క్రీడలు

Football Fan Falls to Death in Argentina Stadium: ఫుట్ బాల్ స్టేడియంలో స్టాండ్ మీద నుంచి పడి వ్యక్తి మృతి, మ్యాచ్ నిలిపివేత

kanha

అర్జెంటీనాలో రివర్ ప్లేట్ , డిఫెన్సా వై జస్టిసియా మధ్య శనివారం జరిగిన మ్యాచ్ స్టాండ్స్ నుండి పడి ఒక అభిమాని మరణించడంతో నిలిపివేశారు. 53 ఏళ్ల పాబ్లో మాసెర్లో సెరానో రివర్ ప్లేట్ మాన్యుమెంటల్ స్టేడియం వద్ద సివోరి ఆల్టా స్టాండ్ నుండి 15 మీటర్ల ఎత్తు నుంచి పడిపోయినట్లు అధికారులు తెలిపారు.

David Warner Retire: టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పేస్తానని ప్రకటించిన డేవిడ్ వార్నర్,

kanha

ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తాజాగా ట్వీట్ ద్వారా తెలియజేశారు. త్వరలోనే జరగబోయే పాకిస్తాన్ తో టెస్ట్ క్రికెట్ ఛాంపియన్షిప్ సందర్భంగా తాను రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు తెలిపారు.

Junior Asia Cup 2023: పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్, 4వ సారి జూనియర్‌ పురుషుల హాకీ ఆసియా కప్‌ కైవసం, శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

Hazarath Reddy

జూనియర్‌ పురుషుల హాకీ ఆసియా కప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ మరోసారి అదరగొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుచేసి.. నాలుగో టైటిల్‌తో ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక సార్లు ట్రోఫీ నెగ్గిన జట్టుగా రికార్డు సృష్టించింది. మూడు టైటిళ్లతో పాక్‌ రెండో స్థానానికి పరిమితమైంది.

Wrestlers Protest: దయచేసి పతకాలను గంగా నదిలో పడేయవద్దు, రెజ్లర్ల నిరసనపై 1983 క్రికెట్ ప్రపంచ కప్ విజేత జట్టు ప్రకటన, వారి సమస్య త్వరగా పరిష్కరించాలని వినతి

Hazarath Reddy

1983 క్రికెట్ ప్రపంచ కప్ విజేత జట్టు రెజ్లర్ల నిరసనపై ప్రకటన విడుదల చేసింది - "మా ఛాంపియన్ రెజ్లర్లపై గత కొంత కాలం నుంచి జరుగుతున్న చూసి మేము బాధపడ్డాము, కలవరపడ్డాము. వారు కష్టపడి సంపాదించిన పతకాలను గంగా నదిలో పడేయాలని ఆలోచిస్తున్నందుకు మేము చాలా ఆందోళన చెందుతున్నాము.

Advertisement

Wrestlers Protest: టీషర్ట్ కిందకు లాగి, వక్షోజాలపై చెయ్యి వేసి, బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్‌లో కీలక ఆరోపణలు, రెండు FIRలు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు

Hazarath Reddy

మ‌హిళా రెజ్ల‌ర్ల‌ను బీజేపీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్(Brij Bhushan) లైంగికంగా వేధించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్న విష‌యం తెలిసిందే. అయితే ఢిల్లీ క‌న్నాట్ పోలీసు స్టేష‌న్‌లో న‌మోదు అయిన ఎఫ్ఐఆర్ వివ‌రాలు కొన్ని బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

MS Dhoni Surgery Successful: సీఎస్‌కే కెప్టెన్ ధోని మోకాలి ఆపరేషన్‌ సక్సెస్‌, మరో రెండు రోజుల పాటు అతను ఆసుపత్రిలోనే ఉంటాడని తెలిపిన సీఎస్‌కే సీఈఓ

Hazarath Reddy

చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్ర సింగ్‌ ధోని మోకాలికి ఇవాళ (జూన్‌ 1) జరిగిన శస్త్ర చికిత్స విజయవంతమైందని సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథ్‌ వెల్లడించారు. ముంబైలోని కోకిలాబెన్‌ ఆసుపత్రిలో నేటి ఉదయం ధోనికి సర్జరీ జరిగిందని ఆయన తెలిపారు.

