రాష్ట్రీయం

KTR: చర్లపల్లి జైలులో పట్నం నరేందర్ రెడ్డితో కేటీఆర్ ములాఖత్, కేటీఆర్ వెంట బీఆర్ఎస్ నేతలు..పట్నం నరేందర్ రెడ్డి భార్య

Arun Charagonda

వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, మరియు అధికారులపై దాడి కుట్ర కేసులో అరెస్ట్ అయ్యి చర్లపల్లి జైలులో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ములాఖాత్ ద్వారా కలిశారు.కేటీఆర్ వెంట ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి భార్య‌, శ్రీనివాస్ గౌడ్, మ‌హ‌ముద్ అలీ, బండారు ల‌క్ష్మారెడ్డి ఉన్నారు.

Telangana: సిగరేట్ తాగొద్దన్నందుకు పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య, ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువకుడు...కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు

Arun Charagonda

సిగరెట్ తాగొద్దన్నందుకు పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో చోటు చేసుకుంది. పదో తరగతి విద్యార్థి(16)ని సిగరెట్ తాగొద్దని తండ్రి మందలించడంతో 6 నెలల క్రితం గడ్డిమందు తాగాడు. చికిత్స అందించడంతో కోలుకోగా, విద్యార్థి ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని ఫ్రెండ్స్, కుటుంబంతో మాట్లాడకుండా ఉండేవాడు.. కాగా నిన్న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Student Suicide: హైద‌రాబాద్‌ మియాపూర్ శ్రీ చైత‌న్య క‌ళాశాల‌లో ఇంటర్ విద్యార్థి బలవన్మరణం.. మృతుడి స్వస్థలం ఏపీలోని విజ‌య‌వాడ‌

Rudra

హైద‌రాబాద్‌ లోని మియాపూర్‌ లో తీవ్ర విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. శ్రీ చైత‌న్య క‌ళాశాల‌లో ఇంట‌ర్‌ విద్యార్థి ఒకరు బలవన్మరణానికి పాల్ప‌డ్డాడు.

Cyber Nude Call: ఇంజినీరింగ్ విద్యార్థికి యువతి నగ్న వీడియో కాల్.. ఘట్‌ కేసర్‌ లో మరో స్కాం.. ఏంటది??

Rudra

హైదరాబాద్ లోని ఘట్‌ కేసర్‌ లో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంజినీరింగ్ విద్యార్థికి ఓ అనామక యువతి నగ్న వీడియో కాల్ చేసి.. డబ్బులు వసూలు చేసింది.

Advertisement

Heavy Rains in AP: బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం.. వచ్చే వారం ఏపీలో దంచికొట్టనున్న వానలు.. ఐఎండీ అంచనా.. ఉత్తరం నుంచి వీచే గాలుల ప్రభావంతో కోస్తాంధ్రలో పెరగనున్న చలి తీవ్రత

Rudra

ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వచ్చేవారం ముఖ్యంగా మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది.

Hospital Horror: కంటిలో నలక పడిందని వస్తే, సర్జరీ అన్నారు.. మత్తు ఇంజక్షన్ ఇచ్చి చిన్నారిని పొట్టనబెట్టుకున్నారు.. హైదరాబాద్ లో ప్రైవేటు కంటి దవాఖాన ముందు బంధువుల ఆందోళన (వీడియో)

Rudra

హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో దారుణం జరిగింది. బిడ్డ కంటిలో నలక సమస్యతో హాస్పిటల్ ను ఆశ్రయించిన ఆ తల్లిదండ్రులకు చివరకు కడుపుకోతే మిగిలింది.

Free Bus Service In Srisailam: శ్రీ‌శైలం వెళ్లే భ‌క్తుల‌కు ఫ్రీ బ‌స్, కార్తీక మాసం సంద‌ర్భంగా ప్రారంభించిన అధికారులు

VNS

శ్రీశైల మహాక్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం శుక్రవారం సాయంత్రం నుంచి ఉచిత బస్సు సౌకర్యం (Free bus) ప్రారంభించింది. వారాంతపు సెలవులతోపాటు పర్వ దినాల్లో అధిక సంఖ్యలో శ్రీశైల క్షేత్రానికి (Free Bus in Srisailam) భక్తులు తరలి వస్తున్నారు.

