రాష్ట్రీయం

Gaddar Last Rites: బౌద్ధ మత ఆచారంలో ముగిసిన గద్దర్ అంత్యక్రియలు, ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అల్వాల్‌లోని మహాబోధి విద్యాలయ ఆవరణలో అంతిమ సంస్కారాలు పూర్తి

Hazarath Reddy

గద్దర్ అంత్యక్రియలు సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ముగిశాయి. అల్వాల్‌లోని మహాబోధి స్కూల్ ఆవరణలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో బౌద్ధ సంప్రదాయం ప్రకారం పూర్తి చేశారు. బౌద్ధ మత ఆచారంలో గద్దర్‌ అంత్యక్రియలు నిర్వహించారు.

Gaddar's Funeral: గద్దర్ అంతిమ యాత్రలో తొక్కిసలాట, సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ మృతి

Hazarath Reddy

గద్దర్ అంత్యక్రియల సందర్భంగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రజా గాయకుడుకు అంతిమ వీడ్కోలు పలికేందుకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ మృతి చెందారు.

Eco-Friendly Electric Buses: హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొట్టనున్న1300 పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్‌ బస్సులు, ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సు ప్రత్యేకతలివే

Hazarath Reddy

హైదరాబాద్ ప్రయాణికులకు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో 1300 ఎలక్ట్రిక్ బస్సులను వాడకంలోకి తీసుకురావాలని #TSRTC నిర్ణయించింది.

Gaddar Funeral: గ‌ద్ద‌ర్ పార్థివ‌దేహానికి నివాళి అర్పించిన సీఎం కేసీఆర్, ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఓదార్చిన తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ పార్థివ‌దేహానికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నివాళుల‌ర్పించారు. అల్వాల్‌లోని గ‌ద్ద‌ర్ నివాసానికి సోమ‌వారం సాయంత్రం కేసీఆర్ చేరుకున్నారు. అనంత‌రం గ‌ద్ద‌ర్ భౌతిక‌కాయానికి నివాళుల‌ర్పించి, ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఓదార్చారు

Advertisement

Telangana: మద్యం మత్తులో లారీ డ్రైవర్ భీభత్సం, షాపు ముందు బైక్ పార్కింగ్ చేస్తున్న వ్యక్తిని వేగంగా వచ్చి ఢీకొట్టిన లారీ, నిందితుడుకి తీవ్ర గాయాలు

Hazarath Reddy

భూపాలపల్లి పట్టణంలోని ఓ షాపు ముందు టూ వీలర్ పార్కింగ్ చేస్తున్న క్రమంలో మైపల్లి గ్రామానికి చెందిన రంజిత్ అనే వ్యక్తిని లారీ ఢీకొట్టింది. రంజిత్ లారీ ముందు భాగంలో ఇరుక్కుపోయాడు. పార్కింగ్ చేసిన కార్లు, బైక్ పై నుంచి లారీ దూసుకెళ్లడంతో నుజ్జునుజ్జయ్యాయి. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

Andhra Pradesh Horror: నెల్లూరు జిల్లాలో దారుణం, కోడలితో సహా ముగ్గురిని కత్తులతో నరికి చంపిన అత్తింటి వారు, నిందితులంతా పరారీలో..

Hazarath Reddy

నెల్లూరు జిల్లాలోని బోగోలు మండలం కొండబిట్రగుంటలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఒకే ఇంట్లో ముగ్గురు కుటుంబసభ్యులను దారుణంగా హతమార్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

Punganur Violence Case: పుంగనూరు పోలీసులపై దాడి కేసులో మరో 9 మంది అరెస్ట్, 72కు చేరుకున్న మొత్తం అరెస్ట్ అయిన వారి సంఖ్య

Hazarath Reddy

చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో చంద్రబాబు పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్న సంగతి విదితమే. ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. పుంగనూరు పోలీసులపై దాడి కేసులో మరో 9 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో మొత్తం ఈ కేసులో అరెస్ట్‌ అయిన వారి సంఖ్య 72కు చేరుకుంది.

