రాష్ట్రీయం

JC Prabhakar Reddy: ఆటోల కారణంగానే రోడ్డు ప్రమాదాలు, వెంటనే బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో

Hazarath Reddy

టీడీపీ సీనియర్‌ నేత,తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆటోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆటోల కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని నిషేధించాలని డిమాండ్‌ చేశారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసిపల్లిలో శనివారం(నవంబర్‌ 23) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతిచెందడంపై జేసీ స్పందించారు

Andhra Pradesh: విద్యార్దినిపై శ్రీ విజ్ఞాన్ స్కూల్ కరస్పాండెంట్ దారుణం, తీవ్రంగా చెంపలపై కొట్టి, పీక నులిమిన గాయ‌పరిచిన సత్యనారాయణ

Hazarath Reddy

ఆకివీడులో దారుణం చోటు చేసుకుంది. తొమ్మదవ తరగతి విద్యార్దినిపై దాడిచేసిన శ్రీ విజ్ఞాన్ స్కూల్ కరస్పాండెంట్ సత్యనారాయణ . విద్యార్ధిని తీవ్రంగా చెంపలపై కొట్టి, పీక నులిమిన గాయ‌పరిచిన సత్యనారాయణ . స్కూల్ బస్సులో హేళనగా మాట్లాడిందని కరస్పాండెంట్ కు డ్రైవర్ ఫిర్యాదు చేశారు.

Divvela Madhuri: పవన్ కళ్యాణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన దివ్వెల మాధురి, రెండేళ్ల క్రితం దువ్వాడపై పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు

Hazarath Reddy

పవన్ కళ్యాణ్‌పై పోలీసులకు దివ్వెల మాధురి ఫిర్యాదు చేశారు, రెండేళ్ల క్రితం దువ్వాడపై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.దువ్వాడ తరఫున పోలీసులకు మాధురి ఫిర్యాదు చేసింది

Young Man Dies by Suicide in Bus: వీడియో ఇదిగో, ఆర్టీసీ బస్సులో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య, చివరి సీటు వద్ద ఉన్న హ్యాంగర్‌కు ఉరేసుకుని సూసైడ్

Hazarath Reddy

ఆర్టీసీ బస్సులో ఉరేసుకుని ఓ యువకుడు మృతిచెందిన విషాదకర ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. బస్సు ఏర్పేడు సమీపంలోకి వచ్చినప్పుడు ఈ ఘటన జరిగినట్లు సమాచారం. రేణిగుంట వద్ద కండక్టర్‌ దీన్ని గుర్తించారు.

Advertisement

Andhra Pradesh: నిమ్మకాయలు పట్టుకుని మీసాలు, గడ్డంతో అఘోరీ హల్‌చల్, కర్నూలు జిల్లాలో భయాందోళనకు గురైన స్థానికులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

కర్నూలు జిల్లాలో మరోసారి అఘోరీ హల్చల్ చేశారు. గడ్డం, మీసంతో కనిపించి ఆశ్చర్యానికి గురిచేశారు. అఘోరీని చూసి స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు. నిమ్మకాయలతో ఏం చేస్తున్నావంటూ కొందరు మహిళలు అఘోరీని ప్రశ్నించగా.. తాను దిష్టి తీస్తున్నట్లు తెలిపారు.

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ వల్లే గెలిచా.. మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రాజేశ్‌ కోఠే (వీడియో)

Rudra

అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ వల్లే గెలిచానని మహారాష్ట్రలోని సోలాపూర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన తెలుగు యువకుడు దేవేంద్ర రాజేశ్‌ కోఠే తెలిపారు.

Agniveer Recruitment Rally: ఆర్మీలో చేరాలనుకునే యువతీయువకులకు గుడ్ న్యూస్.. డిసెంబరు 8 నుంచి హైదరాబాద్ లో అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీ

Rudra

ఆర్మీలో చేరాలనుకునే యువతీయువకులకు శుభవార్త. ఆర్మీ రిక్రూట్‌ మెంట్ బోర్డు.. అభ్యర్ధుల ఎంపికకు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో డిసెంబర్ 8 నుండి 16 వరకు హైదరాబాద్‌ లో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తోంది.

Accident in Shadnagar: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. పలువురికి గాయాలు.. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఘటన (వీడియో)

Rudra

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణ ఆర్టీసీకి చెందిన ఓ ప్రయాణికుల బస్సు రివర్స్ తీసుకుంటుండగా వేగంగా వచ్చిన ఓ లారీ ఢీ కొట్టిన ఘటనలో బస్సు డ్రైవర్, కండక్టర్ తో పాటు పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.

Advertisement

Rains in AP: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం.. అల్పపీడనం ప్రభావంతో నేటి నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు

Rudra

ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనిస్తూ రేపటికల్లా (సోమవారం) దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడనుందని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.

CAT Exam Today: నేడు క్యాట్‌ ఎగ్జామ్‌.. మూడు సెషన్లలో పరీక్ష.. తెలంగాణలో సెంటర్లు ఇవే..!

Rudra

ఇండియన్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లలో ఎంబీఏ వంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే క్యాట్‌ ఎగ్జామ్‌ ఆదివారం జరగనుంది.

No Number Plate: వాహనాలకు నంబరు ప్లేట్లు లేకపోతే కఠిన చర్యలు: ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ జోయెల్‌ డేవీస్‌

Rudra

నంబర్‌ ప్లేట్లు లేని వాహనదారులపై కఠిన చర్యలకు ట్రాఫిక్‌ పోలీసులు సిద్ధమవుతున్నారు. వాహనాలకు నంబర్ ప్లేట్లు లేకపోతే భారీ జరిమానాతో పాటు తగిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ జోయెల్‌ డేవీస్‌ హెచ్చరించారు.

Notice to Sajjala Bhargav: వైఎస్సార్సీపీ నేత‌ల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, స‌జ్జ‌ల భార్గ‌వ్, వైఎస్ జ‌గ‌న్ బంధువు అర్జున్ రెడ్డికి పులివెందుల పోలీసుల నోటీసులు

VNS

ఈ కేసుకు సంబందించి తాజాగా భార్గవ్‌ రెడ్డి, అర్జున్‌ రెడ్డిలకు పులివెందుల పోలీసులు 41-ఏ నోటీసులు ఇచ్చారు. విజయవాడలోని సజ్జల భార్గవ్‌ రెడ్డి ఇంటికి వెళ్లిన పులివెందుల పోలీసులు.. ఆయన తల్లికి నోటీసులు ఇచ్చారు.

Advertisement

No Pharma City In Kodangal: కొడంగ‌ల్ భూసేక‌ర‌ణ విష‌యంలో వెన‌క్కు త‌గ్గిన సీఎం రేవంత్ రెడ్డి, అక్క‌డ‌ వ‌చ్చేది ఫార్మా సిటీ కాదు, ఇండ‌స్ట్రీయ‌ల్ పార్క్ మాత్ర‌మే

VNS

కొడంగల్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేయబోయేది ఫార్మా సిటీ (Pharma City) కాదని, ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. నియోజకవర్గంలో యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఇండస్ట్రియల్ కారిడార్‌ను (Industrial Coridor) ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు.

Accident in Anantapur: అనంత‌పురంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం, ఏడుగురు మృతి, న‌లుగురి ప‌రిస్థితి విష‌మం

VNS

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసుపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు (RTC Bus Accident) ఢీ కొట్టడంతో.. ఏడుగురు ప్రాణాలు కోల్పోగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

Andhra Pradesh: కీచక ఉపాధ్యాయుడు...చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు...దాడికి యత్నించిన తల్లిదండ్రులు!

Arun Charagonda

కాకినాడ‌లో కీచ‌క ఉపాధ్యాయుడు బాగోతం వెలుగులోకి వచ్చింది. జగన్నాథ‌పురంలోని గంటి మోహనచంద్ర బాలయోగి హైస్కూల్‌లో 6వ తరగతి విద్యార్థినుల‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించారు మ్యాథ్స్ టీచ‌ర్ శ్రీ‌నివాస్‌. విష‌యం తెలియ‌డంతో స్కూల్ ముందు ఆందోళ‌న చేశారు త‌ల్లిదండ్రులు. శ్రీ‌నివాస్‌ పారిపోయేందుకు య‌త్నించ‌డంతో దాడికి యత్నించారు. శ్రీ‌నివాస్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

KTR: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన కేటీఆర్.. రేవంత్ రెడ్డిపై విమర్శలు

Arun Charagonda

మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై స్పందించారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ . మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలు స్పష్టమైన సందేశాన్ని పంపాయని అన్నారు. ప్రాంతీయ పార్టీలు భారతీయ రాజకీయాల భవిష్యత్తు గా ఎప్పటి నుంచో ఉన్నాయి.. కొనసాగుతాయి అని తేల్చిచెప్పారు.

Advertisement

MLC Jayamangala Venkataramana: వైసీపీకి మరో షాక్, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా, ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేసిన వెంకటరమణ

Arun Charagonda

ఏపీ మాజీ సీఎం జగన్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు పార్టీకి రాజీనామా చేయగా తాజాగా ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్సీ పదవికి, వైసీపీ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మండలి ఛైర్మన్ మోషేను రాజుకు పంపారు.

KTR: సీఎం రేవంత్‌కు రాజకీయ భవిష్యత్ లేకుండా చేద్దాం..భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ పేరుతో దౌర్జన్యాలు చేస్తున్నారని కేటీఆర్ ఫైర్

Arun Charagonda

భూములను రేవంత్ దౌర్జన్యంగా గుంజుకుంటుంటే తిరగబడ్డ రైతులను అక్రమంగా అరెస్ట్ చేశారు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చర్లపల్లి జైల్లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కలిసి, పరామర్శించారు కేటీఆర్. రైతులు, వారి కుటుంబాలు భయపడకండి, మీ వెనుక కేసీఆర్ ఉన్నడు. న్యాయస్థానంలో కొట్లాడుదాం.. రేవంత్ కు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసి గుణపాఠం చెబుదాం అన్నారు.

Telangana Shocker: వికారాబాద్ జిల్లాలో డెడ్‌బాడీ కలకలం, కొత్త చెరువు సమీపంలో అనుమానాస్పద మృతి...పోలీసుల దర్యాప్తు

Arun Charagonda

వికారాబాద్ జిల్లాలో డెడ్‌బాడీ కలకలం రేపింది. వికారాబాద్ - ధారూర్ మండలంలో కుమ్మరపల్లి గ్రామ పరిధిలోని కొత్త చెరువు సమీపంలో అనుమానాస్పదంగా గ్రామస్థుడు పాండునాయక్ డెడ్‌బాడీ లభ్యమైంది. వాకింగ్‌కు వెళ్లిన యువకులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Bandi Sanjay: మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ అవుతాయి, సీఎం రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందన్న బండి సంజయ్...మోదీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని వెల్లడి

Arun Charagonda

మహారాష్ట్రలో మోదీ అభివృద్ధి మంత్రం పని చేసిందన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. ఎన్నికల ఫలితాల్లో మహారాష్ట్ర ప్రజల ఐక్యత కనిపించిందన్నారు. రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. తెలంగాణ లోనూ కాంగ్రెస్‌కు ఇదే గతి పడుతుందని...ఖచ్చితంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపుతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. మంత్రుల్లో అసంతృప్తి ఉందని చెప్పారు బండి.

Advertisement
Advertisement