రాష్ట్రీయం

Andhra Pradesh Politics: వీడియో ఇదిగో, టీడీపీ - జనసేన - బీజేపీ పొత్తు ఖాయం, సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి

Hazarath Reddy

కడప - ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖచ్చితంగా ఉంటుందని ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో కేంద్రంలో ఉన్న అధిష్టానం సైతం స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందని అన్నారు.

Free Electricity Row: వీడియో ఇదిగో, రేవంత్ రెడ్డి 3 గంటల కరెంట్ ఎపిసోడ్ సూత్రధారి కేసీఆరే, బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

కాంగ్రెస్ పార్టీని లేపాలని కేసీఆర్ అనుకున్నాడు. కేసీఆర్ అనుకున్న దానికంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ హైప్ వచ్చింది. వెంటనే దించాలి అనుకుని రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఫోన్ చేసి 3 గంటల కరెంట్ చాలు, ఉచిత విద్యుత్ అవసరం లేదని చెప్పమని చెప్పాడు. కేసీఆర్ చెప్పినట్లు రేవంత్ రెడ్డి ఆడుతున్నాడు.

Hyderabad: బండి ఫైనాన్స్ కట్టలేక రోజూవారీ కూలి ఆత్మహత్య, ఫైనాన్స్ కంపెనీ డబ్బులు కట్టాలని ఒత్తిడి చేయడంతో మైసమ్మగూడ చెరువులోకి దూకి సూసైడ్

Hazarath Reddy

హైదరాబాద్ - కుత్బుల్లాపూర్ పరిధిలో నివాసం ఉండే లక్ష్మణ్(25) అనే దినసరి కూలి ఫైనాన్స్ పెట్టి బైక్ కొనగా గత 3 నెలలుగా రూ.20 వేలు బండి ఫైనాన్స్ కట్టలేదు. ఫైనాన్స్ వారు ఫోన్ చేసి డబ్బులు కట్టాలని ఒత్తిడి చేయడంతో మైసమ్మగూడ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

AP Horror: భర్త చేతిలో నిత్యం వేధింపులకు గురైన మహిళ.. చెంబుతో కొట్టి చివరకు హత్య.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వెలుగు చూసిన ఘటన

Rudra

ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. తాగొచ్చి చిత్రహింసలు పెడుతున్న భర్తను భరించలేక చెంబుతో కొట్టి కడతేర్చిందో భార్య. ఈ ఘటన అయినవిల్లి మండలం అయినవిల్లి లంకలో వెలుగు చూసింది.

Advertisement

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య? నటుడితో రిసార్ట్‌ వద్ద కనిపించినట్టు వార్త వైరల్.. దీంతో, రెండో పెళ్లి వదంతులు మొదలు.. గతేడాది భర్త ధనుష్‌కు విడాకులు ఇచ్చిన ఐశ్వర్య

Rudra

ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రెండో పెళ్లి అంశం మరోసారి హాట్ టాపిక్‌ గా మారింది. ఇటీవల ఓ హీరోతో ఓ రిసార్ట్‌ వద్ద ఆమె సన్నిహితంగా కనిపించడంతో రెండో పెళ్లి అంశం తెరపైకి వచ్చిందని తమిళ మీడియా వర్గాలు చెబుతున్నాయి.

Chandrayaan-3: మరికొద్ది గంటల్లో చంద్రయాన్‌-3 ప్రయోగం.. విజయవంతంగా కొనసాగుతున్న కౌంట్‌డౌన్‌.. ఆదిపురుష్‌ బడ్జెట్ కంటే చంద్రయాన్‌-3 ప్రయోగం ఖర్చు తక్కువే!

Rudra

ఇస్రో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ చంద్రయాన్‌ – 3 రాకెట్ మరికొద్ది గంటల్లో నింగిని తాకనున్నది. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ విజయవంతంగా కొనసాగుతున్నది. ఏపీలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లోని లాంచ్‌ పాడ్‌ 2 నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.35కు ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్‌ ద్వారా చంద్రయాన్‌ ల్యాండర్‌, రోవర్‌ను చంద్రుడి పైకి పంపనున్నారు.

