Cricket

Akash Madhwal: స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఎక్కడ..నేను ఎక్కడ, ముంబయి ఇండియన్స్‌ పేసర్‌ ఆకాశ్‌ మధ్వాల్‌ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

లక్నో సూపర్‌జెయింట్స్‌తో ఎలిమినేటర్‌లో 3.3 ఓవర్లలో కేవలం 5 పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీసిన ఆకాశ్ మధ్వాల్‌ అందిరకీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఈ స్టార్ పేసర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాకు తాను ప్రత్యామ్నాయం కాదని... తన వంతు బాధ్యతను మాత్రమే నిర్వర్తిస్తున్నానని ముంబయి ఇండియన్స్‌ సంచలన పేసర్‌ అన్నాడు.

IPL 2023: ముంబైతో చావోరేవో తేల్చుకోనున్న గుజరాత్, ఆ స్టార్లు ఇద్దరినీ బరిలోకి దించి విక్టరీ కొట్టాలని భారీ వ్యూహం

Hazarath Reddy

IPL 2023 క్వాలిఫైయర్ 2లో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్, హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ ఒకదానితో ఒకటి పోటీపడతాయి. శక్తివంతమైన ముంబైపై విజయం సాధించే ప్రయత్నంలో, గుజరాత్ వారి ఆటలో కొన్ని మార్పులను పరిగణించవచ్చు. GT IPL 2023 ఫైనల్‌కు తమ స్థానాన్ని బలోపేతం చేయడానికి ఐరిష్ పేసర్ జాషువా లిటిల్, భారత అన్‌క్యాప్డ్ బ్యాటర్ సాయి సుదర్శన్‌లను తీసుకురావచ్చు.

WTC Final 2023: భారత్‌-ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్, గెలిస్తే రూ. 13. 2 కోట్లు, ఓడిన జట్టుకు రూ. 6.61 కోట్లు, డబ్ల్యూటీసీ 2021-23 ప్రైజ్‌మనీ వివరాలు ప్రకటించిన ఐసీసీ

Hazarath Reddy

డబ్ల్యూటీసీ 2021-23 ప్రైజ్‌మనీ వివరాలను ఐసీసీ ఇవాళ (మే 26) ప్రకటించింది. భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జూన్‌ 7న ప్రారంభంకానున్న ప్రతిష్టాత్మక ఫైనల్లో విజేతకు 1.6 మిలియన్‌ డాలర్ల ప్రైజ్‌మనీ (Rs 13.2 crore) దక్కనుండగా.. రన్నరప్‌కు 800,000 డాలర్లు ప్రైజ్‌మనీ ( Rs. 6.61 crore) రూపంలో దక్కనున్నాయి.

IPL 2023: రూ.18.50 కోట్లు పెట్టి కొంటే ఇక్కడ అట్టర్ ఫ్లాప్, అక్కడ మాత్రం ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లను హడలెత్తించాడు, టీ20 బ్లాస్ట్‌లో సామ్‌ కర్రన్‌ విశ్వరూపం

Hazarath Reddy

పంజాబ్‌ కింగ్స్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కర్రన్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర (2023లో రూ. 18.50 కోట్లు) పలికిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన సంగతి విదితమే. అయితే అనుకున్నంతగా రాణించలేకపోవడంతో పంజాబ్ ఇంటి దారి పట్టింది. ఈ ఆటగాడు ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో చెలరేగిపోయాడు

Advertisement

IPL 2023, LSG vs MI : ప్లే ఆఫ్స్ లో లక్నోను చిత్తు చేసిన రోహిత్ సేన, ఫైనల్ కు మరో అడుగు దూరంలో నిలిచిన ముంబై ఇండియన్స్..

kanha

IPL 2023 ఎలిమినేటర్ మ్యాచ్ బుధవారం చెన్నైలో లక్నో సూపర్ జెయింట్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో రోహిత్ సేన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లోకి అడుగుపెట్టింది.

IPL 2023, LSG vs MI: నేడు జరిగే ముంబై ఇండియన్స్, లక్నో సూపర్‌జెయింట్స్ మ్యాచులో ముంబైదే విజయం..ముందే జోస్యం చెప్పిన డివిలియర్స్

kanha

ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ జోస్యం చెప్పాడు.

IPL 2023: వీడియో ఇదిగో, ఆ బాల్ నోబాల్ కాకుండా ఉండి ఉంటే చెన్నై ఓటమి పాలయ్యేదా, రుతురాజ్ గైక్వాడ్ 60 పరుగులు ఎంత విలువైనవంటే..

