రాష్ట్రీయం

BRS Party: బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ, మహేశ్వరం మాజీ శాసనసభ్యుడు తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధం

kanha

బీఆర్ఎస్ కీలక నేత, మహేశ్వరం మాజీ శాసనసభ్యుడు తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తన కోడలు, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డితో కలిసి తీగల కృష్ణారెడ్డి హస్తం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో తీగల కృష్ణారెడ్డి సమావేశమయ్యారు.

Jr NTR Vs Nara Lokesh: ఒంగోలులో Next CM జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీల కలకలం, లోకేష్ పాదయాత్ర నేపథ్యంలో వివాదంగా మారిన ఫ్లెక్సీ వార్..

kanha

ఒంగోలులో నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీల కలకలం, జిల్లాలో నారా లోకేష్ పర్యటన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల ఏర్పాటుతో చర్చనీయాంశంలా వ్యవహారం.

Andhra Pradesh Shocker: తోటికోడలు తిట్టిందని సెల్ టవర్ ఎక్కిన మహిళ, ఆందోళనలో గ్రామ ప్రజలు, వీడియో చూస్తే షాక్ తినాల్సిందే...

kanha

ప్రకాశం - కంభంలో తోటికొడలు తిట్టిందని జియో సెల్ టవర్ ఎక్కి ఓ మహిళ నిరసనకు దిగింది. తోడికోడలు స్వగ్రామమైన పెద్దారవీడులో లక్ష్మీబాయిపై కేసు పెట్టగా విచారణకు పెద్దారవీడు పోలీసులు పిలిచారు.

BRS vs Congress: ఎన్నికలయ్యే వరకు రేవంత్ రెడ్డే పీసీసీ అధ్యక్షుడిగా ఉండాలి. ఆయన ఉంటే BRS 100 సీట్లు గెలుస్తుంది - నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

kanha

ఎన్నికలయ్యే వరకు రేవంత్ రెడ్డే పీసీసీ అధ్యక్షుడిగా ఉండాలి. ఆయన ఉంటే మేము 100 సీట్లు గెలుస్తాం - నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి

Advertisement

YS Viveka Murder Case: వివేకా హత్య కేసు విచారణ సెప్టెంబర్ 2వ వారానికి వాయిదా, బెయిల్‌ వ్యవహారాలు ఆచితూచి ఉంటాయని తెలిపిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివేకా హత్య కేసు చాలా కీలకమైన అంశమని తెలిపిన ధర్మాసనం... వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్ ను సెప్టెంబర్ 2వ వారానికి వాయిదా వేసింది.

Jagananna Thodu: జగనన్న తోడు నిధులు విడుదల చేసిన సీఎం జగన్, చిన్న వ్యాపారులకు రూ.549.70 కోట్ల వడ్డీ లేని రుణాలు, సకాలంలో రుణాన్ని చెల్లించిన వారికి రూ.11.03 కోట్ల వడ్డీలు

Hazarath Reddy

రాష్ట్రవ్యాప్తంగా చిరువ్యాపారులకు చేయూతనందించడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన ‘జగనన్న తోడు’ ఏడో విడత నిధులను పంపిణీ చేశారు. చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి రూ. 549.70 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించారు. గతంలో తీసుకున్న రుణాన్ని చెల్లించిన వారికి రూ. 11.03 కోట్ల వడ్డీ డబ్బు వారి ఖాతాల్లో సీఎం జగన్ జమ చేశారు.

Weather Forecast: హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో అతి భారీ వర్షాలు, ఉత్తర తెలంగాణకు రెడ్‌ అలర్ట్‌, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక

Hazarath Reddy

నేడు, రేపు తెలంగాణలో అతిభారీ వర్షాలు కురవనున్నాయి. నైరుతి రుతుపవనాల నేపథ్యంతో వాతావరణ శాఖ ఉత్తర తెలంగాణకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.అలాగే దక్షిణ తెలంగాణకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేసింది. 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేయడం జరిగింది.

Revanth Reddy: వీడియో ఇదిగో, రాజీవ్ గాంధీ భార్య ఇందిరా గాంధీ అంటూ నోరు జారిన రేవంత్ రెడ్డి, సెటెర్లు వేస్తున్న బీఆర్ఎస్ నేతలు

Hazarath Reddy

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నోరు జారారు. రాజీవ్ గాంధీ భార్య ఇందిరా గాంధీ.. ప్రధాన మంత్రి, రాష్ట్రపతి పదవులను త్యజించి త్యాగానికి మారు పేరుగా నిలబడిందంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ తల్లి అనే సంగతి మరచి భార్య అని సంబోధించడం ఆయనకే చెల్లిందంటూ బీఆర్ఎస్ నేతలు ఘాటుగా సెటైర్లు వేస్తున్నారు.

Advertisement

Andhra Pradesh: వీడియో ఇదిగో, గోదావరిలోకి దూకి యువతి ఆత్మహత్య, పోలీసులకు క్లూ అందించిన యజమాని పెంపుడు కుక్క

Hazarath Reddy

ఏపీలో ఓ యువతి యానాం - ఎదుర్లంక బ్రిడ్జి మీద చెప్పులు వదిలి గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె పెంచుకున్న కుక్క యజమాని ఎంతకు తిరిగిరాకపోయేసరికి ఆమె చెప్పుల వద్దే తిరుగుతూ అక్కడే ఎదురు చూస్తూ గడిపింది.

Project-K Deepika Padukone First Look: ప్రభాస్ 'ప్రాజెక్ట్ కే' నుంచి దీపిక పదుకొనే ఫస్ట్ లుక్ విడుదల.. సీరియస్ లుక్ లో ఆసక్తికరంగా దీపిక ఫస్ట్ లుక్

Rudra

గ్లోబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేస్తున్న మోస్ట్ క్రేజియెస్ట్ సినిమా 'ప్రాజెక్ట్ కే' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీకి సంబంధించిన ప్రతీ అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, తాజాగా ఈ సినిమాలో దీపికా పదుకొనేకు చెందిన ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు.

Heavy Rains in Telangana: తెలంగాణలో నేడు భారీ వర్షాలు.. రేపటి నుంచి అతి భారీ వర్షాలు.. వచ్చే రెండుమూడు రోజులూ ఇంతే.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ

Rudra

తెలంగాణకు వాతావరణశాఖ కీలక సూచన చేసింది. రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపటి నుంచి శుక్రవారం వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలంటూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

Pawan Kalyan on NDA Meeting: ఎన్‌డీఏ సమావేశానికి పవన్ కళ్యాణ్‌కి ఆహ్వానం, చాలా కాలంగా ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని తెలిపిన జనసేనాధినేత

Hazarath Reddy

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘‘చాలా కాలంగా ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్నా...రేపటి సమావేశానికి (ఎన్‌డీఏ సమావేశానికి) సీనియర్‌ నేతలు మమ్మల్ని పిలిచారు.ఎన్‌డీఏ విధానాలు ఎలా ఉండాలా అని ఎదురుచూస్తున్నాం.

Advertisement

Andhra Pradesh: ఏపీలో భారీగా తగ్గిన మద్యం అమ్మకాలు, ఆదాయం తీసుకొచ్చే శాఖలపై సీఎం జగన్ సమీక్ష, వాహనాలపై పన్నుల విషయంలో కొత్త విధానాలు అన్వేషించాలని సూచన

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదాయం తీసుకొచ్చే శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. 2023–24 ఆర్థిక సంవత్సరం మొదటి మూడునెలల్లో విభాగాల వారీగా రెవెన్యూ వసూళ్ల పనితీరును సీఎం సమీక్షించారు.

Telangana: రాత్రి చికెన్ తిన్న 40 మంది విద్యార్థులకు అస్వస్థత, వాంతులు విరోచనాలతో ఆస్పత్రి పాలైన ఇంటర్ ఎంపీసీ స్టూడెంట్స్, బట్టుపల్లి ఎస్సార్‌ప్రైమ్ క్యాంపస్‌‌లో ఘటన

Hazarath Reddy

వరంగల్ జిల్లాలోని బట్టుపల్లి ఎస్సార్‌ప్రైమ్ క్యాంపస్‌లో ఫుడ్ పాయిజన్ కావడంతో కలకలం రేగింది.బట్టుపల్లిలోని ఎస్ఆర్ ప్రైమ్ జూనియర్ కళాశాలలో కలుషిత ఆహారం వల్ల 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు ఆదివారం రాత్రి ఎగ్ బిర్యానీతోపాటు చికెన్ వడ్డించారు.

