రాష్ట్రీయం
Tirumala Special Entry Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఫిబ్రవరి కోటాకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు నేడే విడుదల.. ఉదయం 10 గంటలకు ఆన్ లైన్‌ లో అందుబాటులోకి..
Rudraకలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించాలనుకొంటున్న భక్తులకు శుభవార్త. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది.
Telangana Rains: తెలంగాణలో వచ్చే రెండు రోజుల్లో వర్షాలు.. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.. వాతావరణ శాఖ వెల్లడి
Rudraనిన్నటి నుంచి తెలంగాణలో వాతావరణం మొత్తం చల్లగా మారిపోయింది. వచ్చే రెండు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Tirumala: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు గమనిక, ఫిబ్రవరి కోటాకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు రేపు విడుదల, ఉదయం 10 గంటలకు ఆన్ లైన్‌లో అందుబాటులోకి..
Hazarath Reddyతిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు గమనిక. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ రేపు (నవంబరు 24) విడుదల చేయనుంది. ఫిబ్రవరి కోటాకు సంబంధించిన ఈ టికెట్లను రేపు 10 గంటలకు ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఫిబ్రవరి కోటాకు సంబంధించి వసతి గదుల కోటా టికెట్లను కూడా రేపు విడుదల చేయనున్నారు.
Andhra Pradesh: రాజధాని తరలింపులో కీలక పరిణామం, విశాఖ రిషికొండ మిలీనియం టవర్స్‌లో ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌ జవహర్‌ రెడ్డి
Hazarath Reddyఏపీలో విశాఖపట్నం నుంచే పరిపాలన అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విశాఖ రిషికొండ మిలీనియం టవర్స్‌లో మంత్రులు, అధికారుల క్యాంప్‌ కార్యాలయాలను కమిటీ గుర్తించింది.
Visakha Fishing Harbour Fire: విశాఖ పట్నం ఫిషింగ్‌ హార్బర్‌ అగ్ని ప్రమాదం, బాధితులకు రెండు రోజుల్లోనే పరిహారం చెక్కులను అందజేసిన ఏపీ ప్రభుత్వం
Hazarath Reddyవిశాఖ పట్నం ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్ని ప్రమాదం వల్ల నష్టపోయిన మత్స్యకారులను ఏపీ ప్రభుత్వం సత్వరమే ఆదుకుంది. ప్రమాదం జరిగిన రెండు రోజుల్లోనే బాధితులకు పరిహారం చెక్కులను అందజేసింది.
YSR Kalyanamasthu: కొత్తగా వివాహం చేసుకున్న జంటల అకౌంట్లలోకి రూ. 81.64 కోట్లు, వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా ఆర్థిక సాయాన్ని విడుదల చేసిన ఏపీ సీఎం జగన్
Hazarath Reddyఈ ఏడాది జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా కింద రూ. 81.64 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు.
Heavy Rain In Hyderabad:హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం, ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం, మరో రెండురోజుల పాటూ ఇదే పరిస్థితి ఉంటుందంటూ ఐఎండీ అలర్ట్
VNSహైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్‌లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో వర్షం (Rain) కురుస్తున్నది. నగరంలోని పలు ప్రాంతాలతో పాటూ మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాసబ్ ట్యాంక్, లక్డీకాపూల్, ఖైరతాబాద్, సోమాజిగూడ ప్రాంతాల్లో వర్షం కురిసింది.
Nara Lokesh Yuvagalam: నారా లోకేష్ యువగళం పునః ప్రారంభానికి ముహుర్తం ఖరారు, ఈ నెల 27 నుంచి జనంలోకి లోకేష్, విశాఖలో ముగియనున్న యువగళం పాదయాత్ర
VNSసెప్టెంబరు9న సీఐడీ పోలీసులు చంద్రబాబును అరెస్టు చేయడంతో లోకేష్ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. నారా లోకేష్‌ ఈ ఏడాది జనవరి 27న కుప్పం నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభించారు. చంద్రబాబును అరెస్టు చేయడంతో లోకేష్ పాదయాత్రకు (Nara Lokesh Yuvagalam Padayatra) తాత్కాలిక విరామం ప్రకటించారు.
Palnadu Crime: కూతుర్ని వేధిస్తున్నందుకు అల్లుడితో పాటూ కుటుంబం మొత్తాన్నినరికి చంపిన బంధువులు, పల్నాడులో కలకలం రేపిన మూడు హత్యలు, స్టేషన్‌లో లొంగిపోయిన నిందితులు
VNSపల్నాడు (Palnadu) జిల్లాలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్య గావించబడ్డారు. పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామంలో అర్ధరాత్రి ఒకే కుటుంబంలోని ముగ్గురిని సమీప బంధువులు దారుణంగా హత్య చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన అనంత సాంబశివరావు(50), అది లక్ష్మి(47), నరేష్(30)లను సమీప బంధువులు కత్తులతో విచక్షణారహితంగా నరికి (Killed) చంపారు.
Food Poison in Mid-day Meal: బల్లిపడిన మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్ధులు, 51 మందికి అస్వస్థత, పలువురి పరిస్థితి విషమం, అన్నమయ్య జిల్లాలో ఘటన
VNSఏపీలోని అన్నమయ్య జిల్లాలో విద్యార్థులకు ప్రాణాపాయం తప్పింది. సకాలంలో అస్వస్థతకు గురైన విద్యార్థులను (Students) ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో విద్యార్థులంతా కోలు కుంటున్నారు. జిల్లాలోని మదనపల్లె మండలం టేకుల పాలెం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం( Midday meals) వండి పెట్టారు.
Telangana Assembly Election 2023: కేటీఆర్‌ ఫోన్‌ కాల్‌ లీక్‌ వీడియో ఇదిగో, సిరిసిల్లలోనే ప్రచారానికి పోవాలంటే క్యాడర్‌ వెనకాడుతుందంటూ ఎక్స్‌లో ఆడియో షేర్‌ చేసిన కాంగ్రెస్‌
Hazarath Reddyకేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలోనే ప్రచారానికి పోవాలంటే క్యాడర్‌ వెనకాడుతుందని, ఫోన్లు చేసి బ్రతిమాలాడుకునే పరిస్థితికి బీఆర్ఎస్ వచ్చిందని విమర్శిస్తూ..కేటీఆర్‌ వాయిస్‌తో ఉన్న ఆడియోను పోస్టు చేసింది.కేటీఆర్‌ ఫోన్‌ కాల్‌ రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
Telangana Assembly Election 2023: వెలమలు, రెడ్లను తట్టుకుని కొల్లాపూర్ కోటలో బర్రెలక్క పాగా వేయగలదా, కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క ఎన్నికల సమరంపై ప్రత్యేక కథనం
Hazarath Reddyమరి కొద్ది రోజుల్లో జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఓ సామాన్య యువతి అధికార, ప్రతిపక్ష పార్టీలకు చుక్కలు చూపిస్తోంది. నిండా పాతికేళ్లు కూడా లేని ఈ అమ్మాయి ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా వార్తల్లో ప్రముఖంగా నిలుస్తోంది
Aadhar Enabled Payment System Fraud: ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ సాయంతో రూ. 10 లక్షల మేర మోసపూరిత లావాదేవీలు, ఆరుగురిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు
Hazarath Reddyపిన్ లేదా మొబైల్ పరికరం నమోదు చేయకుండా చిన్న లావాదేవీలు చేయడానికి ఉపయోగపడే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AEPS)ను అనేక మోసపూరిత లావాదేవీలు చేయడానికి ఒక ముఠా దుర్వినియోగం చేసింది. ఈ ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారని జాయింట్ కమిషనర్ Gajarao Bhupal చెప్పారు.
Barrelakka Manifesto: నిరుద్యోగుల అంశమే లక్ష్యంగా బర్రెలక్క మేనిఫెస్టో, ఏడు ప్రధాన అంశాలతో ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసిన బర్రెలక్క అలియాస్ శిరీష
Hazarath Reddyకొల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా పోటీ చేస్తున్న బర్రెలక్క తాజాగా తన మేనిఫెస్టోను విడుదల చేసింది. కొల్లాపూర్ లో తనను గెలిపిస్తే ఏం చేస్తాననే అనే విషయంపై తక్కువ అంశాలతో మేనిఫెస్టోను ప్రకటించింది. మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలతో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తోంది.
Barrelakka Crying Video: తమ్ముడిపై దాడి, భోరున విలపించిన బర్రెలక్క, తాను ఏం పాపం చేశానని ఇలా దాడులు చేస్తున్నారంటూ కన్నీరు పెట్టుకున్న కొల్లాపూర్ స్వతంత్య్ర అభ్యర్థి
Hazarath Reddyఓట్లు చీల్చుతాననే భయంతోనే తనపై కొంత మంది రాజకీయ నాయకులు దాడి చేపించారని బర్రెలక్క ఆరోపించింది. అయితే.. దాడి చేసింది ఏ పార్టీ వాళ్లు అన్నది తెలిదయని చెప్పింది. రాజకీయాలు అంటేనే రౌడీయిజం అని చాలా మంది అనేవారని.. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
JD Lakshminarayana on Barrelakka: బర్రెలక్క కుటుంబానికి వెంటనే రక్షణ కల్పించండి, తెలంగాణ డీజీపీని కోరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించి సంచలనం రేపిన సామాన్య యువతి బర్రెలక్క అలియాస్ శిరీష సోదరుడిపై దాడి కలకలం రేపిన సంగతి విదితమే. దీనిపై శిరీష సోదరుడిపై దాడిని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఖండించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
Telangana Elections 2023: వీడియో ఇదిగో, అక్బ‌రుద్దీన్ ఓవైసీపై కేసు నమోదు, డ్యూటీలో ఉన్న పోలీసు అధికారిని దూషించారనే అభియోగాలపై కేసు బుక్
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పోలీస్ అధికారిని దూషించారనే ఆరోపణల్లో భాగంగా ఎంఐఎం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ(Akbaruddin Owaisi)పై సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు ఓ వీడియో వైరల్‌ కావడం కూడా తెలిసిందే.
PM Modi Telangana Tour Schedule: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఇదిగో, ఈ నెల 27వ తేదీన హైదరాబాద్‌లో రోడ్ షో..
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారం కూడా కీలకదశకు చేరుకుంది. ఎన్నికలు జరుగుతున్న ఇతర రాష్ట్రాల్లో ప్రచార గడువు ముగిసిన దృష్ట్యా అన్ని పార్టీలకు చెందిన అగ్రనేతలు తెలంగాణలో ప్రచారం కోసం క్యూ కడుతున్నారు.
IMD Weather Alert: భారీ వర్షాలు, ఆ రెండు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్, స్కూళ్లు మూసివేతకు సర్కారు ఆదేశాలు, తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల పాటు జోరు వానలు
Hazarath Reddyఈశాన్య రుతుపవనాలు తీవ్రతరం కావడంతో దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. బుధవారం భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రతగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.
Hyderabad: గత నెల రోజుల నుంచి హాస్టల్లో నీళ్లు రావడం లేదంటూ రోడ్డెక్కిన నిజాం కళాశాల విద్యార్థులు, అదుపులోకి తీసుకున్న అబిడ్స్ పోలీసులు
Hazarath Reddyలేడిస్ హాస్టల్‌లో గత నెల రోజులుగా సరైన నీటి సదుపాయం లేదని, కళాశాల సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ హైదరాబాద్‌లోని నిజాం కళాశాల విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అబిడ్స్ పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.వీడియోలు ఇవిగో..