Cricket

Ind vs Aus ICC T20 WC Semifinal: టీ 20 ప్రపంచకప్ సెమీఫైనల్ లో చతికిలపడ్డ టీమిండియా ఉమెన్స్ జట్టు, చెదిరిన ప్రపంచకప్ కల, ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా

kanha

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఐసీసీ టీ20 మహిళల ప్రపంచకప్‌ తొలి సెమీఫైనల్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించి ఫైనల్‌కు టికెట్‌ దక్కించుకుంది.

ICC Women's T20 World Cup 2023: భారత్ ఫైనల్ చేరాలంటే 173 పరుగులు చేయాలి, ప్రపంచకప్ సెమీ ఫైనల్లో భారీ టార్గెట్ విసిరిన ఆస్ట్రేలియా వుమెన్స్

Hazarath Reddy

ప్రపంచకప్ 2023లో భారత్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా వుమెన్స్ జట్టు .. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.

Umesh Yadav Father Dies: భారత క్రికెటర్ ఉమేష్ యాదవ్ తండ్రి కన్నుమూత, గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న తిలక్ యాదవ్

Hazarath Reddy

భారత క్రికెటర్ ఉమేష్ యాదవ్ తండ్రి తిలక్ యాదవ్ (74) కన్నుమూశారు. ఉమేష్ యాదవ్ తండ్రి గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో ఉన్నారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయినప్పటికీ అతని పరిస్థితి మెరుగుపడకపోవడంతో, ఖపర్ఖేడాలోని మిలన్ చౌక్‌లోని అతని ఇంటికి తీసుకువచ్చారు. అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఉమేష్ తండ్రి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.

IPL 2023: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఐడెన్ మార్క్‌రామ్, మాజీ IPL ఛాంపియన్స్‌ను ముందుండి నడిపించనున్న ఐడెన్

Hazarath Reddy

#IPL2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఐడెన్ మార్క్‌రామ్ నియమితులయ్యారు. మార్క్రామ్.. SRHసోదరి ఫ్రాంచైజీ, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో అద్భుతమైన విజయాన్ని సాధించాడు. ఇటీవలే ప్రారంభ SA 20 టైటిల్‌ తీసుకురావడంలో ముందుండి నడిపించాడు. ఇప్పుడు అతను కొత్త సీజన్ కోసం మాజీ IPL ఛాంపియన్స్‌ను టేకోవర్ చేయనున్నాడు.

Advertisement

Australia Team for ODIs: ఆసీస్ వన్డే కెప్టెన్‌గా ప్యాట్‌ కమిన్స్‌, టీమిండియాతో వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు ఇదే, భారత్ జట్టుపై కూడా ఓ లుక్కేయండి

Hazarath Reddy

మార్చి 17 నుంచి టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్‌ ఆరంభం కానున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టును ఆ దేశ క్రికెట్ ప్రకటించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. గాయాల నుంచి కోలుకున్న ఆల్‌రౌండర్లు గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మిచెల్‌ మార్ష్‌ సహా పేసర్‌ జై రిచర్డ్‌సన్‌ పునరాగమనం చేయనున్నట్లు తెలిపింది.

IND W vs AUS W Semi-Final: ఉమెన్స్ టీ-20 వరల్డ్ కప్‌లో ఇవాళ ఇంట్రెస్టింగ్ మ్యాచ్, ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకునేందుకు బరిలోకి దిగనున్న హర్మన్ సేన

VNS

మహిళల టీ20 ప్రపంచ కప్ – 2023లో నేడు కీలక మ్యాచ్ జరగనుంది. భారత్ జట్టు సెమీస్‌లో ఆస్ట్రేలియాను (India vs Australia) ఢీకొట్టనుంది. సాయంత్రం 6.30 గంటలకు దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఈ మ్యాచ్ జరుగుతుంది. టీ20 ప్రపంచ కప్‌లో‌ ఆదినుంచి భారత్ జట్టు అద్భుత ప్రదర్శన ఇస్తుంది. అయితే, గత ఐదేళ్లుగా అగ్రశ్రేణి జట్లలో ఒకటిగాఉన్న భారత్ జట్టు పెద్ద ట్రోఫీని గెలుచుకోలేక పోయింది.

