Khammam, JAN 12: తెలంగాణ సమాచార, ప్రసారాలు, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి (Ponguleti Srinivvas reddy) తృటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి వరంగల్ నుంచి ఖమ్మం వస్తుండగా తిరుమలాయపాలెం వద్ద మంత్రి ప్రయాణిస్తున్నకారు టైర్లు రెండు పేలిపోయాయి. దీంతో కారు అదుపు తప్పినా, డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో మంత్రి పొంగులేటికి (Ponguleti Accident) ప్రమాదం తప్పింది. ఈ ఘటన తర్వాత మంత్రి పొంగులేటి ఎస్కార్ట్ వాహనంలో ఖమ్మం నగరానికి చేరుకున్నారు.
ప్రమాద సమయంలో కారులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోపాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, డీసీసీబీ డైరెక్టర్లు బొర్రా రాజశేఖర్, తుళ్లూరి బ్రహ్మయ్య కూడా ఉన్నారు.