రాష్ట్రీయం
TTD Key Decisions: తిరుమలలో రూ.14 కోట్లతో అదనపు లడ్డూ కౌంటర్ల నిర్మాణం, రూ.1 కోటి 28 లక్షలతో వసతి గృహాల ఆధునీకరణ, టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవిగో..
Hazarath Reddyతిరుమలలో రూ. 4 కోట్లతో తిరుమలలో అదనపు లడ్డూ కౌంటర్ల నిర్మాణం చేపట్టనున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రూ. 1 కోటి 28 లక్షలతో వసతి గృహాల ఆధునీకరించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సోమవారం సమావేశమైంది. సమావేశ తీర్మానాలను టీటీడీ ఛైర్మన్ మీడియాకు వెల్లడించారు.
Balkampet Yellamma Kalynam: నేటి నుంచి 3 రోజుల పాటు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాలు, హైదరాబాద్‌లో ఈ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
Hazarath Reddyసోమవారం ఎదుర్కోళ్లు, మంగళవారం ఎల్లమ్మ కల్యాణం, బుధవారం రథోత్సవం నిర్వహిస్తామని ఆలయ ఈవో ఎస్‌ అన్నపూర్ణ తెలిపారు.ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.
YS Viveka Murder Case: వివేకా హత్య కేసు, అవినాశ్ రెడ్డి, సీబీఐకు సుప్రీంకోర్టు నోటీసులు, సునీతారెడ్డి పిటిషన్‌పై విచారణ జూలై3కు వాయిదా
Hazarath Reddyవైఎస్ వివేకా హత్య కేసులో.. ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ సునీతారెడ్డి వేసిన పిటిషన్‌పై విచారణ వచ్చే నెల(జులై) 3వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణ కోసం సీజేఐ బెంచ్‌ ముందు లిస్ట్‌ చేయాలని ఆదేశిస్తూనే.. ప్రతివాదులకు సోమవారం నోటీసులూ జారీ చేసింది. అవినాశ్‌‌తో పాటు సీబీఐకి కూడా ధర్మాసనం నోటీసులు పంపించింది.
Cricket Player Dies of Heart Attack: విశాఖలో క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిన క్రికెట్ ప్లేయర్, ఆస్పత్రికి తీసుకు వెళ్లే లోపే మృతి
Hazarath Reddyవిశాఖపట్నంలో జరుగుతున్న అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నీలో ఆడుతూ 26 ఏళ్ల న్యాయవాది మృతి చెందాడు. ఆదివారం గాజువాకలోని జింక్ క్రికెట్ గ్రౌండ్ నుంచి బయటకు వస్తుండగా మణికంఠ నాయుడు కుప్పకూలి మృతి చెందాడు. సాక్షుల ప్రకారం, మ్యాచ్ పూర్తయిన తర్వాత నాయుడు మైదానం నుండి బయటకు వస్తుండగా, గుండె ఆగిపోవడంతో అతను కుప్పకూలిపోయాడు.
Telangana Shocker: వీడియో ఇదిగో, చేతబడి చేశారంటూ దంపతులను చెట్టుకు వేలాడదీసి దారుణంగా కొట్టిన గ్రామస్తులు
Hazarath Reddyసదాశివపేటకు చెందిన యాదయ్య, అతని కుటుంబ సభ్యులు చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో కొంతమంది గ్రామస్తులు యాదయ్య కుంటుంబాన్ని గ్రామ నడివీధిలోని చెట్టుకు తాళ్లతో వేలాడదీసి కర్రలతో దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Heatwave Alert: తెలంగాణ, ఏపీ సహా దేశంలోని 10 రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజులపాటు తీవ్ర వడగాల్పులు.. జాగ్రత్తగా ఉండాలంటూ భారత వాతావరణ విభాగం హెచ్చరిక
Rudraవచ్చే మూడు రోజులపాటు దేశంలోని 10 రాష్ట్రాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. తెలంగాణ, ఏపీ, ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్రలోని విదర్భ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
28 Trains Cancelled: ఏపీ, తెలంగాణ సహా పలు ప్రాంతాలకు ప్రయాణించే ప్యాసింజర్లు అలెర్ట్.. వారం రోజులపాటు 28 రైళ్ల రద్దు.. 23 ఎంఎంటీఎస్ రైళ్లు కూడా రద్దు.. ట్రాక్ నిర్వహణ పనుల నేపథ్యంలోనే నిర్ణయం
Rudraతెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు ప్రయాణించే 28 రైళ్లను వారం రోజులపాటు రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ పరిధిలో ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా నేటి నుంచి 25 వరకు 28 రైళ్లను రద్దు చేసినట్టు తెలిపింది.
TTD Seva Tickets: నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల.. జూన్ 21 వరకు లక్కీడిప్ కు అవకాశం.. మరిన్ని వివరాలు ఇవే..
Rudraతిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సెప్టెంబరు నెల శ్రీవారి సేవలకు సంబంధించిన టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. నేడు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆన్ లైన్ లో ఉంచనుంది.
Kalyanam at Yellamma Devasthanam: నేడు బల్కంపేట్‌ ఎల్లమ్మ కల్యాణం.. ఆలయం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు
Rudraతెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బల్కంపేట్‌ ఎల్లమ్మ కల్యాణం నేడు. ఈ సందర్భంగా సోమ, మంగళవారాల్లో ఆలయం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ సుధీర్‌బాబు వివరించారు. సోమవారం కల్యాణోత్సవం, మంగళవారం రథోత్సవ కార్యక్రమాలుంటాయని తెలిపారు. కల్యాణం సందర్భంగా ఆలయం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
Half Day Schools In AP: ఏపీ విద్యార్ధులకు గుడ్‌ న్యూస్! ఈ నెల 24 వరకు ఒంటిపూట బడులు, వడగాల్పులు, ఎండల దృష్ట్యా ప్రభుత్వం నిర్ణయం
VNSఏపీ విద్యార్థులకు శుభవార్త (Half Day Schools) ! ఒంటిపూట బడులను ఈ నెల 24 వరకు పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ (Ap Schools) నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌. సురేశ్‌కుమార్‌ (Suresh Kumar) తెలిపారు.
Rakesh Master And Prabhas Pic: ప్రభాస్‌కు డ్యాన్స్ నేర్పింది రాకేష్ మాస్టరే! సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫోటో, రాకేష్ మాస్టర్‌ తో కలిసి ప్రభాస్‌ డ్యాన్స్ ప్రాక్టీస్‌
VNSఆయన మరణ వార్త తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే రాకేష్ మాస్టర్ కి సంబంధించిన ఒక పాత ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎంతో గొప్ప స్టార్‌డమ్ ని అందుకున్న ప్రభాస్ (Prabhas) కి కెరీర్ మొదటిలో రాకేష్ మాస్టర్ డాన్స్ పాఠాలు నేర్పించాడు.
Rakesh Master Died: రాకేష్ మాస్టర్ చనిపోతాడని రెండు నెలల క్రితమే హెచ్చరించిన డాక్టర్లు, 15 రోజుల క్రితమే శిశ్యుడితో కలిసి చావుపై రాకేష్ మాస్టర్ వీడియో, గాంధీ ఆస్పత్రిలో బెడ్‌పై రాకేష్ మాస్టర్ చివరి క్షణాలు ఇవీ!(వీడియో)
VNSమధ్యాహ్నాం ఒంటిగంట సమయంలో గాంధీ ఆస్పత్రిలో చేరిన రాకేశ్ మాస్టర్.. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో సాయంత్ర 5 గంటల సమయంలో మరణించినట్లు సమాచారం. రాకేష్ మాస్టర్ ఆస్పత్రిలో ఉన్నప్పటి చివరి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. బెడ్‌ మీద కొన ఊపిరితో ఆయన కొట్టుమిట్టాడుతున్న వీడియో చూసిన ఫ్యాన్స్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
TSRTC: తెలంగాణ ఆర్టీసీలో ఇకపై మహిళలు, సీనియర్ సిటిజన్లకు 100 రూపాయలకే వన్ డే పాస్ పథకం ప్రారంభం..ఒక్క టికెట్ తో రోజంతా ప్రయాణించవచ్చు..
kanhaమహిళలు, వృద్ధులు కేవలం రూ.100 చెల్లించి ఈ టికెట్‌ పొందితే 60 కి.మీ పరిధిలో రానుపోను ప్రయాణించొచ్చు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకే చెల్లుబాటు అవుతుంది.
