రాష్ట్రీయం
Telangana: కూకట్‌పల్లిలో తీవ్ర విషాదం, నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి ఇద్దరు కార్మికులు మృతి
Hazarath Reddyకూకట్ పల్లిలోని కే.పి.హెచ్.బి కాలనీ అడ్డగుట్టలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది.. నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు.మృతి చెందిన కార్మికులు ఒడిశా రాష్ట్రానికి చెందిన సంతోష్, సోనియాగా గుర్తించారు.
Constable Dies of Heart Attack: వీడియో ఇదిగో, గుండెపోటుతో కుప్పకూలిన కానిస్టేబుల్, సహచరులు వేగంగా స్పందించి సీపీఆర్ చేసినా దక్కని ప్రాణాలు
Hazarath Reddyగుండెపోటుకు గురైన హెడ్ కానిస్టేబుల్ సుబ్బయ్య మృతి చెందారు. కడప జిల్లా - సిద్దవటం మండలం భాకరాపేట 11వ ఏపీఎస్పీ 1994 బ్యాచ్ కు చెందిన సుబ్బయ్యకు ఇవాళ ఉదయం ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. గుర్తించిన సహచరులు డాక్టర్ల సాయంతో సీపీఆర్ చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది.
Tomato Prices Down: వీడియోలు ఇవిగో, ధరలు లేక టమాటాలను పారబోసి వెళుతున్న రైతులు, మొన్నటి వరకు చుక్కలు తాకిన ధరలు
Hazarath Reddyమొన్నటి వరకు ఆకాశాన్ని తాకిన టమాటా ధరలు (Tomato Prices) ఒక్కసారిగా పతనమయ్యాయి. మంగళవారం (సెప్టెంబర్ 5న) టమాటా ధరలు పాతాళానికి పడిపోయాయి. కర్నూల్ జిల్లా పత్తికొండ వ్యవసాయి మార్కెట్‌లో టమాటా ధరలు మరింత పడిపోయాయి.
Viral Video: బాహుబలి సీన్ రిపీట్ వీడియో ఇదిగో, తీవ్ర జ్వరంతో ఉన్న చంటి బిడ్డను చేతులపై ఎత్తుకుని వాగు దాటించిన బాబాయి, ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స
Hazarath Reddyతెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో పాత వీడియో సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియో విషయంలోకి వెళ్తే.. లక్మాపూర్‌ గ్రామానికి చెందిన రాథోడ్‌ కృష్ణ, సుజాత దంపతుల కూతురు (8 నెలలు) మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది.
Sanatana Dharma Remark Row: విజయవాడలో సనాతన ధర్మం ప్రకంపనలు, స్టాలిన్‌ను చెప్పుతో కొట్టిన వారికి రూ. 10 లక్షల నగదు బహుమతిని ప్రకటించిన జన జాగరణ సమితి
Hazarath Reddyఉదయనిధి స్టాలిన్ సనాతనధర్మ రిమార్క్ ప్రకంపనలు ఏపీలోని విజయవాడకు చేరుకున్నాయి. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను చెప్పుతో కొట్టిన వారికి రూ. 10 లక్షల నగదు బహుమతిని ప్రకటిస్తూ జన జాగరణ సమితి నగరం అంతటా పోస్టర్లు ఏర్పాటు చేసింది. వీడియో ఇదిగో..
Scorpion Festival: కర్నూలు జిల్లాలో ఘనంగా తేళ్ల పండగ వేడుక, తేళ్లతో దేవుడికి నైవేద్యం సమర్పించిన భక్తులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో జరిగిన తేలు పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. పండగలోకి వెళితే..ఈ గ్రామ ప్రజలు తేలు కనిపిస్తే అదృష్టంగా భావిస్తారు. అంతేకాదు దాన్ని చేతిలో పట్టుకుని దేవుడికి నైవేద్యంగా సమర్సిస్తారు. ఇది వారి ఆచారం.
