రాష్ట్రీయం
Salman Khan on Mahesh babu: వీడియో ఇదిగో, మహేష్ బాబుపై ప్రశంసలు కురిపించిన సల్మాన్ ఖాన్, వీడియో షేర్ చేస్తూ ఖుషీ అవుతున్న అభిమానులు
Hazarath Reddyసల్మాన్ ఖాన్ శిల్పతో మాట్లాడుతూ.. శిల్ప మీ బావ మహేష్ బాబు స్క్రీన్ మీద స్టైల్, యాక్షన్, యాటిట్యూడ్ లుక్ తో ఉంటాడు. కానీ బయట రియల్ లైఫ్ లో మాత్రం సింపుల్ గా ఫ్యామిలీ మ్యాన్ లా ఉంటాడు అంటూ సూపర్ స్టార్ పై ప్రశంసలు కురిపించారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
Balineni vs Chevireddy: చెవిరెడ్డికి కౌంటర్ విసిరి బాలినేని, నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర్ రెడ్డి అని వెల్లడి, ఎవరి మెప్పుకోసం నేను పనిచేయట్లేదని మండిపాటు
Hazarath Reddyవైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలో బాలినేనికి ఉన్న స్వేచ్ఛ ఎవరికీ లేదు.. ఇతర పార్టీనేతలతో విదేశాలకు వెళ్లేంత స్వేచ్ఛ ఇక్కడ ఉంది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఇతర పార్టీలతో మాట్లాడటానికి కూడా స్వేచ్ఛ ఉండదని వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వ్యాఖ్యలపై బాలినేని స్పందించారు.
Lady Aghori: కోడిని బలి ఇచ్చి పూజలు నిర్వహించారంటూ అఘోరీపై పోలీసులకు ఫిర్యాదు, మామునూరు పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు
Hazarath Reddyడి అఘోరి నాగసాధుపై కేసు నమోదైంది. కోడిని బలి ఇచ్చి పూజలు నిర్వహించిన ఘటనలో వరంగల్ జిల్లాలోని మామునూరు పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు. కరీంనగర్ జిల్లాకు చెందిన రోహన్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.
Ambati Rambabu: అసభ్యకర పోస్టులు పెట్టిన టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయరా ? పోలీసులకు సూటి ప్రశ్న విసిరిన వైసీపీ నేత అంబటి రాంబాబు
Hazarath Reddyసోషల్‌మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నపుడు టీడీపీ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేయరని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.
Andhra Pradesh: తల్లిని ఆస్పత్రి బయట వదిలి వెళ్ళిన కొడుకుల ఘటనపై స్పందించిన నారా లోకేష్, ఆమెకు వెంటనే ఆహారం, వసతి కల్పించాలని అధికారులకు ఆదేశాలు
Hazarath Reddyవీడియోని బిగ్ టీవీ తన ఎక్స్ లో షేర్ చేసింది. దీనిపై నారా లోకేష్ స్పందించారు. ఈ విజువల్స్ చూస్తే గుండె పగిలిపోతుంది. ఆమెకు వెంటనే ఆహారం, వసతి కల్పించేందుకు అధికారులతో కలిసి కృషి చేస్తామని ఎక్స్ వేదికగా తెలిపారు.
Parliament Winter Session 2024: పసుపు రంగు సైకిల్‌తో పార్లమెంట్‌కు వెళ్లిన టీడీపీ ఎంపీ అప్పల నాయుడు, ఢిల్లీ కాలుష్యంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వచ్చానని వెల్లడి
Hazarath Reddyతెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎంపీ అప్పల నాయుడు కలిశెట్టి నవంబర్ 25న పసుపు రంగు సైకిల్‌తో పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యాడు. పసుపు కుర్తా, తెల్ల లుంగీ ధరించి నేటి నుంచి ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాలకు ఎంపీ వచ్చారు.