Sarpanch Dies by Suicide: కొండారెడ్డి ప‌ల్లె గ్రామ మాజీ స‌ర్పంచ్ ఆత్మ‌హ‌త్య‌, సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడిన హరీష్ రావు, మీ అన్నదమ్ముళ్ల‌పై చట్టరీత్యా హత్యా నేరం పెట్టాలని డిమాండ్

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలోని కొండారెడ్డి పల్లె గ్రామ మాజీ సర్పంచ్‌ సాయిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడడం కలచివేసింద‌ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత గ్రామంలో ఉన్న దారుణ పరిస్థితికి సాయిరెడ్డి ఆత్మహత్య నిదర్శనం అని ఆయ‌న అన్నారు

Advertisement

Andhra Pradesh Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, మొత్తం 21 బిల్లులు ఆమోదం, 10 రోజుల పాటు 59 గంటల 55 నిమిషాల పాటు సభా కార్యకలాపాలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగిశాయి. విజన్ డాక్యుమెంట్-2047పై చర్చ అనంతరం అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. నవంబరు 11న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు 10 రోజుల పాటు జరిగాయి. మొత్తం 59 గంటల 55 నిమిషాల పాటు సభా కార్యకలాపాలు కొనసాగాయి.

Harishrao: రోడ్డెక్కిన ప్రజాపాలన దరఖాస్తులు...సైబర్‌ మోసగాళ్ల చేతికి ఈ వివరాలు చిక్కితే ప్రజల పరిస్థితి ఏంటి?..హరీశ్ రావు ప్రశ్న

Arun Charagonda

నాడు నడిరోడ్డు ఎక్కిన ప్రజాపాలన దరఖాస్తులు..నేడు మళ్ళీ నడి రోడ్డుపై ఇంటింటి కుటుంబ సర్వే పత్రాలు అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. ప్రజల వివరాల సేకరణ పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదీ మరో నిదర్శనం..రోడ్ల పై తెలంగాణ ప్రజల బతుకు వివరాలను బట్టబయలు చేయడమేనా మీ సర్వే లక్ష్యం? ఏంటన్నారు.

Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, పెళ్లి చేయడంలేదని తండ్రిని రూంలో బంధించి చితకబాదిన కొడుకులు, కర్నూలు జిల్లాలో షాకింగ్ ఘటన

Hazarath Reddy

పెళ్లి చేయడం లేదని తండ్రిని రూమ్ లో బంధించి కొడుకు చితకబాదిన ఘటన కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రంలో చోటుచేసుకుంది.మంత రాజు (65) అనే వ్యక్తి కిరణం షాపు పెట్టుకొని, జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు సంతానం.

Andhra Pradesh: మహిళల ముందు బట్టలు విప్పేసి వ్యాపారి నగ్న ప్రదర్శన, మగవారు రోడ్లపై స్నానాలు చేయొద్దంటూ వీరంగం, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు

Hazarath Reddy

రత్నాల చెరువు రోడ్డు వెంబడి ఉంటున్న కుటుంబాలలోని మగవారు రోడ్లపై స్నానాలు చెయ్యొద్దంటూ రామాంజనేయులు ఈ నగ్న ప్రదర్శన చేపట్టారు. మహిళల ఫిర్యాదు మేరకు మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కేసు నమోదు చేశారు పోలీసులు.

Advertisement

Telangana: వీడియో ఇదిగో, పురాతన శివాలయంలో శివలింగాన్ని ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు, దుండగులను అరెస్ట్ చేయాలని హిందూ సంఘాలు ధర్నా

Hazarath Reddy

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో ఉన్న పురాతన శివాలయంలో రాత్రి శివలింగాన్ని తొలగించి గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారు. శివుని పక్కనే ఉన్న వినాయకుడు విగ్రహాన్ని పక్కనే ఉన్న చెట్ల పొదల్లో పడేశారు. హిందూ సంఘాలు చేరుకొని శివలింగాన్ని ఎత్తుకెళ్లిన దుండగులను గుర్తించి అరెస్టు చెయ్యాలని డిమాండ్ చేశారు.

Hydra: చెరువులు, నాళాల పునరుద్ధరణపై మేధావులతో హైడ్రా కమిషనర్‌ సమావేశం, మూడు గంటల పాటు చర్చ, హైడ్రా కూల్చివేతలు ఆగవని స్పష్టం

Arun Charagonda

చెరువులు, నాళాల పునరుద్ధరణపై మేధావులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశమయ్యారు. గ్రేటర్ పరిధిలో ఉన్న చెరువులు, నాళాలకు FTL బౌండరీల నిర్ణయం తీసుకున్నారు. రిటైర్డ్ ENC లు, మైనర్ ఇరిగేషన్ సీఈలు , వీసీలు, ప్రొఫెసర్లు, పర్యావరణవేత్తలు, పీసీబీకి చెందిన సీనియర్ అధికారులతో రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా మీటింగ్ జరుగగా మేధావుల సలహలు, సూచనలు తీసుకున్నారు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, గన్ మిస్ ఫైర్ అయి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌ మృతి, గుంటూరులో విషాదకర ఘటన

Hazarath Reddy

గన్ మిస్‌ఫైర్‌ అయి ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన గుంటూరులో శుక్రవారం చోటు చేసుకుంది. తుపాకీ మిస్‌ ఫైర్‌ కావడంతో ఏఆర్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది.

Chandrababu: వీడియో ఇదిగో, నేను ఐదోసారి సీఎం అవుతా, అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

Hazarath Reddy

AP రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను బ్యాలెన్స్‌ చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారని.. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని చెప్పారు.

Advertisement

Andhra Pradesh Assembly Session: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు, కీలక బిల్లులకు ఏపీ శాసనమండలి ఆమోదం, అనంతరం నిరవధిక వాయిదా

Hazarath Reddy

ఇప్పటికే శాసనసభలో ఆమోదం పొందిన ఎనిమిది బిల్లులకు ఏపీ శాసనమండలి కూడా ఆమోదం తెలిపింది. లోకాయుక్త సవరణ బిల్లు 2024ను ఆమోదించింది. దీంతో పాటుగా చెత్తపన్ను విధిస్తూ గత ప్రభుత్వం చేసిన చట్టాన్ని రద్దు చేసింది.

KTR: అదానీకి అండగా బడే భాయ్ - చోటే భాయ్...కాంగ్రెస్ పార్టీది గల్లీలో ఒక నీతి…ఢిల్లీలో ఒక నీతా? , రేవంత్‌ రెడ్డికి దమ్ముంటే లగచర్లకు రావాలని కేటీఆర్ సవాల్

Arun Charagonda

అదానీ బండారం మళ్లీ అంతర్జాతీయంగా బయటపడిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీడియాతో మాట్లాడిన కేటీఆర్ .. ఆఫ్రికా సహా దేశంలో ఆయన వ్యవహారంపై ప్రకంపనలు మొదలయ్యాయి అన్నారు. అదానీ పై కేసు పెట్టాలని, జేపీసీ వేయాలని ఎన్నిసార్లు కోరినప్పటిికీ ప్రధాని మోడీ పట్టించుకోలేదు.. అదానీ కంపెనీలకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు రెండుసార్లు బయటపడిందన్నారు.

Siddipet: సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీకొట్టిన డీసీఎం...ఆరుగురికి తీవ్ర గాయాలు...బాధితులను ఆస్పత్రికి తరలింపు

Arun Charagonda

సిద్దిపేట - పొన్నాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి సిద్దిపేట వైపు వెళ్తున్న ఆటోను అతివేగంగా వెనకనుంచి ఢీకొట్టింది డీసీఎం. ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు, ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Balakrishna on YS Sharmila: వైఎస్ షర్మిల అంశంపై స్పందించిన ఎమ్మెల్యే బాలకృష్ణ, అసత్య ప్రచారం చేసిన వాడు పట్టించుకోనప్పుడు నేను ఎందుకు పట్టించుకోవాలని వెల్లడి

Hazarath Reddy

.అసత్య ప్రచారం చేసిన వాడు పట్టించుకోనప్పుడు నేను ఎందుకు పట్టించుకోవాలన్నారు. వైసీపీ వాళ్లు అసెంబ్లీ కి హాజరు కాకుండా మనుషులను పెట్టుకున్నారు. ఈరోజు కూడా వాళ్ళ అసెంబ్లీకి రాకుంటే బాగుంటుందన్నారు.

Advertisement
Advertisement