రాష్ట్రీయం

TS DSC 2023 Postponed: తెలంగాణలో డీఎస్సీ వాయిదా, పరీక్షలు రీ షెడ్యూల్ తేదీ త్వరలో ప్రకటిస్తామని తెలిపిన విద్యాశాఖ

Hazarath Reddy

తెలంగాణలో డీఎస్సీ నియామక పరీక్ష వాయిదా పడింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేస్తూ శుక్రవారం(అక్టోబర్‌ 13న) విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది . షెడ్యూల్‌ ప్రకారం.. నవంబర్‌ 20 నుంచి 30వ తారీఖుల మధ్య డీఎస్సీ పరీక్షలు జరగాల్సి ఉంది.

Sandeep Shandilya: హైద‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్‌గా సందీప్ శాండిల్య, ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి

Hazarath Reddy

హైద‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్‌గా సందీప్ శాండిల్య నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు. ప్ర‌స్తుతం సందీప్ శాండిల్య పోలీసు అకాడ‌మీ డైరెక్ట‌ర్‌గా ఉన్నారు. ఈసీ ఆదేశాల‌కు అనుగుణంగా ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి

Telangana Assembly Elections 2023: తెలంగాణాలో కొత్తగా నియమితులైన ఎస్పీలు, కమిషనర్ల లిస్ట్ ఇదిగో, పెండింగ్‌లో హైదరాబాద్‌ సీపీ పోస్ట్

Hazarath Reddy

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కొత్తగా ఐపీఎస్, ఐఏఎస్‌ అధికారులను ఎంపిక చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితా నుంచి ఒక్కో పోస్టుకు ఒకరిని ఎంపిక చేసి.. వివరాలను రాష్ట్రానికి పంపించింది. దీంతో తెలంగాణా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బ‌దిలీకి సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Chandrababu Health Update: చంద్రబాబు కేజీ బరువు పెరిగి ఆరోగ్యంగా ఉన్నారు, క్లారిటీ ఇచ్చిన ఏపీ జైళ్లశాఖ డీఐజీ రవి కిరణ్‌, ఆయన ఆరోగ్యంపై ఎవరేమన్నారంటే..

Hazarath Reddy

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్న సంగతి విదితమే. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ఆందోళన కలుగుతుందంటూ టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే దీనిపై ఏపీ జైళ్లశాఖ డీఐజీ రవి కిరణ్‌ క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Skill Development Scam Case: సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ మంగళవారానికి వాయిదా, వాడీవేడిగా కొనసాగిన వాదనలు

Hazarath Reddy

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు శుక్రవారం వాడీవేడిగా కొనసాగాయి. ఈ కేసులో సెక్షన్‌ 17ఏ వర్తిస్తుందని చంద్రబాబు తరఫు న్యాయవాది వాదించగా.. ఆ సెక్షన్‌ వర్తించదని సీఐడీ తరఫు న్యాయవాది వాదించారు

Israel-Palestine Conflict: పాలస్తీనాకు మద్దతుగా హైదరాబాద్‌లో ప్రజలు నిరసన, వీడియో ఇదిగో

Hazarath Reddy

తెలంగాణ: ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో పాలస్తీనాకు మద్దతుగా హైదరాబాద్‌లో ప్రజలు నిరసన చేపట్టారు.

Ponnala Lakshmaiah Resigns: కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్, రాజీనామా చేసిన సీనియర్ నేత పొన్నాల లక్షయ్య , సొంత పార్టీలోనే పరాయి వ్యక్తులమయ్యామని ఆవేదన

Hazarath Reddy

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్షయ్య బిగ్ షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ కు ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయని ఆయన అన్నారు

Dasara Holidays in AP: ఏపీ పాఠశాలలకు రేపటి నుంచి దసరా సెలవులు, అక్టోబరు 14 నుంచి 24 వరకూ 11 రోజుల పాటు హాలీడేస్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

Hazarath Reddy

ఏపీలోని పాఠశాలలకు శనివారం నుంచి దసరా సెలవులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబరు 14 నుంచి 24 వరకూ దసరా సెలవులను ఖరారు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. తిరిగి అక్టోబరు 25న పాఠశాలలు తెరుచుకుంటాయని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది.

Advertisement

Andhra Pradesh: విశాఖ రాజధానిగా ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు, కృష్ణాబోర్డు కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం, నార్త్‌కోస్ట్‌ సీఈ కార్యాలయం ప్రాంగణంలోకి ఆఫీస్ షిఫ్టింగ్

Hazarath Reddy

కృష్ణాబోర్డు కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అన్ని వసతులతో కూడిన భవనాన్ని సిద్ధం చేసింది. తక్షణమే హైదరాబాద్‌ నుంచి విశాఖకు కార్యాలయాన్ని తరలించాలని బోర్డు చైర్మన్‌ శివ్‌­నందన్‌కుమార్‌కు జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ లేఖ రాశారు.

Dengue in Telangana: తెలంగాణలో విజృభిస్తున్న డెంగ్యూ జ్వరాలు, జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రాణాలు గాల్లో కలిసి పోతాయని హెచ్చరిస్తున్న వైద్యులు

Hazarath Reddy

తెలంగాణలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. సెప్టెంబరులో కేసులు తారస్థాయికి చేరుకోగా, ఈ నెలలోనూ కేసుల్లో పెరుగదల కనిపిస్తోంది. వ్యాధి లక్షణాలు పెద్దగా లేకుండానే తీవ్రస్థాయికి చేరి ప్రాణాంతకంగా మారుతున్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి.

