ఆంధ్ర ప్రదేశ్

Andhra Pradesh Fire: విజయవాడలో భారీ అగ్నిప్రమాదం, ఆయిల్‌ శుద్ధి చేసే కేంద్రంలో చెలరేగిన మంటలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

విజయవాడ నగర శివారు కానూరులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. న్యూ ఆటోనగర్‌లోని ఆయిల్‌ శుద్ధి చేసే కేంద్రంలో భారీగా మంటలు చెలరేగాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక శకటాలతో సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Andhra Pradesh Elections 2024: తిరుపతి టికెట్ జనసేనకు ఇవ్వడంతో ఏడ్చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, చంద్రబాబు చేసిన సర్వేలు ఏమయ్యాయని సూటి ప్రశ్న

Hazarath Reddy

తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో టీడీపీలో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. జనసేన నుంచి ఆరని శ్రీనివాసులుకు టికెట్‌ ప్రకటించడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ టికెట్‌ దక్కలేదని మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. టీడీపీ కోసం అహర్నిశలు పనిచేశామని, తిరుపతి అసెంబ్లీ స్థానం దక్కకపోవడం బాధాకరమని అన్నారు.

Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, అధికారంలోకి రాగానే మద్యం ధరలు తగ్గిస్తామని తెలిపిన చంద్రబాబు

Hazarath Reddy

తెలుగు తమ్ముళ్లు ఎవరికీ భయపడబోరని, అడ్డొస్తే పచ్చడి పచ్చడిగా తొక్కుకుంటూ వెళతామే తప్ప, ఎవరినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. మేము అధికారంలోకి రాగానే మద్యం ధరలు తగ్గిస్తామని నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

Andhra Pradesh: మగవాళ్లు చీరలు కట్టుకుని రతి మన్మధులకు ప్రత్యేక పూజలు, కర్నూలు జిల్లాలో హోళీ పండగ రోజు జరిగే వింత ఆచారం గురించి ఎవరికైనా తెలుసా..

Hazarath Reddy

కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుళ్ళురు గ్రామంలో హొలీ పండుగను మగవారు ఆడవారి వేషధారణలో అలంకరించుకొని రతి మన్మధులకు పూజలు జరుపుకోని మొక్కులు తీర్చడం.. ఇక్కడ వారి సంప్రదాయంగా వస్తోంది

Advertisement

Andhra Pradesh Elections 2024: టీడీపీ అధికారంలోకి వస్తే రూ. 4 వేలు పెన్సన్, కుప్పంలో చంద్రబాబు సంచలన ప్రకటన, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర సాయం అవసరమని వెల్లడి

Hazarath Reddy

ఏపీలో అరాచక పాలన పోవాలన్న ఉద్దేశంతోనే టీడీపీ, జనసేన, బీజేపీ కలిశాయని అన్నారు. మూడు పార్టీల అజెండా ఒక్కటేనని... రాష్ట్ర అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే తమ అజెండా అని చంద్రబాబు (Chandrababu Naidu ) ఉద్ఘాటించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం సాయం అవసరమని అన్నారు.

Andhra Pradesh Elections 2024: జగన్‌ను అథఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు రఘురామ కాదు, ఎంపీ రఘురామకృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు, నరసాపురం సీటు నాకు రాకుండా అడ్డుకున్నారని మండిపాటు

Hazarath Reddy

టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తులో భాగంగా ఏపీలోని 6 లోక్‌సభ స్థానాలకు బీజేపీ ఆదివారం అభ్యర్థులను ప్రకటించింది. రఘురామకృష్ణంరాజు సిట్టింగ్ ఎంపీగా ఉన్న నరసాపురం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేరును అధిష్ఠానం ప్రకటించిన విషయం తెలిసిందే.

Nara Lokesh Fire on Police: డీజీపీని తమాషాలు ఆడొద్దని చెప్పండంటూ పోలీసులకు నారా లోకేష్ వార్నింగ్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

పోలీసుల తీరుపై లోకేష్ మండిపడ్డారు.. వైఎస్సార్‌సీపీ నేతల కార్లు ఎందుకు ఆపి సోదాలు చేయడం లేదని పోలీసుల్ని ప్రశ్నించారు. టీడీపీ నేతల వాహనాలు మాత్రమే ఆపాలని ఆదేశాలు ఏమైనా ఉన్నాయా అన్నారు.

