క్రీడలు
Benjamin Mendy: 10 వేల మందితో సెక్స్ చేశా, అందులో నీవున్నావో లేదో నాకు తెలియదు, జడ్జి ముందే బాంబు పేల్చిన శృంగార యోధుడు బెంజమిన్ మెండీ
Hazarath Reddyఫ్రాన్స్ మాజీ ఫుట్ బాల్ ప్లేయర్ బెంజమిన్ మెండీ.. రెండేళ్ల క్రితం ఓ మహిళపై అత్యాచారం చేశాడు. అప్పుడు ఆమెతో నేను 10 వేల మంది మహిళలతో శృంగారంలో పాల్గొన్నాను అంటూ చెప్పాడట. అయితే.. ఆ విషయాన్ని సదరు మహిళ కోర్టులో చెప్పింది. అంతే కాకుండా తానే అత్యాచారం చేశాడని కేసు వేసింది.
ICC World Cup 2023: దాయాది దేశపు ఆటగాళ్లు ఇండియాకు వస్తున్నారు, ప్రపంచకప్ ఆడేందుకు భారత్ పంపాలంటూ ప్రధానికి లేఖ రాసిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు
Hazarath Reddyభారత్ లో జరిగే వన్డే వరల్డ్‌ కప్‌ 2023 లో పాల్గొనేందుకు దాయాది దేశం పాకిస్థాన్ అంగీకరించింది. వేదికల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన పాకిస్తాన్ చివరికి మనసు మార్చుకుంది. టోర్నీలో ఆడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ మెగా టోర్నీ కోసం భారత్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఆ దేశ ప్రభుత్వానికి పాకిస్థాన్ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) విజ్ఞప్తి చేసింది.
World Cup Qualifiers 2023: ఆసక్తికరంగా వరల్డ్ కప్‌ క్వాలిఫైయర్స్, చివరి బెర్త్ కోసం మూడు దేశాల మధ్య తీవ్రపోటీ
VNSఈ ఏడాది వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ క్వాలిఫైయ‌ర్స్ పోటీ మ‌రింత అస‌క్తిక‌రంగా మారింది. మాజీ చాంపియ‌న్ శ్రీ‌లంక (Srilanka) జ‌ట్టు ఈరోజు అర్హ‌త సాధించింది. దాంతో, మిగిలిన‌ ఆఖ‌రి బెర్తు కోసం మూడు జ‌ట్ల మ‌ధ్య పోటీ నెల‌కొంది.
West Indies Out Of 2023 One Day World Cup: 2023 ప్రపంచ కప్ నుంచి వెస్టిండీస్ ఔట్..రెండు సార్లు ప్రపంచ కప్ గెలిచిన జట్టుకు అత్యంత అవమానకరమైన ఓటమి
kanhaఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు వెస్టిండీస్ జట్టు దూరమైంది. క్వాలిఫయర్స్‌లో పేలవ ప్రదర్శనతో వెస్టిండీస్ వన్డే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించలేకపోయింది.
Asian Kabaddi Championship: ఏషియన్ కబడ్డీ ఛాంపియన్‌ షిప్‌ టైటిల్‌ భారత్ సొంతం, ఫైనల్‌లో ఇరాన్‌ను చిత్తుగా ఓడించి ఇండియా
VNSద‌క్షిణకొరియాలో జ‌రిగిన ఏషియ‌న్ క‌బ‌డ్డీ ఛాంపియ‌న్ షిప్ 2023 (Asian Kabaddi Championship )విజేత‌గా భార‌త్ (India) నిలిచింది. ఫైన‌ల్ మ్యాచ్‌లో ఇరాన్ (Iran)ను చిత్తు చిత్తుగా ఓడించి గెలుపొందింది. బూస‌న్ వేదిక‌గా జ‌రిగిన ఈ మ్యాచ్‌లో 42-32 తేడాతో భార‌త్ విజ‌యం సాధించింది. కాగా.. ఆసియా క‌ప్ టైటిల్ విజేత‌గా నిల‌వ‌డం భార‌త్‌కు ఇది ఎనిమిదోసారి.
Asian Games 2023: ఆసియా గేమ్స్‌‌ లో ఆడనున్న టీమిండియా.. కెప్టెన్‌గా శిఖర్ ధావన్.. కోచ్ గా లక్ష్మణ్
Rudraఆసియా కప్-2023 తర్వాత రోహిత్ సేన వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో ఉండగానే ద్వితీయ శ్రేణి భారత జట్టు క్రేజీ టోర్నమెంట్ ఆడనుంది. ఈ జట్టుకు టీమిండియా గబ్బర్ శిఖర్ ధావన్ సారథిగా వ్యవహరించే అవకాశాలున్నాయి.
