Sports

Tokyo Olympics 2021: జపాన్ దేశాన్ని వణికిస్తున్న కరోనా, ఒలింపిక్స్ 2021 నిర్వహణపై కమ్ముకున్న నీలినీడలు, జులై 23 నుంచి ఆగస్టు 8 వరకూ టోక్యో వేదికగా గేమ్స్, ప్రేక్షకుల్లేకుండానే ఒలింపిక్స్‌ నిర్వహించేందుకు కసరత్తు

Hazarath Reddy

ఒలింపిక్స్ 2021 నిర్వహణపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. జపాన్‌లో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు ఒలంపిక్స్ నిర్వహకుల్లో (Tokyo Olympics 2021) ఆందోళన కలిగిస్తున్నాయి. జులై 23 నుంచి ఆగస్టు 8 వరకూ టోక్యో వేదికగా జరుగనున్న విశ్వక్రీడల నేపథ్యంలో (Tokyo Olympics 2021) అనేక దేశాల నుంచి వేల సంఖ్యలో క్రీడాకారులు నగరానికి చేరుకోనున్నారు.

UEFA EURO 2020: బెల్జియంకు దిమ్మదిరిగే షాక్, యూరో 2020 ఫుట్‌బాల్‌లో సెమిస్ కు దూసుకెళ్లిన ఇటలీ, స్విట్జ‌ర్లాండ్‌పై గెలిచి ఫైనల్ బెర్త్ కోసం ఇటలీతో తలపడనున్న స్పెయిన్

Hazarath Reddy

యూరో 2020 ఫుట్‌బాల్ టోర్నీ ర‌స‌వ‌త్త‌ర ద‌శ‌కు చేరుకున్న‌ది. బెల్జియంతో జ‌రిగిన హోరాహోరీ పోరులో (UEFA EURO 2020) నెగ్గిన ఇట‌లీ ఆ టోర్నీలో సెమీస్‌కు చేరుకున్న‌ది. మునిచ్‌లో జ‌రిగిన మ్యాచ్‌లో ఇట‌లీ 2-1 గోల్స్ తేడాతో బెల్జియంపై విజ‌యం సాధించింది.

Andhra Pradesh: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే ఏపీ క్రీడాకారులకు సీఎం జగన్ అభినందనలు, ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చెక్‌‌ను అందజేసిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. జులై 23, 2021 నుంచి ఆగష్టు 8 వరకు జపాన్‌ టోక్యో నగరంలో జరిగే ఒలింపిక్స్‌కు ఏపీ నుంచి భారతదేశం తరపున పాల్గొంటున్న క్రీడాకురులు పీవీ సింధు, ఆర్‌ సాత్విక్‌ సాయిరాజ్, రజనీలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చెక్‌ను సీఎం జగన్‌ అందజేశారు.

India's Olympic Theme Song: టోక్యో ఒలంపిక్ క్రీడలు 2020 కోసం భారత దేశ అధికారిక ఒలంపిక్ థీమ్ సాంగ్ విడుదల, జూలై 23 నుంచి ప్రారంభంకానున్న మెగా టోర్నమెంట్

Team Latestly

Advertisement

New Zealand Win WTC 21: తొలి టెస్ట్ క్రికెట్ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించిన న్యూజిలాండ్, ఫైనల్‌లో భారత్‌పై 8 వెకెట్ల తేడాతో ఘన విజయం

Team Latestly

తొలి ఇన్నింగ్స్ లో 217 పరుగులు చేసిన భారత్, రెండో ఇన్నింగ్స్ లో కనీసం 2 సెషన్లు ఆడి, మరో 30-40 పరుగులు అదనంగా జోడించి ఉంటే ప్రత్యర్థి విజయ లక్ష్యం పెరిగి, మ్యాచ్ కనీసం డ్రా చేసుకొని రెండు జట్లు సంయుక్త విజేతలుగా నిలిచేవి....

