రాష్ట్రీయం

Andhra Pradesh Elections 2024: ఏపీలో ఒకే దశలో ఎన్నికలు పూర్తి చేసేలా ఈసీ కసరత్తు, ఈ నెల 9,10 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్న కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం

Hazarath Reddy

వచ్చే సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై ఈ నెల 9,10 తేదీల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం (Election Commission) ఏపీలో పర్యటించనుంది. సీఈసీ ఆధ్వర్యంలో అధికారుల బృందం ఆంధ్రప్రదేశ్‌‌కు రానుంది.

Gadikota Dwarakanath Reddy Joins TDP: వైసీపీ వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథరెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య తదితరులు

Hazarath Reddy

మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథరెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బావ అయిన ద్వారకానాథరెడ్డి ఉమ్మడి కడప జిల్లాలో పునర్విభజనలో రద్దయిన లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో వీరికి చంద్రబాబు పార్టీ కండువా కప్పి ఆయన్ని టీడీపీలోకి ఆహ్వానించారు.

Sankranti Holidays 2024: జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు, హాలిడేస్ ప్రకటన విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

Hazarath Reddy

తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగకు సంబంధించి అధికారికంగా పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ క్రమంలోనే మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయని పేర్కొంది.

CM Jagan To Meet KCR: రేపు కేసీఆర్‌తో భేటీ కానున్న సీఎం జగన్, మాజీ ముఖ్యమంత్రిని పరామర్శించనున్న ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును పరామర్శించనున్నారు. గత నెల 8వ తేదీన కేసీఆర్‌ గజ్వేల్‌ ఫాంహౌజ్‌లో కాలుజారి పడడంతో తుంటి ఎముక విరిగన సంగతి తెలిసిందే.

Advertisement

CM Jagan Slams Chandrababu: పొత్తుల కోసం కుటుంబాల్ని చీలుస్తూ రాజకీయాలు చేస్తున్నారు, చంద్రబాబుపై మండిపడిన సీఎం జగన్, వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపు ఉత్సవాల్లో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

కాకినాడలో రంగరాయ మెడికల్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో (YSR Pension Donation Enhancement Program) వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం జగన్ (CM Jagan Mohan ReddY). సభలో సీఎం మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం రూ.3వేలకు పెన్షన్‌ పెంచాం. పేదల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలి

AP Three Capitals Case: సుప్రీంకోర్టులో ఏపీ రాజధాని కేసు విచారణ ఏప్రిల్‌కు వాయిదా, ఈ లోగా అన్ని పక్షాలు తమ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు

Hazarath Reddy

సుప్రీంకోర్టులో ఏపీ రాజధాని కేసు విచారణ వాయిదా పడింది. అమరావతి(Amaravati)కి సంబంధించిన కేసుల విచారణను సుప్రీంకోర్టు (Supreme Court) ఏప్రిల్‌కు వాయిదా వేసింది. ఆ నెలలోని నాన్‌ మిస్‌లేనియస్‌ డేలో వాదనలు వింటామని న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం స్పష్టం చేసింది

Hyderabad Road Accident: షాకింగ్ వీడియో ఇదిగో, అతివేగంతో దూసుకొచ్చిన బైకులను ఢీకొట్టిన చెత్త ఆటో, ఒకరు అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం. చెంగిచర్లలో చెత్త సేకరించే ఆటో అతివేగంగా దూసుకొచ్చి ఎదురొచ్చిన రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నాచారం వాసి బాబీ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

Hyderabad Fire: వీడియో ఇదిగో, ఉప్పల్ సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం, భారీగా ఆస్తి నష్టం

Hazarath Reddy

హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతంలో ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న, సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి సమయంలో ఒక్కసారిగా నాలుగంతస్తుల భవనంలోని ముందు భాగంలో మంటలు చెలరేగాయి

Advertisement

YSRCP 2nd List : 27 మంది ఇంఛార్జులతో వైసీపీ రెండో జాబితా విడుదల...వారసులకు టిక్కెట్లు, ఎంపీలకు ఎమ్మెల్యే టిక్కెట్లు..

sajaya

వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల రెండో జాబితాను మంగళవారం విడుదల చేసింది. ముగ్గురు సిట్టింగ్ ఎంపీలను అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులుగా పేర్కొనగా, ముగ్గురు శాసనసభ్యులను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరారు.

YS Sharmila: వీడియో ఇదిగో, కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయాలని ఇది వరకే నిర్ణయించుకున్నాం, రేపు ఢిల్లీ వెళ్తున్నానని తెలిపిన వైఎస్ షర్మిల

Hazarath Reddy

కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయాలని ఇది వరకే నిర్ణయించుకున్నామని వైఎస్ షర్మిల తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 31 స్థానాల్లో 10వేలలోపు మెజారిటీతో గెలిచిన ప్రాంతాల్లో వైఎస్ఆర్టీపీ పార్టీ ప్రభావం ఎంతో ఉందని అన్నారు. రేపు ఢిల్లీ వెళ్తున్నా..వచ్చాక అన్ని విషయాలు మాట్లాడాతని తెలిపారు. కాగా జనవరి 4వ తేదీన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు షర్మిల ప్రకటించిన సంగతి విదితమే.

