ఆంధ్ర ప్రదేశ్
Andhra pradesh: మానవత్వం చాటుకున్న మదనపల్లె సీఐ, ఫిర్యాదు ఇవ్వడానికి స్టేషన్‌కువచ్చిన బాధితురాలికి అస్వస్థత, తన వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించిన సీఐ
Arun Charagondaమానవత్వం చాటుకున్న మదనపల్లె సీఐ చాంద్‌బాషా మంచి మనసు చాటుకున్నారు. ఫిర్యాదు ఇవ్వడానికి అర్ధరాత్రి స్టేషన్‌కి వచ్చిన బాధితురాలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో తన వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి.. వైద్యం చేయించారు. దీంతో సీఐ చాంద్‌బాషాని అభినందించింది పోలీస్ శాఖ.
Rammohan Naidu: నాగార్జున సాగర్ వద్ద త్వరలోనే విమానాశ్రయం, మరికొన్ని ప్రాంతాల్లోనూ కొత్త ఎయిర్ పోర్టులు నిర్మిస్తామన్న రామ్మోహన్ నాయుడు
VNSనాగార్జున సాగర్‌తో(Nagarjuna Sagar) పాటు మరికొన్ని విమానాశ్రయాల (Airports )ఏర్పాటుకు కేంద్రం ఆలోచిస్తుందని కేంద్ర విమానాయానశాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు(Minister Rammohan Naidu) వెల్లడించారు. వీటితో పాటు శ్రీకాకుళం, దగదర్తిలో, కుప్పం వద్ద కూడా విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.
YS Jagan Tweet: పంట బీమా ఎప్పుడు చెల్లిస్తారు! సీఎం చంద్రబాబు అలసత్వంతో వేలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ జగన్ ఫైర్
VNSఏపీ రైతుల పట్ల చంద్రబాబు (CM Chandra Babu) నిర్లక్ష్యం వహిస్తుందని మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan) ధ్వజమెత్తారు. సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడంతో రైతులకు నష్టం వాటిల్లుతుందని ఆరోపించారు.
Duvvada Srinivas - Madhuri: బిగ్ ట్విస్ట్.. మరోసారి మాధురి ఆత్మహత్య యత్నం, ఆగి ఉన్న కారును ఢీకొట్టిన మాధురి, తీవ్ర గాయాలు
Arun Charagondaదువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీలో నెలకొన్న విభేదాలు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. రెండు సంవత్సరాలుగా జరుగుతున్న గోడవలు రచ్చకెక్కగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇక తన భార్య వాణి, కూతుళ్లపై ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు దువ్వాడ. అనంతరం వాణితో జరుగుతున్న పరిణామాలపై వివరణ ఇచ్చారు.
Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ ఎఫెక్ట్..మిగితా రాజకీయ నాయకులకు కనువిప్పే, ఎందుకో తెలుసా?
Arun Charagondaరాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఒక్కోసారి తాము మాట్లాడిన మాటలే తమ మెడకే చుట్టుకుంటాయి. ఇది సరిగ్గా దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ చూస్తే తెలిసిపోతుంది. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడిన దువ్వాడ తీవ్ర విమర్శలు చేశారు. హిందు సంప్రదాయం, మూడు పెళ్లిళ్లు అంటూ పవన్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు.
Andhra Pradesh Rains: ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు, ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
Arun Charagondaతెలుగు రాష్ట్రాలకు భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. రానున్న మూడు రోజుల్లో తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవగా మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలకు భయాందోళనకు గురవుతున్నారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, శ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల గుంపు హల్ చల్...భయాందోళనలో రెండు గ్రామాల ప్రజలు, విద్యుత్ నిలిపేసిన అధికారులు
Arun Charagondaశ్రీకాకుళం జిల్లాలో ఏనుగుల గుంపు హల్ చల్ సృష్టించింది. వంగర మండలం వివిఆర్ పేట, రాజుల గుమడ గ్రామల్లో తిష్ట వేశాయి ఏనుగుల గుంపు. భయాందోళనలో రెండు గ్రామాల ప్రజలు ఉండగా అప్రమత్తమై విద్యుత్ శాఖ అధికారులు చుట్టుపక్క గ్రామాలకు విద్యుత్ నిలిపివేశారు.