ICC Women's T20 World Cup 2023: ఆస్ట్రేలియాతో చావో రేవో తేల్చుకోనున్న భారత్, గెలిస్తే ఇక ప్రపంచకప్‌ మనదే, ఐర్లాండ్‌పై గెలిచి సెమీస్‌కు చేరుకున్న టిమిండియా మహిళా జట్టు

Hazarath Reddy

ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత మహిళల జట్టు టి20 ప్రపంచకప్‌లో (ICC Women's T20 World Cup 2023) నేరుగా సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఐర్లాండ్‌తో సోమవారం జరిగిన గ్రూప్‌–2 చివరి లీగ్‌ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని టీమిండియా ‘డక్‌వర్త్‌ లూయిస్‌’ పద్ధతిలో ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది.

Woman Kisses Kohli’s Wax Statute: విరాట్ కోహ్లీ పెదాలపై ముద్దు పెట్టిన అమ్మడు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

స్టార్ ఇండియన్ క్రికెటర్‌ విరాట్ కోహ్లికు భారీ అభిమానుల ఫాలోయింగ్ ఉంది.ఈ అభిమానం ఎలా ఉంటుందో చూడాలంటే ఈ వీడియో చూడాల్సిందే. ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్‌లో విరాట్ కోహ్లీ మైనపు ప్రతిమను ఓ మహిళ ముద్దుపెట్టుకున్న వీడియో వైరల్‌గా మారింది. కోహ్లీ మైనపుతో కొంత 'క్లోజ్ టైమ్' గడిపింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Advertisement

MS Dhoni Last Match: మే 14న ఐపీఎల్ చివరి మ్యాచ్ ఆడనున్న ధోనీ, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనున్న చెన్నై సూపర్ కింగ్స్, ఇంకా అధికారికంగా ప్రకటించిన భారత మాజీ కెప్టెన్

Hazarath Reddy

చెన్నై సూపర్ కింగ్స్ తరపున తన కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడిన తర్వాత MS ధోని ఐపీఎల్ వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇన్‌సైడ్‌స్పోర్ట్‌లోని ఒక నివేదిక ప్రకారం, మే 14న చెపాక్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో CSK కోసం ధోని వీడ్కోలు గేమ్ ఆడనుంది.

KL Rahul: కేఎల్ రాహుల్‌కు బీసీసీఐ షాక్.. వైస్ కెప్టెన్సీ నుంచి తొలగింపు

Rudra

ఫామ్ కోల్పోయి పరుగుల కోసం ఏడాదిగా తంటాలు పడుతున్న టీమిండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు బీసీసీఐ షాకిచ్చింది. వైస్ కెప్టెన్సీ పదవిని లాక్కుంది.

India Vs Australia: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే సిరీస్ షెడ్యూల్ ప్రకటన, తొలి వన్డేలో కెప్టెన్ రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యాకు బాధ్యతలు, మార్చి 17 నుంచి వన్డే సిరీస్ షురూ..

kanha

ఆస్ట్రేలియాతో (IND vs AUS) జరగనున్న 3-మ్యాచ్‌ల ODI సిరీస్‌కు భారత్ జట్టును ప్రకటించింది. తొలి వన్డేలో రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల రోహిత్ తొలి వన్డేలో ఎంపికకు అందుబాటులో ఉండడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డే మార్చి 17న జరగనుంది.

Virat Kohli World Record: వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన కింగ్ కోహ్లీ, స్కోరులో సచిన్ టెండూల్కర్ ను దాటిన కోహ్లీ, పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్

VNS

విరాట్ కోహ్లీ (Virat Kohli) మ‌రో మైలురాయిని అందుకున్నాడు. క్రికెట్ దిగ్గజం స‌చిన్ ఆల్ టైం రికార్డును బ‌ద్దలుకొడుతూ.. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 25 వేల ప‌రుగులు పూర్తి చేసుకున్నాడు. బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఘ‌న‌త‌ను (Virat Kohli rewrites history) సాధించాడు.

Advertisement

IPL 2023 Schedule: గ్రూపు ఏలో కింగ్ ఏది, గ్రూపు బీలో మెరుపులు మెరిపించేది ఎవరు, ఐపీఎల్‌ 2023 షెడ్యూల్ ఇదిగో, మార్చి 31 నుంచి మే 21 వరకు లీగ్‌ మ్యాచ్‌లు

Hazarath Reddy

ఇప్పటికే 15 సీజన్ల పాటు సూపర్‌ సక్సెస్‌ అయిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)16 వ సీజన్‌ షెడ్యూల్‌ ఎట్టకేలకు విడుదలైంది. ఐపీఎల్‌ 16వ సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌, మ్యాచ్‌ల వివరాలను బీసీసీఐ శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది.

