Cricket

Mumbai: సెల్పీ దిగలేదని భారత క్రికెటర్ పృథ్వీ షా స్నేహితుడి కారుపై దాడి, ఇద్దర్నీ అరెస్ట్ చేసిన ముంబై ఓషివారా పోలీసులు

Hazarath Reddy

ఇద్దరు వ్యక్తులతో రెండోసారి సెల్ఫీ తీసుకోవడానికి ఇండియన్ క్రికెటర్ షా నిరాకరించడంతో భారత క్రికెటర్ పృథ్వీ షా స్నేహితుడి కారుపై దాడి చేసిన ఆరోపణలపై ఓషివారా పోలీసులు 8 మందిపై కేసు నమోదు చేశారు. వీరిని కోర్టులో హాజరు పరచనున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు.

WPL 2023 Schedule: మహిళల ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ ఇదే, గుజరాత్‌ జెయింట్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య తొలి మ్యాచ్, మార్చి 4 నుంచి 26 వరకు సమరం

Hazarath Reddy

బీసీసీఐ..మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్‌) షెడ్యూల్‌ విడుదల చేసింది. ముంబై వేదికగా మార్చి 4 నుంచి 26 వరకు ఈ లీగ్‌ జరనుంది. ఐదు జట్లు బరిలో నిలిచిన తొలి ఎడిషన్‌లో మొత్తం 22 మ్యాచ్ లు జరుగుతాయి. ఇందులో 20 లీగ్‌ మ్యాచ్‌లు, రెండు నాకౌట్‌ మ్యాచ్‌లు (ఎలిమినేటర్‌, ఫైనల్‌) ఉన్నాయి.

Hardik Pandya Wedding Pic: మొదటి భార్యనే రెండో సారి పెళ్లి చేసుకున్న హార్దిక్‌ పాండ్యా, కొడుకు అగస్త్య సమక్షంలో ఒక్కటైన జంట

Hazarath Reddy

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా మరోసారి పెళ్లి చేసుకున్నాడు. తన భార్య నటాషా స్టాంకోవిక్‌ను రెండోసారి వివాహమడాడు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌ కోటలో వీరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. వీరికి 2020 జూలైలో కుమారుడు అగస్త్య జన్మించాడు.

Hyderabad Cricket Association: హెచ్‌సీఏ కమిటీని రద్దు చేసిన సుప్రీం కోర్టు, మాజీ జడ్జి లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు

Hazarath Reddy

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న భారత మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. అజర్‌ నేతృత్వం వహిస్తున్న హెచ్‌సీఏ కమిటీని రద్దు చేస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం మంగళవారం తీర్పునిచ్చింది

Advertisement

Viral Video: సూర్య కుమార్ యాదవ్ షాట్లతో సోషల్ మీడియాని షేక్ చేస్తోన్న యువతి, ఫిదా అయిన లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్

Hazarath Reddy

రాజస్థాన్‌కు చెందిన ముమల్‌ మెహర్‌ అనే ఓ బాలిక.. టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ తరహా విధ్వంకర షాట్లతో విరుచుకుపడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ముమల్‌ అచ్చం సూర్యకుమార్‌లా 360 డిగ్రీస్‌లో షాట్లు ఆడుతుంది.

Women's IPL Auction: రూ.2.20 కోట్లకు జెమీమా రోడ్రిగ్స్, పాకిస్థాన్‌పై టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన బ్యాటర్ ని సొంతం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

Hazarath Reddy

మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఆటగాళ్ల వేలం ముంబయిలో కొనసాగుతోంది. టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ పై టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన యువ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ కు వేలంలో భారీ ధర లభించింది. జెమీమా కనీస ధర రూ.50 లక్షలు కాగా... ఆమెను రూ.2.20 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది.

Women Premier League Auction: కాసుల వర్షం కురిపిస్తున్న ఉమెన్స్‌ ఐపీఎల్‌, అత్యధిక ధర పలికిన టీమిండియా ఓపెనర్ స్మృతి మందాన, ఆసిస్ ప్లేయర్లు గిరాకీ ఫుల్

VNS

మొట్టమొదటి విమెన్ ప్రీమియర్ లీగ్ (Women Premier League) నిర్వహణ కోసం ముంబైలో వేలం జరుగుతోంది. తొలిసారి నిర్వహిస్తున్న ఈ లీగ్‌ లో మొత్తం 12 జట్లు బరిలోకి దిగనున్నాయి. వేలంలో భారత్ సహా పలు దేశాలకు చెందిన 409 మంది మహిళా క్రికెటర్లను ఆయా ఫ్రాంచైజీలు దక్కించుకునే అవకాశం ఉంది. టీమిండియా ఓపెనర్ స్మృతి మందానాను (Smriti Mandhana) బెంగళూరు టీమ్ రూ. 3.40 కోట్లకు దక్కించుకుంది

Women's IPL Auction: రూ.3.4 కోట్ల భారీ ధరకు స్మృతి మంధానను కొనుగోలు చేసిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌, ఆర్సీబీ మధ్య తీవ్రమైన పోటీ

Hazarath Reddy

ముంబై వేదికగా జరుగుతోన్న మహిళల ప్రీమియర్‌ లీగ్‌ వేలంలో స్మృతి మంధానను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు రూ.3.4 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. మంధాన కోసం ఆది నుంచే ముంబై ఇండియన్స్‌, ఆర్సీబీ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఆఖరికి బెంగళూరు ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. కాగా ఈ వేలంలో మంధాన తన బేస్‌ ప్రైస్‌ రూ.50లక్షలగా నిర్ణయించుకుంది.

Advertisement

Women's IPL Auction:మహిళల ఐపీఎల్ వేలంలో రెండు కోట్లకు భారత క్రికెటర్ షఫాలీ వర్మ, దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌

Hazarath Reddy

మహిళల ఐపీఎల్ వేలంలో భారత క్రికెటర్ షఫాలీ వర్మ రూ.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరింది.

Eoin Morgan Retires: మరో క్రికెటర్ అన్ని రకాల ఫార్మాట్లకు గుడ్‌బై, అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన ఇయాన్ మోర్గాన్

Hazarath Reddy

ఇంగ్లాండ్ కి 2019లో ప్రపంచ కప్ అందించిన ఇయాన్ మోర్గాన్ ఇప్పుడు అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. మోర్గాన్ అంతకుముందు గతేడాది (2022) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైరయ్యాడు. మోర్గాన్ తన ప్రకటనలో అంతర్జాతీయ, ఫ్రాంచైజీ టోర్నమెంట్‌లలో ప్రసారకర్తలతో కలిసి వ్యాఖ్యాతగా పండిట్‌గా పని చేస్తానని పేర్కొన్నాడు.

Border Gavaskar Trophy 2023: భారత్-ఆస్ట్రేలియా మూడో టెస్టు.. ధర్మశాల నుంచి ఇండోర్ కు..

Rudra

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరగాల్సిన మూడో టెస్టును అక్కడి నుంచి ఇండోర్ కు మార్చినట్టు బీసీసీఐ వెల్లడించింది.

Viral Video: ఫుట్‌బాల్ తెలిసిన వ్యక్తి క్రికెట్ ఆడితే ఇలాగే ఉంటుంది మరి.. అంటూ దిగ్గజ క్రికెటర్ సచిన్ కామెంట్ చేసిన ఆ వీడియో చూశారా?

Rudra

ఓ మ్యాచ్‌లో బ్యాటర్ బంతిని బలంగా బాదడంతో అది గాల్లోకి లేచి బౌండరీకి ఆవల పడబోయింది. అక్కడే ఉన్న ఫీల్డర్ దానిని అడ్డుకున్న విధానం సూపర్. వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి క్రికెటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మీరూ చూడండి.

Advertisement

Women's T20 World Cup, India Vs Pakistan: టీ 20 మహిళా ప్రపంచ కప్ బోణీ అదిరింది, పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం, ఏడు వికెట్ల తేడాతో పాక్ ను చిత్తు చేసిన టీమిండియా మహిళలు..

kanha

Women's T20 World Cup, India Vs Pakistan: కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌లో జరిగిన టీ ట్వంటీ మ్యాచ్‌లో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై భారీ విజయాన్ని నమోదు చేసింది.

India vs Australia 1st Test: నాగ్ పూర్ టెస్టులో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్, మూడు రోజుల్లోనే ముగిసిన టెస్టు మ్యాచు, 132 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించిన రోహిత్ సేన

kanha

నాగ్‌పూర్‌లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ (India vs Australia 1st Test)లో భారత్ ఇన్నింగ్స్ మరియు 132 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. దీంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ పేరుతో జరుగుతున్న ఈ సిరీస్‌లో 1-0తో ఆధిక్యం టీమిండియా సాధించింది

Rishabh Pant: యాక్సిడెంట్ తర్వాత తొలిసారి నడిచిన రిషబ్ పంత్, కర్ర పట్టుకొని నడుస్తున్న రిషబ్ పంత్, ఈ సారి ఐపీఎల్‌కు దూరమయ్యే అవకాశం