India Move to 100th Position in FIFA Ranking: ఫిఫా ర్యాంకింగ్స్ లో 100వ స్థానానికి ఎగబాకిన భారత ఫుట్ బాల్ జట్టు
kanhaభారత ఫుట్‌బాల్ జట్టు ఇటీవల ఇంటర్‌కాంటినెంటల్ కప్ 2023లో విజయం తర్వాత FIFA ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 100వ స్థానానికి ఎగబాకింది.
ICC Cricket World Cup 2023: వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లకు టిక్కెట్లు ఎలా కొనుగోలు చేయాలి, ICC ODI వరల్డ్ కప్ 2023 టిక్కెట్ల ధరలు, బుకింగ్ వివరాలు ఇవిగో..
Hazarath Reddyఈ ఏడాది భారత్‌ ఆతిథ్యమివ్వనున్న 2023 ఐసీసీ వన్డే క్రికెట్‌ ప్రపంచకప్‌ టోర్నీ అధికారిక షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) విడుదల చేసింది. ఇక్కడ నుండి సరిగ్గా 100 రోజుల తరువాత, ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో మొదటి మ్యాచ్ షెడ్యూల్ చేయబడుతుంది.
ICC World Cup 2023: హైదరాబాద్ టీమిండియా అభిమానులకు తీవ్ర నిరాశే, ఉప్పల్ స్టేడియంలో భారత్ మ్యాచ్ ఒక్కటి కూడా లేదు
Hazarath Reddyహైదరాబాద్ అభిమానులకు తీవ్ర నిరాశే మిగిలింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ప్రపంచకప్ మ్యాచ్‌లు జరగనున్నప్పటికీ టీమిండియా మాత్రం ఒక మ్యాచ్ కూడా ఆడడం లేదు. లీగ్ స్టేజ్‌లో భారత జట్టు 9 మ్యాచ్‌లు ఆడనుండగా.. 9 వేర్వేరు వేదికలపై ఆడనుంది.
ICC World Cup 2023: ఆ నాలుగు జట్లతోనే భారత్‌కు గట్టి పోటీ, ప్రపంచకప్‌లో టీమిండియా ఆడబోయే మ్యాచ్‌ల వివరాలు ఇవిగో..
Hazarath Reddyటోర్నీ ఆరంభ, ఫైనల్‌ మ్యాచ్‌లకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌.. రన్నరప్‌ న్యూజిలాండ్‌తో తలపడుతుంది. వన్డే వరల్డ్‌కప్‌-2023లో టీమిండియా ఆడబోయే మ్యాచ్‌ల వివరాలను ఓసారి చూద్దాం.
Rishabh Pant Latest Tweet: ప్రపంచకప్ కోసం రెడీ అవుతున్న రిషబ్ పంత్, సహచర ఆటగాళ్లును కలిసిన ఫోటో షేర్ చేసిన టీమిండియా వికెట్ కీపర్
Hazarath Reddyరోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నాడు. పంత్ ప్రస్తుతం బెంగళూరులోని నెషనల్‌ క్రికెట్‌ అకాడమీలో పునరావసం పొందుతున్నాడు. భారత్‌ వేదికగా జరగనున్న వరల్డ్‌కప్‌ సమయానికి పూర్తి ఫిట్‌నెస్‌ సాధించే దిశగా పంత్‌ శ్రమిస్తున్నాడు.
ICC World Cup 2023: పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఐసీసీ, వేదికలు మార్చే ప్రసక్తే లేదని స్ఫష్టం చేసిన బీసీసీఐ, ఆ మైదానాల్లోనే ఆడాలని తెలిపిన ఐసీసీ
Hazarath Reddyఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరుగనున్న సంగతి విదితమే. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. కాగా పాకిస్తాన్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండు మ్యాచులకు సంబంధించిన వేదికలను మార్చాలన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు డిమాండ్‌ను ఐసీసీ, బీసీసీఐ తిరస్కరించాయి.
ICC World Cup 2023: ఈ సారి విరాట్ కోహ్లీ కోసం ప్రపంచకప్ గెలవండి, టీమిండియా మాజీ డాషింగ్ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Hazarath Reddyఈ ఏడాది భార‌త్‌లో జ‌ర‌గ‌నున్న‌వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్(ODI WC 2023) స‌మ‌రానికి తేదీలు ఖ‌రార‌యి నేపథ్యంలో ఆటగాళ్ల నుంచి అంచనాలు వెలువడుతున్నాయి.షెడ్యూల్ వ‌చ్చిన సంద‌ర్భంగా.. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag)..ఈసారి భార‌త జ‌ట్టు విరాట్ కోహ్లీ కోసం(Virat Kohli) వ‌ర‌ల్డ్ క‌ప్ సాధించాల‌ని అన్నాడు.
ICC World Cup 2023: ధోనీ 2011 సీన్ రిపీట్ చేస్తాం, సొంత గ‌డ్డ‌పై ఆడటమే మా బలం, ప్రపంచకప్ టోర్నీపై భార‌త జట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఆసక్తికర వ్యాఖ్యలు
Hazarath Reddyక్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ అయింది. వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నీపై భార‌త జట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ(Rohit Sharma) ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశాడు. ఈసారి వ‌రల్డ్ క‌ప్ మామూలుగా ఉండ‌ద‌ని, త‌గ్గ‌పోరు ఖాయ‌మ‌ని అన్నాడు.
ICC World Cup 2023: ఈ సారి ప్రపంచకప్ ఎగరేసుకుపోయేది ఆ జట్టేనా, టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్న భారత్, ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ ఇదే..
Hazarath ReddyICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023. ఇది పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ యొక్క 13వ ఎడిషన్, 5 అక్టోబర్ 2023, 19 నవంబర్ 2023 మధ్య షెడ్యూల్ చేయబడింది. ఇది భారతదేశం పూర్తిగా హోస్ట్ చేసిన మొదటి ICC ప్రపంచ కప్ ఈవెంట్.
ICC Cricket World Cup 2023: అక్టోబర్ 15న పాకిస్తాన్‌ వర్సెస్ భారత్ మ్యాచ్, ప్రపంచకప్ 2023 షెడ్యూల్ ఇదిగో, ఆస్ట్రేలియాతో అక్టోబర్ 8న తొలి మ్యాచ్ ఆడనున్న టీం ఇండియా
Hazarath ReddyICC క్రికెట్ ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ ప్రకటించింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్..అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో భారత్ vs పాకిస్థాన్ తలపడనున్నాయి. అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్‌తో ప్రపంచ కప్ ప్రారంభమవుతుంది.
ICC Cricket World Cup 2023 Schedule: ప్రపంచకప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది, ఆస్ట్రేలియాతో అక్టోబర్ 8న భారత్ తొలి మ్యాచ్, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyఅక్టోబర్ 5న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్‌తో ప్రపంచ కప్ ప్రారంభమవుతుంది.ఐదుసార్లు ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియాతో చెన్నైలో ఆతిథ్య భారత్ అక్టోబర్ 8న తన తొలి మ్యాచ్ ఆడనుంది. షోకేస్ ఈవెంట్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి
ICC World Cup 2023: ఐసీసీ ప్రపంచ కప్ 2023 సెమీఫైనల్స్‌ వేదికలు ఖరారు, ముంబై లేదా కోల్‌కతాలో సెమీఫైనల్స్‌ జరుగుతాయని తెలిపిన అధికారులు
Hazarath Reddyకోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్, ముంబైలోని వాంఖడే స్టేడియంలు ICC ప్రపంచ కప్ 2023 సెమీఫైనల్స్‌కు వేదికలుగా మారవచ్చు.ఈ మేరకు ఏఎన్ఐ ట్వీట్ చేసింది.
Candy Crush Saga Fake Tweet: కాండీ క్రష్ సాగా ధోనీ ఆడుతున్నారనేది ఫేక్, మూడు గంటల్లోనే మూడు మిలియన్లు డౌన్లోడ్ వార్త అబద్దం, వాస్తవమేదో ఇక్కడ తెలుసుకోండి
Hazarath Reddyట్విటర్‌లో ఒక నకిలీ ట్వీట్ వైరల్ అవుతోంది, దాని ప్రకారం, ప్రముఖ ఆన్‌లైన్ గేమ్ కాండీ క్రష్ సాగా కేవలం మూడు గంటల్లోనే మూడు మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లను చూసిందని ఉంది, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ MS ధోని దానిని ఆడటం కనిపించింది.
Wrestlers Call Off Protest: 5 నెలల తరువాత ఆందోళన విరమించిన రెజ్లర్లు, ఇక నుంచి కోర్టులో యుద్ధం కొనసాగుతుందని ప్రకటన
Hazarath Reddyరెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ధర్నాకు దిగిన ఆరు నెలల తర్వాత, రెజ్లర్లు తమ నిరసనను విరమించారు.