Cheteshwar Pujara: తొలి ప‌రుగు చేయ‌డానికి 36 బంతులు వాడేశాడు, వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో 54 బంతుల్లో 8 ప‌రుగులు చేసిన చెటేశ్వ‌ర్ పుజారా, బోర్ కొట్టిస్తున్నాడంటూ ట్విట్టర్లో పేలుతున్న జోకులు

Hazarath Reddy

ఇండియ‌న్ క్రికెట్ టీమ్ ఆటగాడు చెటేశ్వ‌ర్ పుజారా ఈ మ‌ధ్య మ‌రీ నిదానంగా బ్యాటింగ్ చేస్తూ బోర్ కొట్టిస్తున్నాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లోనూ పుజారా మ‌రోసారి ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌తోపాటు అభిమానుల స‌హ‌నాన్ని ప‌రీక్షించాడు.

ICC WTC Final 2021 Day 3: పీకలోతు కష్టాల్లో భారత్, ప్రస్తుతం ఆరువికెట్లకు 182 పరుగులు చేసిన టీం ఇండియా, 49 పరుగుల వద్ద ఆరో వికెట్ గా వెనుదిరిగిన రహానే, కొనసాగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మూడో రోజు ఆట

Hazarath Reddy

ఐసీసీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ (ICC World Test Championship 2021 Finals) మూడో రోజుకు చేరుకుంది. ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో తొలిరోజైన శుక్రవారం కనీసం బంతి పడకుండానే ఆట ముగిసింది. ఇక రెండోరోజు శనివారం రెండు సెషన్ల మేర ఆట కొనసాగింది.

Milkha Singh Passes Away: దివికేగిన పరుగుల వీరుడు మిల్ఖా సింగ్, సంతాపం తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని,హోం మంత్రి తదితరులు, మొత్తం 80 రేసుల్లో 77 విజయాలతో అరుదైన రికార్డు ఫ్లైయింగ్‌ సిక్‌ సొంతం

Hazarath Reddy

భారత పరుగుల వీరుడు మిల్కాసింగ్ కన్నుమూశారు. ఆసియా గేమ్స్‌లో నాలుగుసార్లు బంగారు పతకాలు కొల్లగొట్టిన మిల్కా సింగ్ కొవిడ్ అనంతరం సమస్యలతో గత రాత్రి చండీగఢ్‌లోని పోస్టు గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్) ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.

Advertisement

WTC 2021 Finals: తొలిసెషన్ ఆట రద్దు! మొట్టమొదటి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కు భారత్ మరియు న్యూజిలాండ్ జట్లు సిద్ధం, ఉల్లాసంగా-ఉత్సాహంగా టీమిండియా ఆటగాళ్లు, మ్యాచ్ విశేషాలు ఇలా ఉన్నాయి

Team Latestly

బ్యాటింగ్- బౌలింగ్ రెండింటి పరంగా టీమిండియా బలంగా కనిపిస్తోంది. అటు న్యూజిలాండ్ కూడా ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ 1-0 తేడాతో గెలిచి ఊపు మీద ఉంది. అంతేకాకుండా చాలాకాలం నుంచి ఇంగ్లండ్ లో వాతావరణ పరిస్థితులకు అలవాటుపడి ఉంది....

Take Your Condoms Home: కండోమ్‌లు ఇస్తాం, అయితే వాడకుండా ఇంటికి తీసుకువెళ్లండి, ఒలంపిక్స్ గేమ్స్‌లో సోషల్‌ డిస్టెన్స్‌ కఠినంగా అమలయ్యేలా చూస్తామని తెలిపిన కమిటీ సీఈవో తోషిరో ముటో

Hazarath Reddy

కరోనా నిబంధనలకు ప్రాధాన్యం ఇస్తూ.. ఈసారి సోషల్‌ డిస్టెన్స్‌ కఠినంగా అమలయ్యేలా చూస్తున్నామని, అందుకే కండోమ్‌లు ఇంటికి తీసుకెళ్లాలని ఈసారి ఆటగాళ్లకు సూచించనున్నట్లు ఓ ప్రముఖ మీడియా హౌజ్‌ అడిగిన ప్రశ్నకు కమిటీ సీఈవో తోషిరో ముటో బదులిచ్చారు.