VNS

టీమిండియా వికెట్ కీప‌ర్ రిష‌భ్ పంత్ త‌న ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చాడు. క‌ర్ర సాయంతో న‌డుస్తున్న ఫొటోల్ని అత‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో (Rishab pant Instagram) షేర్ చేశాడు. ‘ఒక అడుగు ముంద‌కు. ఒక అడుగు బ‌లంగా. ఒక అడుగు మ‌రింత మెరుగ్గా’ అంటూ ఆ ఫొటోల‌కు క్యాప్ష‌న్ రాశాడు. కారు యాక్సిడెంట్‌కు (Pant accident) గురైన‌ త‌ర్వాత పంత్ సోష‌ల్‌మీడియాలో ఫొటోలు షేర్ చేయ‌డం ఇదే మొద‌టిసారి.

Bharat Reply To CM Jagan Tweet: మీ ఆశీస్సులు అందుకోవడం నా అదృష్టం సర్, సీఎం జగన్‌ ట్వీట్‌కు కేఎస్‌ భరత్‌ రిప్లై, తెలుగు జాతికి గొప్ప పేరు తీసుకు వస్తానని వెల్లడి

Hazarath Reddy

బోర్డర్- గావస్కర్ సిరీస్ తో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన భరత్‌కి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపిన విషయం విధితమే. తెలుగు జాతి గర్వపడేలా మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని జగన్‌ ఆకాంక్షించారు. సీఎం జగన్‌ చేసిన ట్వీట్‌కు కేఎస్‌ భరత్‌ రిప్లై ఇచ్చాడు."

Advertisement

IND vs AUS 1st Test 2023: తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే కుప్పకూలిన ఆస్ట్రేలియా, మొదటి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 77 పరుగులు చేసిన ఇండియా

Hazarath Reddy

బోర్డర్ - గావస్కర్ (Border - Gavaskar Trophy) ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌ (IND vs AUS) మొదటి రోజు ఆట ముగిసింది. టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే కుప్పకూలింది. అనంతరం మొదటి రోజు ఆట ముగిసేసమయానికి టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 77 పరుగులు చేసింది.

KS Bharat Stumping Video: కేఎస్ భ‌ర‌త్ ఫస్ట్ స్టంప్ ఔట్ వీడియో ఇదిగో, ఫ్రంట్ ఫుట్ ఆడిన లబుషేన్‌ను రెప్ప‌పాటులో స్టంప్ ఔట్ చేసిన తెలుగు కుర్రాడు

Hazarath Reddy

బోర్డ‌ర్- గ‌వాస్క‌ర్ ట్రోఫీకి రిష‌భ్ పంత్ ప్లేస్‌లో కీప‌ర్‌గా భ‌ర‌త్‌ జట్టులో స్థానం సంపాదించిన సంగతి విదితమే. తొలి టెస్టులో ఉస్మాన్ ఖ‌వాజా ఎల్బీగా ఔట్ కావ‌డంలో అత‌ని పాత్రం ఉంది. సిరాజ్ ఎల్బీకి అప్పీల్ చేశాడు

Jadeja Dismissed Smith Video: వీడియో ఇదిగో, రవీంద్ర జడేజా అద్భుతమైన బంతికి షాక్ తిన్న స్టీవ్ స్మిత్, ఒక్కసారిగా టర్న్‌ అయి వికెట్లను గిరాటేసిన ఆఫ్‌సైడ్‌ పడిన బంతి

Hazarath Reddy

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ను ఔట్‌ చేసిన వీడియో వైరల్ అవుతోంది. క్రీజులో పాతుకుపోవడానికి ప్రయత్నిస్తున్న స్మిత్‌ను అద్భుతమైన బంతితో స్మిత్‌ బోల్తా కొట్టించాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ 42 ఓవర్‌లో జడేజా వేసిన ఆఖరి బంతికి స్మిత్‌ ఢిఫెన్స్‌ ఆడటానికి ప్రయత్నించాడు.

CM Jagan Wishes to KS Bharat: భారత్ క్రికెట్ జట్టులోకి వైజాగ్ కుర్రాడు భరత్, తెలుగు జాతి గర్వపడేలా మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అభినందనలు తెలిపిన సీఎం జగన్

Hazarath Reddy

భారత క్రికెట్‌ జట్టులోకి వైజాగ్ కుర్రాడు కోన శ్రీకర్‌ భరత్‌ అరంగేట్రం పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ వికెట్‌ కీపర్‌ కమ్ బ్యాటర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా భరత్‌ ఫొటో షేర్‌ చేస్తూ అభినందనలు తెలియజేశారు.

Advertisement
Advertisement