రాష్ట్రీయం
Telangana BJP: అమిత్ షా లాంటి వ్యక్తి దళితుల పట్ల అంటరానితనం పాటిస్తే ఈ దేశం, రాష్ట్రం బాగుపడుతుందా - BJP నేత చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు..
kanhaఆరోజు చేవెళ్ల సభలో అమిత్ షా నన్ను శాలువా కప్పనీయకుండా అవమానించిన తీరును మేధావులు, దళిత సంఘాలు, జర్నలిస్టులు ప్రశ్నించారు. అమిత్ షా లాంటి వ్యక్తికి అంటరానితనం ఉంటే ఈ దేశం, రాష్ట్రం బాగుపడుతుందా - మాజీ మంత్రి చంద్రశేఖర్
Perni Nani on Pawan Kalyan: సిగ్గుందా పవన్, చంద్రబాబు ఏది మాట్లాడమంటే అది మాట్లాడేస్తావా, జనసేనానిపై విరుచుకుపడిన పేర్ని నాని
Hazarath Reddyజనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వాలంటీర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్‌ వెంటనే క్షమాపణలు చెప్పాలని వాలంటీర్లు డిమాండ్‌ చేస్తున్నారు. పవన్‌ వ్యాఖ్యలపై పేర్నినాని సీరియస్‌ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంపై పవన్‌ విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు
Pawan Kalyan vs Volunteers: పవన్‌ కల్యాణ్‌పై ఉరవకొండ పోలీస్ స్టేషన్‌లో వాలంటీర్ల ఫిర్యాదు, ఏపీలో దుమారం రేపుతున్న జనసేన అధినేత వివాదాస్పద వ్యాఖ్యలు
Hazarath Reddyఏపీలో వాలంటీర్‌ వ్యవస్థపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబీకింది. ఒంటరి మహిళలు, వితంతువుల వివరాలు సేకరించి సంఘ విద్రోహ శక్తులకు వాలంటీర్లు సమాచారం ఇస్తున్నారన్న పవన్ ఆరోపణలపై నిరసనలు వెల్లు వెల్లువెత్తుతున్నాయి
Hyderabad Shocker: హైదరాబాద్‌లో విషాదం, తాను వండిపెట్టిన అన్నం భర్త తినలేదని భార్య ఆత్మహత్య
Hazarath Reddyభర్త అన్నం తినడం లేదని అలిగి భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. గత మూడు రోజులుగా తాను చేసిన వంటలు తినకుండా బయట తినడమే కాకుండా ఇదేమిటని అడిగితే సరైన సమాధానం చెప్పకపోవడంతో మనస్థాపానికి గురైన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది
Youth Dies of Heart Attack: జిమ్ నుంచి రాగానే గుండెపోటు, గంటల వ్యవధిలో ఇద్దరు యువకులు మృతి, ఖమ్మంలో విషాదకర ఘటన
Hazarath Reddyఖమ్మం నగరం అల్లీపురంలో గరికపాటి నాగరాజు అనే యువకుడు ఆదివారం గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా ఖమ్మంలో హార్ట్‌స్ట్రోక్‌తో మరో యువకుడు మరణించాడు.కాంగ్రెస్‌ నాయకుడు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మానుకొండ రాధా కిషోర్‌ కుమారుడు శ్రీధర్‌(31) గుండెపోటుతో మృతిచెందాడు.
Dada Oxygen Park: మహారాష్ట్రలో సీఎం జగన్ మీద వెలువెత్తిన అభిమానం, లక్షా 11వేల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిన దాదాశ్రీ ఫౌండేషన్‌ వీఈటీ
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేరిట దాదాశ్రీ ఫౌండేషన్‌ వీఈటీ తరపున మహారాష్ట్ర షోలాపూర్‌ జిల్లాలోని 11 తాలూకాలోని అన్ని గ్రామాల్లో, పాఠశాలల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (దాదాశ్రీ) ఆక్సిజన్ పార్క్ ప్రచారం ద్వారా మొక్కలు నాటుతున్నారు
Volunteers Protest: ఆ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాల్సిందే, దిష్టిబొమ్మ దహనం చేసిన వాలంటీర్లు
Hazarath Reddyపవన్‌ కల్యాణ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఏపీ వాలంటీర్ల భగ్గుమంటున్నారు. పవన్‌ కల్యాణ్‌ వివాదాస్పద వ్యాఖ్యలపై వాలంటీర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒంటరి మహిళలు, వితంతువుల వివరాలు సేకరించి సంఘ విద్రోహ శక్తులకు వాలంటీర్లు సమాచారం ఇస్తున్నారన్న పవన్ ఆరోపణలపై నిరసనలు వెల్లు వెల్లువెత్తుతున్నాయి.
