Cricket

World Cup 2023: శ్రీలంక జట్టులో భారత క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, మహమ్మద్ షమీ, స్క్రీన్‌పై తప్పుగా చూపించిన బ్రాడ్‌కాస్టర్

Hazarath Reddy

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ 2023లో శ్రీలంకతో భారత్ ప్రస్తుతం హై-వోల్టేజ్ ఘర్షణలో నిమగ్నమై ఉంది. మ్యాచ్‌కు ముందు, బ్రాడ్‌కాస్టర్ రెండు జట్ల ప్లేయింగ్ XIలను స్క్రీన్‌పై ప్రదర్శిస్తుండగా, వారు ఏంజెలో మాథ్యూస్, దుష్మంత చమీరా స్థానంలో భారత క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, మహమ్మద్ షమీల చిత్రాలను తప్పుగా చూపించారు. అభిమానులు వెంటనే దాన్ని గుర్తించి ఫోటోని వైరల్‌ చేశారు.

Virat Kohli Breaks Sachin Record: సచిన్ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ, వన్డేల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000కు పైగా పరుగులు అత్యధిక సార్లు సాధించిన ఆటగాడిగా రికార్డు

Hazarath Reddy

అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా రన్‌ మిషన్‌ విరాట్‌ కోహ్లి మరో అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000కు పైగా పరుగులు అత్యధిక సార్లు చేసిన ఆటగాడిగా విరాట్‌ రికార్డులకెక్కాడు. వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా శ్రీలంకపై 34 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద కోహ్లి.. ఈ ఘనతను అందుకున్నాడు.

Rohit Sharma Wicket Video: రోహిత్‌ శర్మ క్లీన్ బౌల్డ్ వీడియో ఇదిగో, దిల్షాన్‌ బౌలింగ్‌లో రెండో బంతికే పెవిలియన్ బాట పట్టిన భారత కెప్టెన్

Hazarath Reddy

వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో టీమిండియా- శ్రీలంక మధ్య గురువారం మ్యాచ్ జరుగుతోంది. టాస్‌ గెలిచిన శ్రీలంక ఆహ్వానం మేరకు రోహిత్‌ సేన తొలుత బ్యాటింగ్‌కు దిగింది భారత ఇన్నింగ్స్‌ రెండో బంతికే లంక శ్రీలంక పేసర్‌ దిల్షాన్‌ మధుషాంక ఊహించని షాకిచ్చాడు.

ODI World Cup 2023: టీమిండియాతో శ్రీలంక పోరు, బద్దలు అయ్యేందుకు రెడీగా ఉన్న రికార్డులు ఇవే, ఆసియా కప్‌ ఫైనల్‌ ఫలితం పునరావృతంతో పాటు సెమీస్‌ బెర్త్‌పై కన్నేసిన భారత్

Hazarath Reddy

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇవాళ (నవంబర్‌ 2) శ్రీలంక.. టీమిండియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ శ్రీలంకను ఓడించి, అధికారికంగా సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకోవాలని భావిస్తుంది.ఆసియా కప్‌-2023 ఫైనల్లో ఫలితాన్నే (సిరాజ్‌ (7-1-21-6) చెలరేగడంతో భారత్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది) ఈ మ్యాచ్‌లోనూ పునరావృతం చేయాలని భారత ఆటగాళ్లు భావిస్తున్నారు.

Advertisement

Sachin Tendulkar Statue: స్ట్రెయిట్ డ్రైవ్‌ షాట్ రూపంలో సచిన్ టెండూల్కర్ విగ్రహం ఇదిగో, ఇది నా జీవితంలో ప్రత్యేకమైన రోజని తెలిపిన లిటిల్ మాస్టర్

Hazarath Reddy

దిగ్గజ బ్యాటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ విగ్రహాన్ని వాంఖడే స్టేడియంలో మహారాష్ట్ర ముఖ్యమంతి ఏక్‌నాథ్‌ షిండే బుధవారం ఆవిష్కరించారు. కన్నులపండువగా జరిగిన ఈ కార్యక్రమానికి సచిన్‌, అతడి భార్య అంజలి, కూతురు సారాతో హాజరయ్యాడు.

IND Vs SL: వరల్డ్ కప్ లో ఇవాళ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ లంకతో భారత్ ఢీ, వాంఖడే స్టేడియంలో ధోనీ సాధించిన ఘనతను రోహిత్ సాధిస్తాడా? ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫాన్స్

VNS

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో (CWC 23) టీమిండియా హవా కొనసాగుతోంది. ఓటమి లేకుండా విజయాల పరంపరను కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్ లు ఆడిన టీమిండియా (Team India) అన్నింటిలో విజయం సాధించింది. వరుస విజయాలతో భారత జట్టు దాదాపు సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టడం ఖాయమైంది.

SA vs NZ, World Cup 2023: దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘోర పరాజయం.. కివీస్‌పై 190 పరుగుల తేడాతో సౌతాఫ్రికా భారీ విజయం

ahana

దక్షిణాఫ్రికా 190 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. న్యూజిలాండ్‌కు 358 పరుగుల విజయ లక్ష్యం నిర్దేశించగా, కివీస్ జట్టు కేవలం 167 పరుగులకే ఆలౌటైంది.

World Cup 2023: దక్షిణాఫ్రికా చేతిలో 190 పరుగుల తేడాతో చిత్తయిన న్యూజీలాండ్, పాకిస్తాన్ సెమీస్ అవకాశాలను సజీవం చేసిన కివీస్

Hazarath Reddy

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా పుణే MCA Stadiumలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 190 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ ఓటమి పాలైంది. 358 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌.. ప్రోటీస్‌ బౌలర్ల ధాటికి 167 పరుగులకే కుప్పకూలింది.

Advertisement

World Cup 2023: అఫ్ఘానిస్థాన్‌ సెమీస్ చేరాలంటే దారులు ఇవే, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలకు షాకిస్తే సంచలనమే మరి

Hazarath Reddy

పాకిస్థాన్‌లకు షాకిచ్చిన పసికూన అఫ్ఘానిస్థాన్‌...మాజీ చాంపియన్‌ శ్రీలంకను కూడా 7 వికెట్లతో చిత్తు చేసింది. తాజాగా ప్రపంచకప్ సెమీస్ రేసులో పోటీలోకి వచ్చేసింది.

Afg vs SL, World Cup 2023: పఠాన్ల సంచలనం, శ్రీలంకను ఓడించి ప్రపంచకప్‌లో దుమారం సృష్టించిన ఆఫ్ఘనిస్థాన్

ahana

అఫ్గానిస్థాన్ జట్టు మరోసారి తన భీకర ఫామ్‌ను కనబరిచింది. ఇప్పటికే ఇంగ్లండ్‌ను ఓడించి పెద్ద దుమారాన్ని సృష్టించిన పఠాన్లు. ఆ తర్వాత పాకిస్థాన్ ను సైతం చితక్కొట్టారు. ఇప్పుడు శ్రీలంకను కూడా ఆఫ్ఘనిస్తాన్ ఓడించింది. ఈ జట్టు శ్రీలంకపై పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించింది. లంకను ఓడించి ఆఫ్ఘనిస్థాన్ ప్రపంచకప్‌లో మూడో విజయాన్ని నమోదు చేసింది.

Rohit Sharma in Elite List: రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డ్, ఎలైట్ లిస్ట్‌లో చోటు హిట్ మ్యాన్, భారత్ నుంచి లిస్ట్ లో చుతూ దక్కించుకున్న వాళ్ళు వీళ్ళే

VNS

భార‌త కెప్టెన్‌, హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ (Rohit Sharma) ఎలైట్ లిస్ట్‌లో (Elite List) చోటు సంపాదించాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా ల‌క్నో వేదిక‌గా ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో రోహిత్ (Rohit Sharma) ఈ ఘ‌న‌త సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 18 వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్నాడు. త‌ద్వారా ఈ ఘ‌న‌త సాధించిన ఐదో భార‌త క్రికెట‌ర్‌గా నిలిచాడు.

India Vs England: వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా విజ‌య యాత్ర‌, ఇంగ్లాండ్ పై 100 తేడాతో ఘనవిజయం, భారత్ సెమీస్ బెర్త్ ఖాయం

VNS

లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో కాస్త తడబడ్డా మన బౌలర్ల సమిష్టి కృషితో భారత్‌.. ప్రపంచకప్‌లో (World Cup) సెమీస్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. రోహిత్‌ సేన నిర్దేశించిన 230 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్‌.. 34.5 ఓవర్లలో 129 కే ఆలౌట్‌ అయింది. ఫలితంగా భారత్‌.. వంద పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

Advertisement

India vs England, World Cup 2023, Viral Video: 40 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్, షమీ వికెట్లు ఎలా తీశాడో ఈ వీడియోల్లో చూడండి..

ahana

2023 ప్రపంచకప్‌లో భారత్-ఇంగ్లండ్ మధ్య లక్నోలో జరుగుతున్న వన్డే మ్యాచులో భారత్ బౌలింగ్ విభాగం పట్టు బిగించింది. ఇంగ్లాండ్ 10 ఓవర్లకే 40 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లు బుమ్రా, షమి చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

India vs England, World Cup 2023: ఇంగ్లాండ్ బౌలర్ల దెబ్బకు భారత్ తడబాటు, ఇంగ్లీష్ సేన లక్ష్యం కేవలం 230 పరుగులు మాత్రమే..సున్నాకే ఔట్ అయిన కోహ్లీ..

ahana

2023 ప్రపంచకప్‌లో భారత్-ఇంగ్లండ్ మధ్య లక్నోలో జరుగుతున్న వన్డే మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసింది. భారత్ టాప్ ఆర్డర్ దారుణంగా తడబడింది. కేవలం రోహిత్ శర్మ 101 బంతుల్లో 87 పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ 49 పరుగులతో ఇన్నింగ్స్ ఆడి చెప్పుకోదగ్గ పరుగులు చేశారు.

