రాష్ట్రీయం

Konda Surekha on KTR: హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం కేటీఆర్‌కు అలవాటే, కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు, సమంత, నాగచైతన్య విడిపోవడానికి కారణం అతడే అంటూ..

Hazarath Reddy

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం కేటీఆర్ కు అలవాటేనని ఆమె అన్నారు. కేటీఆర్ డ్రగ్స్ కు అలవాటు పడ్డారని... హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసింది కూడా ఆయనే అని మండిపడ్డారు

Heart Attack Caught on Camera: వీడియో ఇదిగో, బట్టలు కోసం వచ్చి గుండెపోటుతో కుప్పకూలిన కస్టమర్

Hazarath Reddy

హార్ట్ ఎటాక్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధి రోడ్ నెంబర్-1 లోని షోరూమ్‌లో బట్టలు తీసుకుంటూ ఉండగా హార్ట్ ఎటాక్ సమస్యతో కిందపడిపోయాడు ప్రవీణ్ గౌడ్ (37). వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడు.సీసీ ఫుటేజ్‌లో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.

Y. S. Avinash Reddy: మేము అధికారంలోకి వస్తాం,కూటమి నేతలు సంగతి అప్పుడు తేలుస్తాం, వైఎస్ అవినాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

వైసీపీ నేత వైఎస్ అవినాశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. మేము అధికారంలోకి వస్తాం.. అప్పుడు కూటమి నేతల పని చెబుతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Telangana Horror: వరంగల్‌లో దారుణం, యువతికి బీర్లు తాగించి స్నేహితులు సామూహిక అత్యాచారం, బలవంతంగా కారులో ఎక్కించుకుని..

Hazarath Reddy

భూపాలపల్లి ప్రాంతానికి చెందిన ఓ యువతి నగర శివారులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఫార్మసీ రెండో సంవత్సరం చదువుతోంది. గత నెల 15న ఆమె స్వస్థలానికి చెందిన తెలిసిన యువకుడొకరు ఆమె వసతి గృహం వద్దకు వెళ్లాడు. మాట్లాడే పని ఉందంటూ ఆమెను కారులో ఎక్కమన్నాడు.

Advertisement

Roja on Pawan Kalyan: తప్పు చేశారు కాబట్టే పవన్ చేత ప్రాయశ్చిత్త దీక్ష ను దేవుడు చేయించాడు, సంచలన వ్యాఖ్యలు చేసిన రోజా

Hazarath Reddy

పవన్ ప్రాయశ్చిత్త దీక్షపై రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేశారు కాబట్టే పవన్ చేత ప్రాయశ్చిత్త దీక్ష ను దేవుడు చేయించాడు.సుప్రీం కోర్టు వ్యాఖ్యలను పురంధరేశ్వరి పక్కదోవ పట్టిస్తున్నారని మాజీమంత్రి రోజా అన్నారు.

AP DCM Pawan Kalyan At Tirumala: తిరుమలలో ప్రాయశ్చిత్త దీక్షను విరమించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందని పిలుపు..

sajaya

గత 11 రోజులుగా తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ నేడు తిరుమలలో విరమించారు. ఈ సందర్భంగా ఆయన అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన స్వామి వారి దర్శనం చేసుకునేందుకు వచ్చారు.

AP Liquor Policy Notification: ఏపీలో మద్యం దుకాణాల లైసెన్స్ లకు నోటిఫికేషన్ జారీ, మద్యం షాపుల లైసెన్సుల కోసం నిబంధనలు ఇవే..

sajaya

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ప్రవేశపెట్టింది, ఎక్సైజ్ శాఖ కొత్త మద్యం దుకాణాల కోసం దరఖాస్తులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా రిటైల్ మద్యం వ్యాపారాన్ని నియంత్రించే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం రెండేళ్ల కాలపరిమితితో వస్తుంది.

Hyderabad Horror: వీడియో ఇదిగో, హైడ్రా కూల్చివేతల్లో ఎగిరి వచ్చి పోలీసుకు తగిలిన రాయి, కుప్పకూలిన అక్కడే పడిపోయిన తెలంగాణ పోలీస్

Vikas M

Advertisement

Hyderabad Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం, చెరువును తలపిస్తున్న పంజాగుట్ట-అమీర్‌పేట రహదారి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిక

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయం కావడంతో వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. పంజాగుట్ట, బేగంపేట, కూకట్‌పల్లి, మూసాపేట్, నిజాంపేట్ ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురిసింది.

Pawan Kalyan Fell Ill: వీడియోలు ఇవిగో, తిరుమల కొండ మెట్లు ఎక్కుతుండగా పవన్‌కి అస్వస్థత, తీవ్ర వెన్నునొప్పి, కాళ్ల నొప్పులతో బాధపడిన డిప్యూటీ సీఎం

Hazarath Reddy

తిరుమల కొండ ఎక్కుతుండగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తిరుమల కొండ ఎక్కుతున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర వెన్నునొప్పి, కాళ్ల నొప్పులతో ఆయన బాధపడ్డారు.

Pawan Kalyan Health Update: వీడియో ఇదిగో, తిరుమల కొండ ఎక్కుతుండగా పవన్‌కి తీవ్ర అస్వస్థత, తీవ్ర వెన్నునొప్పి, కాళ్ల నొప్పులతో బాధపడిన డిప్యూటీ సీఎం

Hazarath Reddy

తిరుమల కొండెక్కుతుండగా పవన్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తిరుమల కొండ ఎక్కుతున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర వెన్నునొప్పి, కాళ్ల నొప్పులతో ఆయన బాధపడ్డారు. దీంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది సపర్యలు చేశారు. ఆయన దీక్షలో ఉండటం వల్ల సరైన ఆహారం తీసుకోకపోవడంతో ఇబ్బంది పడ్డారని జనసైనికులు చెబుతున్నారు.