Hazarath Reddy

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా గుజరాత్‌టైటాన్స్‌తో క్వాలిఫయర్‌-1 పోరులో సీఎస్‌కే ఓపెనర్‌ రుతురాజ్‌కు ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే నోబాల్‌ రూపంలో అదృష్టం కలిసొచ్చింది. రుతురాజ్ 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద దర్శన్‌ నల్కండే బౌలింగ్‌లో ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ మూడో బంతికి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

IPL 2023: ధోనీ దిమ్మతిరిగే వ్యూహానికి బలైన హార్దిక్ పాండ్యా, మహేష్ తీక్షణ బౌలింగ్‌లో బంతిని అంచనావేయలేక జడేజాకు క్యాచ్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

MS ధోని ఒక మాస్టర్ వ్యూహకర్త, ఇది అందరికీ తెలిసిన వాస్తవం. మే 23, మంగళవారం నాడు గుజరాత్ టైటాన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ క్వాలిఫైయర్ 1 సందర్భంగా హార్దిక్ పాండ్యాను అవుట్ చేయడానికి అతను అద్భుతమైన ఫీల్డింగ్ మార్పు చేసాడు.

Advertisement

IPL 2023: రవీంద్ర జడేజా సరికొత్త రికార్డు, IPL చరిత్రలో 150 వికెట్లు తీసిన తొలి లెఫ్టార్మ్ బౌలర్‌గా నిలిచిన జడ్డూ భాయ్

Hazarath Reddy

మే 23, మంగళవారం జరిగిన గుజరాత్ టైటాన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో రవీంద్ర జడేజా IPL చరిత్రలో 150 వికెట్లు తీసిన తొలి లెఫ్టార్మ్ బౌలర్‌గా నిలిచాడు. జడేజా తర్వాత అత్యధిక వికెట్లు తీసిన ఎడమచేతి వాటం బౌలర్ అక్షర్ పటేల్. మొత్తం 112 వికెట్లు తీసాడు.

IPL 2023: ధోనీ దెబ్బకు శుభమాన్ గిల్ సైలెంట్, గుజరాత్ మెడలు వంచుతూ సొంత గడ్డపై గర్జించిన చెన్నై సూపర్ కింగ్స్, సగర్వంగా పదవసారి ఐపీఎల్‌ ఫైనల్లోకి..

Hazarath Reddy

సొంతగడ్డపై ధోనీ సేన గర్జించింది. బ్యాటింగ్‌.. బౌలింగ్‌లో విశేషంగా రాణించిన ఈ మాజీ చాంపియన్‌ ఏకంగా పదోసారి ఐపీఎల్‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది.డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో మంగళవారం జరిగిన తొలి క్వాలిఫయర్‌లో ధోనీ సేన 15 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

MS Dhoni Retirement: రిటైర్మెంట్‌పై ధోనీ హింట్, మళ్లీ ఆడతానో? లేదో? నాకూ అనుమానమే అంటూ కీలక వ్యాఖ్యలు, సీఎస్‌కే కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానంటూ ప్రకటన

VNS

గత సీజన్‌లో లీగ్‌ స్టేజ్‌కే పరిమితమైన సీఎస్‌కేను కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ (M.S. Dhoni) అద్భుతంగా ముందుకు నడిపించి టైటిల్‌ రేసులో నిలిపాడు. ప్రస్తుత సీజనే ధోనీకి చివరిదిగా అంతా భావిస్తున్న వేళ.. కెప్టెన్‌ కూల్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. రిటైర్‌మెంట్‌, తన జట్టు ఫైనల్‌కు చేరుకోవడంపై ధోనీ మాట్లాడాడు.

GT vs CSK : గుజరాత్ టైటాన్స్ కు ధోని సేన దెబ్బ.. తొలి ప్లే ఆఫ్ మ్యాచ్ లో విజయం కైవసం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్

kanha

చెన్నై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ ప్లే ఆఫ్ 1 మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టును 15 పరుగుల తేడాతో ఓడించింది.

Advertisement

CSK vs GT IPL 2023 Qualifier 1: ప్లే ఆఫ్స్‌‌లో ధోని దిమ్మతిరిగే రికార్డు, గుజరాత్ టైటాన్స్ కొత్త వ్యూహం మహేంద్రుడి బాదుడును ఆపుతుందా..

Hazarath Reddy

ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌లో సీఎస్‌కే సారధి మహేంద్ర సింగ్‌ ధోనికి తిరుగులేని రికార్డు ఉంది. ఇప్పటివరకు 21 ప్లే ఆఫ్స్‌ ఇన్నింగ్స్‌ల్లో 522 పరుగులు బాదాడు. ఇది ఐపీఎల్‌ చరిత్రలో రెండో అత్యుత్తమం.ఇప్పటివరకు అన్ని సీజన్‌ల ప్లే ఆఫ్‌లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రైనా రికార్డు నెలకొల్పారు.