IPL 2023 Schedule: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 షెడ్యూల్ ఇదిగో, అందరి కళ్లు సామ్‌ కర్రన్‌ పైనే, రు. 18.5 కోట్లకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్

Hazarath Reddy

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL 2023) షెడ్యూల్ విడుదలైంది. IPL సీజన్ 16 మ్యాచ్‌ల కోసం స్వదేశీ, బయటి ఆటగాళ్లతో మరోసారి పోరు మొదలైంది. IPL 2023 మార్చి 31వ తేదీన డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతుంది.

KL Rahul Catch Video: గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్‌ పట్టిన కేఎల్‌ రాహుల్‌, వాట్‌ ఏ క్యాచ్‌ అంటూ ట్వీట్ చేసిన బీసీసీఐ, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో కేఎల్‌ రాహుల్‌ సంచలన క్యాచ్‌తో మెరిసి మరోసారి వార్తల్లో నిలిచాడు.గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్‌ అందుకుని కీలక వికెట్‌ కూల్చడంలో తన వంతు పాత్ర పోషించాడు

IPL 2023 Schedule Announced: ఐపీఎల్ 2023 షెడ్యూల్ వచ్చేసింది, మార్చి 31న గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్

Hazarath Reddy

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 షెడ్యూల్ శుక్రవారం, ఫిబ్రవరి 17న విడుదల చేశారు. మూడు సీజన్‌ల తర్వాత, స్వదేశీ, బయటి ఫార్మాట్ ఎట్టకేలకు తిరిగి వచ్చింది. బలాబలాల ఆధారంగా తమ జట్లను నిర్మించుకున్న జట్లకు ఇది సీజన్‌లోని చాలా డైనమిక్‌లను మారుస్తుంది. మార్చి 31న అహ్మదాబాద్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో గత ఎడిషన్‌లో ఫైనల్‌కు చేరుకున్న గుజరాత్ టైటాన్స్, గత ఎడిషన్ విజేత, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.

Advertisement

Disney+ Hotstar Down: డిస్నీ+ హాట్‌స్టార్‌ డౌన్, ఓపెన్ చేస్తుంటూ ఎర్రర్‌ వస్తోందంటూ యూజర్లు గగ్గోలు, క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం

Hazarath Reddy

ప్రముఖ స్ట్రీమింగ్‌ సంస్థ డిస్నీ+ హాట్‌స్టార్‌ (Diney+ Hotstar) డౌన్ అయింది. హాట్‌స్టార్‌ యాప్‌, వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేస్తుంటే.. ఎర్రర్‌ వస్తోందంటూ యూజర్లు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో భారత్‌- ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు జరుగుతున్న వేళ ఈ అంతరాయం నెలకొనడంపై క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

Theunis De Bruyn Retires: 30 ఏళ్లకే మరో క్రికెటర్ గుడ్ బై, అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన దక్షిణాఫ్రికా బ్యాటర్ థియునిస్ డి బ్రుయిన్

Hazarath Reddy

దక్షిణాఫ్రికా బ్యాటర్ థియునిస్ డి బ్రుయిన్ 30 ఏళ్ల వయస్సులోనే డి బ్రుయిన్ (Theunis De Bruyn Retires) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దేశీవాళీ క్రికెట్‌పై దృష్టి పెట్టాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.

Chetan Sharma Resigns: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా, ఆమోదించిన బీసీసీఐ సెక్రటరీ జే షా

Hazarath Reddy

బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను బీసీసీఐ సెక్రటరీ జే షాకు పంపగా ఆయన దానిని ఆమోదించారు.

Prithvi Shaw Attacked: సెల్ఫీలు ఇవ్వనందుకు టీమిండియా బ్యాట్స్ మెన్‌పై బ్యాట్‌తో దాడి, ముంబైలో పృథ్వీషాపై అటాక్ చేసిన అభిమానుల గుంపు

VNS

తొలుత కొన్ని సెల్ఫీలు దిగిన కొంద‌రు.. మ‌రిన్ని సెల్ఫీలు కావాలంటూ (Physical Fight With Woman) క్రికెట‌ర్ వెంట ప‌డ్డారు. ఆ స‌మ‌యంలో ఆ అభిమానుల్ని పృథ్వీ షా నివారించారు. హోట‌ల్ మేనేజ‌ర్‌ను పిలిపించి ఆ అభిమానుల్ని బ‌య‌ట‌కు పంపించారు. దీంతో ఆగ్రహం పెంచుకున్న ఆ అభిమానులు క్రికెట‌ర్‌ను వెంటాడారు.

Advertisement
Advertisement