Pawan Kalyan Comments Row: వాలంటీర్లపై పవన్‌ విషం, సీరియస్ అయిన ఏపీ మహిళా కమిషన్‌, సమన్లు జారీ
Hazarath Reddyఏపీ వాలంటీర్ల పట్ల పవన్‌ కల్యాణ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్‌ సీరియస్‌ అయ్యింది. ఈ మేరకు పవన్‌కు కమిషన్‌ సమన్లు జారీ చేయనుంది. మహిళలను ఉద్ధేశించి చేసిన పవన్‌ వ్యాఖ్యలపై భారీగా ఫిర్యాదులు వస్తున్నాయని మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు
CM Jagan in Kadapa: కడపలో రూ.871.77 కోట్లతో అభివృద్ధి ప‌నులకు శంకుస్థాపనలు చేసిన సీఎం జగన్, వీడియో ఇదిగో..
Hazarath Reddyకడప నగరంలో రూ.871.77 కోట్లతో అభివృద్ధి ప‌నులకు శంకుస్థాపనలు చేసిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌. అందులో భాగంగా రూ.1.37 కోట్లతో పూర్తయిన రాజీవ్‌ పార్కు, రూ. 5.61 కోట్లతో పూర్తయిన రాజీవ్‌ మార్గ్‌ అభివృద్ధి పనులను ప్రారంభించిన‌ సీఎం వైయ‌స్ జగన్.
Andhra Pradesh: వాగు దాటాలంటే బైక్ ఎత్తుకు వెళ్లాల్సిందే, ఏపీలో 36 గ్రామాల పరిస్థితి ఇది, బ్రిడ్జి మార్గం ఏర్పాటు చేయాలని కోరుతున్న గ్రామస్థులు
Hazarath Reddyవర్షాలకి వాగు పొంగిపొర్లడంతో అటుగా వెళ్లాల్సిన గ్రామ గిరిజన గ్రామస్తులు వాగు దాటేందుకు బైకు భుజాలపై ఎత్తుకొని వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరుగలేదు.
TDP Workers Fight in Tana Videos: వీడియోలు ఇవిగో, తెలుగు తమ్ముళ్ల తన్నులాటతో రచ్చ రచ్చగా మారిన తానా సభలు, టీడీపీ ఎన్నారై అధ్యక్షుడి ముందే ఫైటింగ్
Hazarath Reddyఅమెరికాలో ‘తానా’(ఉత్తర అమెరికా తెలుగు సంఘం) సభల సందర్భంగా జూనియర్‌ ఎన్టీఆర్, లోకేశ్‌ వర్గాలు పరస్పరం తన్నుకున్నాయి. రెండుగా చీలిపోయిన టీడీపీ ఎన్నారై సభ్యులు పిడిగుద్దులు గుద్దుకున్నారు. తరని పరుచూరి, సతీష్‌ వేమన వర్గాలు పరస్పరం చొక్కాలు పట్టుకుని మరీ దాడులకు దిగాయి.
Hyderabad Shocker: వీడియో ఇదిగో, పురుషాంగాన్ని కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ ఎంబిబిఎస్ విద్యార్థి, హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన
Hazarath Reddyపురుషాంగాన్ని కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ ఎంబిబిఎస్ విద్యార్థి. సికింద్రాబాద్ - జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంబిబిఎస్ విద్యార్థి దీక్షిత్ రెడ్డి పురుషాంగాన్ని కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Pawan Kalyan: వీడియో ఇదిగో, ఏపీలో 30 వేల మంది అమ్మాయిలు మిస్సింగ్, దీనిపై జగన్ ప్రభుత్వం రివ్యూ ఎందుకు పెట్టడం లేదు, పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyప్రతి గ్రామంలో ఎవరు ఎవరి మనిషి. ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు. ఆడపిల్లలు ఎవరినైనా ప్రేమిస్తున్నారా. వారిలో వితంతువులు ఉన్నారా. ఇలా వాలంటీర్లు సమాచారం సేకరించి.. సంఘవిద్రోహ శక్తులకు చేరవేయడంతో ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు.