Retired MPDO Murder: కిడ్నాపైన రెండు రోజులకు బట్టలు లేకుండా దొరికిన శవం, జనగామలో రిటైర్డ్ ఎంపీడీవో దారుణహత్య, గతంలో పలువురి పట్టాదార్ పాసుబుక్‌లు రద్దు చేసి వివాదంలో ఇరుక్కున్న ఎంపీడీవో
VNSజనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేటకు చెందిన రిటైర్డ్ ఎంపీడీవో నల్ల రామకృష్ణ (Nalla Ramakrishna) దారుణ హత్యకు గురయ్యాడు. ఈనెల 15న కిడ్నాప్ అయిన రామకృష్ణ మృతదేహాన్ని జనగామ మండలంలోని చెంపక్ హిల్స్ వద్ద అటవీ ప్రాంతంలో గుర్తించారు. రామకృష్ణను ఓ కీలక ప్రజాప్రతినిధి భర్త, మరో సర్పంచ్ సహా బాధితులంతా కిరాయి హంతకులతో డీల్ కుదుర్చుకొని హత్య చేయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
JEE Advanced 2023 Results: జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ ఫలితాలు వచ్చేశాయోచ్.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!
Rudraజేఈఈ అడ్వాన్స్‌ డ్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షలకు దాదాపు... 1.80 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
RBI Lost Money: ప్రింట్‌ అయినా ఆర్బీఐకి చేరని 88 వేల కోట్ల విలువైన రూ.500 నోట్లు.. ఆర్బీఐ ఏం చెప్పిందంటే?
Rudraదేశ ఆర్థిక వ్యవస్థను, నగదును నియంత్రించే రిజర్వు బ్యాంకే నోట్లను పోగొట్టుకున్నది. ఒకటి రెండు నోట్లు, నోట్ల కట్టలు కాదు.. నోట్ల గుట్టలనే పోగొట్టుకున్నది. వీటి విలువ అక్షరాలా రూ.88,032 కోట్లు.
JEE Advanced 2023 Results: నేడు జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ ఫలితాలు.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!
Rudraజేఈఈ అడ్వాన్స్‌ డ్‌ ఫలితాలు నేడు ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షలకు దాదాపు... 1.80 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
Special Trains to Puri: పూరీ జగన్నాథ్ రథయాత్రకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు.. జూన్ 18వ తేదీ నుండి 22 మధ్య ఆరు ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్, కాచిగూడ, నాందేడ్ నుండి రైళ్ల ప్రారంభం
Rudraదేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఎదురుచూస్తున్న పూరీ జగన్నాథ (Puri Jagannadh) రథయాత్రకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ క్రమంలో పూరీకి (Puri) వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) శుభవార్త (Goodnews) చెప్పింది. ఇక్కడికి ప్రత్యేక రైళ్లను (Special Trains) నడుపుతోంది.
Ravinder Gupta Arrested: తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ అరెస్ట్, రూ.50వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయిన రవీందర్ గుప్తా, యూనివర్సిటీలో సంబురాలు
VNSనిజామబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీ (Telangana University) వైస్‌ చాన్స్‌లర్‌ దాచేపల్లి రవీందర్‌ గుప్తా (VC Ravinder Gupta)ను ఏసీబీ అధికారులు శ‌నివారం సాయంత్రం అరెస్టు చేశారు. తార్నాక‌లోని ఆయ‌న నివాసంలో దాదాపు 8 గంట‌ల పాటు సోదాలు నిర్వ‌హించిన అనంత‌రం ర‌వీంద‌ర్ గుప్తాను అరెస్టు చేస్తున్న‌ట్లు ఏసీబీ అధికారులు ప్ర‌క‌టించారు.
Telangana Shocker: ములుగు జిల్లా మంగపేటలో రోడ్డు ప్రమాదం వీడియో వైరల్, ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ కొన్న వీడియో చూస్తే గుండె గుభేల్ మనడం ఖాయం..
kanhaములుగు జిల్లా మంగపేటలోని తెలంగాణ సెంటర్ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందగా.. తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. నిర్లక్ష్యం, పరధ్యానం వల్లే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్ ట్వీట్ చేశారు.