క్రీడలు

India Final Squad: ప్రపంచ కప్ కోసం భారత తుది జట్టు ఇదిగో, చివరి నిమిషంలో జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, గాయం కారణంగా అక్షర్ పటేల్ అవుట్

Hazarath Reddy

ICC ప్రపంచ కప్ 2023 కోసం టీమ్ ఇండియా యొక్క తుది జట్టులో రవిచంద్రన్ అశ్విన్ గురువారం అక్షర్ పటేల్ స్థానంలో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆసియా కప్ 2023లో గాయపడిన అక్షర్ పటేల్ ప్రపంచ కప్ నుండి వైదొలిగాడు

India World Cup Squad: ప్రపంచకప్ కోసం భారత జట్టులో కీలక మార్పు, గాయంతో దూరమైన అక్షర్ పటేల్ స్థానంలో ఎంట్రీ ఇచ్చిన రవిచంద్రన్ అశ్విన్‌

Hazarath Reddy

భారత జట్టు నుండి ఒక మార్పుతో ODI ప్రపంచ కప్ 2023 కోసం తుది జట్టును ప్రకటించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్‌లో క్వాడ్రిసెప్స్ గాయంతో అక్షర్ పటేల్ దూరమయ్యాడు. అతని స్థానంలో రవిచంద్రన్ అశ్విన్‌ను ఎంపిక చేశారు.

Asian Games: ఏషియన్‌ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం, ఎయిర్‌ పిస్టల్ పురుషుల విభాగంలో సత్తా చాటిన ఇండియా, పతకాల పట్టికలో ఐదోస్థానానికి చేరిన భారత్‌

VNS

ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్‌కు మరో స్వర్ణం (Gold Medal) లభించింది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ పురుషుల విభాగంలో (Men’s 10m Air Pistol Team event) సరబ్‌జోత్‌ సింగ్‌, శివ నర్వాల్‌, అర్జున్‌ సింగ్‌ చీమాతో కూడిన జట్టు బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నది. టీమ్‌ ఈవెంట్‌లో భారత త్రయం 1734.50 పాయింట్లతో అగ్రస్థానంలో నిలచింది.

Pakistan Team: హైదరాబాద్‌ చేరుకున్న పాక్‌ టీమ్‌, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం, ఉప్పల్‌లో వార్మప్‌ మ్యాచ్‌ ఆడనున్న పాక్‌ టీమ్

VNS

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ (ICC World Cup) ఆడేందుకు దాయాది పాకిస్థాన్‌ జట్టు (Pakistan Cricket Team).. భారత్‌లో అడుగుపెట్టింది. బాబర్‌ ఆజమ్‌ సారథ్యంలోని 18 మంది ఆటగాళ్లు, 13 మంది సహాయక సిబ్బందితో కూడిన పాకిస్థాన్‌ బృందం లాహోర్‌ నుంచి నేరుగా హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. అయితే దీనికి సంబంధించిన వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

Advertisement

IND vs AUS ODI Series: చివరి వన్డేలో టీమిండియా ఓటమి, 2-1తో సిరీస్ భారత్ కైవసం..

ahana

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల శుభారంభం భారత్‌ను విజయతీరాలకు చేర్చలేకపోయింది. రాజ్‌కోట్‌లో జరిగిన వన్డేలో ఆస్ట్రేలియా 66 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించింది. అయితే ఈ సిరీస్‌ను రోహిత్ బ్రిగేడ్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

Jasprit Bumrah: వాట్ ఈజ్ దిస్ బుమ్రా, వన్డేల్లో అత్యంత చెత్త గణాంకాలు నమోదు చేసిన టీమిండియా పేసు గుర్రం, 10 ఓవర్లు వేసి 81 పరుగులు ఇచ్చిన బౌలర్

Hazarath Reddy

రాజ్‌కోట్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో టీమిండియా పేసు గుర్రం బుమ్రా తన వన్డే కెరీర్‌లో అత్యంత చెత్త గణాంకాలు నమోదు చేశాడు.