Bandi Sanjay: వీడియో ఇదిగో, పిల్లాడితో ఫుట్‌బాల్ గేమ్ ఆడిన బండి సంజయ్, నిఖార్సైన హిందువని చెప్పుకున్న కేసీఆర్‌ స్టాలిన్ వ్యాఖ్యలపై ఎందుకు స్పందించరని ఫైర్
Hazarath Reddyతెలంగాణ రాష్ట్ర మాజీ బీజేపీ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ అమెరికాలో పర్యటనలో ఉన్న సంగతి విదితమే. తాజాగా ఆయన ఎక్స్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు, పిల్లవాడితో పుట్ బాల్ గేమ్ ఆడుతూ సరదాగా గడుపుతున్న వీడియోని తన ఖాతాలో పంచుకున్నారు.
TTD: నడక దారిన వెళ్లే భక్తులకు కర్రలు పంచిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, పని కట్టుకొని విమర్శలు చేసే వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని వెల్లడి
Hazarath Reddyతిరుమల నడక దారిన వెళ్లే భక్తులకు టీటీడీ చైర్మన్ కర్రలు పంచారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజు నుండి చేతికర్రలు పంపిణి చేస్తున్నాం. కర్రలు ఇచ్చినంత మాత్రన మేము చేతులు దులుపుకుంటునట్లు కాదు. యాత్రికులకు తోడుగా రక్షకులు కూడా నడుస్తారు. రొటేషన్ పద్దతిలో కర్రలను వాడుతాం. పని కట్టుకొని విమర్శలు చేసే వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
Chandrababu Naidu: వీడియో ఇదిగో, తెలంగాణలో ఒక ఎకరం అమ్మి ఆంధ్రలో వందల ఎకరాలు కొనొచ్చు, చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
Hazarath Reddyహైదరాబాద్‌లో 100 కోట్లకు ఎకరం పోతుంది. ఒకప్పుడు ఆంధ్రలో ఒక ఎకరం అమ్మి తెలంగాణలో రెండు, మూడు ఎకరాలు కొనే వాళ్ళం. ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మి ఆంధ్రలో వందల ఎకరాలు కొనొచ్చు. అది సంపద సృష్టించే విధానమని చంద్రబాబు నాయుడు అన్నారు.
Cheetah Trapped: తిరుమల నడకమార్గంలో చిక్కిన మరో చిరుత, రెండు నెలల్లో ఐదు చిరుతలను బంధించిన అధికారులు, నడకదారి భక్తులకు చేతికర్రల పంపిణీ షురూ
VNSఇప్పటికే రెండు నెలల కాలం వ్యవధిలో తిరుమల నడక మార్గం (Tirumala Walkway) లో నాలుగు చిరుతలను అధికారులు బంధించారు. తాజాగా గురువారం తెల్లవారుజామున ఐదో చిరుత అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కుకుంది.
Palamuru Rangareddy Project: పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు, ఈ నెల 16న నార్లాపూర్‌ ఇన్‌టేక్ నుంచి బాహుబలి పంపు ద్వారా కృష్ణాజలాల విడుదల
VNSపాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల (Palamuru Rangareddy Project) పథకాన్ని ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ (CM KCR) నిర్ణయించారు. ఇందులో భాగంగా నార్లాపూర్ ఇన్‌టేక్ నుంచి ఈ నెల 16న మధ్యాహ్నం బటన్ నొక్కి బాహుబలి పంపు ద్వారా కృష్ణా జలాలను సీఎం ఎత్తిపోయనున్నారు.
Hyderabad Rains: అర్ధరాత్రి వరకు హైదరాబాద్‌లో కుండపోత వర్షం, పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశముందని హెచ్చరిక, జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తం
VNSహైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం (Hyderabad Rains) కురుస్తోంది. అర్ధరాత్రి వరకు కుండపోత వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో జీహెచ్‌ఎంసీ (GHMC) మాన్ సూన్ టీమ్స్ అప్రమత్తమయ్యాయి.
