రాష్ట్రీయం

Bio Asia 2025: అట్టహాసంగా ప్రారంభమైన బయో ఏషియా-2025 సదస్సు.. హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రత్యేక ఆకర్షణగా హైదరాబాదీల స్మార్ట్ నోట్ బుక్ (లైవ్ వీడియో)

Rudra

ఔషధాలు, లైఫ్‌ సైన్సెస్‌ రంగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే బయో ఏషియా-2025 వార్షిక సదస్సు కాసేపటి క్రితం హెచ్‌ఐసీసీలో ప్రారంభమైంది.

Actress Sri Reddy: చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, అనితలపై చేసిన వ్యాఖ్యల కేసులో నటి శ్రీరెడ్డికి హైకోర్టులో కాస్త ఊరట.. షరతులతో కూడిన బెయిలు మంజూరు

Rudra

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అనిత, వారి కుటుంబ సభ్యులను సోషల్ మీడియా వేదికగా దూషించిన కేసులో నటి శ్రీరెడ్డికి ఎట్టకేలకు హైకోర్టులో ఊరట లభించింది.

Elephant Attack Update: అన్నమయ్య జిల్లాలో ఏనుగుల తొక్కిసలాట ఘటనపై పవన్ కళ్యాన్ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటన

Rudra

ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో ఏనుగుల తొక్కిసలాట ఘటనపై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ స్పందించారు. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు మృతి చెందిన ఘటనపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Elephant Attack: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం.. రైస్ మిల్ లోకి చొరబడ్డ ఏనుగుల గుంపు (వీడియో)

Rudra

ఏపీలోని పలు జిల్లాల్లో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ ఏనుగుల గుంపు జియ్యమ్మవలస మండలం పెదమేరంగిలోని సాయి గాయత్రి మోడరన్ రైస్ మిల్ లోకి చొరబడింది.

Advertisement

World's First AI Powered Reusable Smart Notebook: ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత పునర్వినియోగ స్మార్ట్‌ నోట్‌ బుక్‌.. అభివృద్ధి చేసిన హైదరాబాదీ టెకీలు.. విశేషాలు చూస్తే, అబ్బురపడాల్సిందే!!

Rudra

యువత తలచుకుంటే అద్భుతాలని ఆవిష్కరిస్తారు అని మరోసారి నిరూపించారు ఓ యువత్రయం. అమెరికాలో నివసిస్తున్న కేసరి సాయికృష్ణ సబ్నివీసు, రఘురాం తటవర్తి.. హైదరాబాద్ లో ఉంటున్న తన స్నేహితుడు సుమన్ బాలబొమ్ముతో కలిసి ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత పునర్వినియోగ స్మార్ట్‌ నోట్‌ బుక్‌ ను అభివృద్ధి చేశారు.

Elephant Attack: అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం.. భక్తులపై దాడి చేసిన ఏనుగుల గుంపు.. ముగ్గురు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం

Rudra

ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. ఓబులవారిపల్లె మండలం గుండాలకోన వద్ద భక్తులపై ఏనుగులు దాడికి పాల్పడ్డాయి.

SLBC Tunnel Collapse Update: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం, బిగ్గరగా అరిచినా 8 మంది నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని తెలిపిన మంత్రి జూపల్లి కృష్ణారావు

Hazarath Reddy

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం కూలిన ఘటనలో 8 మంది ఆచూకీ ఇంతవరకు లభించలేదు. అయితే సహాయక చర్యలు మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వారిని ఎలాగైనా ప్రాణాలతో బయటికి రప్పించేందుకు ర్యాట్ హోల్ మైనర్స్ ను సైతం రప్పించింది తెలంగాణ ప్రభుత్వం.

Anjan Kumar Yadav: వీడియో ఇదిగో, సొంత పార్టీ నేతలపై రెచ్చిపోయిన అంజన్ కుమార్ యాదవ్, రెడ్డి కొడుకుల వల్లనే కాంగ్రెస్ పార్టీ నష్టం పోయిందంటూ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు.సోమవారం హైదరాబాద్‌లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఆదర్శనగర్‌లో యాదవ సామాజికవర్గ నేతల సమావేశం నిర్వహించారు.

Advertisement

Andhra Pradesh: వీడియో ఇదిగో, సీఎం చంద్రబాబు ఇలాకాలో జల్లికట్టు పోటీలు, ఎద్దు ఢీకొట్డడంతో యువకుడు అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో జరిగిన జల్లికట్టు పోటీల్లో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. జల్లికట్టు క్రీడల సమయంలో ఎద్దు ఢీకొట్టడంతో అక్కడికక్కడే యువకుడు కుప్పకూలాడు. వెంటనే గ్రామస్తులు, కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందాడు.

Telangana Horror: జగిత్యాలలో దారుణం, ఆస్తి కోసం సొంత అన్నను చంపిన ఇద్దరు చెల్లెళ్లు, అనంతరం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన ఇద్దరు మహిళలు

Hazarath Reddy

తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం సొంత అన్నను ఇద్దరు చెల్లెళ్లు మట్టుబెట్టిన ఘటన పోచమ్మవాడలో జరిగింది. ఆస్తి తగాదాల నేపథ్యంలో అన్నపై ఇద్దరు చెల్లెళ్లు.. దాడి చేసి, హత్య చేశారు.

