రాష్ట్రీయం
Skill Development Scam Case: సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ మంగళవారానికి వాయిదా, వాడీవేడిగా కొనసాగిన వాదనలు
Hazarath Reddyస్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు శుక్రవారం వాడీవేడిగా కొనసాగాయి. ఈ కేసులో సెక్షన్‌ 17ఏ వర్తిస్తుందని చంద్రబాబు తరఫు న్యాయవాది వాదించగా.. ఆ సెక్షన్‌ వర్తించదని సీఐడీ తరఫు న్యాయవాది వాదించారు
Israel-Palestine Conflict: పాలస్తీనాకు మద్దతుగా హైదరాబాద్‌లో ప్రజలు నిరసన, వీడియో ఇదిగో
Hazarath Reddyతెలంగాణ: ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో పాలస్తీనాకు మద్దతుగా హైదరాబాద్‌లో ప్రజలు నిరసన చేపట్టారు.
Ponnala Lakshmaiah Resigns: కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్, రాజీనామా చేసిన సీనియర్ నేత పొన్నాల లక్షయ్య , సొంత పార్టీలోనే పరాయి వ్యక్తులమయ్యామని ఆవేదన
Hazarath Reddyఅసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్షయ్య బిగ్ షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ కు ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు. అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయని ఆయన అన్నారు
Dasara Holidays in AP: ఏపీ పాఠశాలలకు రేపటి నుంచి దసరా సెలవులు, అక్టోబరు 14 నుంచి 24 వరకూ 11 రోజుల పాటు హాలీడేస్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
Hazarath Reddyఏపీలోని పాఠశాలలకు శనివారం నుంచి దసరా సెలవులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబరు 14 నుంచి 24 వరకూ దసరా సెలవులను ఖరారు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. తిరిగి అక్టోబరు 25న పాఠశాలలు తెరుచుకుంటాయని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది.
Andhra Pradesh: విశాఖ రాజధానిగా ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు, కృష్ణాబోర్డు కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం, నార్త్‌కోస్ట్‌ సీఈ కార్యాలయం ప్రాంగణంలోకి ఆఫీస్ షిఫ్టింగ్
Hazarath Reddyకృష్ణాబోర్డు కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అన్ని వసతులతో కూడిన భవనాన్ని సిద్ధం చేసింది. తక్షణమే హైదరాబాద్‌ నుంచి విశాఖకు కార్యాలయాన్ని తరలించాలని బోర్డు చైర్మన్‌ శివ్‌­నందన్‌కుమార్‌కు జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ లేఖ రాశారు.
Dengue in Telangana: తెలంగాణలో విజృభిస్తున్న డెంగ్యూ జ్వరాలు, జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రాణాలు గాల్లో కలిసి పోతాయని హెచ్చరిస్తున్న వైద్యులు
Hazarath Reddyతెలంగాణలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. సెప్టెంబరులో కేసులు తారస్థాయికి చేరుకోగా, ఈ నెలలోనూ కేసుల్లో పెరుగదల కనిపిస్తోంది. వ్యాధి లక్షణాలు పెద్దగా లేకుండానే తీవ్రస్థాయికి చేరి ప్రాణాంతకంగా మారుతున్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి.
Hyderabad Shocker: బోయిన్‌పల్లిలో దారుణం, ఇద్దరు కుమార్తెలతో కలిసి తండ్రి ఆత్మహత్య, అన్ని కోణాల్లో విచారణ సాగిస్తున్న పోలీసులు
Hazarath Reddyసికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భవానీనగర్‌ కాలనీకి చెందిన ఓ తండ్రి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా కుటుంబ కలహాలతోనే వీరు ప్రాణాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
Angallu Rioting Case: అంగళ్లు కేసులో చంద్రబాబుకు ఊరట, ముందస్తు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు
Hazarath Reddyఅంగళ్లు ఘటనలో అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పును వెలువరించింది.ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది.
Chandrababu Health Update: చంద్రబాబు హెల్త్ లేటెస్ట్ అప్‌డేట్ ఇదిగో, డీహైడ్రేషన్‌తో పాటు స్కిన్ అలర్జీతో బాధపడుతున్న టీడీపీ అధినేత, ఎటువంటి ఆందోళన అవసరం లేదని తెలిపిన వైద్యులు
Hazarath Reddyస్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో జ్యుడిషియల్‌ రిమాండ్‌ అనుభవిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు డీహైడ్రేషన్‌తో పాటు స్కిన్ అలర్జీతో బాధపడుతున్నారు.ఆయన చర్మంపై పలు చోట్ల దద్దుర్లు, ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు సమాచారం.
Dasara Holidays: నేటి నుంచి పాఠశాలలకు బతుకమ్మ, దసరా సెలవులు.. ఈ నెల 26న తిరిగి ప్రారంభం కానున్న ప్రభుత్వ, ప్రయివేటు స్కూల్స్
Rudraనేటి నుంచి (శుక్రవారం) తెలంగాణలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు దసరా సెలవులను ప్రకటించారు. తిరిగి ఈ నెల 26న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి.
