

గోల్ఫ్‌లో ఇద్దరమ్మాయిలు ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతే చాలామందికి తెలియదు. కానీ 23 ఏళ్ల అదితి ఇప్పుడు భారతీయులందరికీ సుపరిచితమైపోయింది. వ్యక్తిగత స్ట్రోక్‌ప్లేలో ఆమె (Aditi Ashok At Tokyo Olympics 2020) చూపించిన తెగువ ఇప్పుడు అందర్నీ ఆమె వైపు తిప్పుకునేలా చేసింది.

Tropical Storm Mirinae: దూసుకొస్తున్న మిరినే ఉష్ణమండల తుఫాను, టోక్యో ఒలింపిక్స్‌‌కు అంతరాయం ఏర్పడే అవకాశం, రుక్యు దీవుల దగ్గర మిరినే పుట్టే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ

Hazarath Reddy

: జపాన్‌లోని టోక్యో నగరంలో జరుగుతున్న ఒలింపిక్స్‌ 2020 గేమ్స్ ముగింపు దశకు చేరుకున్నాయి. అయితే చివరి రోజుల్లో టోక్యోలో వాతావారణ పరిస్థితులు పూర్తిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. జపాన్ లో ఇప్పుడు వేడి తేమతో కూడిన పొడి వాతావరణం ఉంది. అయితే రానున్న కాలంలో ఉష్ణమండల తుఫాను (Tropical Storm Mirinae) టోక్యో నగరాన్ని తాకబోతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీనికి జపాన్ వాతావరణ సంస్థ (JMA) మిరినే (Mirinae) అని నామకరణం చేసింది.

Major Dhyan Chand Khel Ratna Award: రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్ పేరు మార్చిన కేంద్ర ప్రభుత్వం, 'మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డు'గా పేరు మారుస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన, ప్రజల విజ్ఞప్తుల మేరకే పేరు మార్పు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి

Team Latestly

ధ్యాన్‌చంద్‌ పేరు పెట్టడం ద్వారా ఆ క్రీడా దిగ్గజానికి మరింత గౌరవం లభించినట్లయింది. అయితే కాంగ్రెస్ వర్గాలకు మాత్రం మోదీ నిర్ణయం కొంత ఇబ్బంది కలిగించేలా ఉంది. దీనిపై కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి....

Advertisement

Tokyo Olympics 2020: హోరాహోరీ మ్యాచ్‌లో బ్రిటన్ చేతిలో భారత మహిళల హాకీ జట్టు ఓటమి, చేజారిన కాంస్య పతకం; మరో మ్యాచ్‌లో భారత రెజ్లర్ సీమా బిస్లా ఓటమి, ఈరోజు టోక్యో ఒలంపిక్స్ క్రీడా విశేషాలు ఇలా ఉన్నాయి

Team Latestly

భారత్ పై మళ్లీ 4-3 తో లీడ్ లోకి వచ్చింది, దీని తర్వాత బ్రిటన్ భారత జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు, సమయం మించి పోవడంతో చివరకు బ్రిటన్ విజేతగా నిలిచింది. బ్రిటన్ విజయోత్సవంతో భారత మహిళలు కన్నీళ్లలో మునిగిపోయారు...

Tokyo Olympics 2020: టోక్యో ఒలంపిక్స్‌లో సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్న భారత రెజ్లర్ రవికుమార్ దహియా, ఫైనల్లో రష్యన్ ప్రత్యర్థి చేతిలో ఓటమి; పోరాట స్పూర్థిని మెచ్చుకున్న రాష్ట్రపతి మరియు ప్రధాని

Team Latestly

టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్‌ రవికుమార్‌ దహియా సిల్వర్ మెడల్ సాధించాడు. గురువారం జరిగిన 57 కిలోల రెజ్లింగ్‌ ఫ్రీస్టైల్‌ ఫైనల్స్ లో బంగారు పతకం సాధిస్తాడనుకున్న రవికుమార్ ఫైనల్లో పోరాడి ఓడిపోయాడు....

Tokyo Olympics 2020: భారత్ ఖాతాలో మరో పతకం, కాంస్యం సాధించిన పురుషుల హాకీ జట్టు; మరో మ్యాచ్‌లో మహిళా రెజ్లర్ దూకుడు.. క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన వినేష్ ఫోగట్

Team Latestly

టోక్యోలో భారత కీర్తి పతాకం మరోసారి రెపరెపలాడింది. భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో బలమైన ప్రత్యర్థి జర్మనీని 5-4 తేడాతో భారత్ చిత్తు చేసింది. దీంతో 41 ఏళ్ల తర్వాత ఒలంపిక్స్ లో భారత హాకీ జట్టు మరో పతకాన్ని ముద్దాడింది....

