ఆంధ్ర ప్రదేశ్

Weather Update: రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వానలు, వచ్చే మూడు నాలుగు రోజులు పాటు వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. ఎండ వేడిమి నుంచి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రెండు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి. నిన్న సాయంత్రం అరకు చింతపల్లి ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. విశాఖలో రాత్రి 9 తర్వాత వర్షం పడింది

Andhra Pradesh Elections 2024: మా తమ్ముడిని పిఠాపురంలో గెలిపించండి, వీడియో విడుదల చేసిన చిరంజీవి, జనసేనాని గురించి ఇంకా ఏమన్నారంటే..

Hazarath Reddy

ఏపీ ఎన్నికల్లో తన తమ్ముడు, జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా వీడియో సందేశాన్ని ఇచ్చారు. జనసేనానిని గెలిపించాలని వీడియోలో ఆయన కోరారు. కొణిదెల పవన్ కల్యాణ్... అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టినా... అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందు వాడిగా ఉంటాడు.

Andhra Pradesh Elections 2024: పవన్ కళ్యాణ్ గెలవాలంటూ హీరో నాని ట్వీట్, సినీ కుటుంబంలో ఒకడిగా జనసేనాధినేతకు మద్ధతు పలుకుతున్నట్లు ట్వీట్

Hazarath Reddy

జనసేనాని పవన్ కల్యాణ్ కు నేచురల్ స్టార్ నాని మద్దతు తెలిపారు. ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్.. ఈ ఎన్నికల్లో గెలవాలని ఆకాంక్షించారు. పిఠాపురం అసెంబ్లీ పోరులో తలపడుతున్న జనసేనానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. సినీ కుటుంబంలో ఒకడిగా పవన్ కల్యాణ్ కు మద్దతు పలుకుతున్నట్లు వివరించారు.

Andhra Pradesh New DGP: ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీశ్‌కుమార్‌ గుప్తా, ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌పై బదిలీ వేటు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన హరీశ్‌కుమార్‌ గుప్తా పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని ఏపీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో కొత్త డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా బాధ్యతలు స్వీకరించారు. భారత ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ కొత్త DGPగా 1992 బ్యాచ్ IPS అధికారి అయిన హరీష్ కుమార్ గుప్తాను నియమించింది.

Advertisement

Weather Update: హమ్మయ్యా.. రేపటి నుండి ఎండలు తగ్గి వర్షాలు, మే 10 వరకు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపిన ఐఎండీ

Hazarath Reddy

వారం రోజులుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో వేడిగాలులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. అయితే తూర్పు మరియు దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో మే 10 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ( ఐఎండీ ) తెలిపింది.

Andhra Pradesh Election 2024: పిఠాపురంలో నీ సీటుకే దిక్కులేదు, నా కూతురుకు సీటు ఇస్తావా, పవన్ కళ్యాణ్‌పై మండిపడిన ముద్రగడ పద్మానాభం

Hazarath Reddy

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై సీరియస్‌ అయ్యారు వైఎస్సార్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభం. పవన్‌ మీ నటన సినిమాల్లో చూపించండి.. రాజకీయాల్లో కాదు అని హితవు పలికారు. అలాగే, పైకి తనపైన ప్రేమ ఉన్నట్టు నటించాల్సిన అవసరంలేదని చురకలంటించారు.

PM Modi AP Tour: ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టారు! రాజ‌మండ్రి స‌భ‌లో ప్ర‌ధాని మోదీ ధ్వజం, మే 13 త‌ర్వాత నూత‌న శకం ప్రారంభం కాబోతోందని వెల్లడి

VNS

మే 13న ఏపీలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోందని ప్రధాని మోదీ (Modi) అన్నారు. కేంద్రంలో మరోసారి ఎన్డీయే విజయం సాధించబోతోందన్న ప్రధాని మోదీ.. ఏపీలోనూ ఎన్డీయే ప్రభుత్వం వస్తుందని జోస్యం చెప్పారు. రాజమండ్రిలో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ”ఎన్నికల ఫలితాలు ముందే కాంగ్రెస్ పార్టీ పరాజయాన్ని అంగీకరించింది.