Revanth Reddy: వైఎస్సార్ ఉచిత విద్యుత్ ఇస్తాం అంటే కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని చంద్రబాబు అన్నాడు, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ ఇస్తాం అంటే కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి అని చంద్రబాబు నాయుడు అన్నాడు. ఆనాడు చంద్రబాబు బషీర్ బాగ్ ఘటనలో రైతులను పిట్టలను కాల్చినట్లు కాల్చితే ఆ ప్రభుత్వంలో కేసీఆర్ భాగస్వామిగా ఉన్నాడు: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

Pawan Kalyan on CM Jagan: వీడియో ఇదిగో, జగన్ నాకు అసలు సరిపోడు, ఆయనకు అంత సీన్ లేదు, తణుకులో సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్

Hazarath Reddy

జగన్ అనే వ్యక్తి నాకు శత్రువు కాదు.. అంత సీన్ లేదు అతనికి. జగన్ నాకు అసలు సరిపోడు - తణుకు నియోజవర్గంలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Advertisement

Dr B.S. Rao Dies: బాత్‌రూమ్‌లో కాలు జారిపడి శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్‌ మృతి, చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచిన డా.బి.ఎస్‌. రావు

Hazarath Reddy

శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్‌ డా.బి.ఎస్‌. రావు ప్రమాదవశాత్తు బాత్‌రూమ్‌లో కాలు జారిపడి తీవ్ర గాయాలతో మృతి చెందారు.ఈ రోజు ఇంట్లో బాత్‌రూమ్‌లో కాలుజారి పడిన డా. బీఎస్‌రావును అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బీఎస్ రావు తిరిగి కోలుకోలేకపోయారు.

Andhra Pradesh: స్థానిక ఉద్యోగాలపై జగన్ సర్కారు కీలక నిర్ణయం, ప్రైవేటు కంపెనీల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశాలు

Hazarath Reddy

స్థానిక ఉద్యోగాలపై జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు చెందాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇది ఇప్పటికే కార్యాచరణలోకి రాగా సమగ్ర పర్యవేక్షణ ద్వారా మరింత సమర్థంగా అమ­లవుతుందన్నారు. దీనిపై సమీక్షిస్తూ క్రమం తప్ప­కుండా ఆరు నెలలకు ఒకసారి నివేదికలు పంపాలని కలెక్టర్లకు సూచించారు.

Sexual Assault Case: అర్థరాత్రి బాలికను రూంకి లాక్కెళ్లి స్వామీజి అత్యాచారం, పూర్ణానంద రిమాండ్‌ను మరోసారి పొడిగించిన కోర్టు

Hazarath Reddy

అత్యాచారం కేసులో పూర్ణానంద రిమాండ్‌ను కోర్టు మరోసారి పొడిగించింది. ఇక, మైనర్లపై అత్యాచారానికి పాల్పడినట్టు ఫిర్యాదు రావడంతో దిశ పోలీసులు పూర్ణానందను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

Telangana Horror: చికెన్ బదులు వంకాయ కూర వండిందని భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త, మరో ఘటనలో పెళ్లయిన పది రోజులకే నవవధువు ఆత్మహత్య

Hazarath Reddy

మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో నచ్చిన కూర వండలేదని భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి చికెన్ వండాలని భర్త..భార్యకు చెప్పాడు.

Advertisement

Video: వీడియో ఇదిగో, స్కూలును మందు బారుగా మార్చేసిన 9వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయుడిని ఇరికించే ప్రయత్చం చేసి అడ్డంగా దొరికిన స్టూడెంట్స్

Hazarath Reddy

స్కూల్‌లోనే విద్యార్థులు మందుకొట్టి టీచర్‌ను ఇరికించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారు. ములుగు జిల్లా మల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగిందీ ఘటన

Andhra Pradesh Politics: నేను బీజేపీ వైపు ఉన్నానని ముస్లింలు నన్ను నమ్మడం లేదు, వాలంటీర్లు నాకు తమ్ముళ్లతో సమానం, వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్

Hazarath Reddy

పవన్‌ కళ్యాణ్ చేపట్టిన రెండో విడత వారాహి యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం చేరుకుంది. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. జగన్ కొంతకాలంగా దిగజారి మాట్లాడుతున్నారని, తాను మాత్రం జగన్ భార్య గురించి ఏనాడూ మాట్లాడలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.

