Sports

IND vs AFG Final, Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టుకు స్వర్ణ పతకం

ahana

ఆసియా క్రీడలు 2023లో భారత పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఆసియా క్రీడలు 2023లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఆఫ్ఘనిస్థాన్‌ కంటే ఎక్కువ సీడ్‌ కావడంతో భారత్‌ విజేతగా నిలిచింది.

Asian Games India Record: ఆసియా క్రీడల్లో భారత్ కొత్త చరిత్ర.. వంద పతకాలతో సరికొత్త రికార్డు.. మహిళల కబడ్డీ ఫైనల్‌ లో భారత్ చేతిలో చైనీస్‌ జట్టు చిత్తు.. మొత్తంగా భారత్ కు ఏయే పతకాలు ఎన్ని వచ్చాయంటే?

Rudra

ఆసియా క్రీడల్లో భారత్ కొత్త చరిత్ర సృష్టించింది. ఏకంగా వంద పతకాలు సాధించి తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నది.

Pak Won On Netherlands: పాక్ టార్గెట్‌ ను చేధించడంలో తడబడ్డ నెదర్లాండ్స్, ఉప్పల్ మ్యాచ్‌లో పాక్ విజయం, 9 ఓవర్లు ఉండగానే ఆల్‌ ఔట్

VNS

ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్-2023 టోర్నీలో (ICC World CUP) హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై పాకిస్థాన్ (PAK Vs Netherlands) విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 286 పరుగులకు ఆల్ ఔట్ అయింది. 287 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ 41 ఓవర్లకే 205 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.

World Cup 2023: భారత జట్టుకు భారీ షాక్, డెంగ్యూ బారీన పడిన టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌, ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో ఆడటంపై సస్పెన్స్

Hazarath Reddy

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్‌ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనున్న సంగతి విదితమే. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు బిగ్‌ షాక్‌ తగిలింది. టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ డెంగ్యూతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Asian Games 2023: జపాన్‌ను చిత్తు చేసి గోల్డ్ మెడల్ సాధించిన టీమిండియా, చరిత్ర సృష్టించిన భారత హకీ జట్టు..

ahana

ఆసియా క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుత ప్రదర్శన చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్‌లో భారత్‌ జపాన్‌ను ఓడించింది.

Asian Games 2023: అఫ్గనిస్తాన్‌ చేతిలో పాకిస్తాన్‌కు ఘోర ఓటమి, సెమీ ఫైనల్లో 4 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఆప్ఘన్లు, ఫైనల్లో టీమిండియాతో రెడీ

Hazarath Reddy

చైనాలోని హోంగ్జూలో జరగుతున్న ఆసియా క్రీడలు-2023లో పాకిస్తాన్‌కు ఘోర ఓటమి ఎదురైంది. సెమీ ఫైనల్లో అఫ్గనిస్తాన్‌ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిపోయిన పాక్‌ జట్టుకు చేదు అనుభవం మిగిలింది. గోల్డ్‌ మెడల్‌ రేసు నుంచి పాక్‌ క్రికెట్‌ బృందం నిష్క్రమించింది.

Asian Games 2023: ఆసియా క్రీడలు 2023లో దూసుకుపోతున్న భారత్, రెజ్లింగ్‌లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్న కిరణ్ బిష్ణోయ్

Hazarath Reddy

అక్టోబర్ 6న జరిగిన ఆసియా క్రీడలు 2023లో మహిళల ఫ్రీస్టైల్ 76 కేజీల ఈవెంట్‌లో కిరణ్ బిష్ణోయ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. భారత గ్రాప్లర్ మంగోలియాకు చెందిన అరియుంజర్గా గన్‌బత్‌ను పాయింట్ల తేడాతో ఓడించి పోడియం ఫినిషింగ్‌ను ఖాయం చేసుకున్నారు. ఇది భారత్‌కు ఓవరాల్‌గా 92వ పతకం కాగా, రెజ్లింగ్‌లో ఓవరాల్‌గా నాలుగోది.

Asian Games 2023: ఆసియా క్రీడలు 2023లో భారత్‌కు మరో కాంస్యపతకం, 52 కేజీల రెజ్లింగ్ ఈవెంట్‌లో పతకం గెలుచుకున్న సోనమ్ మాలిక్

Hazarath Reddy

ఆసియా క్రీడలు 2023లో మహిళల ఫ్రీస్టైల్ 52 కేజీల రెజ్లింగ్ ఈవెంట్‌లో సోనమ్ మాలిక్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ ఈవెంట్‌లో భారత రెజ్లర్ 7-5తో చైనాకు చెందిన లాంగ్ జియాను ఓడించి పోడియం ఫినిషింగ్. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో రెజ్లింగ్‌లో భారత్‌కు ఇది మూడో పతకం కాగా, మొత్తం మీద 91వ పతకం.

Advertisement

Asian Games: బంగ్లాపై 9 వికెట్ల తేడాతో విక్ట‌రీ.. ఆసియా గేమ్స్ ఫైన‌ల్లోకి భార‌త్‌

Rudra

ఆసియా క్రీడ‌ల్లో ఇండియా ఫైన‌ల్లోకి దూసుకెళ్లింది. ఇవాళ జ‌రిగిన సెమీస్ మ్యాచ్‌ లో.. బంగ్లాదే శ్‌పై 9 వికెట్ల తేడాతో భార‌త జ‌ట్టు విజ‌యం సాధించింది.

ICC World Cup 2023: డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు భారీ షాక్, 9 వికెట్ల తేడాతో న్యూజీలాండ్ అదిరిపోయే విక్టరీ, 2019 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో ఎదురైన ఓట‌మికి ప్రతీకారం

Hazarath Reddy

వన్డే ప్రపంచకప్‌ ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ దుమ్మురేపింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌పై అదిరిపోయే విక్టరీ సొంతం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

ICC World Cup 2023: వరల్డ్‌కప్‌ 2023లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఇంగ్లండ్, జట్టులో 11 మంది ఆటగాళ్లు రెండంకెల స్కోర్లు చేసి కొత్త చరిత్ర, 4658 వన్డేల చరిత్రలో ఇదే తొలిసారి

Hazarath Reddy

భారత్‌లో జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌ 2023లో ఇంగ్లండ్‌ జట్టు ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఇవాళ (అక్టోబర్‌ 5) జరుగుతున్న టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ తుది జట్టులోని సభ్యులందరూ (11 మంది) రెండంకెల స్కోర్లు చేసి చరిత్ర సృష్టించారు

Joe Root Dismissal Video: జో రూట్ క్లీన్ బౌల్డ్ వీడియో ఇదిగో, ఫిలిప్స్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌ షాట్ ఆడి భారీ మూల్యం చెల్లించుకున్న ఇంగ్లండ్ ఆటగాడు

Hazarath Reddy

ఈ ఇన్నింగ్స్‌లో ఆరంభం నుంచి క్రమం తప్పకుండా రివర్స్‌ స్వీప్‌ షాట్లు ఆడి సక్సెస్‌ సాధించిన రూట్‌.. గ్లెన్‌ ఫిలిప్స్‌ బౌలింగ్‌ మరోసారి అదే ప్రయత్నం చేయబోయి మూల్యం చెల్లించుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు రూట్‌ అనవసరపు షాట్‌కు ప్రయత్నించి ఫిలిప్స్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు.

Advertisement

World Cup 2023: క్రికెట్ అభిమానులకు అదిరిపోయే కిక్ ఇచ్చిన జానీ బెయిర్‌స్టో, తొలి ఓవర్ రెండో బంతికే సిక్స్ బాది సరికొత్త రికార్డు

Hazarath Reddy

భారత్‌లో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌ 2023లో క్రికెట్‌ అభిమానులకు ఇంగ్లండ్‌ ఆటగాడు జానీ బెయిర్‌స్టో అదిరిపోయే కిక్‌ ఇచ్చాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఇవాళ (అక్టోబర్‌ 5) ప్రారంభమైన టోర్నీ ఓపెనింగ్‌ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ రెండో బంతికే సిక్సర్‌ బాదాడు.

World Cup 2023: మ్యాచ్ చూసేందుకు స్టేడియంలోకి వెళ్లే అభిమానులకు గుడ్ న్యూస్, అన్ని స్టేడియాల్లో ఫ్రీగా మిన‌ర‌ల్ వాట‌ర్ ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపిన బీసీసీఐ సెక్ర‌ట‌రీ జే షా

Hazarath Reddy

క్రికెట్ మ్యాచ్‌ల‌ను చూసేందుకు స్టేడియం వ‌చ్చే ప్రేక్ష‌కుల‌కు ఫ్రీగా మిన‌ర‌ల్ వాట‌ర్ ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. అన్ని స్టేడియాల్లోనూ ఉచిత మంచి నీరు స‌ర‌ఫ‌రా ఉంటుంద‌న్నారు. క్రికెట్ మ్యాచ్‌ల‌ను ఆస్వాదించాలంటూ ఆయ‌న త‌న ఎక్స్ అకౌంట్‌లో ట్వీట్ చేశారు.

Muttiah Muralitharan: హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం, హైదరాబాద్‌ చాలా ఫాస్ట్‌గా డెవలప్ అవుతోందని తెలిపిన ముతయ్య మురళీధరన్

Hazarath Reddy

శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ 800 సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ "హైదరాబాద్ బిర్యానీ అంటే తనకు ఇష్టం అని.. నేను ఇక్కడికి మొదటిసారి వచ్చినపుడు సిటీ అంత పెద్దగా లేకుండేది. ఇప్పుడు చూస్తే ఇండియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్‌గా ఉంది" అన్నారు.

Cricket World Cup 2023 Google Doodle: క్రికెట్ ప్రపంచ కప్ 2023 మొదటి రోజు, గూగుల్ డూడుల్ ఇదిగో, రెండు బాతులు రన్స్ తీస్తున్నట్లుగా గూగుల్ హోమ్ పేజీలో ప్రత్యేక డూడుల్‌

Hazarath Reddy

క్రికెట్ ప్రపంచకప్ 2023 నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రికెట్ ప్రపంచంలోని ఈ ఉత్కంఠ మ్యాచ్‌లలో ప్రపంచంలోని 10 జట్లు ఒకదానితో ఒకటి తలపడనున్నాయి. ఈ రోజు, మ్యాచ్ మొదటి రోజు, గూగుల్ తన హోమ్ పేజీలో ప్రత్యేక డూడుల్‌ను షేర్ చేసింది. ఇందులో రెండు బాతులు నడుస్తున్నట్లు కనిపిస్తున్నాయి.

Advertisement

ODI World Cup 2023: మెగా క్రికెట్ సమరానికి సర్వం సిద్ధం, నేటి నుంచి ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ప్రారంభం, తొలి మ్యాచ్‌ ఆడనున్న ఇంగ్లాండ్- న్యూజిలాండ్, వన్డే వరల్డ్ కప్ విశేషాలివే!

VNS

తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ – న్యూజిలాండ్ (ENG Vs NZ) జట్లు తలపడనున్నాయి. మధ్యాహ్నం 2గంటల నుంచి అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ ప్రారంభమవుతోంది. నవంబర్ 19న ఇదే స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ ను నిర్వహించనున్నారు.

Asian Games 2023: ఏషియన్‌ గేమ్స్‌లో 81 పతకాలతో భారత్ ఆల్ టైం రికార్డు, పాత రికార్డులను బద్దలు కొట్టిన ఇండియా అథ్లెట్ల బృందం, పతాకల పట్టికలో నాలుగో స్థానం

Hazarath Reddy

ఆసియా క్రీడల్లో భారత్‌ పతకాల పంట పండిస్తోంది. ఏషియన్‌ గేమ్స్‌ 2023 పతకాల వేటలో భారత్‌ దూసుకుపోతుంది. భారత క్రీడాకారుల జోరుతో ఈ ఆసియా క్రీడల్లో భారత్‌ ఇప్పటి వరకు 81 పతకాలు సాధించింది. అందులో 18 బంగారు పతకాలు, 31 రజత పతకాలు, 32 కాంస్య పతకాలు ఉన్నాయి.

Team India Schedule: రేపటి నుండి ప్రపంచకప్ ప్రారంభం, వరల్డ్‌కప్‌లో టీమిండియా షెడ్యూల్‌ ఇదిగో, ICC ప్రపంచ కప్ 2023 పూర్తి షెడ్యూల్‌పై ఓ లుక్కేయండి

Hazarath Reddy

ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5న అంటే రేపటి నుండి భారతదేశంలో ప్రారంభమవుతుంది. అక్టోబర్ 15న భారత్ వర్సెస్ పాకిస్థాన్ పోరుకు వేదిక అయిన అహ్మదాదాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో తొలి మ్యాచ్ ఆరంభం కానుంది.

Asian Games 2023: ఏషియన్‌ గేమ్స్‌ 2023 పతకాల వేటలో దూసుకుపోతున్న భారత్, 4X400 మీటర్ల రేసులో  మహిళలు రజత పతకం కైవసం

Hazarath Reddy

ఏషియన్‌ గేమ్స్‌ 2023 పతకాల వేటలో భారత్‌ దూసుకుపోతుంది. 19వ ఆసియా క్రీడల్లో విత్యా రాంరాజ్, ఐశ్వర్య మిశ్రా, ప్రాచి, శుభా వెంకటేశన్‌లతో కూడిన భారత మహిళల 4x400 మీటర్ల రిలే జట్టు రజత పతకాన్ని గెలుచుకుంది.

Advertisement
Advertisement