రాష్ట్రీయం

Yellow Alert for Telangana: తెలంగాణకు ఎల్లో అలర్ట్‌, ఈ నెల 18, 19 తేదీల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు, ఈ జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్

Hazarath Reddy

ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో ఈ నెల 18, 19 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. వచ్చే రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉన్నట్టు ప్రకటించింది.

Warangal Accident: వరంగల్‌ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం, ఐదుగురు స్పాట్‌లోనే మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం, బాధితులంతా తేనె అమ్ముకునే వ్యక్తులే!

VNS

వరంగల్ జిల్లాలో (Warangal) విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని వర్ధన్నపేట మండలం (Wardhannapet) ఇల్లంద గ్రామం వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారిపై వరంగల్ నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ (Lorry Hits Auto) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తో పాటు ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు.

Techie Dies by Suicide: విశాఖలో ప్రేమ విఫలం కావడంతో టెకీ ఉరివేసుకుని ఆత్మహత్య, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

విశాఖలో ప్రేమ విఫలమయిందనే బాధతో సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పి.రాంప్రసాద్ (30) అనే వ్యక్తి కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రాంతానికి చెందినవాడు. విశాఖలోని శంకరమఠంలో ఉన్న ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

Telangana: ప్రాణాలకు తెగించి వరదలో ఈదుకుంటూ వెళ్లి విద్యుత్ సమస్య సరిచేసిన జూనియర్ లైన్‌మెన్‌, స్వాతంత్ర్య దినోత్సవం రోజున సత్కరించిన సీఎం కేసీఆర్

Hazarath Reddy

తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. జనగాం జిల్లా దేవరుప్పుల మండలం చింతల తండా, ధర్మాపురం, పడమటి తండా గ్రామాలకు విద్యుత్ ఇవ్వడం కోసం ప్రాణాలకు తెగించి వరదలో ఈదుకుంటూ వెళ్లి విద్యుత్ సమస్య సరిచేసిన జూనియర్ లైన్‌మెన్‌ ఎండీ రహమాన్‌ను ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున సత్కరించిన సీఎం కేసీఆర్.

Advertisement

Independence Day 2023: వీడియో ఇదిగో, రెండు జాతీయ జెండాలతో వీధులన్నీ చుట్టేసిన అసదుద్దీన్ ఒవైసీ, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్న హైదరాబాద్ ఎంపీ

Hazarath Reddy

AIMIM చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్వాతంత్ర్య దినోత్సవాన్ని తన స్టైల్లో ప్రత్యేకంగా జరుపుకున్నారు. వీధుల్లో తన మోటర్‌బైక్‌పై తిరుగుతూ తనదైన శైలిలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నారు.

Chandrababu on Hyderabad: నా పోరాటం వల్లే ఈరోజు హైదరాబాద్ ఇలా ఉంది, చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యల వీడియో ఇదిగో..

Hazarath Reddy

హైదరాబాద్ 1995లో ప్రారంభమైంది..నా పోరాటం వల్లే హైదరాబాద్‌ ఇలా ఉంది. తెలంగాణ ప్రజలందరూ నేడు లబ్ధిపొందుతున్నారు. అది ఆరోజు ఇచ్చిన భిక్ష’’ అంటూ చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై తెలంగాణ వాసుల నుండి వ్యతిరేకత ఎదురవుతోంది. ట్విట్టర్లో నెటిజన్లు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

Andhra Pradesh: బీజేపీ ఆఫీసులో జాతీయ జెండాకు అవమానం, తలకిందులుగా ఎగరేసిన జెండాకే వందనం చేసిన నేతలు, మండిపడుతున్న దేశభక్తులు

Hazarath Reddy

కాకినాడలో రాజాం పట్టణంలోని బీజేపీ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని నేడు ఆవిష్కరించారు. అయితే.. తలకిందులుగా ఎగరేసిన జెండాకే వందనం చేసి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. బీజేపీ నాయకుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.

YS Sharmila Padayatra: 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసిన మొదటి మహిళగా వైయస్ షర్మిల రికార్డు, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు

Hazarath Reddy

తెలంగాణలో 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసినందుకు గాను వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసిన మొదటి మహిళగా వైయస్ షర్మిల రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు వైయస్ షర్మిల గారిని కలిసి అభినందించి అవార్డును ప్రదానం చేశారు.

Advertisement

'Made in India' AirPods: హైదరాబాద్ యాపిల్ ఎయిర్ పాడ్స్ తయారీ, ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో ఉత్పత్తి

Hazarath Reddy

హైదరాబాద్‌లోని కొంగరకలాన్‌లో ఫాక్సాకాన్ కంపెనీ ప్లాంట్లో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో ఐఫోన్ ఎయిర్ పాడ్స్ తయారీ చేయనుంది. డిసెంబరు 2024 నుంచి ఇక్కడ ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

Chandrababu on Study: వీడియో ఇదిగో, ఇంటర్మీడియట్‌లో ఇంజనీరింగ్ చేయాలంటే బైపీసీ చేయాలని తెలిపిన చంద్రబాబు, వైరల్ అవుతున్న క్లిప్

Hazarath Reddy

ఇంటర్మీడియట్‌లో ఇంజినీరింగ్ చేయాలంటే బైపీసీ చేయాలి.. అంటూ ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఆగస్టు 15 సందర్భంగా విశాఖపట్నంలో "ఇండియా విజన్ 2047" డాక్యుమెంట్ విడుదల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Chandrababu: విశాఖలో 2047 విజన్ డాక్యుమెంట్‌ విడుదల, ఏపీని మరలా గాడిలో పెడతానని ప్రకటన..

kanha

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం చేరుకుని ‘విజన్ 2047’ డాక్యుమెంట్ విడుదల చేశారు.