Andhra Pradesh: అల్లుడి కోసం 100 వంటకాలు.. తొలిసారి ఇంటికి వచ్చిన అల్లుడికి అదిరే వంటకాలు, ఆంధ్ర అత్తకు జేజేలు పలుకుతున్న నెటిజన్లు!
Arun Charagondaతొలిసారి ఇంటికి వచ్చిన అల్లుడికి అదిరే సర్‌ప్రైజ్ ఇచ్చారు ఓ అత్త. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడ గ్రామానికి చెందిన రత్నకుమారికి కాకినాడకు చెందిన రవితేజకు గతేడాది సెప్టెంబర్లో వివాహం జరిగింది. వివాహం అయి ఆషాడం మాసం ముగిసిన తర్వాత తొలిసారిగా అత్తారింటికి వచ్చిన అల్లుడికి అత్తమామలు ఏకంగా 100 రకాల పిండివంటలతో భోజన ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Attack On YSRCP Leader: అన్నమయ్య జిల్లాలో దారుణం, వైసీపీ నాయకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి, తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. వైఎస్సార్సీపీ నాయకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. తంబళ్లపల్లి నియోజకవర్గం పులికల్లు గ్రామ పంచాయతీకి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు లక్ష్మీ నారాయణ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కుటుంబ సమేతంగా దర్శనం..వీడియో
Arun Charagondaతిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక అంతకముందు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న భట్టికి అనుకోకుండా తారసపడ్డారు మోహన్ బాబు. వీరిద్దరి కాసేపు ముచ్చటించుకున్నారు.
Tungabhadra Dam Gate Chain Snaps: అలర్ట్.. భారీ వరదకు కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు.. గత 70 ఏండ్లలో ఇలాంటి ఘటన ఇదే మొదటిసారి.. తెగిన గేట్ మార్గం నుంచి 35 వేల క్యూసెక్కుల వరద.. ఏపీలోని మంత్రాలయం, నందవరం ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు
Rudraఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర, కృష్ణానదిలో వరద పోటెత్తుతున్నది. వరద ప్రవాహ తీవ్రతకు కర్ణాటకలోని హోస్పేట్ లో ఉన్న తుంగభద్ర డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోయింది.
Ashwini Vaishnaw About New Rail Projects: తెలుగు రాష్ట్రాలకు కొత్త రైల్వే లైన్లు, బెంగాల్ టూ వరంగల్, భద్రాచాలం టూ తూర్పుగోదావరి కొత్త రైల్వే లైన్ల ఏర్పాటు, ఐదేళ్లలో పూర్తి చేస్తామన్న కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్
Arun Charagondaతెలుగు రాష్ట్రాలకు కొత్త రైల్వే కారిడార్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్. బెంగాల్‌లోని అసోన్‌సోల్ నుండి వరంగల్ వరకు అలాగే భద్రాచలం మీదుగా తూర్పుగోదావరి వరకు కొత్త రైల్వే లైన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏపీ, తెలంగాణతో పాటు బిహార్, ఝార్ఖండ్ కొత్త రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను తెలిపారు.