Rohit Sharma: అత్యధిక సిక్సర్లతో మార్టిన్‌ గప్తిల్‌ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ శర్మ, క్రిస్‌ గేల్‌ రికార్డు బద్దలు కొట్టడానికి 4 సిక్సర్ల దూరంలో హిట్‌మ్యాన్‌

Hazarath Reddy

రాజ్‌కోట్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో వరుస సిక్సర్లతో విరుచుకుపడిన హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ స్వదేశంలో అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్లు (259) బాదిన క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు

ICC World Cup 2023: వీడియో ఇదిగో, ఏడు సంవత్సరాల తరువాత భారత్‌లో అడుగుపెట్టిన పాకిస్తాన్ క్రికెట్ టీం, న్యూజీలాండ్‌తో వార్మప్ మ్యాచ్ కోసం హైదరాబాద్ చేరుకున్న దాయాది జట్టు

Hazarath Reddy

ఏడు సంవత్సరాల తరువాత పాకిస్తాన్ క్రికెట్ టీం భారత్ లో అడుగు పెట్టింది. భార‌త్ వేదిక‌గా అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ జ‌ర‌గ‌నున్న సంగతి విదితమే. న్యూజిలాండ్‌తో జరిగే తొలి వన్డే ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్ కోసం పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఈరోజు రాత్రి హైదరాబాద్ చేరుకుంది.

Advertisement

ODI World Cup 2023: వీడియో ఇదిగో, హైదరాబాద్ చేరుకున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు, సెప్టెంబర్ 29న న్యూజిలాండ్‌తో వార్మప్ మ్యాచ్ ఆడనున్న దాయాదులు

Hazarath Reddy

భార‌త్ వేదిక‌గా అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ జ‌ర‌గ‌నున్న సంగతి విదితమే. న్యూజిలాండ్‌తో జరిగే తొలి వన్డే ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్ కోసం పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఈరోజు రాత్రి హైదరాబాద్ చేరుకుంది.

Glenn Maxwell Dismissal Video: మ్యాక్స్‌వెల్‌ క్లీన్ బౌల్డ్ వీడియో ఇదిగో, జస్ప్రీత్‌ బుమ్రా అద్భుతమైన యార్కర్‌కి బుక్కయిన ఆసీస్ విధ్వంసకర ఆటగాడు

Hazarath Reddy

రాజ్‌కోట్‌ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నామమాత్రపు మూడో వన్డేలో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేస్తోంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌కు ఓపెనర్లు వార్నర్‌ , మిచెల్‌ మార్ష్‌ మంచి శుభారంభాన్ని అందించారు. ప్రస్తుతం 299 పరుగుల వద్ద ఆసీస్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది.

Dipendra Singh Airee Six Sixes Video: వీడియో ఇదిగో, ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టిన దీపేంద్ర సింగ్‌ ఆరీ, విధ్వంసం రేపిన నేపాల్ ఆటగాడు

Hazarath Reddy

ఐదోస్థానంలో బ్యాటింగ్‌ దిగిన ఈ ఆల్‌రౌండర్‌ 10 బంతుల్లో 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 8 సిక్సర్లు ఉండటం విశేషం. ఈ క్రమంలో ఎదుర్కొన్న తొలి ఆరు బంతుల్లోనే వరుసగా ఆరు సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్‌గానూ చరిత్రకెక్కాడు.

Dipendra Singh Airee: యువరాజ్ సింగ్ రికార్డు బద్దలు కొట్టిన పసికూన ప్లేయర్, 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన నేపాల్‌ ఆల్‌రౌండర్‌ దీపేంద్ర సింగ్‌ ఆరీ

Hazarath Reddy

నేపాల్‌ ఆల్‌రౌండర్‌ దీపేంద్ర సింగ్‌ ఆరీ పరుగుల వరద పారించాడు. మంగోలియాతో మ్యాచ్‌లో విధ్వంసకర హాఫ్‌ సెంచరీతో ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను చిత్తు చేశాడు. కేవలం 9 బంతుల్లోనే హాప్ సెంచరీ సాధించి చరిత్రకెక్కాడు.

Advertisement

Asian Games 2023: అంతర్జాతీయ టీ20ల్లో నేపాల్ కొత్త చరిత్ర, 20 ఓవర్లలో 314 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేసిన పసికూన, విధ్వంసం మాములుగా లేదు మరి..

Hazarath Reddy

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ చరిత్రలో నేపాల్‌ జట్టు చరిత్రను కొత్తగా రాసింది. ఆసియా క్రీడల్లో భాగంగా మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్ల ఆట ముగిసే సమయానికి నేపాల్‌ 314 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేసింది.