Tirumala Update: తిరుమలలో నేడు కూడా కొనసాగుతున్న భక్తుల రద్దీ.. స్వామివారి సర్వదర్శనానికి 20 గంటల సమయం.. నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్
Rudraప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న క్యూ లైన్లలో ప్రవేశించినవారు ఈ ఉదయానికి కూడా దర్శనం కోసం వేచిచూస్తున్నారు. స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.
Hyderabad Horror: హైదరాబాద్ లో ఘోరం.. మతిస్థిమితం కోల్పోయి.. మర్మాంగం కోసుకుని గాంధీ మెడికల్ కాలేజీకి చెందిన వైద్య విద్యార్థి ఆత్మహత్య
Rudraమానసిక స్థితి సరిగా లేని ఓ వైద్య విద్యార్థి బ్లేడ్‌ తో పురుషాంగాన్ని కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌ జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం జరిగింది.
Trains Cancelled: విజయవాడ డివిజన్‌ లో భద్రతాపరమైన పనులు.. నేటి నుంచి 16వ తేదీ వరకు కొన్ని రైళ్లు పూర్తిగా రద్దు.. మరికొన్ని రైళ్లు నిడదవోలు, భీమవరం టౌన్ మీదుగా మళ్లింపు
Rudraదక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్‌ లో భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు మరికొన్నింటిని దారి మళ్లించినట్టు అధికారులు తెలిపారు. నేటి నుంచి 16వ తేదీ వరకు కొన్ని రైళ్లను రద్దు చేశారు. వీటితోపాటు మరికొన్ని రైళ్లను నిడదవోలు, భీమవరం టౌన్ మీదుగా దారి మళ్లించారు.
Lashkar Bonalu Rangam LIVE: లష్కర్ బోనాల్లో నేడు భవిష్యవాణి.. అమ్మవారు ఏం చెబుతారో! (లైవ్)
Rudraతెలంగాణ లష్కర్ బోనాల వేడుకల్లో నేడు ప్రధాన ఘట్టమైన 'రంగం' జరగనుంది. అవివాహిత జోగిని ఈ సంవత్సరం తెలంగాణ ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో భవిష్యవాణి చెప్పనున్నారు.
Fire Accident in Balanagar: హైదరాబాద్ లోని బాలానగర్‌ లో అగ్నిప్రమాదం.. అపార్ట్‌ మెంట్‌ లో చెలరేగిన మంటలు.. బయటకు పరుగులు తీసిన జనం
Rudraహైదరాబాద్ బాలానగర్‌ లోని (Balanagar) ఓ అపార్ట్‌ మెంట్‌ లో (Apartment) అగ్నిప్రమాదం అగ్నిప్రమాదం జరిగింది. ఐడీపీఎల్ (IDPL) చౌరస్తాలో ఉన్న ఏ2ఏ లైఫ్‌ స్పేస్‌ (A2A Life Space) అపార్ట్‌ మెంట్‌ లోని ఐదో ఫ్లోర్‌ లో ఉన్న ఓ ఫ్లాట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Heavy Rains in North India: ఉత్తరాదిన వరద బీభత్సం... విరిగిపడుతున్న కొండచరియలు... పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోతున్న దుకాణాలు, కార్లు.. 22కి పెరిగిన మృతుల సంఖ్య
Rudraఉత్తరాది రాష్ట్రాలపై వరణుడు ప్రతాపం చూపుతున్నాడు. నైరుతి రుతుపవనాల ప్రభావం ఆయా రాష్ట్రాలపై తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి.
AP Minister Amarnath: పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో అయ్యుండొచ్చు, రాజకీయాల్లో మాత్రం అతను సైడ్ క్యారెక్టర్, మంత్రి అమర్ నాథ్ సంచలన వ్యాఖ్యలు..
kanhaపవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో అయ్యుండొచ్చు, రాజకీయాల్లో మాత్రం అతను సైడ్ క్యారెక్టర్