Hyderabad Shocker: బోయిన్‌పల్లిలో దారుణం, ఇద్దరు కుమార్తెలతో కలిసి తండ్రి ఆత్మహత్య, అన్ని కోణాల్లో విచారణ సాగిస్తున్న పోలీసులు

Hazarath Reddy

సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భవానీనగర్‌ కాలనీకి చెందిన ఓ తండ్రి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా కుటుంబ కలహాలతోనే వీరు ప్రాణాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Angallu Rioting Case: అంగళ్లు కేసులో చంద్రబాబుకు ఊరట, ముందస్తు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు

Hazarath Reddy

అంగళ్లు ఘటనలో అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పును వెలువరించింది.ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది.

Advertisement

Chandrababu Health Update: చంద్రబాబు హెల్త్ లేటెస్ట్ అప్‌డేట్ ఇదిగో, డీహైడ్రేషన్‌తో పాటు స్కిన్ అలర్జీతో బాధపడుతున్న టీడీపీ అధినేత, ఎటువంటి ఆందోళన అవసరం లేదని తెలిపిన వైద్యులు

Hazarath Reddy

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో జ్యుడిషియల్‌ రిమాండ్‌ అనుభవిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు డీహైడ్రేషన్‌తో పాటు స్కిన్ అలర్జీతో బాధపడుతున్నారు.ఆయన చర్మంపై పలు చోట్ల దద్దుర్లు, ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు సమాచారం.

Dasara Holidays: నేటి నుంచి పాఠశాలలకు బతుకమ్మ, దసరా సెలవులు.. ఈ నెల 26న తిరిగి ప్రారంభం కానున్న ప్రభుత్వ, ప్రయివేటు స్కూల్స్

Rudra

నేటి నుంచి (శుక్రవారం) తెలంగాణలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు దసరా సెలవులను ప్రకటించారు. తిరిగి ఈ నెల 26న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి.

Vinod Reddy Resigns Janasena: నెల్లూరులో జనసేనకు భారీ షాక్, పార్టీకి కేతంరెడ్డి వినోద్‌రెడ్డి రాజీనామా, సీటు లేదని తేల్చి చెప్పడంతో కీలక నిర్ణయం

Hazarath Reddy

జనసేనకు తాను రాజీనామా చేస్తున్నానని ఆ పార్టీ నేత కేతంరెడ్డి వినోద్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జనసేన కోసం నగరంలో ఎంతో కృషి చేశానని, నెల్లూరు నగర నియోజకవర్గానికి అభ్యర్థిగా నారాయణను టీడీపీ మూడు నెలల క్రితం ప్రకటించిందని పేర్కొన్నారు.

Andhra Pradesh Investments Row: వీడియో ఇదిగో, సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన టెక్‌ మహీంద్ర ఎండీ, సీఈవో సీపీ గుర్నాని, హోటల్ రంగంలో భారీ పెట్టుబడులు

Hazarath Reddy

సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన టెక్‌ మహీంద్ర ఎండీ, సీఈవో సీపీ గుర్నాని. ఏపీలో విశాఖపట్నం సహా మూడు ప్రాంతాల్లో మూడు 5 స్టార్‌ నుంచి 7 స్టార్‌ హోటల్స్‌ నిర్మాణానికి సంసిద్దత వ్యక్తం చేసిన మహీంద్ర గ్రూప్‌.ఒక్కో హోటల్‌ నిర్మాణానికి రూ. 250 కోట్లు ఖర్చు…

Advertisement

Etela Rajendar vs CM KCR: వీడియో ఇదిగో, గజ్వేల్లో కేసీఆర్ మీద పోటీ చేసేది నేనే, హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌, హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంతో పాటు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపైనా తాను పోటీ చేస్తానని ప్రకటించారు.

CP Gurnani Meets CM Jagan: విశాఖలో టెక్ మహీంద్రా భారీ పెట్టుబడులు, సీఎం జగన్‌ను కలిసిన సీఈవో సీపీ గుర్నాని, వచ్చే 2 నెలల్లో శంకుస్ధాపనకు రెడీ అవుతున్నట్లు వెల్లడి

Hazarath Reddy

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని టెక్‌ మహీంద్ర ఎండీ, సీఈవో సీపీ గుర్నాని గురువారం తాడేపల్లిలోని సీఎం నివాసంలో కలిశారు. ఏపీలో విశాఖపట్నం సహా మూడు ప్రాంతాల్లో మూడు 5 స్టార్‌ నుంచి 7 స్టార్‌ హోటల్స్‌ నిర్మాణానికి మహీంద్రా గ్రూప్‌ సంసిద్దత వ్యక్తం చేసింది.

CM Jagan on Pawan Kalyan Marriages: పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్లపై సీఎం జగన్ కామెంట్స్ వీడియో ఇదిగో, ఇప్పటికే లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఇల్లాలు అంటూ..

Hazarath Reddy

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మూడు పెళ్లిళ్లపై సీఎం జగన్‌ మరోసారి విమర్శలకు దిగారు. కాకినాడ జిల్లా సామర్లకోట సభలో సీఎం మాట్లాడుతూ ‘‘చంద్రబాబు, ఆయనను సమర్థించే నాయకులెవరూ ఏపీలో ఉండరు.

Angallu Rioting Case: అంగళ్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్, స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో నారా లోకేశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను డిస్పోజ్‌ చేసిన హైకోర్టు

Hazarath Reddy

అంగళ్లు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ పూర్తైంది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేస్తూ శుక్రవారం వెల్లడిస్తామని తెలిపింది.

Advertisement
Advertisement