Video: వీడియో ఇదిగో, బండి లేదు నా గుండు లేదు పత్తా లేకుండా పోయారు, అసెంబ్లీలో సీఎం కేసీఆర్ సైటైర్లు

Hazarath Reddy

అసెంబ్లీలొ చివరి రోజు సమావేశాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సుదీర్ఘ ప్రసంగం ఇచ్చారు. రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతి’పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంటా సీఎం బండి సంజయ్ మీద పరోక్షంగా సెటైర్లు వేశారు. హైదరాబాద్‌లో వరదలు వస్తే బండి పోతే బండి .. గుండు పోతే గుండు అన్నోల్లు ఇప్పుడు బండి లేదు గుండు లేదు పత్తా లేకుండా పోయారు - సీఎం కేసీఆర్

Advertisement

Andhra Pradesh: వేలిముద్రతో అమ్మఒడి డబ్బు కాజేసిన వాలంటీర్‌, డబ్బులు అడిగితె ఇంకా పడలేదు వస్తే ఇస్తా అంటూ బుకాయిస్తున్నాడని మహిళ ఆవేదన

Hazarath Reddy

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నాగినేనిగుంట గ్రామానికి మీరావళి అన్న కుమారుడు ఖాసీం పీర వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. బ్యాంక్ మొబైల్ యాప్ ద్వారా లబ్దిదారు హుస్సేనమ్మ వేలిముద్ర తీసుకున్న వాలంటీర్.. అమ్మఒడి డబ్బులు తన అకౌంట్ లోకి మళ్లించాడు.

Road Accident Video: ఘోర విషాదం వీడియో ఇదిగో, రూ. 500 చిల్లర కోసం వెళ్లి సిమెంట్ ట్యాంకర్ కింద పడి చనిపోయిన యువకుడు

Hazarath Reddy

500 రూపాయల చిల్లర కోసం వెళ్లి సిమెంట్ ట్యాంకర్ కింద పడి చనిపోయాడు. హైదరాబాద్ - మొయినాబాద్ సమీపంలో విగ్నేష్ చారి అనే యువకుడు రోడ్డుపక్కన భోజనం చేసి, రూ.500నోటు ఇవ్వడంతో హోటల్ నిర్వాహకుడు చిల్లర లేదని చెప్పాడు. చిల్లర తీసుకొని వెనుదిరగగా లారీ ఢీకొట్టడంతో మృతిచెందాడు

Chandrababu on Work From Home to Police: వీడియో ఇదిగో, పోలీసులకు వర్క్ ఫ్రం హోం పెట్టాలని ఆలోచిస్తున్నా, చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

చంద్రబాబు నాయుడు తన పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు వర్క్ ఫ్రం హోం పెట్టాలని ఆలోచిస్తున్నా చేస్తున్నానని ఏపీ ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వీడియో ఇదిగో..

Chandrababu on liquor Policy: సాయంత్రం అయితే నా తమ్ముళ్లకు ఓ పెగ్గు పడాల్సిందే, చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఇక్కడ నా తమ్ముళ్లు మందు బాబులు ఉంటారు.. రోజంతా కష్టపడతారు, ఒక పెగ్గు వేసుకోవాలి అనుకుంటారు. కానీ రేట్లు పెరిగిపోయాయి, నాసిరకం సరుకు అమ్ముతున్నారని చంద్రబాబు నాయుడు ఏపీ మద్యం పాలసీపై మండిపడ్డారు. వీడియో ఇదిగో..

Advertisement

Telangana: చేనేత మిత్ర పథకం కింద ప్రతి చేనేత కార్మికుడికి, ప్రతి మగ్గానికి నెలకు రూ.3000, చేనేత భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

Hazarath Reddy

జాతీయ చేనేత దినోత్సం సందర్భంగా ఉప్పల్‌ శిల్పారామంలో చేనేత భవన్‌ నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ (Minister KTR) శంకుస్థాన చేశారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఎమ్మెల్సీ ఎల్‌.రమణతో కలిసి చేనేత భవన్‌ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. 500 గజాల స్థలంలో దీనిని నిర్మిస్తున్నారు.