May’s ICC Player of the Month Awards: మే నెల ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డులు, భారత క్రికెటర్లకు దక్కని చోటు, టాప్‌లో పాకిస్తాన్ క్రికెటర్ హసన్ అలీ, మహిళల క్రికెట్లో క్యాథరిన్​

Hazarath Reddy

ఈ ఏడాది జనవరి నుంచి ప్రకటిస్తూ వస్తున్న ఈ అవార్డులను (May’s ICC Player of the Month Awards) తొలిసారి(జనవరి) టీమిండియా డాషింగ్‌ క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ దక్కించుకోగా, ఫిబ్రవరి నెలకు అశ్విన్‌, మార్చిలో భువనేశ్వర్‌ కుమార్‌, ఏప్రిల్‌ నెలకు పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ దక్కించుకున్నారు.

Ahmed Musaddiq: క్రికెట్లో విధ్వంసం అంటే ఇదే..28 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన అహ్మద్ ముస్సాదిక్, అందులో 13 సిక్సర్లు, 7 ఫోర్లు, గౌహర్ మనన్ ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డును బద్దలు కొట్టిన కమ్మర్‌ఫెల్డర్ స్పోర్ట్‌వెరిన్ ఆటగాడు

Hazarath Reddy

యూరోపియన్ క్రికెట్ సిరీస్‌లో ఓ ఆటగాడు పెను విధ్వంసం సృష్టించాడు. కేవలం 28 బంతుల్లోనే 13 సిక్సర్లు, 7 ఫోర్ల సహాయంతో సెంచరీ బాది రికార్డు ఇన్నింగ్స్ ఆడాడు. 13 సిక్సర్లు, ఏడు ఫోర్ల సాయంతో 33 బంతుల్లో ఏకంగా 115 పరుగులు సాధించాడు. యూరోపియన్ క్రికెట్ సిరీస్ చరిత్రలో భారత సంతతికి చెందిన గౌహర్ మనన్(29 బంతుల్లో) పేరిట​ ఉన్న ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డును బద్దలు కొట్టాడు.

Advertisement

ICC T20 World Cup 2021: భారత్‌లో టి20 ప్రపంచకప్‌ నిర్వహిస్తారా లేదా..క్లారిటీ ఇవ్వాలని బీసీసీఐని కోరిన ఐసీసీ, నెల రోజుల్లో నిర్ణయాన్ని చెబుతామన్న బీసీసీఐ, 2024 టి20 ప్రపంచకప్‌లో 20 జట్లు

Hazarath Reddy

ఈ ఏడాది టి20 ప్రపంచకప్‌ను భారత్‌లో నిర్వహించగలరా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని ఐసీసీ బీసీసీఐని కోరింది. అయితే ఇందుకు నెల రోజులు సమయం్ కావాలని బీసీసీఐ కోరింది. టీ20 ప్రపంచకప్‌ నిర్వహణపై ఓ నిర్ణయానికి వచ్చేందుకు నెల రోజుల సమయం ఇవ్వాలన్న బీసీసీఐ (BCCI) విజ్ఞప్తిని ఎట్టకేలకు ఐసీసీ అంగీకరించింది. దీంతో ఈనెల 28 వరకు గడువు లభించింది.

Sachin Tendulkar: జీవితంలో రెండు కోరికలు తీరలేదని బాధపడుతున్న సచిన్, అవి కలగానే మిగిలిపోయాయని ఇంటర్వ్యూలో తెలిపిన లిటిల్ మాస్టర్, అవేంటో తెలుసుకుందామా..

Hazarath Reddy

దిగ్గజ క్రికెటర్ కూడా తన జీవితంలో కొన్ని కోరికలను నెరవేర్చుకోలేకపోయాడట. తన జీవితంలో రెండు కోరికలు కలగానే మిగిలిపోయాయని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

IPL 2021 New Venue: ఐపీఎల్‌-2021 మళ్లీ వచ్చేస్తోంది, మిగిలిన మ్యాచ్‌ల‌ను యూఏఈలో నిర్వ‌హిస్తామ‌ని స్ప‌ష్టం చేసిన బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా, రెండో దశ పోటీలకు తమ ఆటగాళ్లను అనుమతించేది లేదని తెలిపిన ఇంగ్లండ్