Andhra Pradesh Weather Forecast: బంగాళాఖాతంలో 48 గంటల్లో వాయుగుండం ఏర్పడే అవకాశం, జూలై 17 నుండి 21 వరకు ఏపీలో భారీ వర్షాలు

Hazarath Reddy

ఈ నెల 17 నుంచి జూలై 21 వరకు రానున్న ఐదు రోజుల్లో ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉత్తరాదిలోని కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Andhra Pradesh Shocker: ఏపీలో మరో టమాటా రైతు దారుణ హత్య, అన్నమయ్య జిల్లాలో రైతు గొంతు కోసి పారిపోయిన గుర్తుతెలియని వ్యక్తులు

Hazarath Reddy

మదనపల్లెలో టమాటా రైతు హత్య మరువకముందే మరో టమాటా పండించే రైతును హత్య చేశారు. అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలోని నవాబుకోటకు చెందిన భర్తల మధుకర్ రెడ్డి తన టమోటా పొలం వద్ద టెంటు వేసుకుని ఆదివారం రాత్రి నిద్రపోయాడు. గుర్తుతెలియని వ్యక్తులు అక్కడికి వచ్చి మధుకర్ రెడ్డి గొంతు కోసి పారిపోయారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Telangana: ప్రైవేట్ కాలేజీలో ఫుడ్ పాయిజన్, 40 మంది విద్యార్థులకి వాంతులు విరోచనాలు, నిన్న రాత్రి తిన్న చికెన్ బిరియానే కారణమని అనుమానాలు

Hazarath Reddy

వరంగల్ - భట్టుపల్లిలోని ఎస్ఆర్ ప్రైమ్ ప్రైవేట్ కాలేజీ క్యాంపస్‌లో ఫుడ్ పాయిజన్ వల్ల 40 మంది విద్యార్థులకి వాంతులు విరోచనాలు అయ్యాయి. నిన్న రాత్రి తిన్న చికెన్ బిరియాని వల్ల ఇలా జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Pallevelugu Town Bus Pass: ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్, కొత్తగా పల్లెవెలుగు టౌన్ బస్ పాస్‌ అమలు, ధరల వివరాలు ఇవిగో..

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ‘పల్లెవెలుగు టౌన్ బస్ పాస్‌కు శ్రీకారం చుట్టింది. మొదటగా కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో ఈ పాస్‌ను అమలు చేయాలని సంస్థ నిర్ణయించింది.

Andhra Pradesh: ఏపీలో అన్ని స్కూళ్ల తరగతుల గదులలోని స్క్రీన్‌లపై చంద్రయాన్ 3 ప్రత్యక్ష ప్రసారం, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఏపీలో విద్యారంగంపై జగన్ పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే..ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని పాఠశాలలను డిజిటల్‌గా మార్చారు. కాగా చంద్రయాన్ 3 ప్రారంభించినప్పుడు, AP ప్రభుత్వం అన్ని తరగతి గదులలో స్క్రీన్‌లపై దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. దీనినే ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారంటూ ఓ నెటిజన్ ట్వీట్ షేర్ చేశారు.

Andhra Pradesh: సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన ఆరుమంది, తాడు సాయంతో పడవకు కట్టి ఒడ్డుకు చేర్చిన మత్స్యకారులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

అంబేద్కర్ కోనసీమ - కాట్రేనికోన మండలం బ్రహ్మ సమేధ్యం గ్రామానికి చెందిన ఆరుగురు పైబర్ బోటుపై సముద్రంలో వేటకు వెళ్ళారు. రాత్రి తిరిగి వచ్చే క్రమంలో విపరీతమైన గాలులు వీయడంతో బోటు తిరగబడిపోయింది

Advertisement
Advertisement