ICC World Cup 2023 All Squads: ప్రపంచ కప్‌లో పాల్గొనే 10 దేశాల ఆటగాళ్ల లిస్టు ఇదిగో, టైటిల్ ఫేవరేట్‌గా బరిలో దిగుతున్న భారత స్క్వాడ్ పై ఓ లుక్కేసుకోండి

Hazarath Reddy

భారతదేశంలో జరిగే ICC ప్రపంచ కప్ 2023కి ఎక్కువ సమయం లేదు. అక్టోబరు 5న మార్క్యూ టోర్నమెంట్ ప్రారంభమైనప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు కొన్ని నిజంగా ఉత్తేజకరమైన మ్యాచ్‌లకు సాక్ష్యమివ్వనున్నారు. కొంతమంది అగ్రశ్రేణి క్రికెటర్లు నెల రోజుల పోటీలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు,

Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్ మరో గోల్డ్ మెడల్, 41 ఏళ్ళ తరువాత ఈక్వస్ట్రియన్‌ విభాగంలో బంగారు పతకం సాధించిన భారత బృందం

Hazarath Reddy

ఆసియా 2023 క్రీడల్లో ఈక్వస్ట్రియన్‌ విభాగంలో భారత్‌ బంగారు పతకం సాధించింది. 41 ఏళ్ల తర్వాత తొలిసారి ఈక్వస్ట్రియన్‌లో భారత్‌ బంగారు పతకం కైవసం చేసుకోవడం గమనార్హం.

Sri Lanka Squad for World Cup: వరల్డ్‌కప్‌కు శ్రీలంక జట్టు ఇదిగో, ఆశలన్నీ మిస్టరీ స్పిన్నర్ దునిత్ వెల్లలగే పైనే, స్టార్‌ ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగా రీ ఎంట్రీ

Hazarath Reddy

వన్డే ప్రపంచకప్-2023కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు సారథిగా దసున్‌ షనక ఎంపికయ్యాడు. గాయం కారణంగా ఆసియాకప్‌కు దూరమైన స్టార్‌ ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగాకు వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కింది.

Advertisement

Viral Video: భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ కిడ్నాప్..వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..అసలు ఏం జరుగుతోంది..

ahana

ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన భారత కెప్టెన్‌కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తోంది. వీడియోలో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ చేతులు వెనుకకు కట్టి ఉన్నాయి. అతని నోటిపై గుడ్డ ఉంది. తన కెప్టెన్సీలో భారత్‌ను విశ్వవిజేతగా నిలిపిన ఈ క్రికెటర్ వీడియోలో నిస్సహాయంగా కనిపిస్తున్నాడు.

World Cup 2023: వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ సెమీ ఫైనల్ చేరదు..ఆధారాలతో సహా బయటపెట్టిన సంచలన క్రికెటర్

ahana

వచ్చే నెలలో భారత్‌లో జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ ప్రారంభ తేదీ సమీపిస్తోంది. ఈ టోర్నీపై క్రికెట్ అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహం నెలకొంది. సెమీఫైనల్‌కు చేరే నాలుగు జట్లు ఎవరన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

Asian Games 2023: ఆసియాక్రీడలు-2023లో భారత్‌ తొలి గోల్డ్‌మెడల్‌, పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం

Hazarath Reddy

చైనా వేదికగా జరుగుతున్న ఆసియాక్రీడలు-2023లో భారత్‌ తొలి గోల్డ్‌మెడల్‌ సాధించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో భారత్ స్వర్ణం కైవసం చేసుకుంది. రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్, దివ్యాంశ్ సింగ్ పన్వార్ ,ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్‌లతో కూడిన జట్టు భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించింది

Asian Games 2023: ఏసియన్స్ గేమ్స్‌లో టీమిండియా కొత్త చరిత్ర, క్రికెట్‌లో మొట్టమొదటి గోల్డ్‌ మెడల్‌చ సొంతం చేసుకున్న అండర్ 19 మహిళలు

Hazarath Reddy

స్వర్ణం కోసం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన శ్రీలంక లక్ష్యానికి 20 పరుగుల దూరంలో నిలిచిపోయి రజతంతో సరిపెట్టుకుంది. టీమిండియా మొట్టమొదటి గోల్డ్‌ మెడల్‌ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది.

Advertisement
Advertisement