Andhra Pradesh:వీడియో ఇదిగో, పోలీస్ శాల్యూట్ చేస్తుండగా కింద పడిన మెడల్, స్వయంగా కిందకు వంగి దాన్ని తీసి మళ్లీ ప్రదానం చేసిన సీఎం జగన్

Hazarath Reddy

గ్రేహౌండ్స్ కు చెందిన గౌరునాయుడికి జగన్ మెడల్ ప్రదానం చేశారు. అనంతరం గౌరునాయుడు శాల్యూట్ చేస్తుండగా మెడల్ కిందపడింది. దీన్ని గుర్తించిన జగన్ మెడల్ తీసి మళ్లీ గౌరునాయుడికి ప్రదానం చేశారు. మరోవైపు, ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తాము అందిస్తున్న నవరత్నాల పాలన ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థమని అన్నారు.

Advertisement

Independence Day 2023: గోల్కొండ కోట‌ నుంచి ప్రజలకు వరాల జల్లులు కురిపించిన సీఎం కేసీఆర్, జాతీయ జెండాను ఎగుర‌వేసిన అనంత‌రం ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి

Hazarath Reddy

గోల్కొండ కోట‌పై జాతీయ జెండాను ఎగుర‌వేసిన అనంత‌రం ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి కేసీఆర్ ప్ర‌సంగించారు. రాష్ట్రంలోని గూడు లేని నిరుపేద‌లు ఆత్మ‌గౌర‌వంతో బ‌త‌కాల‌నే ఉద్దేశంతో కేసీఆర్ స‌ర్కార్ డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను క‌ట్టించి ఇస్తున్న సంగ‌తి తెలిసిందే.

Independence Day 2023: మేనిఫెస్టో మాకు పవిత్ర గ్రంథం, ఇచ్చిన అన్ని హామీలు అమలు చేశామని తెలిపిన సీఎం జగన్, పేదలు గెలిచి వారి బతుకులు బాగుపడే వరకూ యుద్ధం జరుగుతుందని వెల్లడి

Hazarath Reddy

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం జగన్‌. అనంతరం ప్రసంగించారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా తీసుకొని అన్ని హామీలను అమలు చేశామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.

AP Road Accident: బాపట్లలో స్కూలు బస్సు బోల్తా, 9 మంది విద్యార్థులకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు

Hazarath Reddy

Andhra Pradesh: కూల్ బీర్ కోసం తల పగలకొట్టుకున్న యువకుడు, కాకినాడలో జరిగిన ఫైటింగ్ వీడియో ఇదిగో

Hazarath Reddy

కాకినాడ - రాజాం మండలంలోని రాజిపేట ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద ఆబోతుల హరిబాబు అనే వ్యక్తి బీర్లు కూలింగ్ లేవా అంటూ అడగగా.. వైన్ షాప్ సిబ్బందికి, అతనికి మధ్య గొడవ జరిగి కూల్ బీర్ అడిగిన హరిబాబు తల పగిలింది.

Advertisement

Tirumala: వీడియో ఇదిగో, తిరుమల కాలినడకన వెళ్లే భక్తలకు ఆత్మరక్షణ కోసం మంచి ఉత కర్ర ఇస్తాం, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ ఇదిగో..

Hazarath Reddy

తిరుమల కాలి నడకన వెళ్లే ప్రతి ఒక్క భక్తుడికి ఆత్మరక్షణ కోసం ఒక మంచి చేతి కర్ర ఇవ్వాలని నిర్ణయించాం - టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి

Revanth Reddy: వీడియో ఇదిగో, ఆ పోలీసుల గుడ్డలు ఊడదీసి కొడతా, డైరీలో పోలీసుల పేర్లు రాసి పెడుతున్నానని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

మహబూబ్ నగర్ పోలీసులను గుడ్డలు ఊడతీసి కొడతా అంటూ వార్నింగ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి. డైరీలో పోలీసుల పేర్లు రాసి పెడుతున్నాం. 100 రోజుల తరువాత అధికారంలోకి రాగానే మీ గుడ్డలు ఊడతీసి, అసలు మిత్తితో సహా చెల్లిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

Telangana Shocker: తీవ్ర విషాదం, చిన్న విభేదాలతో భార్యని చంపి ఉరివేసుకున్న భర్త, కరీంనగర్‌లో విషాదకర ఘటన

Hazarath Reddy

కరీంనగర్ మార్కండేయ కాలనీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భార్యని చంపి ఓ భర్త ఉరివేసుకున్నారు. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా భార్య లావణ్యను చంపిన భర్త ప్రవీణ్, 2 రోజులు మృతదేహాన్ని ఇంట్లోనే దాచి, హాస్టల్లో ఉన్న కూతురుని చూసొచ్చి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ప్రవీణ్.

Video: తీవ్ర విషాదాలు, క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి, పని కోసం బయటకు వెళ్లి మరొక యువకుడు మృతి

Hazarath Reddy

కర్నూలు - బేతంచెర్లలోని సంజీవనగర్ కాలనీకి చెందిన మహేంద్ర (21) స్నేహితులతో క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. తూర్పు గోదావరి - బిక్కవోలుకు చెందిన రాజా (30) అనే యువకుడు సోమవారం ఉదయం పని నిమిత్తం బయటికి వెళ్ళాడు.

Advertisement
Advertisement