Vinod Reddy Resigns Janasena: నెల్లూరులో జనసేనకు భారీ షాక్, పార్టీకి కేతంరెడ్డి వినోద్‌రెడ్డి రాజీనామా, సీటు లేదని తేల్చి చెప్పడంతో కీలక నిర్ణయం
Hazarath Reddyజనసేనకు తాను రాజీనామా చేస్తున్నానని ఆ పార్టీ నేత కేతంరెడ్డి వినోద్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జనసేన కోసం నగరంలో ఎంతో కృషి చేశానని, నెల్లూరు నగర నియోజకవర్గానికి అభ్యర్థిగా నారాయణను టీడీపీ మూడు నెలల క్రితం ప్రకటించిందని పేర్కొన్నారు.
Andhra Pradesh Investments Row: వీడియో ఇదిగో, సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన టెక్‌ మహీంద్ర ఎండీ, సీఈవో సీపీ గుర్నాని, హోటల్ రంగంలో భారీ పెట్టుబడులు
Hazarath Reddyసీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన టెక్‌ మహీంద్ర ఎండీ, సీఈవో సీపీ గుర్నాని. ఏపీలో విశాఖపట్నం సహా మూడు ప్రాంతాల్లో మూడు 5 స్టార్‌ నుంచి 7 స్టార్‌ హోటల్స్‌ నిర్మాణానికి సంసిద్దత వ్యక్తం చేసిన మహీంద్ర గ్రూప్‌.ఒక్కో హోటల్‌ నిర్మాణానికి రూ. 250 కోట్లు ఖర్చు…
Etela Rajendar vs CM KCR: వీడియో ఇదిగో, గజ్వేల్లో కేసీఆర్ మీద పోటీ చేసేది నేనే, హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌, హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంతో పాటు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపైనా తాను పోటీ చేస్తానని ప్రకటించారు.
CP Gurnani Meets CM Jagan: విశాఖలో టెక్ మహీంద్రా భారీ పెట్టుబడులు, సీఎం జగన్‌ను కలిసిన సీఈవో సీపీ గుర్నాని, వచ్చే 2 నెలల్లో శంకుస్ధాపనకు రెడీ అవుతున్నట్లు వెల్లడి
Hazarath Reddyముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని టెక్‌ మహీంద్ర ఎండీ, సీఈవో సీపీ గుర్నాని గురువారం తాడేపల్లిలోని సీఎం నివాసంలో కలిశారు. ఏపీలో విశాఖపట్నం సహా మూడు ప్రాంతాల్లో మూడు 5 స్టార్‌ నుంచి 7 స్టార్‌ హోటల్స్‌ నిర్మాణానికి మహీంద్రా గ్రూప్‌ సంసిద్దత వ్యక్తం చేసింది.
CM Jagan on Pawan Kalyan Marriages: పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్లపై సీఎం జగన్ కామెంట్స్ వీడియో ఇదిగో, ఇప్పటికే లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఇల్లాలు అంటూ..
Hazarath Reddyజనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మూడు పెళ్లిళ్లపై సీఎం జగన్‌ మరోసారి విమర్శలకు దిగారు. కాకినాడ జిల్లా సామర్లకోట సభలో సీఎం మాట్లాడుతూ ‘‘చంద్రబాబు, ఆయనను సమర్థించే నాయకులెవరూ ఏపీలో ఉండరు.
Angallu Rioting Case: అంగళ్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్, స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో నారా లోకేశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను డిస్పోజ్‌ చేసిన హైకోర్టు
Hazarath Reddyఅంగళ్లు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ పూర్తైంది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేస్తూ శుక్రవారం వెల్లడిస్తామని తెలిపింది.
Telangana Shocker: తీసుకున్న రూ. 4 లక్షల అప్పు తిరిగి ఇవ్వని అత్త, రివాల్వర్‌తో కాల్చి చంపిన కానిస్టేబులైన అల్లుడు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఅత్తకు 4 లక్షల రూపాయల అప్పు ఇచ్చిన కానిస్టేబుల్ ప్రసాద్ తిరిగి ఇవ్వమని అడగడంతో ఇవ్వలేదని అత్తను రివాల్వర్‌తో కాల్చి చంపాడు.రామగుండం పోలీస్ కమిషనరేటు పరిధిలోని కొత్తకోట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు ప్రసాద్.
Telangana Shocker: పుస్తకాలకు తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేదని బాలుడు ఆత్మ‌హ‌త్య, త‌న ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని సూసైడ్
Hazarath Reddyభ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా చంద్రుగొండ మండ‌లం బెండ‌ల‌పాడులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పుస్త‌కాల‌కు డబ్బులు ఇవ్వ‌లేద‌ని ఓ బాలుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. బెండ‌ల‌పాడు గ్రామానికి చెందిన సుధీర్ బాబు(11) పుస్త‌కాల కోసం త‌న త‌ల్లిదండ్రుల‌ను డ‌బ్బులు అడిగాడు.
YSR Jagananna Colonies: జగనన్న కాలనీల్లో కడుతున్నవి ఇళ్లు కాదు ఊళ్లు, రాష్ట్రంలో 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపిన సీఎం జగన్
Hazarath Reddyరెండేళ్లలోనే పేదల సొంతింటి కలను నెరవేర్చినట్లు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలను కేటాయించామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల జగనన్న కాలనీలు ఏర్పాటు అవుతున్నాయని తెలిపారు.
Skill Development Scam Case: చంద్రబాబుకు హైకోర్టులో చుక్కెదురు, బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఈ నెల 17కు వాయిదా వేసిన ధర్మాసనం
Hazarath Reddyస్కిల్ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. చంద్రబాబు పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీని హైకోర్టు ఆదేశిస్తూ.. విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది