India Women National Cricket Team players celebrate wicket (Photo Credit: X@BCCIWomen)

Rajkot, JAN 12: ఐర్లాండ్‌తో రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా మహిళా జట్టు (India Women team) విజయం సాధించింది. 116 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను (IND W Vs IRE W ) కైవసం చేసుకున్నది. ఇక సిరీస్‌లో చివరిదైన మూడో వన్డే ఈ నెల 15న రాజ్‌కోట్‌ (Rajkot) వేదికగా జరుగనున్నది. నెదర్లాండ్‌ వుమెన్స్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా వుమెన్స్‌ జట్టు కెప్టెన్‌ స్మృతి మందాన టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. స్మృతి మంధాన (73), ప్రతీకా రావల్ (67), హర్లీన్ డియోల్ (89), జెమీమా రోడ్రిగ్స్ (102) రాణించడంతో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 370 పరుగులు చేసింది. వన్డే క్రికెట్‌లో టీమిండియా చేసిన అత్యధిక స్కోర్‌ ఇదే. ఇంతకు ముందు 2017లో ఐర్లాండ్‌పై రెండు వికెట్ల నష్టానికి 358 పరుగుల స్కోర్‌ చేసింది.

Funniest Cricket Video: క్రికెట్ చరిత్రలో ఇలాంటి ఫన్నీ వీడియో మీరు ఎప్పుడూ చూసి ఉండరు, సోషల్ మీడియాలో నవ్వులే నవ్వులు.. 

భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌ (Iraland) జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 254 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఐర్లాండ్‌కు మంచి ఆరంభం లభించలేదు. జట్టుకు తొలి దెబ్బ కెప్టెన్‌ గాబీ లూయిస్ (12) అవుట్‌ అయ్యింది. సయాలి సత్ఘారే బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరింది. ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌లో క్రిస్టినా కౌల్టర్ 80తో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. సారా ఫోర్బ్స్ 38, లారా డెన్లీ 37 పరుగులు చేసింది. వీరికి మరో ఎండ్‌ నుంచి బ్యాట్స్‌మెన్‌ పెద్ద ఇన్సింగ్స్‌ ఆడలేకపోయారు. దీప్తి శర్మ, ప్రియా మిశ్రా స్పిన్‌ బౌలింగ్‌లో ఐర్లాండ్ బ్యాట్‌ వుమెన్స్‌ ఇబ్బంది పడ్డారు. దీప్తి మూడు వికెట్లు పడగొట్టగా, ప్రియా 53 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టారు. టైటాస్ సాధు, సయాలి సత్ఘారే ఒక్కొ వికెట్‌ దక్కింది.

India's Squad for IND vs ENG 2025 T20I Series: లాంగ్‌ గ్యాప్‌ తర్వాత భారత జట్టులోకి మహ్మద్‌ షమీ, ఇంగ్లాండ్‌తో టీ-20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ 

కెప్టెన్ స్మృతి మంధాన, ప్రతీక మరోసారి టీమ్ ఇండియాకు (India Womens) మంచి ఆరంభం ఇచ్చారు. ఇద్దరూ మొదటి వికెట్‌కు 156 పరుగులు జోడించారు. మంధాన 54 బంతుల్లో 10 ఫోర్లు, రెండు సిక్సర్లతో 73 పరుగులు చేసింది. ప్రతీక 61 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, సిక్సర్‌ సహాయం 67 పరుగులు చేసింది. హర్లీన్ డియోల్ హాఫ్‌ సెంచరీ నమోదు చేసింది. 84 బంతుల్లో 12 ఫోర్లతో 89 పరుగులు చేసింది. జెమీమా 91 బంతుల్లో 12 ఫోర్లతో 102 పరుగులు చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో, వన్డేల్లో జెమీమాకు ఇది తొలి సెంచరీ. చివరలో రిచా ఘోష్‌ పది పరుగులు అవుట్‌ అయ్యింది. తేజల్ హసబ్నిస్, సయాలి సత్ఘారే చెరో రెండు పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఐర్లాండ్ తరఫున ఓర్లా ప్రెండర్‌గాస్ట్, అర్లీన్ కెల్లీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. జార్జినా డెంప్సే ఒక వికెట్‌ తీసింది.