Team India New Jersey:టీం ఇండియా కొత్త జెర్సీ వీడియో ఇదిగో, వ‌న్డే, టీ20లకు కొంచెం భిన్నంగా జెర్సీలను రూపొందించిన అడిడాస్

Hazarath Reddy

ప్రపంచ‌టెస్టు చాంపియ‌న్‌షిప్(WTC 2023) మ‌రో వారంలో మెద‌లుకానుంది. కాగా ఈసారి భార‌త జ‌ట్టు కొత్త జెర్సీతో బ‌రిలోకి దిగ‌నుంది. మూడు ఫార్మాట్ల‌కు కొత్త జెర్సీల‌ను బీసీసీఐ(BCCI) ఈరోజు సాయంత్రం విడుద‌ల చేసింది. ఈమ‌ధ్యే కిట్ స్పాన్స‌ర్‌గా ఎంపికైన ప్ర‌ముఖ స్పోర్ట్స్ కంపెనీ అడిడాస్ లోగో జెర్సీ మీద ఉండ‌నుంది.

WTC Final 2023: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌పై గురి పెట్టిన ఇండియా, భారత్ శిక్షణా సెషన్ వీడియోను విడుదల చేసిన బీసీసీఐ

Hazarath Reddy

ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో భారత్ కఠినమైన పరీక్షను ఎదుర్కొంటుంది. అత్యంత ముఖ్యమైన ICC WTC 2023 ఫైనల్ లండన్‌లోని ఓవల్‌లో జరుగుతుంది. కోచింగ్ సిబ్బందితో సహా భారత జట్టులోని చాలా మంది సభ్యులు ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకున్నారు.

Advertisement

IPL Trophy In TTD Temple: శ్రీవారి సన్నిధిలో ఐపీఎల్ ట్రోఫీ, మొక్కు చెల్లించుకున్న చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం..

kanha

ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత దానిని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం చెన్నైలోని త్యాగరాయ నగర్ లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి తీసుకెళ్లారు. అక్కడ ట్రోఫీకి ప్రత్యేక పూజలు నిర్వహించడం విశేషం.

Ambati Rayudu Retirement: క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన అంబటి రాయుడు, ఇది ఒక ఉద్వేగ సమయం అంటూ ట్వీట్

Hazarath Reddy

ఐపీఎల్ 2023 టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ గెలుచుకున్న తర్వాత అంబటి రాయుడు భారత క్రికెట్‌లోని అన్ని రూపాలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. వర్షం కారణంగా రిజర్వ్ డేకి తరలించబడిన ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఐపిఎల్ 2023 తన చివరి మ్యాచ్ అని రైట్ హ్యాండర్ గతంలో ప్రకటించాడు.

Ravindra Jadeja Finishing Video: మళ్లీ మళ్లీ చూడాలనిపించే రవీంద్ర జడేజా ఫినిషింగ్ వీడియో ఇదిగో, రెండు బంతుల్లో పది పరుగులను ఎంత స్మార్ట్‌గా రాబట్టాడో..

Hazarath Reddy

గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠతో సాగిన పోరులో చివరకు ధోనీ సేనదే పైచేయి అయింది. వరుణుడి ఆటంకం మధ్య సాగిన పోరులో చెన్నై విజయానికి చివరి రెండు బంతుల్లో 10 పరుగులు అవసరం కాగా.. రవీంద్ర జడేజా 6,4తో సూపర్‌ కింగ్స్‌ను సంబురాల్లో ముంచెత్తాడు.

Deepak Chahar Dancing Video: దీపక్ చాహర్ డ్యాన్స్ వీడియో ఇదిగో, హోటల్‌లో భార్యతో కలిసి కొత్త స్టెప్పులతో చిందులేసిన సీఎస్‌కే ఆటగాడు

Hazarath Reddy

దీపక్ చాహర్ ఉదయం ఐదు గంటలకు హోటల్‌లో తన భార్యతో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. IPL 2023 చివరి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది, చెన్నై సూపర్ కింగ్స్ చివరి బంతికి 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ (GT vs CSK ఫైనల్)ను ఓడించింది.

Advertisement

YSRCP on Ambati Rayudu: అంబటి రాయుడు కొత్త జర్నీ అటేనా, ఆల్ ది బెస్ట్ అంటూ ప్రత్యేకంగా ప్రస్తావించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, ట్వీట్ ఇదిగో..

Hazarath Reddy

చెన్నై సూపర్ కింగ్స్ సాధించిన ఈ విజయం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఆ జట్టుకు అభినందనలు తెలియజేసింది. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పారటీ చీఫ్ వీ విజయసాయి రెడ్డి కొద్దిసేపటి కిందటే ట్వీట్ పోస్ట్ చేశారు. చివరి బంతి వరకు ఉత్కంఠతను రేకెత్తించిన ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కూడా అద్భుతంగా పోరాడాయని అన్నారు. ఈ

Dhoni on Ambati Rayudu: వీడియో ఇదిగో, రాయుడు అద్భుతమైన క్రికెటర్, అతడిని చూస్తే ఆనందంగా ఉందని ప్రశంసలు కురిపించిన ధోనీ

Hazarath Reddy

అతడు మైదానంలో ఉంటే నూటికి నూరు శాతం అంకితభావంతో ఆడతాడన్నాడు. రాయుడు జట్టులో ఉన్నప్పుడు తానెప్పుడూ ఫెయిర్ ప్లే అవార్డు గెలవలేదని.. అతడు త్వరగా రియాక్ట్ అవుతాడని ధోనీ సరదాగా చెప్పాడు. రాయుడు అద్భుతమైన క్రికెటర్ అని ప్రశంసించిన ధోనీ.. తామిద్దరం కలిసి ఇండియా-ఏ తరఫున ఆడామని గుర్తు చేసుకున్నాడు.