Netherlands Beat Bangladesh: వరల్డ్ కప్‌లో మరో సంచలనం, బంగ్లాదేశ్‌పై ఘనవిజయం సాధించిన నెదర్లాండ్స్, కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన ఎడ్వర్డ్స్

VNS

భార‌త్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ (CWC-23) సంచ‌ల‌నాల‌కు నెల‌వుగా మారింది. ఈ మెగా టోర్నీలో నెద‌ర్లాండ్స్ (Netherlands) మ‌రో జ‌ట్టుకు షాకిచ్చింది. మొన్న సౌతాఫ్రికాను ఓడించిన నెద‌ర్లాండ్స్ నేడు బంగ్లాదేశ్‌కు (Bangladesh) షాకిచ్చింది. కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా బంగ్లాదేశ్ తో జ‌రిగిన మ్యాచ్‌లో 87 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

World Cup 2023, AUS vs NZ: న్యూజిలాండ్ పై ఆస్ట్రేలియా విజయం, 5 పరుగుల తేడాతో ఆసీస్ గెలుపు, చివరి ఓవర్లో ఉత్కంఠగా మారిన మ్యాచ్..

ahana

ప్రపంచ కప్ 27వ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు మధ్య హోరాహోరీగా తలపడ్డాయి. హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్లిన కంగారూ జట్టును న్యూజిలాండ్‌ భయపెట్టింది. 388 పరుగుల భారీ స్కోరు చేసిన తర్వాత కూడా ఆస్ట్రేలియా చెమటోడ్చి 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Advertisement

SA Vs PAK: పాక్‌ సెమీస్ ఆశలు గల్లంతు, చెపాక్‌లో రాణించిన మార్‌క్రమ్, పాక్‌పై ఒక వికెట్ తేడాతో సౌతాఫ్రికా విన్, పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి సఫారీలు

VNS

భార‌త్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ద‌క్షిణాఫ్రికా అద‌ర‌గొడుతోంది. శుక్ర‌వారం చెన్నై వేదిక‌గా పాకిస్థాన్‌తో జ‌రిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో వికెట్‌ తేడాతో విజ‌యం (South Africa Win) సాధించింది. త‌ద్వారా పాయింట్ల ప‌ట్టిక‌లో మ‌ళ్లీ అగ్ర‌స్థానానికి చేరుకుంది.

MS Dhoni Opens Up on Retirement: రనౌట్ అయిన ఆ రోజే డ్రెస్సింగ్ రూమ్‌లో ఏడ్చేశా, రిటైర్మెంట్ ప్రకటనపై ఎంఎస్ ధోనీ భావోద్వేగపు వీడియో ఇదిగో

Hazarath Reddy

2019 క్రికెట్ ప్రపంచ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడం చాలా మంది భారతీయ క్రికెట్ అభిమానులను బాధించిన సంగతి విదితమే. MS ధోని రనౌట్ ఆట గతిని మార్చింది. చివరికి భారత్ కేవలం 18 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఆ ఓటమి తర్వాత తాను డ్రెస్సింగ్ రూమ్‌లో ఏడ్చేశానని సంజయ్ బంగర్ అనే అభిమాని అడిగిన ప్రశ్నకు ధోని స్పందిస్తూ.. ఆ పోటీ తర్వాత రిటైర్ కావాలని అనుకున్నట్లు ధోనీ వెల్లడించాడు

Greg Chappell: తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో టీమిండియా మాజీ కోచ్, లగ్జరీ లైఫ్‌కి డబ్బులు లేక అవస్థలు పడుతున్న గ్రెగ్ చాపెల్, GoFundMe పేరిట నిధులు సేకరిస్తున్న స్నేహితులు

Hazarath Reddy

క్రికెట్ దిగ్గజం గ్రెగ్ చాపెల్ తన గత కొన్నేళ్లుగా "తనకు మెరుగులు దిద్దేందుకు" ఆన్‌లైన్ నిధుల సేకరణ ప్లాట్‌ఫారమ్‌ను ఏర్పాటు చేయడానికి తన స్నేహితులతో ఆర్థికంగా పోరాడుతున్నాడని వెల్లడించాడు.

ICC Cricket World Cup 2023: డిఫెండింగ్‌ చాంపియన్‌కు ఇంగ్లండ్‌కు ఘోర పరాభవం, శ్రీలంక చేతిలో భారీ ఓటమి, వరుసగా నాలుగో పరాజయంతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టం

Hazarath Reddy

వన్డే వరల్డ్‌కప్‌-2023లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌కు మరో ఘోర పరాభవం ఎదురైంది. గత మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో 229 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన బట్లర్‌ బృందాన్ని ఈ రోజు శ్రీలంక మట్టి కరిపించింది.

Advertisement
Advertisement