Andhra Pradesh Assembly Election 2024: ఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్టు విడుదల..ఎంపీ రఘరామ కృష్ణం రాజుకు మొండి చేయి..జనసేన 18 స్థానాల్లో MLA అభ్యర్థుల జాబితా విడుదల..పిఠాపురం నుంచే పవన్ కళ్యాణ్ పోటీ..

sajaya

ఏపీలో బీజేపీ పార్లమెంట్‌ అభ్యర్థుల పేర్లను అధిష్టానం ఖరారు చేసింది. కూటమిలో భాగంగా, బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. ఇందులో భాగంగా బీజేపీకి ఆరు పార్లమెంట్‌ స్థానాల్లో పోటీకి దిగబోతోంది. బీజేపీ ఆదివారం రాత్రి ప్రకటించిన 5వ విడత లిస్టులో ఆరు పార్లమెంట్‌ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది .

Advertisement

IMD Alert: రాబోయే ఐదు రోజులు బ‌య‌ట‌కు వెళ్తున్నారా? ప్ర‌జ‌ల్ని అల‌ర్ట్ చేస్తున్న ఐఎండీ, ఉష్ణోగ్ర‌త‌లు విప‌రీతంగా పెరుగుతాయ‌ని హెచ్చ‌రిక‌

VNS

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD Alert) తెలిపింది. దక్షిణ దిశ నుంచి రాష్ట్రంలోకి కిందిస్థాయి గాలులు వీచడం వల్ల వచ్చే అయిదు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్​ నుంచి 3 డిగ్రీల సెల్సియస్​ వరకు పెరుగుతాయని వెల్లడించింది.

AP Governor Abdul Nazeer Fell ill: ఏపీ గ‌వ‌ర్న‌ర్ న‌జీర్ తీవ్ర అస్వ‌స్థ‌త‌, హుటాహుటిన విజ‌యవాడ ఆస్ప‌త్రికి త‌ర‌లించిన సిబ్బంది

VNS

గవర్నర్‌కు ఎండోస్కోప్‌ టెస్టులు నిర్వహించాలని వైద్యులు సూచించినట్టు సమాచారం. నాజిర్‌ గత ఏడాదికాలంగా ఏపీకి గవర్నర్‌గా సేవలందిస్తున్నారు. 2017 -2023 వరకు సుప్రీం కోర్టు (Supreme Court) లో జడ్జిగా పనిచేశారు.

AP Assembly Elections 2024: ఏపీ ఎన్నికల్లో ఈ సారి పోటీలోకి 6 గురు మాజీ ముఖ్యమంత్రుల కొడుకులు..ఆసక్తికరంగా మారిన పరిణామం..

sajaya

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి లోక్‌సభకు మే 13న జరిగే ఎన్నికలలో కనీసం ఆరుగురు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రుల కుమారులు పోటీలో ఉండటం విశేషం. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల కుమార్తెలు కూడా రేసులో చేరే అవకాశం ఉంది.

School Bus Fire Video: 30 మంది విద్యార్థులతో వెళుతున్న స్కూలు బస్సులో మంటలు, అందరూ సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్న పాఠశాల యాజమాన్యం, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెనాలి - దుర్గి నుంచి నెహ్రూనగర్ తండాకు వెళ్తున్న పాఠశాల బస్సులో మంటలు చెలరేగాయి.బస్సు దుర్గి లోని ఓ ప్రైవేట్ పాఠశాలదిగా చెబుతున్నారు. అందులోని 30 మంది విద్యార్థులు అంతా సురక్షితంగా బయటపడటంతో తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Andhra Pradesh Elections 2024: రాజకీయాల్లో ఎవరు ఎలాంటి వారో ఈ రోజు అర్థం అయ్యిందంటూ ఉండవల్లి శ్రీదేవి సంచలన ట్వీట్, వారిని ఉద్దేశించి పెట్టిందా అంటూ చర్చలు

Hazarath Reddy

రాజకీయాలు ఎలా ఉంటాయో... ఎవరు ఎలాంటి వారో ఈ రోజు అర్థమైంది అంటూ తాడికొండ ఎమ్మెల్యే చేసిన ట్వీట్ ఎవరిని ఉద్దేశించి అనేది రాజకీయ వర్గాల్లో చర్చకు తెర లేపింది. బాపట్ల అని హ్యాష్ ట్యాగ్ పెట్టి కత్తి ఎమోజీ పోస్టు చేయడంతో ఇంకా ఆసక్తికరంగా మారింది.