Ambati Rayudu: అంబటి రాయుడుకి ధోని అరుదైన గౌరవం, ట్రోఫీ అందుకోవాలంటూ పక్కకు వెళ్లి నిల్చున్న మహేంద్రుడు, అంబటి రాయుడు ఐపీఎల్ జర్నీపై ప్రత్యేక కథనం ఇదిగో..

Hazarath Reddy

ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడకుండా.. 200కిపైగా ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఏకైక భారత క్రికెటర్ రాయుడే కావడం విశేషం. ఆరుసార్లు ఐపీఎల్ ఛాంపియన్, లెజెండ్.. విన్నర్.. హ్యాపీ రిటైర్మెంట్ అంబటి అంటూ.. ముంబై ఇండియన్స్ రాయుడిని ఉద్దేశించి ట్వీట్ చేసింది.

MS Dhoni On Retirement: రిటైర్మెంట్ రూమర్స్‌కు చెక్ పెట్టిన ధోనీ, మరో ఐపీఎల్ సీజన్ ఆడుతానని స్పష్టం చేసిన సీఎస్కే కెప్టెన్

Hazarath Reddy

నిన్న రాత్రి జరిగిన ఐపీఎల్ ఫైనల్స్ లో గుజరాత్ టైటాన్స్ ను ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ టైటిల్ ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలుపొందిన కెప్టెన్ గా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ సరసన ధోనీ నిలిచాడు.

Advertisement

MS Dhoni Lifts Ravindra Jadeja Video: ఒక్క వీడియోతో అన్ని రూమర్లకు పుల్‌స్టాప్, జడేజాను ఎత్తుకుని కన్నీటి పర్యంతమైన ధోనీ, మిలియన్‌కు పైగా వ్యూస్‌తో దూసుకుపోతున్న వీడియో

Hazarath Reddy

గుజరాత్‌ టైటాన్స్‌తో సోమవారం నాటి తుదిపోరులో CSK ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా చివరి రెండు బంతుల్లో సిక్స్, ఫోర్‌ బాది జట్టుకు విజయం అందించగానే ధోని కళ్లల్లో ఆనంద భాష్పాలు కనిపించాయి. విన్నింగ్‌ షాట్‌ కొట్టగానే జడ్డూ డగౌట్‌ దిశగా పరిగెత్తుకు రాగా.. ఎంఎస్ ధోని ఒక్కసారిగా అతడిని ఎత్తుకున్నాడు.

Dhoni Gets Emotional Video: ఐపీఎల్ ఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జయభేరి.. ధోనీ భావోద్వేగం.. వీడియో వైరల్

Rudra

అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచులో చెన్నై ఆటగాడు రవీంద్ర జడేజా చివరి బంతికి ఫోర్ కొట్టి, చెన్నై సూపర్ కింగ్స్ ను ఫైనల్లో విజేతగా నిలిపాడు. ఈ సందర్భంగా టీం కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ భావోద్వేగానికి గురయ్యారు. దాదాపుగా కన్నీటిపర్యంతమయ్యే స్థితిలోకి వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

GT vs CSK, IPL Final Match: నరాలు తెగే ఉత్కంఠతో కొనసాగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచులో విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్, పోరాడి ఓడిన గుజరాత్ టైటాన్స్..

kanha

అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచులో చెన్నై ఆటగాడు రవీంద్ర జడేజా చివరి బంతికి ఫోర్ కొట్టి, చెన్నై సూపర్ కింగ్స్ ను ఫైనల్లో విజేతగా నిలిపాడు. గుజరాత్ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో చెన్నై విజయం సాధించి ఐపీఎల్ టైటిల్‌ను 5వ సారి గెలుచుకుంది.

IPL 2023 Final: ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచులో ఐపీఎల్ ట్రోఫీ కైవసం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్

kanha

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. వర్షం కారణంగా పలు ఆటంకాలతో ప్రారంభమైన మ్యాచులో గుజరాత్ టైటాన్స్ పై విజయం సాధించింది.

Advertisement
Advertisement