TSRTC MD VC Sajjanar: షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, భారీ వాహనం కిందపడి తృటిలో చావు నుండి తప్పించుకున్న బైక్ రైడర్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా ఓ షాకింగ్ వీడియో షేర్ చేశారు. మాములు అదృష్టం కాదు ఇది! భారీ వాహనాలు వెంట వెళ్ళేటప్పుడు ద్విచక్రవాహన చోదకులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదం ఎప్పుడైనా, ఎటు నుంచైనా రావొచ్చు.. జాగ్రత్త! అంటూ సజ్జనార్ ట్వీట్ చేశారు.

Pawan Kalyan Slams Jagan: వీడియో ఇదిగో, మీ నాన్న లాగా, నీలాగా దొచేయడానికి మా దగ్గర డబ్బుల్లేవు, సీఎం జగన్‌పై విరుచుకుపడిన పవన్ కళ్యాణ్

Hazarath Reddy

జగన్.. నువ్వు ఉపాధి అవకాశాలు కల్పించవు, పరిశ్రమలు రానివ్వవు, పారిశ్రామికవేత్తలను బతకనివ్వవు. ఎవరైనా కంపెనీ పెడితే నీ ఎమ్మెల్యేలు లంచాలు కావాలని పీడించేస్తారు. యువత ఎక్కడికి వెళ్ళాలి.. తెలంగాణకి వెళ్తే వాళ్ళేమో మీ ఆంధ్ర వాళ్లు దోచేశారు.. దొబ్బేయండి అని తిడుతున్నారు. మీ నాన్న లాగా, నీలాగా దొచేయడానికి మా దగ్గర డబ్బుల్లేవు. మేము మా నేల లోనే బతకాలి - పవన్ కళ్యాణ్

Advertisement

Video: వీడియో ఇదిగో, భర్త ఇంటికి రావట్లేదని బాబాతో కుద్రపూజలు చేయించిన భార్య, ఇద్దర్నీ అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

హైదరాబాద్ - కంచన్ బాగ్‌లోని హఫీజ్ నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. భర్త ఇంటికి రావట్లేదని అతని భార్య క్షుద్ర పూజలు చేసింది.ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి ఇంటికి రావడం మానేశాడు.దీంతో అదని భార్య హజీరా మరో బాబాతో కలిసి అతనిపై కుద్ర పూజలు చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు అతని భార్యను, బాబాను అరెస్ట్ చేశారు. వీడియో ఇదిగో..

Pawan Kalyan Comments Row: విజయవాడ సీపీకి పవన్‌ కల్యాణ్‌పై ఫిర్యాదు, ఏపీలో దుమారం రేపుతున్న జనసేనాధినేత వ్యాఖ్యలు

Hazarath Reddy

ఏపీ వాలంటీర్లనుద్దేశించి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రం భగ్గుమంటోంది. ఇప్పటికే పవన్‌కు మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేయగా.. డీజీపీకి సైతం ఫిర్యాదు వెళ్లింది. ఇక ఇప్పుడు వైస్సార్‌సీపీ లీగల్ సెల్ విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ మీటింగ్, మొత్తం 55 అంశాలపై కొనసాగిన భేటీ, జగనన్న సురక్ష అమలుపై ప్రముఖంగా ప్రస్తావన

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్ష­తన బుధవారం రాష్ట్ర కేబినెట్‌ సమావేశం ముగిసింది. సచివాల­యం మొదటి బ్లాకులోని కేబినెట్‌ సమావేశ మం­దిరంలో ఈ భేటీ జరిగింది. పలు కీలక నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Telangana Shocker: అత్తపూర్‌లో దారుణం, ఇద్దరు కూలీలను నగ్నంగా నిలబెట్టి 12 వేల నగదు దోచుకున్న దొంగలు, ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు

Hazarath Reddy

అత్తపూర్‌లో దారుణం చోటు చేసుకుంది, దొంగలు రెచ్చిపోయారు. ఇద్దరు హమీలీలను నగ్నంగా నిలబెట్టి 12 వేల నగదు దోచుకున్నారు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దానికి సంబంధించిన వీడియో ఇదే..

Advertisement
Advertisement