Drugs Seized in Vizag Port: విశాఖలో సీబీఐ ఆపరేషన్ గరుడ, పోర్టులో 25 వేల కేజీల డ్రగ్స్ పట్టివేత, డ్రగ్స్‌ కేసు వివరాలు వెల్లడించిన సీపీ రవిశంకర్‌

Hazarath Reddy

ఆంధ్రాలోని వైజాగ్ పోర్టులో 25000 కిలోల ఎండు ఈస్ట్ కలిపి మత్తుమందులు తరలిస్తున్నట్లు అనుమానిస్తున్న షిప్పింగ్ కంటైనర్‌ను సీబీఐ అధికారులు భారీ ఆపరేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. మొత్తం సరుకును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

Andhra Pradesh Elections 2024: దేవినేని ఉమాకు షాకిచ్చిన చంద్రబాబు, గంటాకు మళ్లీ నిరాశ, టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల, పెండింగులో 5 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలు

Hazarath Reddy

టీడీపీ (TDP) అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 11 శాసనసభ స్థానాలతో పాటు 13 ఎంపీ అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్‌ స్థానాల్లో తెదేపా పోటీ చేయనుంది. ఇదివరకే 128 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా మరో 11 మందిని వెల్లడించింది. 5 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలను పెండింగులో ఉంచింది.

Andhra Pradesh Elections 2024: వాలంటీర్లపై వైరల్ అవుతున్న ప్రకటన ఫేక్, తాము ఏ ప్రకటన చేయలేదని వెల్లడించిన ఎన్నికల సంఘం

Hazarath Reddy

వలంటీర్ల ఫోటో తీసి వారి పేరు, ఊరు చెప్పాలని తెలిపారు. ఇందులో ఎన్నికల కమిషనర్‌ పేరుతో ఓ వాట్సాప్‌ నెంబర్‌ కూడా ఇచ్చారు. ఈ నెంబర్‌కు వలంటీర్లపై ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. అయితే వాలంటీర్లపై వైరలవుతున్న ప్రకటన ఫేక్‌ అని ఎన్నికల సంఘం పేర్కొంది. తాము ఏ ప్రకటన చేయలేదని వెల్లడించింది.

Advertisement

Andhra Pradesh: గ్రూప్‌-1 రద్దుపై ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక ఆదేశాలు, ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు కొనసాగుతారని స్పష్టం, సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలపై స్టే

Hazarath Reddy

ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష రద్దుపై గురువారం ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు కొనసాగుతున్నారని డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది.పరీక్ష రద్దు చేస్తూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలపై డివిజన్‌ బెంచ్‌ స్టే విధించింది. తదుపరి విచారణ వచ్చేవారానికి వాయిదా వేసింది.

Nara Lokesh Donate to TTD: దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవారికి రూ.38 లక్షలు విరాళం ఇచ్చిన నారా లోకేష్, కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల సందర్శన

Hazarath Reddy

కుమారుడు దేవాన్ష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు తిరుమలలో TTD నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు TDP NGS Nara Lokesh రూ.38 లక్షలు విరాళంగా అందించారు. తిరుమల ఆలయంలో TDP అధినేత చంద్రబాబునాయుడు మనవడు దేవాన్ష్.. తన తండ్రి లోకేష్, తల్లి బ్రాహ్మణి, అమ్మమ్మ భువనేశ్వరితో కలిసి పూజలు చేశారు.

AP EAPCET 2024 Exam New Date: ఏపీలో ఎంట్రన్స్‌ పరీక్షల తేదీల్లో మార్పు, కొత్త షెడ్యూల్ ప్రకటంచిన విద్యాశాఖ అధికారులు, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. దాంతో రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాల్లో ప్రవేశం కల్పించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షల తేదీల్లో మార్పులు చేశారు. కొత్త షెడ్యూల్ను విడుదల చేశారు.

Tirumala Update: జూన్ నెల శ్రీ‌వారి ఆర్జిత‌సేవా టికెట్ల కోటా విడుదల‌, మార్చి 25న ఉద‌యం 10 గంట‌లకు రూ.300 ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్ల‌ు అందుబాటులోకి

Hazarath Reddy

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ ఖాళీగానే కనపడుతున్నాయి. వసతి గృహాల విషయంలోనూ భక్తులు పెద్దగా ఇబ్బంది పడటం లేదు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం గంట సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement