ఆంధ్ర ప్రదేశ్

Guidelines For Transfer Of Employees: ఏపీలో 15 శాఖల్లో బదిలీలు, గైడ్ లైన్స్ జారీ చేసిన ప్రభుత్వం, 31లోగా బదిలీల ప్రక్రియ పూర్తి

Arun Charagonda

ఏపీ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన గైడ్‌లైన్స్ ను విడుదల చేసింది ప్రభుత్వం. మొత్తం 15 శాఖల్లో బదిలీలు చేపట్టాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. 5 ఏళ్లు ఒకేచోట పని చేసినవారికి బదిలీ తప్పనిసరి చేసింది. ఈ నెల 31లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలిచ్చింది ప్రభుత్వం.

Tirumala: తిరుమల కొండపై మందుబాబుల బీభత్సం, గాజు బాటిళ్లతో దాడి, ఇద్దరికి తీవ్ర గాయాలు, వీడియో వైరల్

Arun Charagonda

తిరుమల కొండపై మందుబాబులు హల్ చల్ చేశారు. మద్యం మత్తులో కొట్టుకున్నారు. నందకం అతిథిగా గృహం వద్ద గాజు బాటిళ్ళతో దాడి చేసుకోగా ఇద్దరి తీవ్ర గాయాలయ్యాయి. నందకం అతిథిగా గృహం వద్ద ఈ ఘటన జరుగగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Duvvada Srinivas: దువ్వాడ వాణికి టెక్కలి పోలీసుల నోటీస్, పోలీసులతో వాణి వాగ్వాదం, నోటీసులు తీసుకునేందుకు నిరాకరణ

Arun Charagonda

తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ఎపిసోడ్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దువ్వాడ శ్రీనివాస్ - వాణి మధ్యలో మాధురి విషయం రచ్చచెక్కగా దువ్వాడ శ్రీనివాస్ ఇంటి బయట నిరసన చేస్తూనే ఉన్నారు వాణి.

Nara Lokesh on Red Book: మా గెలుపులో రెడ్ బుక్ కూడా ఒక భాగం, క్లారిటీ ఇచ్చిన నారా లోకేష్, చట్టాలు ఉల్లంఘించినవాళ్లను వదిలిపెట్టనంటూ వార్నింగ్

Hazarath Reddy

ఏపీలో నారా లోకేశ్ 'రెడ్ బుక్' రాజ్యాంగం నడుస్తోందని, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న సంఘటనలే అందుకు కారణమని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. "రెడ్ బుక్ లో నేను ఏం చెప్పాను? ఓసారి పరిశీలించుకోండి

Advertisement

MLA Paritala Sunitha: పొలంలోకి దిగి వరి నాట్లు వేసిన ఎమ్మెల్యే పరిటాల సునీత, నేల తల్లికి పూజలు...వీడియో

Arun Charagonda

టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పరిటాల సునీత రైతుగా మారారు. వెంకటాపురంలోని తన వ్యవసాయ క్షేత్రంలో వరలక్ష్మి వ్రతం సందర్బంగా నేల తల్లికి పూజలు చేశారు. అనంతరం తోటి కూలీలతో కలిసి పొలంలో వరి నాట్లు వేశారు పరిటాల సునీత

EOS-08 Earth Observation Satellite: విజయవంతంగా కక్ష్యలోకి ఈవోఎస్‌-08 ఉపగ్రహం, ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్‌ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి..

Hazarath Reddy

ఇస్రో (ISRO) చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది. శుక్రవారం ఉదయం నెల్లూరు జిల్లా శ్రీహరికోట (Sriharikota) షార్(Shar) నుంచి ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్‌ను‌ (SSLV-D3 Rocket ) నింగిలోకి పంపింది. షార్‌లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది.

Chaddi Gang Caught on Camera: తిరుపతిలో కెమెరాకు చిక్కిన చెడ్డి గ్యాంగ్, ఇంట్లో చొరబడి నగలు, నగదుతో పరార్, రంగంలోకి దిగిన పోలీసులు

Hazarath Reddy

తిరుపతి జిల్లా తిరుచానూరులో చెడ్డి గ్యాంగ్ హల్ చల్ చేశారు. కొత్తపాళెం లే అవుట్‌లో ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన ఈ చెడ్డీ గ్యాంగ్. బీరువాలో నగలు, నగదుతో పరారయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. బాధితుడు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Thief at Basara Temple: బాసర అమ్మవారి ఆలయంలో చోరీ.. గోడ దూకి చొరబడిన దుండగుడు.. చీరల విక్రయ కేంద్రం బీరువా, హుండీలను పగలకొట్టి చోరీ

Rudra

నిర్మల్ లోని బాస‌రలో కొలువైన స‌ర‌స్వ‌తీ అమ్మ‌వారి ఆల‌యంలో చోరీ జ‌రిగింది. ఆలయం లోపలికి గోడ దూకి చొరబడిన దుండగుడు ఆలయంలోని చీరల విక్రయ కేంద్రం బీరువా, హుండీలను పగలకొట్టి చోరీ చేశాడు.

Advertisement

SSLV-D3: ఇస్రో ఎస్ఎస్ఎల్వీ-డీ3 ప్రయోగం విజయవంతం.. విపత్తు నిర్వహణలో సాయపడటమే లక్ష్యం (వీడియోతో)

Rudra

భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో ఖాతాలో మరో విజయం చేరింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఇస్రో చేపట్టిన ఎస్ఎస్ఎల్వీ-డీ3 ప్రయోగం విజయవంతమైంది.