Duvvada Srinivas: మాకు నాన్న కావాలి, నా కుటుంబమే నాపై దాడి చేస్తోంది, కుటుంబ సభ్యులపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కేసు, వాణికి విడాకులు ఇస్తానని వెల్లడి
Arun Charagondaవైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ పరిస్థితులు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. మాకు నాన్న కావాలి అంటూ దువ్వాడ శ్రీనివాస్ మరో మహిళతో ఉన్న ఇంటిపై దాడికి చేయగా దీనిపై స్పందించారు శ్రీనివాస్. సమాజంలో, జగన్ ముందు తనను దోషిగా నిలబెట్టారని మండిపడ్డారు. మంత్రి అచ్చెన్నాయుడు దర్శకత్వంలోనే వాణి నడుస్తోందని ఆరోపించారు. వాణికి రాజకీయ ఆకాంక్ష ఎక్కువని ఓ కూతురు పెళ్లి చేశాను మరో కూతురు పెళ్లి చేయాల్సి ఉందన్నారు. క్వారీ డబ్బులు అన్ని తనకే ఇవ్వాలని రచ్చ చేసేదని మండిపడ్డారు. ఇవాళ తనపైకి తన పిల్లలతో పాటు చాలా మందిని తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Viral Video: ఎంతకు తెగించావ్రా..? అమ్మవారికి భక్తితో మొక్కినట్టే మొక్కి.. ఆభరణాలు చోరీ చేసిన దొంగ.. అన్నమయ్య జిల్లాలో ఘటన (వీడియో)
Rudraదొంగతనానికి హద్దూ అదుపు లేకుండా పోతుంది. భక్తిమాటున కొందరు దొంగలు హద్దులు దాటుతున్నారు. ఇదీ అలాంటి ఘటనే. అమ్మవారికి మొక్కినట్టే మొక్కి.. ఆ తర్వాత అమ్మవారి మెడలో ఆభరణాలు చోరీ చేశాడు ఓ దొంగ.
Marriage in Theatre: ‘మురారి’ రీ రిలీజ్ హంగామా.. థియేటర్ లోనే పెళ్లిళ్లు చేసుకున్న మహేష్ ఫ్యాన్స్.. వీడియోలు వైరల్
Rudraప్రస్తుతం టాలీవుడ్ లో రీ-రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మురారి’ రీ రిలీజ్ అయింది. మహేష్ బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేసిన ఈ మూవీ థియేటర్స్ లో ఆసక్తికర ఘటనలు జరుగుతున్నాయి.
Jagan on Nara Lokesh 'Red Book': ఏపీలో లా అండ్ ఆర్డర్ బతకాలంటే చంద్రబాబు, నారా లోకేష్‌లను హత్య కేసుల్లో ముద్దాయిలుగా చేర్చాలి, జగన్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyఏపీలో లా అండ్ ఆర్డర్ నాశనం చేస్తున్నారు. ఏపీలో జరుగుతున్న హత్యల్లో చంద్రబాబు, లోకేష్‌లను ముద్దాయిలుగా చేర్చాలన్నారు. కేవలం ఆధిపత్యం కోసమే దాడులకు తెగబడుతున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. కావాలనే భయానక వాతావరణం సృష్టిస్తున్నారని.. ఇదెక్కడి పాలన అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Jagan on Subbarayudu Murder Case: ప్రతి ఊరిలో ఇద్దరు వైసీపీ నాయకులను చంపాలని శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే చెబుతున్నాడు, వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyప్రతి ఊరిలో ఇద్దరు వైయస్ఆర్ సీపీ నాయకులను చంపండి అని శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మీటింగ్ లు పెట్టి మరీ చెబుతున్నాడని మండిపడ్డారు.
Jagan on AP Law and Order: పోలీసుల సమక్షంలోనే హత్యలు చేస్తున్నారు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండని కోరిన వైఎస్ జగన్, వీడియో ఇదిగో
Hazarath Reddyరాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది.మారణహోమం సృష్టించే పాలన చేస్తున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన అమలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల సమక్షంలోనే హత్యలు చేస్తున్నారంటే.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండని ప్రజలను కోరారు.
Jagan on Subbarayudu Murder Case: ఎస్ఐ సమక్షంలోనే సుబ్బారాయుడిని హత్య చేశారు, రాజకీయ కుట్ర లేకపోతే హత్య జరిగిన తర్వాత అడిషనల్ ఫోర్స్ ఎందుకు రాలేదని ప్రశ్నించిన వైఎస్ జగన్
Hazarath Reddyవైఎస్ జగన్ నంద్యాలలో సీతారామపురంలో టీడీపీ గూండాల దాడితో హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ క్రమంలో వారి కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం, వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల సమక్షంలోనే పెద్దసుబ్బారాయుడిని చంపేశారు.