Kodali Nani on Pawan Kalyan: చంద్రబాబుకు మద్దతు ఇస్తే పవన్ కళ్యాణ్‌ను బట్టలూడదీసి రోడ్డు మీద నిలబెడతాం, కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

పవన్ కళ్యాణ్‌కు కొడాలి నాని మాస్ వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబుకు మద్దతు ఇస్తే పవన్ కళ్యాణ్‌ను బట్టలూడదీసి రోడ్డు మీద నిలబెడతామని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వీడియో ఇదిగో..

CM KCR Speech in Assembly: అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజు సీఎం కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగం, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు, రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతిపై మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

ఆదివారం అసెంబ్లీ సమావేశాల చివరిరోజు సభలో ‘రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతి’పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ మాదిరిగా అలవికా నీ హామీలు ఇచ్చి, ప్రజలను వంచించబోమని సీఎం కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తమ అమ్ములపొదిలో మరిన్ని అస్ర్తాలు ఉన్నాయని చెప్పారు.

MLA Vanama Venkateswara Rao: వనమా వెంకటేశ్వరరావు అనర్హత వేటుపై స్టే విధించిన సుప్రీంకోర్టు, తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా

Hazarath Reddy

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అనర్హత వేటుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. జలగం వెంకరావు సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టు తీర్పు చెల్లుబాటు అవుతుందో లేదో తెలుస్తామని చెప్పింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Advertisement

CM KCR on Jagan: వీడియో ఇదిగో, కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్‌ను చాలా ఇబ్బందులు పెట్టింది, సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు ఇదిగో..

Hazarath Reddy

వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోగానే కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వేదింపులు చేసి ఇబ్బందులు పెడితే ఆయన సొంత పార్టీ స్థాపించి కడప పులివెందుల ఉప ఎన్నికల్లో నాలుగైదు లక్షల మెజారిటీతో గెలుపొందాడు- సీఎం కేసీఆర్

CM Jagan on Polavaram Project: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులందరికీ న్యాయం చేయడమే ప్రభుత్వం లక్ష్యం, ఏ ఒక్కరికి ఏ కష్టం వచ్చినా దాన్ని తీర్చేందుకు మీ బిడ్డ ఉన్నాడని తెలిపిన సీఎం జగన్

Hazarath Reddy

పోలవరం విషయంలో అప్పటి సీఎం చంద్రబాబు బుద్ధి లేకుండా వ్యవహరించారు. మీ బిడ్డ అలా చేయడు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నది మీ కోసమే అన్నది మరిచిపోవద్దు. ఏ ఒక్కరికి ఏ కష్టం వచ్చినా దాన్ని తీర్చేందుకు మీ బిడ్డ ఉన్నాడు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులందరికీ న్యాయం చేయడమే ప్రభుత్వం లక్ష్యమన్నారు.

CM Jagan Kunavaram Tour: డబ్బులు మిగుల్చుకోవాలనే ఆరాటం ప్రభుత్వానికి లేదు, కూనవరంలో సీఎం జగన్ స్పీచ్ హైలెట్స్ ఇవిగో..

Hazarath Reddy

అల్లూరి సీతారామరాజు, ఏలూరులో జిల్లాలో సీఎం జగన్‌ పర్యటిస్తున్నారు. కూనవరంలో వరద బాధిత ప్రజలను పరామర్శించారు. వరద సహాయ, పునరావాస చర్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వరద బాధితులకు నిత్యవసరాలు అందించాం, ఇళ్లు దెబ్బతిని ఉంటే రూ10 వేలు ఇవ్వాలని ఆదేశించాం.

Video: పుల్లుగా తాగి మహిళ మీద పడిన ముందుబాబు, పట్టుకుని చితక్కొట్టిన మహిళలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ప్రకాశం జిల్లా దోర్నాల మండలం పెద్ద బొమ్మలపురంలో ఓ వ్యక్తి మద్యం తాగి మహిళలతో అసభ్య పదజాలంతో దూషిస్తూ, అసభ్యకరంగా వ్యవహరించాడు. దీంతో ఆగ్రహించిన మహిళలు ఆ వ్యక్తిని చంప చెల్లుమనిపించి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

Advertisement
Advertisement