MLA Kavvampally Satyanarayana: మానకొండూర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే క‌వ్వంప‌ల్లి స‌త్య‌నారాయ‌ణ చిలిపి చేష్టలు వీడియో వైరల్, ఇంకా అధికారికంగా స్పందించని ఎమ్మెల్యే

Hazarath Reddy

క‌రీంన‌గ‌ర్ జిల్లా మాన‌కొండూరు ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే క‌వ్వంప‌ల్లి స‌త్య‌నారాయ‌ణ.. నియోజకవర్గంలో నిర్వ‌హించిన నూతన సంవత్సర వేడుక‌ల్లో అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు.కాంగ్రెస్ మహిళా కార్యకర్తలతో అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో వైరల్ అవుతోంది.

Andhra Pradesh Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, రాంగ్ రూట్‌లో వెళ్లి కారును ఢీకొట్టిన మరో కారు, 19 నెలల చిన్నారితో సహా ముగ్గురు మృతి

Hazarath Reddy

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తున్న ఎర్టిగా కారు టైర్ పంచర్ కావడంతో రాంగ్ రూట్‌లో దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న మరో ఎర్టీగా కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 19 నెలల చిన్నారి సహా ముగ్గురు మృత్యువాతపడ్డారు.

Advertisement

Dadi Veerabhadrarao Resigned YSRCP: వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆ పార్టీలోకి వెళతారని వార్తలు

Hazarath Reddy

వైసీపీకి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు. మంగళవారం తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి దాడి పంపించారు. తన అనుచరులతో కలిసి పార్టీని వీడుతున్నట్లు ఏకవాక్యంతో రాజీనామా లేఖ రాశారు

Dadi Veerabhadrarao Resigned YCP: అనకాపల్లిలో వైసీపీకి షాక్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజీనామా, త్వరలో రాజకీయ భవిష్యత్ ప్రకటన

Hazarath Reddy

Andhra Pradesh Shocker: విశాఖలో దారుణం, మైనర్ బాలికపై ప్రియుడితో సహా 9 మంది దారుణంగా అత్యాచారం, ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

ఆంధ్రాలోని విశాఖపట్నంలో 16 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఎనిమిది మందిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.డిసిపి శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిషాకు చెందిన మైనర్ బాలిక తల్లిదండ్రులకు డిసెంబర్ 18న అందిన మిస్సింగ్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు.

Telangana: పెండింగ్ చలానాలు ఈ వెబ్‌సైట్‌లో కడుతున్నారా, అయితే మీ డబ్బులు పోయినట్లే, అలర్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు

Hazarath Reddy

తెలంగాణలో పెండింగ్‌ చలాన్లను క్లియర్‌ చేయటానికి వాహనదారులకు భారీ రాయితీని ప్రభుత్వం ప్రకటించిన సంగతి విదితమే. అయితే దీన్ని అవకాశంగా తీసుకుని సైబర్‌ మోసగాళ్లు ఫేక్ వెబ్‌సైట్‌ క్రియేట్లతో రెచ్చిపోతున్నారు. www.echallantspolice.in పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ సృష్టించారు.

Advertisement

YSRTP Merge With Congress: పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించిన వైఎస్ షర్మిల, రేపు సాయంత్రం ఢిల్లీకి వైఎస్సార్టీపీ అధినేత్రి

Hazarath Reddy

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. వెఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రోజు పార్టీ ముఖ్య నేతలతో హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో భేటీ అయ్యారు షర్మిల. అనంతరం కాంగ్రెస్ లో పార్టీ విలీనంపై ప్రకటన చేశారు. ఈ నెల 4న పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. రేపు సాయంత్రం షర్మిల ఢిల్లీకి వెళ్లనున్నారు.

YS Raja Reddy’s Engagement: కుమారుడు వైఎస్‌ రాజారెడ్డి పెళ్లిపై షర్మిల ట్వీట్ ఇదిగో, ఈ నెల 18న నిశ్చితార్థ వేడుక, ఫిబ్రవరి 17న వివాహం

Hazarath Reddy

ఫిబ్రవరి 17న తన కుమారుడు వైఎస్‌ రాజారెడ్డి వివాహం జరగనున్నట్లు వైఎస్‌ షర్మిల (YS Sharmila) వెల్లడించారు. ఈ మేరకు ఆమె Xలో ట్వీట్‌ చేశారు. అట్లూరి ప్రియతో రాజారెడ్డికి వివాహం జరగనున్నట్లు తెలిపారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Andhra Pradesh Elections 2024: కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ షర్మిల ? సాధ్యాసాధ్యాలపై పార్టీ నేతలతో సమావేశం, పార్టీ విలీనంపై కీలక ప్రకటన చేసే అవకాశం

Hazarath Reddy

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఈ నెల 4న కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.

RGI Airport Self Check-In: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. శంషాబాద్ విమానాశ్రయంలో అందుబాటులోకి వచ్చిన సెల్ఫ్ చెకిన్ విధానం.. కారు పార్కింగ్ ప్రాంతంలోనే బోర్డింగ్, లగేజీ పాస్‌ లు పొందే సౌలభ్యం

Rudra

నూతన సంవత్సరం సందర్భంగా ప్రయాణికులకు శంషాబాద్ విమానాశ్రయం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. బోర్డింగ్ పాస్, లగేజీ కౌంటర్ల వద్ద క్యూలకు స్వస్థి పలికేలా సెల్ఫ్ చెకిన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.

Advertisement
Advertisement