Varalakshmi Vratham 2024: నేడే వరలక్ష్మీవ్రతం.. లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ అందమైన కార్డ్స్ తో మీ బంధువులకు, స్నేహితులకు స్పెషల్ విషెస్ అందించండి

Rudra

తెలుగింటి ఆడబిడ్డలు ఎంతో మురిపెంగా చేసుకునే వరలక్ష్మీవ్రతం నేడే. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేసుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ పర్వదినంనాడు లేటెస్ట్ లీ అందిస్తున్న ఈ అందమైన కార్డ్స్ తో మీ బంధువులకు, స్నేహితులకు స్పెషల్ విషెస్ అందించండి.

Pawan Kalyan Selfie With Daughter: తండ్రితో క‌లిసి ఇండిపెండెన్స్ డే వేడుక‌ల్లో పాల్గొన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ కుమార్తె, వైర‌ల్ గా మారిన తండ్రీ కూతుళ్ల సెల్ఫీ

VNS

ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కాకినాడలోని పోలీస్ పరెడ్ గ్రౌండ్లో నిర్వహించిన 78వ ఇండిపెండెన్స్ డే వేడుకల్లో మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల నుంచి సీఎం గౌరవ వందనం స్వీకరించారు.

NTR Anna Canteens Menu: అన్న క్యాంటీన్లలో రోజు వారీ మెనూ ఇదిగో, నేటి నుంచి 5 రూపాయలకే భోజనం, టిఫెన్ ప్రారంభం

Hazarath Reddy

Advertisement

NTR Anna Canteens: ప్రతి ఒక్కరం బతికేది జానెడు పొట్టకోసమే, అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు, ఇంకా ఏమన్నారంటే..

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తన అర్ధాంగి నారా భువనేశ్వరితో కలిసి గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు దంపతులు అన్న క్యాంటీన్ లో భోజనాలు వడ్డించారు. పేదలతో కలిసి భోజనం చేశారు.

National Flag Underwater: సముద్ర గర్భాన జాతీయ జెండా రెపరెపలు, విశాఖలో స్కూబా డైవర్ సాహసం, వీడియో వైరల్

Arun Charagonda

దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. తెలుగు రాష్ట్రాల్లో సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వైజాగ్ సముద్ర గర్భంలో జాతీయ జెండాను రెపరెపలాడించారు స్కూబా డైవర్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Jagan's Disproportionate Assets Case: జగన్ అక్రమాస్తుల కేసు, విచారణ నుండి తప్పుకున్న సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సంజయ్ కుమార్

Hazarath Reddy

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్, విజయసాయి రెడ్డిలకు వ్యతిరేకంగా ఈడీ దాఖలు చేసిన కేసు విచారణ నుండి సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ తప్పుకున్నారు.

CM Chandrababu: 2019-2024 మధ్య ఒక విధ్వంస పాలన జరిగింది, గత ఐదేళ్లలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్‌ను తిరిగి తెస్తామని తెలిపిన చంద్రబాబు

Hazarath Reddy

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో మువ్వన్నెల జెండాను ఎగురవేశారు.

Advertisement

Andhra Pradesh: బెట్టింగ్‌లో రూ.2.40 కోట్ల అప్పు చేసిన కొడుకు, అప్పులు కట్టలేక తల్లిదండ్రుల ఆత్మహత్య, నంద్యాలలో విషాదం

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలలో విషాదం నెలకొంది. అబ్దుల్లాపురానికి చెందిన మహేశ్వర్, ప్రశాంతి దంపతుల కొడుకు నిఖిల్. డిగ్రీ కోసం బెంగళూరుకు పంపితే బెట్టింగులకు బానిసై ₹2.40 కోట్ల అప్పు చేశాడు. తల్లిదండ్రులు వాళ్ల 10 ఎకరాల భూమి, ఇల్లు అమ్మేసినా అప్పు తీరలేదు. అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు చేసుకున్నారు.

Aarogyasri Services in AP: ఏపిలో రేపటి నుంచి ఆస్పత్రులో ఆరోగ్య శ్రీ సేవలు బంద్, ప్రభుత్వం నుంచి పెండింగ్‌లో రూ.2500 కోట్లు బకాయిలు

Hazarath Reddy

పెండింగ్ బకాయిలు చెల్లించనందున ఆగస్టు 15 నుంచి రోగులకు ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగించలేమని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ వెల్లడించింది. 2023 సెప్టెంబర్ తర్వాత బిల్లుల చెల్లింపులు నిలిచిపోగా..ప్రభుత్వం నుంచి రూ.2500 కోట్లు రావాల్సి ఉంది.

Man Catches Snake Video: వీడియో ఇదిగో, బ్యాంక్‌లో దూరి కస్టమర్లను, బ్యాంక్ సిబ్బందిని హడలెత్తించిన పాము

Hazarath Reddy

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి పాము దూరింది. వడ్లపూడిలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి ఎలా వెళ్లిందో కానీ.. ఓ పాము ప్రవేశించింది. రికార్డు రూములోకి దూరి తిష్ట వేసింది. ఉదయమే బ్యాంకు తెరిచిన సిబ్బంది.. రికార్డు రూమ్‌లోకి వెళ్లారు. అక్కడ పామును చూసి బిత్తరపోయారు

YS Sharmila: వైఎస్ జ‌గ‌న్ ఎన్న‌టికీ మ‌ళ్లీ సీఎం అవ్వ‌రు! సంచ‌ల‌న కామెంట్స్ చేసిన వైఎస్ ష‌ర్మిల‌

VNS

వైసీపీ ఎన్నటికీ అధికారంలోకి రాదు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఎందుకు పోటీ పెట్టలేదు? భారీ మెజారిటీతో గెలిచి ఎందుకు ధైర్యం చేయలేదు? బొత్స అనే వాడు నిండు సభలో విజయమ్మను అవమానించాడు.

Advertisement
Advertisement