Andhra Pradesh: గుంటూరు జిల్లాలో ఘోర విషాదం, పూడిక తీస్తుండగా కరెంట్ షాక్, నలుగురు అక్కడికక్కడే మృతి, పెదకాకానిలో అలుముకున్న విషాద ఛాయలు

Hazarath Reddy

గుంటూరు జిల్లా పెదకాకానిలో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. పెదకాకానిలోని నంబూరు కాళీ గార్డెన్స్ వెళ్లే మార్గంలో ఉన్న గోశాలలో కరెంట్ షాక్ కొట్టడంతో నలుగురు మృతి చెందారు. కాగా గోశాల వృథా నీటిని పక్కనే ఉన్న మూడు సంపుల్లో చేరేలా నిర్వాహకులు ఏర్పాటు చేశారు

GV Reddy Resigns: టీడీపీతో పాటు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా, ఇకపై న్యాయవాది వృత్తిలో కొనసాగుతానని వెల్లడి

Hazarath Reddy

ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తన పదవీకి రాజీనామా చేశారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పదవితో పాటు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ చంద్రబాబుకు లేఖ పంపించారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్న జీవీ రెడ్డి.. ఇకపై న్యాయవాది వృత్తిలో కొనసాగుతానని వెల్లడించారు.

Advertisement

Andhra Pradesh: జగనన్న భయపడతాడో లేదో సోనియా గాంధీని అడగండి చెప్తుంది, కూటమి నేతల వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన రోజా, వీడియో ఇదిగో..

Hazarath Reddy

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేసింది. ఈ నేపథ్యంలోఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలని అనుకుంటే గనుక జర్మనీకి వెళ్లాలంటూ జనసేన అధినేత, డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు కీలక వ్యాఖ్యలు చేశారు.

YS Avinash Reddy: సూపర్ సిక్స్ రెఫరెండంతో మంగళగిరి, పిఠాపురంలో గెలిచే దమ్ముందా, ఎన్నికలకు సిద్ధమని కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరిన వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి

Hazarath Reddy

సూపర్ సిక్స్ పథకాల అమలులో ప్రభుత్వం విఫలమయిందని... ప్రభుత్వంపై అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని చెప్పారు. కడపలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో తాము సంధించే ప్రశ్నలకు భయపడే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని అవినాశ్ మండిపడ్డారు.

Wine Shops to Closed in Telangana: మందుబాబులకు అలర్ట్, రేపటి నుండి 3 రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేత, ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలు

Hazarath Reddy

తెలంగాణలో రేపటి నుండి మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. తెలంగాణలోని ఏడు ఉమ్మడి జిల్లాల్లో ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి

PM Kisan 19th Instalment Released: రైతులకు గుడ్ న్యూస్, పీఎం కిసాన్ 19వ విడత నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ, 9.80 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి నగదు

Hazarath Reddy

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద 19వ విడత నిధులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. సోమవారం బిహార్‌లోని భాగల్‌పూర్‌లో రూ. 22 వేల నగదును ప్రధాని విడుదల చేశారు. దీని ద్వారా 9.80 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనుంది.

Advertisement

Pawan Kalyan on YSRCP: వీడియో ఇదిగో, 11 సీట్లతో ఈ ఐదేళ్లూ వైసీపీకు ప్రతిపక్ష హోదా రాదు, సభలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన అని తెలిపిన పవన్ కళ్యాణ్

Hazarath Reddy

ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదని.. ప్రజలు ఇస్తేనే వస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు. అత్యధిక మెజార్టీలో రెండో స్థానంలో ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారన్నారు. ఈ విషయంలో వైసీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలని హితవు పలికారు

Tuni Municipal Chairperson Resigns: తుని మున్సిపల్ ఛైర్‌ పర్సన్‌ పదవికి వైసీపీ నేత రాజీనామా, కౌన్సిలర్‌గా కొనసాగుతానని ప్రకటించిన సుధారాణి

Hazarath Reddy

కాకినాడ జిల్లా తునిలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్‌ తగిలింది. ఛైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సుధారాణి ప్రకటించారు. చైర్‌ పర్సన్‌గా మాత్రమే రాజీనామా చేశానని కౌన్సిలర్‌గా కొనసాగుతానని ఆమె వెల్లడించారు

Mahah Kumbh Mela 2025: మహాకుంభమేళాకు వెళ్లివస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు తెలంగాణ వాసులు మృతి, టిప్పర్‌ను బలంగా ఢీకొట్టిన కారు

Hazarath Reddy

మహాకుంభమేళాకు వెళ్లివస్తుండగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వారణాసి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సంగారెడ్డి జిల్లా వాసులు మృత్యువాతపడ్డారు. కుంభమేళాకు వెళ్లి వస్తుండగా భక్తులు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది.

Telangana: వీడియో ఇదిగో, నాకు భయం వేస్తోంది పరీక్షకు పోను అని ఏడ్చిన బాలుడు, ధైర్యం చెప్పి పరీక్ష కేంద్రంలోకి పంపిన పోలీసులు, మెచ్చుకుంటున్న నెటిజన్లు

Hazarath Reddy

నాకు భయం వేస్తోంది పరీక్ష పోను అని పరీక్షా కేంద్రం వద్ద మారం చేసిన బాలుడిని పోలీసులు బుజ్జగించి ధైర్యం చెప్పి పరీక్షా కేంద్రంలోకి పంపిన సంఘటన హన్మకొండ లో జరిగింది.

Advertisement
Advertisement