Tokyo Olympics 2020: ఒలింపిక్స్ మహిళల హాకీ సెమీ ఫైనల్‌లో భారత్ ఓటమి, అర్జెంటీనా చేతిలో 1-2 తేడాతో పరాజయం పాలైన రాణీ రాంపాల్ సేన, కాంస్య పతకం కోసం బ్రిటన్‌తో తలపడనున్న ఇండియా

Hazarath Reddy

ఒలింపిక్స్ మహిళల హాకీ సెమీ ఫైనల్‌లో భారత్ ఓటమి పాలైంది. అర్జెంటీనా చేతిలో 1-2 తేడాతో ఓడిపోయింది. తదుపరి పోటీలో భారత్ కాంస్య పతకం కోసం బ్రిటన్‌తో తలపడనుంది.

Advertisement

Tokyo Olympic Games 2020: ఈ సారి ఏకంగా స్వర్ణ పతకమేనా.., ఫైనల్లోకి అడుగుపెట్టిన భారత రెజ్లర్ రవి కుమార్ దహియా, పురుషుల 57కేజీల కేటగిరీలో నురిస్లామ్ సానాయేవ్‌పై అనూహ్య విజయం

Hazarath Reddy

పీవీ సింధు కాంస్య పతకంతో పులకించిపోతున్న భారత క్రీడాభిమానులకు మరో శుభవార్త. టోక్యో ఒలింపిక్స్‌లో (Tokyo Olympic Games 2020) పోటీ పడుతున్న భారత రెజ్లర్ రవి కుమార్ దహియా(23) తాజాగా ఫైనల్స్‌లో అడుగు పెట్టి భారత్‌కు కనీసం రజత పతకాన్ని (Ravi Kumar Dahiya Assured of Silver Medal) ఖాయం చేశాడు.

Tokyo Olympics 2020: లవ్లీనా బొర్గోహెయిన్‌కు ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు, ఆమె పోరాడిన తీరు అద్భుతమని కొనియాడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తొలి ఒలింపిక్స్‌లోనే కాంస్య పతకం సాధించిన భారత మహిళా బాక్సర్‌ లవ్లీనా

Hazarath Reddy

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత మహిళా బాక్సర్‌ లవ్లీనా బొర్గోహెయిన్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పాల్గొన్న తొలి ఒలింపిక్స్‌లోనే పతకం గెలుపొందేందుకు ఆమె పోరాడిన తీరు అద్భుతమని కొనియాడారు.

Tokyo Olympics 2020: భారత్ ఖాతాలో మరో పతకం, బాక్సింగ్‌లో కాంస్యంతో అదరగొట్టిన లవ్లీనా బొర్గొహెయిన్‌, ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత మూడో బాక్సర్‌గా రికార్డు

Hazarath Reddy

లవ్లీనా బొర్గొహెయిన్‌ చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత మూడో బాక్సర్‌గా అవతరించింది. ‘మాగ్నిఫిసెంట్‌ మేరీ’ తర్వాత పతకం ముద్దాడుతున్న రెండో మహిళగా ఘనకీర్తిని అందుకుంది. టోక్యో క్రీడల్లో భారత బాక్సింగ్‌కు 12 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో ఆమె తొలి పతకం అందించింది.

Tokyo Olympic Games 2020: టోక్యో ఒలింపిక్స్‌లో సెమీస్‌లోకి అడుగుపెట్టిన భారత రెజ్లర్లు, 57 కిలోల విభాగంలో రవి కుమార్‌, 86 కిలోల విభాగంలో రెజ్లర్‌ దీపక్‌ పునియా విజయం

Hazarath Reddy

టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే 86 కిలోల విభాగంలో రెజ్లర్‌ దీపక్‌ పునియా సెమీస్‌ చేరగా.. తాజాగా రెజ్లింగ్‌ పురుషుల 57 కిలోల విభాగంలో రవి కుమార్‌ సైతం సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టాడు.

Advertisement

India vs England Test Series 2021 Schedule: ఆగస్టు 4 నుంచి టీమిండియా -ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌, కప్ సాధించేందుకు కసరత్తు చేస్తున్న కోహ్లి సేన, జో రూట్‌ బృందం, సీరిస్ పూర్తి షెడ్యూల్ ఇదే..

Hazarath Reddy

టీమిండియా -ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌ బుధవారం నుంచి ఆరంభం కానుంది. ఆగష్టు 4 నుంచి ప్రారంభమయ్యే 5 మ్యాచ్‌ల సిరీస్‌ (India vs England Test Series 2021 Schedule) కోసం ఇప్పటికే కోహ్లి సేన, జో రూట్‌ బృందం సన్నద్ధమయ్యాయి.

Tokyo Olympic Games 2020: బాధపడకండి, గెలుపోటములు సహజం, కాంస్యం కోసం పోరాడండి. హాకీ సెమీస్‌లో భారత్ ఓటమిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ప్రధాని మోదీ, పలువురు ప్రముఖులు

Hazarath Reddy

అయితే, జీవితంలో గెలుపోటములు సహజం. తదుపరి ఆడనున్న మ్యాచ్‌, భవిష్యత్‌ విజయాల కోసం ఆల్‌ ది బెస్ట్‌. తమ ఆటగాళ్లను చూసి భారత్‌ ఎల్లప్పుడూ గర్విస్తుంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు

Tokyo Olympic Games 2020: కాంస్యం పైనే ఆశలు, బెల్జియంతో జరిగిన పురుషుల హాకీ సెమీఫైనల్‌లో భారత్‌ ఓటమి, పెనాల్టీలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైన భారత్ ఆటగాళ్లు

Hazarath Reddy

భారత పురుషుల హాకీ జట్టు కప్‌కు అడుగు దూరంలో ఆగిపోయింది. టోక్యో ఓలింపిక్స్ లో ( Tokyo Olympic Games 2020) సెమీస్‎లో భారత్ పురుషుల హాకీ జట్టు, వరల్డ్ నెంబర్ వన్ బెల్జియంతో సెమీ ఫైనల్లో తలపడింది. ఈ మ్యాచ్‎లో 5-2 తేడాతో బెల్జియం చేతిలో ఇండియా (India Men's Hockey Team ) పరాజయం పాలైంది.

Tokyo 2020 Olympic Games: ఆస్ట్రేలియాకు షాక్..టోక్యో ఒలింపిక్స్‌లో తొలిసారిగా హాకీ సెమీస్‌లోకి భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు, 1980 మాస్కో ఒలింపిక్స్‌ తర్వాత భారత్‌ అత్యుత్తమ ప్రదర్శన

Hazarath Reddy

భార‌త మ‌హిళ‌ల హాకీ ( Indian Women Hockey ) జ‌ట్టు చ‌రిత్ర సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్ ( Tokyo Olympics ) సెమీస్‌లో ఇండియ‌న్ జ‌ట్టు ప్ర‌వేశించింది. క్వార్టర్స్‌లో బలమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాను అన్ని విధాలుగా కట్టడి చేసింది. ఏ దశలోనూ వారిని కోలుకోకుండా దెబ్బకొట్టింది.

Advertisement

PV Sindhu Wins Bronze Medal: భారత్ ఖాతాలో మరో పతకం, టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సింధు, భారత్ నుంచి రెండు ఒలింపిక్‌ మెడల్స్‌ అందుకున్న తొలి మహిళగా రికార్డులకెక్కిన తెలుగుతేజం

Hazarath Reddy

భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్‌లో వరుసగా రెండోసారి పతకం (PV Sindhu Wins Bronze Medal) సాధించి రికార్డుకెక్కింది. కోట్లాది మంది భారతీయులు కోరుకున్నట్టే ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకాన్ని అందించింది. కాంస్య పతకం కోసం కొద్దిసేపటి క్రితం ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ హే బింగ్‌జియావో (చైనా)తో జరిగిన పోరులో వరుస సెట్లలో (21-13, 21-15) విజయం సాధించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.

Tokyo Olympics 2020: సహనం కోల్పోయిన వరల్డ్‌ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌, ఓటమితో రాకెట్‌తో నెట్‌పై బలంగా బాదేసిన సెర్బియా ఆటగాడు, సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

Hazarath Reddy

ఒలింపిక్‌ స్వర్ణ పతకంతో పాటు క్యాలెండర్‌ సంవత్సరంలో ‘గోల్డెన్‌ స్లామ్‌’ సాధించాలనే లక్ష్యంతో టోక్యోకు వచ్చిన టెన్నిస్‌ సెర్బియా ఆటగాడు వరల్డ్‌ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ ఆశలు అడియాసలు అయ్యాయి.

Tokyo Olympics 2020: ఒట్టి చేతులతో తిరిగి రావడం చాలా బాధగా ఉంది, అయితే బాక్సింగ్ వదిలిపెట్టను, 0 ఏళ్లు వచ్చేవరకు బాక్సింగ్‌ రింగ్‌ బరిలో ఉంటానని తెలిపిన భారత ​బాక్సర్‌ మేరీకోమ్‌

Hazarath Reddy

పతకం లేకుండా స్వదేశానికి రావడం బాధగా ఉందని భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను పతకం గెలిచి దేశానికి రావాలనుకున్నానని, కానీ వట్టి చేతులతో తిరిగి రావడాన్ని (Mary Kom on Making Comeback ) జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. అయితే తాను బాక్సింగ్‌ను మాత్రం అప్పుడే వదిలిపెట్టనని, కచ్చితంగా కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

Tokyo Olympics 2020: కాంస్యంపై గురిపెట్టిన పీ.వీ. సింధు, సెమీఫైనల్లో తైజూయింగ్‌తో పోరాడి ఓడిన తెలుగమ్మాయి, ఓటమితో కాంస్యం, రజత పతకాలకు దూరమైన తెలుగు తేజం 

Hazarath Reddy

మరోసారి ఒలింపిక్స్ ఫైనల్‌కు చేరాలనుకున్న షట్లర్ పీ.వీ. సింధు కు (PV Sindhu) నిరాశే ఎదురైంది. చైనీస్ తైపీ క్రీడాకారిణి తైజూయింగ్‌తో నిన్న జరిగిన సెమీస్‌లో తలపడిన సింధూ వరుస సెట్లు కోల్పోయి ఓటమిని చవిచూసింది. సెమీఫైనల్లో తై జు 21–18, 21–12 తేడాతో సింధుపై విజయం సాధించింది.

Advertisement
Advertisement