Hazarath Reddy

బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా (BCCI Vice-President Rajeev Shukla) మీడియాతో మాట్లాడుతూ.. ఈ సీజన్‌ ఐపీఎల్ రెండో ద‌శ‌ షెడ్యూల్ పై మరింత స్పష్టత ఇచ్చారు. మిగిలిన‌ మ్యాచ్‌ల‌ను యూఏఈలో (IPL 2021 Has Been Moved to UAE) నిర్వ‌హిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. మొద‌టి ప‌దిరోజుల పాటు రోజుకు రెండు మ్యాచ్‌ల చొప్పున ఆడించే అవ‌కాశం ఉంది. అనంత‌రం ఏడు రోజుల పాటు రోజూ ఒక్కో మ్యాచ్ నిర్వ‌హించే చాన్స్ ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Asia Cup 2021: క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్, ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ రద్దు, 2023లో వన్డే ప్రపంచ కప్‌ ముగిసిన తర్వాత నిర్వహించే అవకాశం, శ్రీలంక క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అష్లే డిసిల్వా వెల్లడి

Hazarath Reddy

ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ (T20 Tournament Postponed) రద్దయింది. జూన్ నెలలో శ్రీలంక నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) షెడ్యూల్ చేసింది. అయితే కరోనా కేసుల (COVID-19 Pandemic) నేపథ్యంలో ఈ ఏడాది ఆసియా కప్ నిర్వహించలేకపోతున్నామని శ్రీలంక క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అష్లే డిసిల్వా ప్రకటించారు.

Advertisement

Sushil Kumar Arrested: రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ అరెస్ట్, జూనియర్‌ రెజ్లర్‌ సాగర్‌ రాణా హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న సీనియర్‌ రెజ్లర్‌

Hazarath Reddy

ఒలింపియన్‌ సీనియర్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్‌లో సుశీల్‌ (Sushil Kumar Arrested) ఉన్నట్లు సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు అతనితో పాటు మరో అనుమానితుడు అజయ్‌ కుమార్‌ను అరెస్ట్‌ (Wrestler Sushil Kumar Arrested) చేశారు.

Vemuri Sudhakar Dies: తెలుగు తేజం వేమూరి సుధాకర్ కరోనాతో కన్నుమూత, అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ అంపైర్‌గా బాధ్యతలు నిర్వహించిన సుధాకర్, సంతాపం వ్యక్తం చేసిన పలువురు ప్రముఖులు

Hazarath Reddy

ఆసియాతో పాటు ప్రపంచ బ్యాడ్మింటన్​ దిగ్గజ అంపైర్​గా ప్రఖ్యాతి పొందిన తెలుగు తేజం వేమూరి సుధాకర్ (Vemuri Sudhakar Dies) కరోనాతో పోరాడుతూ ఈరోజు ఉదయం కన్నుమూశారు.

Rahul Tewatia: నీవు చాలా అందంగా ఉన్నావు..నన్ను పెళ్లి చేసుకుంటావా, నీళ్ళ బాటిల్‌కి ప్రపోజ్ చేసిన ఆర్‌ఆర్ ప్లేయర్ రాహుల్‌ తెవాటియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

Hazarath Reddy

నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఐ లవ్‌ యూ.. నన్ను పెళ్లి చేసుకుంటావా? (You are so beautiful. I love you. Will you marry me) అయినా ఎందుకు చేసుకోవులే’’ అంటూ సిగ్గుపడుతూ రాహుల్ ప్రపోజల్‌ పూర్తి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Sakariya's Father Dies: కరోనాతో కన్నుమూసిన రాజస్థాన్ రాయల్స్ పేస‌ర్ చేత‌న్ సకారియా తండ్రి, కరోనాతో ఒకే రోజు ఇద్దరు భారత హాకీ మాజీ క్రీడాకారుల కన్నుమూత

Hazarath Reddy

భారత హాకీ జట్టు మాజీ ఆటగాళ్లు రవీందర్‌ పాల్‌ సింగ్‌ (Ravinder singh) (60), ఎమ్‌కే కౌషిక్‌ (66) (kaushik) కరోనాతో మృతి చెందారు. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన భారత జట్టులో సభ్యుడైన రవిందర్‌ పాల్‌ సింగ్‌.. గత రెండు వారాలుగా లక్నోలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం కన్నుమూశారు. ఇక 1980 ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన జట్టులోనే సభ్యుడైన కౌషిక్‌ కూడా కొవిడ్‌-19తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు.

Advertisement
Advertisement