Chandrababu Naidu: రెండు తెలుగు రాష్ట్రాలకు సౌత్ కొరియాకు, నార్త్ కొరియాకు ఉన్నంత తేడా వచ్చింది, చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
Hazarath Reddyటీడీపీ అధినేత చంద్రబాబు రెండు తెలుగు రాష్ట్రాల సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు లేవని బద్ద శత్రువుల్లా ఎప్పుడూ కొట్లాడుకుంటాయనే రీతిలో మాట్లాడుతూ.. తెలంగాణకు, ఆంధ్రకు.. సౌత్ కొరియాకు, నార్త్ కొరియాకు ఉన్నంత తేడా వచ్చిందని అన్నారు. వీడియో ఇదిగో
Chandrababu Naidu: చంద్రబాబు అరెస్ట్ సంచలన వ్యాఖ్యల వీడియో ఇదిగో, నిప్పులా బతికాను నేను ఏతప్పూ చేయలేదు, అయినా రేపో మాపో నన్ను అరెస్ట్ చేస్తారని వెల్లడి
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి జగన్‌ పాలనలో అన్నీ అరాచకాలే అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఉపాధ్యాయులు, న్యాయవాదులు, మేధావులు, విద్యావంతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
Hyderabad Floods Videos: హైదరాబాద్ వరద బీభత్సం ఎలా ఉందో వీడియోల్లో చూడండి, మ్యాన్‌ హోళ్లు ఓపెన్‌ చేసినా చెరువులను తలపించిన రోడ్లు
Hazarath Reddyఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కుండపోతగా కురిసిన వర్షం హైదరాబాద్ నగరంలో బీభత్సం సృష్టించింది. జన జీవనాన్ని అతలాకుతలం చేసింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయాయి.
Weather Forecast: బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు, మ‌రో ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్
Hazarath Reddyతెలుగు రాష్ట్రాలను మళ్లీ వర్షాలు వణికిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. మరో ఐదు రోజులపాటు వర్షాలు పడతాయని, ముఖ్యంగా గురువారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ మంగళవారం ప్రకటించింది.
Free Wi-Fi in TSRTC Buses: టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఫ్రీ వైఫై
Hazarath Reddyతెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు TSRTC గుడ్ న్యూస్ చెప్పింది. బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఫ్రీ వైఫై సదుపాయం కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చినట్టు ఆర్టీసీఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.
Hyderabad Rains: విషాదకర వీడియో ఇదిగో, భారీ వర్షాలకు గల్లంతైన ఆ మహిళ జాడ నాలుగు రోజుల తర్వాత, మూసీ నదిలో కొట్టుకువచ్చిన లక్ష్మి మృతదేహం
Hazarath Reddyనాలుగు రోజుల క్రితం హుస్సేన్‌ సాగర్‌ నాలాలో గల్లంతైన మహిళ మృతి చెందిది. మూసీ నదిలోకి లక్ష్మి మృతదేహం కొట్టుకొచ్చింది. మూసారాంబాగ్‌ బ్రిడ్జి దగ్గర మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని లక్ష్మీ కూతురు గుర్తించినట్లు తెలుస్తోంది
Road Accident Video: వీడియో ఇదిగో, మనిషి చనిపోతున్నా ఎవరు పట్టించుకోలేదు, కావాలంటే విశాఖపట్నంలో జరిగిన ప్రమాదం వీడియో చూడండి
Hazarath Reddyవిశాఖపట్నం - ఆనందపురం మండలంలోని నీలకుండీలు జంక్షన్ వద్ద బైక్ మీద వెళ్తున్న జోగ సురేష్ అనే యువకుడిని లారీ ఢీకొట్టడంతో మృతి.అయితే రోడ్డున ఎవరూ ఈ ఘటనను పట్టించుకోలేదు. ప్రమాదం ఘటనను చూస్తూనే రోడ్డు మీద అలా వెళ్లి పోయారే తప్ప ఏం జరిగిందోనని అతని దగ్గరకు వెళ్లే సాహసం కూడా చేయలేదు.