Tirupati Laddu Controversy: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం, సిట్ దర్యాప్తును నిలిపివేస్తున్నామని తెలిపిన డీజీపీ ద్వారకా తిరుమలరావు

Hazarath Reddy

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణలు (Tirupati Laddu Controversy) నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే.

Advertisement

DJ Sound Systems Ban in Hyderabad: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం, కీలక ఉత్తర్వులు జారీ చేసిన నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్

Hazarath Reddy

హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం విధించినట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఊరేగింపులు, వేడుకల సందర్భంగా విపరీత శబ్ద కాలుష్యానికి దారితీస్తున్న డీజేలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. డీజే సౌండ్ కారణంగా ఇబ్బందులు పడుతున్నట్లు డయల్ 100కు ఫిర్యాదులు పెరిగాయి.

Andhra Pradesh: ఏపీలో వైన్ షాపులు బంద్, లబోదిబోమంటున్న మందుబాబులు, బార్లకు వెళితే జేబులకు చిల్లులు పడుతున్నాయంటూ గగ్గోలు

Hazarath Reddy

ఏపీలో మందుబాబులు లబోదిబోమంటున్నారు. వైన్ షాపులు బంద్ కావడమే దీనికి కారణం. వైన్ షాపుల్లో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగుల కాలపరిమితి నిన్నటితో ముగిసింది. అయినప్పటికీ మరో 10 రోజుల పాటు షాపులను తెరవాలని కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం కోరింది

Telangana Shocker: వీడియో ఇదిగో, గ్రామం నుండి బహిష్కరించారని దంపతులు ఆత్మహత్యాయత్నం

Hazarath Reddy

ఆస్తి పంపకాల్లో చెప్పినమాట వినలేదని పెద్దలు గ్రామ బహిష్కరణ విధించడంతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. యాదాద్రి జిల్లా రామన్నపేట్ మండలం మునిపంపుల గ్రామంలో ఆస్తి పంపకాల్లో గ్రామపెద్దలు చెప్పినట్లు వినకపోవడంతో రమేష్, వసంత దంపతులను గ్రామ బహిష్కరణ చేశారు.

Hyderabad Road Accident: వీడియో ఇదిగో, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు, మద్యం సేవించిన యువకులను చితకబాదిన స్థానికులు

Hazarath Reddy

రంగారెడ్డి జిల్లాలో పుప్పాలగూడలో కారు బీభత్సం సృష్టించింది. నిలిపి ఉంచిన ద్విచక్రవాహనాన్ని కారు ఢీ కొట్టింది. కారులో ఉన్న నలుగురు యువకులను స్థానికులు చితకబాదారు. దీంతో కోప్రాదిక్తులైన స్థానికులు కారు అద్దాలు ధ్వంసం చేశారు. మద్యం సేవించి యువకులు కారు నడిపారంటూ వారిని స్థానికులు చితకబాదారు.

Advertisement

Jagananna Thodu Name Change: 'జ‌గ‌న‌న్న తోడు' ప‌థ‌కం పేరు మారుస్తూ ఏపీ స‌ర్కార్‌ ఉత్తర్వులు జారీ.. 'చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు'గా మార్చిన ప్ర‌భుత్వం

Rudra

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నేతృత్వంలో ఏర్పాటైన కూట‌మి ప్ర‌భుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం చిరు వ్యాపారుల కోసం తీసుకొచ్చిన‌ 'జగనన్న తోడు' స్కీమ్‌ పేరును మార్చింది.

LPG Prices Hike: కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు షాక్.. మళ్లీ పెరిగిన రేట్లు.. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై రూ.50 మేర పెంచుతున్నట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రకటన

Rudra

దసరా, దీపావళి పండుగల ముందు హోటల్స్, ఇతరత్రా వాణిజ్య సముదాయాల్ని నిర్వహించే కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. వరుసగా మూడవ నెల అక్టోబర్‌ లో కూడా గ్యాస్ ధర పెరిగింది.

KTR On Musi River Project: దేశంలోనే అతిపెద్ద కుంభకోణం మూసీ ప్రాజెక్టు, హుస్సేన్ సాగర్ పై ఉన్న హైడ్రా కార్యాలయాన్ని కూల్చేయాలని కేటీఆర్ డిమాండ్

Arun Charagonda

బీఆర్ఎస్ పార్టీకి కాళేశ్వరం ఏటీఎం అని రాహుల్ గాంధీ అన్నాడు.. మరి మూసీ ప్రాజెక్ట్ కాంగ్రెస్ పార్టీకి రిజర్వు బ్యాంకా? అని ప్రశ్నించారు. మీడియాతో మాట్లాడిన కేటీఆర్..లక్ష 50 వేల కోట్లు అంటే భారత్ దేశంలోనే అతి పెద్ద కుంభకోణం కాదా ఇది అని ప్రశ్నించారు.

Tirupati Laddu Row: దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి, వారిపై మరో ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్, శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఘటనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ తిరుమల లడ్డూ ప్రసాదం అంశంపై మరో ట్వీట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఘటనపై ఈరోజు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Advertisement
Advertisement