CM Jagan Reacts on Officials Transfer: ఏపీలో వ‌రుస బ‌దిలీల‌పై తొలిసారి స్పందించిన సీఎం వైఎస్ జ‌గ‌న్, ఎన్నిక‌లు స‌జావుగా సాగుతాయో లేదో అని అనుమానం

VNS

ఎన్నికలు సరిగ్గా జరుగుతాయన్న నమ్మకం సన్నగిల్లుతోందని చెప్పారు. కాగా, ఇవాళ మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని మచిలీపట్నం టౌన్ వల్లూరి రాజా సెంటర్లో ప్రచార సభలో జగన్ పాల్గొన్నారు. కాగా, ఈ నెల 11న సాయంత్రం 5గంటలకు ఏపీలో ప్రచార పర్వం ముగుస్తుంది. మే 13న ఎన్నికలు జరుగుతాయి.

Advertisement

Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, జాలరిగా మారి చేపలు పడుతున్న కేఏ పాల్, విశాఖపట్నం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రజాశాంతి పార్టీ అధినేత

Hazarath Reddy

కేఏ పాల్ మత్స్యకారుడిగా మారాడు.ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ విశాఖపట్నం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తరుణంలో తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్న ఆయన నేడు మత్స్యకారుడిగా మారారు. చేపలు పట్టేందుకు జాలరి భుజాన వేసుకుని వీడియో వైరల్ అవుతోంది.

Harish Kumar Gupta: ఏపీ పోలీస్ కొత్త బాస్‌గా హరీశ్‌కుమార్‌ గుప్తా, తక్షణమే విధుల్లో చేరాలని ఈసీ ఆదేశాలు, ఇంతకీ ఎవరీ హరీష్ గుప్తా

Hazarath Reddy

నిన్నటివరకు డీజీపీగా వ్యవహరించిన కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఈసీ బదిలీ చేసిన నేపథ్యంలో, రాష్ట్ర నూతన పోలీస్ బాస్ గా హరీశ్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఏపీ డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తాను నియమిస్తూ ఎన్నికల సంఘం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ సమాచారం అందించింది.

Shankha Brata Bagchi: ఏపీ ఇన్‌ఛార్జి డీజీపీగా శంఖబ్రత బాగ్చి, ప్రస్తుత డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదిలీ వేటు వేసిన ఎన్నికల సంఘం

Hazarath Reddy

ఐపీఎస్ అధికారి శంఖబ్రత బాగ్చి ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఛార్జి డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డి స్థానంలో ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఏపీ నూతన డీజీపీ నియామకంపై ఈసీ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు

PM Modi In AP: నేడు ఏపీకి ప్రధాని నరేంద్ర మోడీ.. మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రి వేమగిరి సెంటర్‌లో ఎన్టీఏ కూటమి బహిరంగ సభ

sajaya

నేడు ఏపీకి ప్రధాని నరేంద్ర మోడీ.. మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రి వేమగిరి సెంటర్‌లో ఎన్టీఏ కూటమి బహిరంగ సభలో.. సాయంత్రం 4 గంటలకు అనకాపల్లి బహిరంగ సభలో పాల్గొననున్న మోడీ.. సభలకు హాజరుకానున్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్

Advertisement

EC Transfer AP DGP: ఏపీ ఎన్నికల్లో కీల‌క ప‌రిణామం, డీజీపీ రాజేంద్ర‌నాథ్ రెడ్డిపై బ‌దిలీ వేటు వేసిన ఎన్నిక‌ల సంఘం

VNS

ఎన్నికల సమయంలో ఎలక్షన్‌ కమిషన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ డీజేపీపై రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ (EC Transfer AP DGP) వేటు వేసింది. ఆయన్ను విధుల నుంచి వెంటనే రిలీవ్‌ కావాలని ఆదేశించింది. అలాగే ముగ్గురు పేర్లతో కూడిన ప్యానల్‌ను సోమవారం ఉదయం 11 గంటలలోగా పంపించాలని ఏపీ సీఎస్‌కు సూచించింది.

YS Jagan Road show: భారీ వ‌ర్షాన్ని సైతం లెక్క చేయ‌కుండా సీఎం జ‌గ‌న్ స‌భ‌కు పోటెత్తిన జ‌నం, చంద్ర‌బాబుకు ఓటేస్తే కొండ‌చిలువ నోట్లో త‌ల‌పెట్టిన‌ట్లేనన్న జ‌గ‌న్

VNS

పలమనేరు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, మరో 9 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతుందన్నారు. ‘‘పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే.. కొండచిలువ నోట్లో తలపెట్టినట్లే. చంద్రబాబును నమ్మితే మళ్లీ చంద్రముఖి నిద్ర లేస్తుంది.

Heat Wave In AP, Telangana: తెలుగు రాష్ట్రాలను ఠారెత్తిస్తున్న ఎండలు.. తెలంగాణలో 4 జిల్లాల్లో 47 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు..

sajaya

తెలుగు రాష్ట్రాలను ఠారెత్తిస్తున్న ఎండలు.. తెలంగాణలో 4 జిల్లాల్లో 47 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు.. విజయవాడలో 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. ఉదయం ఎండవేడిమి, సాయంత్రం ఉక్కపోతతో అల్లాడుతున్న జనం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక.

Hyderabad Cheating: ‘ఒక్క చాన్స్‌.. ఒకే ఒక్క చాన్స్’ అంటూ వచ్చి.. సినిమాల్లో అవకాశం ఇవ్వాలని వచ్చి నిర్మాతను మొత్తం దోచేసిన యువకుడు.. హైదరాబాద్ లో ఘటన

Rudra

ఖడ్గం సినిమాలో ‘ఒక్క చాన్స్‌..’ అంటూ రవితేజ అడిగినట్టు సినిమాల్లో అవకాశం ఇవ్వాలని ఈ ఫేమస్ డైలాగ్ ను వాడుకొన్న ఓ యువకుడు నిర్మాతకు టోకరా వేసి బంగారు ఆభరణాలు, నగదుతో ఉడాయించాడు.

Advertisement

Heavy Rain In Tirumala: మండుతున్న ఎండ‌ల నుంచి ఉప‌శ‌మ‌నం, తిరుమ‌ల కొండ‌పై కుండ‌పోత వ‌ర్షం, గాలి దుమారంతో విరిగిప‌డ్డ చెట్లు

VNS

తిరుమలలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గాలివానతో కూడిన భారీ వర్షం (Heavy Rain) కురిసింది. దీంతో వాతారణం చల్లబడింది. మాడు పగిలేలా ఉన్న మండుటెండలతో ఉక్కిరిబిక్కిరి అయిన జనం వర్షం కురవడంతో రిలీఫ్ పొందారు.

Heatwave Alert in Telugu States: 6వ తేదీ తర్వాత వాతావరణం చల్లబడుతుందని తెలిపిన ఐఎండీ, నిప్పుల కుంపటిని తలపిస్తున్న తెలుగు రాష్ట్రాలు, ఏకంగా 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు

Hazarath Reddy

భగభగ మండే ఎండలతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. వారం రోజులుగా ఠారెత్తిస్తున్న ఎండలు మరో వారం రోజుల పాటు కొనసాగుతాయని ఐఎండీ తెలిపింది. తెలంగాణలో మొత్తం 18 జిల్లాలో ఉదయం ఎనిమిది గంటలకే మొదలైన భానుడి ఉగ్రప్రతాపం మొదలై సాయంత్రం వరకు కొనసాగుతోంది

Andhra Pradesh: స్కూటీని మందు షాపుగా మార్చిన వృద్ధుడు, 100 క్వార్టర్ల తెలంగాణ మందును ఏపీకి తీసుకెళుతూ నందిగామలో పట్టుబడిన గోపయ్య, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఎన్టీఆర్ - నందిగామలో గోపయ్య అనే వృద్ధుడు కోదాడ నుండి నందిగామకు స్కూటీలో మద్యం తరలిస్తుండగా పోలీసులకు చిక్కాడు. స్కూటీని మందు షాపుగా మార్చి తెలంగాణ నుండి ఆంధ్రాకు స్కూటీలో గుట్టు చప్పుడు కాకుండా మద్యం తరలిస్తుండగా పోలీసుల చేతికి దొరికాడు. నందిగామ పట్టణ శివారులో పట్టుకున్న పోలీసులు.. స్కూటీ నుండి 100 క్వార్టర్ల తెలంగాణ మందు సీసాలు స్వాధీనం.

Viveka Murder Case: వివేకా హత్య కేసు, వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి బెయిల్ మంజూరు, అవినాష్‌రెడ్డిపై దస్తగిరి వేసిన పిటిషన్‌ కొట్టేసిన తెలంగాణ హైకోర్టు

Hazarath Reddy

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి ఊరట లభించింది. కేసులో ప్రధాన నిందితుడు దస్తగిరి వేసిన పిటిషన్‌ను శుక్రవారం ఉదయం తెలంగాణ హైకోర్టు కొట్టేసింది.

Advertisement
Advertisement