ICC World Cup 2023 Qualifiers: మాజీ ప్రపంచ ఛాంపియన్లకు పసికూనలు సవాల్, ఆ జట్లు ఫైనల్ చేరితేనే ప్రపంచకప్‌కు అర్హత, వరల్డ్‌ కప్‌ 2023 క్వాలిఫైయ‌ర్ షెడ్యూల్‌ ఇదిగో..

Hazarath Reddy

ఈ ఏడాది వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ క్వాలిఫైయ‌ర్(ICC ODI World Cup qualifiers) షెడ్యూల్‌ను ఐసీసీ కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. జింబాబ్వే వేదికగా జరుగనున్న ఈ టోర్నీ జూన్‌ 18 నుంచి జులై 9 వరకు జరుగనుంది.

IPL 2023, GT vs CSK: ధోనీ ముందు ప్లూట్ ఊదుతున్న శుభమాన్ గిల్, గెలుపు మాదే అంటూ శపధాలు, నేడే అసలైన పోరు, ఫైనల్‌కు చేరేది ఎవరో?

Hazarath Reddy

ఐపీఎల్‌-2023లో రసవత్తరమైన పోరుకు సమయం ఆసన్నమైంది. గుజరాత్‌ టైటాన్స్‌- చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య మంగళవారం తొలి క్వాలిఫయర్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు నేరుగా ఫైనల్స్‌కు చేరుకోనుండగా, ఓడిన జట్టు క్వాలిఫయర్‌-2లో గెలిచే జట్టుతో తలపడనుంది. దీంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

IPL 2023: అభిమానులకు విరాట్ కోహ్లీ ఎమోషనల్ మెసేజ్, ప్లేఆఫ్స్‌కు చేరలేకపోయినా ఈ సీజన్ ఎన్నో మెమొరీస్ అందించిందంటూ ట్వీట్

Hazarath Reddy

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సీజన్ ముగిసింది. RCB IPL 2023 ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. టోర్నమెంట్ నుండి నాకౌట్ అయ్యింది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ మెసేజ్ పెట్టాడు. ఆర్‌సిబి మద్దతుదారుల అపారమైన మద్దతు కోసం కోహ్లీ తన కృతజ్ఞతలు తెలిపాడు

Advertisement

IPL 2023 Shubman Gill: శుభ్ మన్ గిల్ చెల్లిని కూడా వదలని దుండగులు, అయ్యోపాపం..ఏం జరిగిందో తెలిస్తే ఆగ్రహంతో ఊగిపోతారు..

kanha

తమను తాము RCB అభిమానులుగా చెప్పుకునే కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా గిల్, అతని సోదరి షహనీల్ గిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రారంభించారు. దీనిపై అనుచితంగా పదాలు వాడేవారిని వదిలిపెట్టబోమని, వారిపై చర్యలు తీసుకుంటామని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ తెలిపారు.

IPL 2023: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గోల్డెన్‌ డకౌట్, 17 డకౌట్లతో ఐపీఎల్‌లోనే అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్న ఆర్‌సీబీ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌

Hazarath Reddy

ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్‌ అయిన బ్యాటర్‌గా దినేశ్‌ కార్తిక్‌ తొలి స్థానంలో నిలిచాడు. 17 డకౌట్లతో కార్తిక్‌ మొదటి స్థానంలో ఉండగా.. రోహిత్‌ శర్మ 16 డకౌట్లతో రెండు, 15 డకౌట్లతో మణిదీప్‌సింగ్‌, సునీల్‌ నరైన్‌లు సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు.

IPL 2023: శుభమాన్ గిల్ సిక్స్ వీడియో, స్టేడియంలోనే నేల మీద పడుకుని ఏడ్చేసిన మహమ్మద్ సిరాజ్, డగౌట్‌లో కూర్చోని కంటతడి పెట్టిన కోహ్లీ

Hazarath Reddy

ఐపీఎల్‌-2023లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. తద్వారా ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి బెంగళూరు నిష్క్రమించగా ముంబై ఇండియన్స్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.

IPL 2023: విరాట్ కోహ్లీని మళ్లీ గెలికిన నవీన్‌ ఉల్‌ హక్‌, ఎగతాళి చేస్తూ వీడియో పోస్ట్, నీవు అస్సలు మనిషివేనా అంటూ మండిపడుతున్న ఆర్సీబీ ఫ్యాన్స్‌

Hazarath Reddy

ఐపీఎల్‌-2023లో ప్లేఆఫ్ రేసులో గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఓటమి పాలైంది.దీంతో ఈ ఏడాది క్యాష్‌రిచ్‌ లీగ్‌ నుంచి ఆర్సీబీ ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో ఆర్సీబీ ఓటమి పాలవ్వగానే.. నవీన్‌ ఉల్‌ హక్‌ తన ఇనాస్టాగ్రామ్‌లో ఓ క్రిప్టిక్‌ స్టోరీ పోస్టు చేశాడు.

Advertisement
Advertisement