Ram Gopal Varma: వీడియో ఇదిగో, రాంగోపాల్ వర్మ ఇంటికి చేరుకున్న మద్దిపాడు పోలీసులు, అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం
Hazarath Reddyరాంగోపాల్ వర్మ ఇంటి వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. హైదరాబాద్లోని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నివాసానికి చేరుకున్న ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు చేరుకున్నారు. నేడు మద్దిపాడు పోలీస్ స్టేషన్లో విచారణకు రాంగోపాల్ వర్మ హాజరు కావలసి ఉంది.
Theft Caught on Camera: వీడియో ఇదిగో, ఏటీఎం నుంచి డబ్బులు తీసివ్వమని అడిగినందుకు కార్డు మార్చేసి రూ. 75 వేలు డ్రా చేసుకున్న దొంగ
Hazarath Reddyఉరవకొండ CANARABANK ATM సెంటర్లో ఏటీఏం కార్డును మార్చి నగదు చోరీ చేసిన ఘటన చోటు చేసుకుంది. రాయంపల్లికి చెందిన నేటికల్లు అనే వ్యక్తి నగదును తీసుకోవడానికి పట్టణంలోని ఏటీఏంలోకి వెళ్లారు. అయనకు అవగాహన లేకపోవడంతో డబ్బులు తీసి ఇవ్వాలని కోరుతూ అక్కడే ఉన్న యువకుడికి కార్డు ఇచ్చారు. రెండు సార్లు రూ.20వేల నగదు తీసి ఇచ్చాడు
Devotee Dies of Heart Attack: వీడియో ఇదిగో, గుండెపోటుతో అయ్యప్ప మాలధారుడు మృతి, ద్వారకా తిరుమల దర్శనంలో విషాదకర ఘటన
Hazarath Reddyస్నేహితులతో కలిసి ద్వారకా తిరుమలకు వచ్చిన అమలాపురం మండలం ఇందుపల్లికి చెందిన సురేష్ (27). వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కి వచ్చేసరికి తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిన సురేష్ వెంటనే ఆసుపత్రికి తరలించిన స్నేహితులు.. అప్పటికే మృతిచెందినట్టు తెలిపిన డాక్టర్లు.
Allu Arjun Dance at Pushpa-2 Event: చెన్నైలో పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ లో అల్లు అర్జున్ అదిరిపోయే స్టెప్స్ (వీడియో)
Rudraమరికొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న పుష్ప-2 కోసం సినిమా యూనిట్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ క్రమంలో చెన్నైలో గ్రాండ్ గా నిర్వహించిన పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ లో పాల్గొన్న అల్లు అర్జున్ అదిరిపోయే స్టెప్స్ వేసి అభిమానులను అలరించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Lift Fallen in Hyderabad: కేబుల్ వైర్ తెగిపోయి అపార్ట్ మెంట్ లో ఒక్కసారిగా కుప్పకూలిన లిఫ్ట్.. ఆరుగురికి గాయాలు.. హైదరాబాద్ పాతబస్తీలో ఘటన (వీడియో)
Rudraహైదరాబాద్ పాతబస్తీలోని చందూలాల్ బారాదరిలో ప్రమాదం జరిగింది. స్థానికంగా ఓ అపార్ట్ మెంట్ లో కేబుల్ వైర్ తెగిపోయి లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి.
TG Weather Update: చలితో గజగజలాడుతున్న తెలంగాణ.. సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో 9 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిక
Rudraచలితో యావత్తు తెలంగాణ గజగజలాడుతున్నది. రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతుండగా.. ఉదయం పొగమంచు ఊపిరి ఆడనివ్వటం లేదు. సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో 9 డిగ్రీల కంటే దిగువకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
Accident in Prakasam: ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ ను వెనుక నుంచి ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
Rudraప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం శాంతినగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ను వెనుక నుంచి ఓ కారు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
Rains in AP: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. ఎల్లుండి నుంచి ఏపీలో భారీ వర్షాలు.. మూడు రోజుల పాటు సముద్రంలో అలజడి.. మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని అధికారుల హెచ్చరికలు
Rudraఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనిస్తూ నేడు దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా మారనుందని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.
Heavy Rush in Srisailam: కార్తీక మాసం కదా అని శ్రీశైలం వెళ్తున్నారా? ఘాట్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్, ఏకంగా 5 కి.మీ మేర నిలిచిపోయిన వాహనాలు
VNSకార్తిక మాసం సందర్భంగా శని, ఆదివారాలు సెలవుల కారణంగా శ్రీశైలం ఆలయానికి (Srisailam Temple) భక్తులు పోటెత్తారు. మల్లన్న స్వామి దర్శనానికి తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కార్తిక మాసాన్ని (Kartika Masam) పురస్కరించుకొని శ్రీశైలంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు వాహనాల్లో తరలిరావడంతో దాదాపు 5కి.మీల మేర ట్రాఫిక్ జామ్ అయింది.
Telangana: వీడియో ఇదిగో, నాలుగు పిల్లలు జన్మనిచ్చిన పెంపుడు కుక్క, ఊరి వాళ్లందరిని పిలిచి వేడుక జరుపుకున్న దాని యజమాని కుటుంబం
Hazarath Reddyతెలంగాణలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని సుభాష్ నగర్‌కు చెందిన వినోద్ మరియు లావణ్య దంపతులు పెంచుకుంటున్న ShihTzu జాతి పెంపుడు కుక్క నాలుగు పిల్లలకు జన్మనివ్వడంతో వాటికి బారసాల జరిపింది.
Telangana: దారుణం, ఆస్తి కోసం తండ్రి అంతిమ సంస్కారాలు ఆపిన కుమారుడు, యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదకర ఘటన
Hazarath Reddyఆస్తి కోసం తండ్రి అంతిమ సంస్కారాలు ఆపిన కుమారుడు.. ఈ దారుణ ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాకి చెందిన ఆలకుంట్ల బాలయ్య అనారోగ్యంతో గురువారం మృతి చెందారు . అయితే తన తల్లి ఆస్తిలో తనకు వాటా రావాలంటూ అంత్యక్రియలను చిన్న కొడుకు సురేష్ అడ్డుకున్నారు.
Telangana: వీడియో ఇదిగో, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ ఆగడాలు భరించలేక బైక్ తగలబెట్టిన యువకుడు, ఇంటికి వచ్చి EMI కట్టాలని యువకున్ని బెదిరించిన ఫైనాన్స్ సంస్థ ఏజెంట్లు
Hazarath Reddyమెదక్ జిల్లాలోని శివంపేటలో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ ఆగడాలు భరించలేక ఓ యువకుడు తన బైక్ తగలబెట్టాడు. ఇంటికి వచ్చి యువకున్ని EMI కట్టాలని ఫైనాన్స్ సంస్థ ఏజెంట్లు బెదిరించడంతో అతను కోపంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. మనోవేదనకు గురై ఫైనాన్స్ సంస్థ ఏజెంట్ల ముందే బైక్ కి నిప్పు పెట్టాడు.
Actor Ali Gets Notices: ఫామ్‌హౌస్‌లో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ సినీనటుడు అలీకి నోటీసులు, నిర్మాణాలు ఆపివేయాలని సూచన
Hazarath Reddyప్రముఖ సినీ నటుడు అలీకి అక్రమ నిర్మాణం వ్యవహారం నోటీసులు జారీ అయ్యాయి. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం ఎక్‌మామిడి గ్రామ పంచాయతీ సెక్రటరీ అలీ పనివారికి నోటీసులు అందజేశారు. గ్రామ పంచాయతీ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా అలీ తన ఫామ్‌హౌస్‌లో అక్రమ నిర్మాణాలు చేపట్టారని.. అందుకు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
Viral Video: వీడియో ఇదిగో, చేపల వలకు చిక్కిన భారీ కొండచిలువ, అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి వదిలివేస్తామని తెలిపిన ఫారెస్ట్ అధికారులు
Hazarath Reddyసిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో చేపల వేటకు వేసిన వలలో మత్స్యకారులకు భారీ కొండచిలువ చిక్కడం స్థానికంగా కలకలం రేపింది. ఉదయం వలలో చిక్కిన భారీ కొండచిలువను గమనించిన మత్స్యకారులు కొండచిలువను చెరువు కట్ట పైకి తీసుకువచ్చి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.