ఆంధ్ర ప్రదేశ్

Gogula Venkata Ramana Joins YSRCP: విజయవాడలో టీడీపీకీ మరో షాక్, వైసీపీలో చేరిన విజయవాడ మాజీ డిప్యూటీ మేయర్‌ గోగుల వెంకట రమణ

Hazarath Reddy

టీడీపీ నేత, విజయవాడ మాజీ డిప్యూటీ మేయర్‌ గోగుల వెంకట రమణ వైఎస్సార్‌సీపీలోకి చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ఆహ్వానించారు. గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, విజయవాడ ఎంపీ కేశినేని నాని హాజరయ్యారు

MLA Burra Madhusudan Yadav: వీడియో ఇదిగో, సీటు ఇవ్వకపోయినా జీవితాంతం సీఎం జగన్‌తోనే ఉంటాను, పార్టీ మార్పు వ్యాఖ్యలను ఖండించిన కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌

Hazarath Reddy

పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌ మీడియా వేదికగా స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్లు ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కాదని తాను ఎక్కడికి వెళ్లనని స్పష్టం చేశారు.

Godavari Express Train Turns 50: గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలు గోల్డెన్ జూబ్లీ వేడుకల వీడియోలు ఇవిగో, తెలుగు రాష్ట్రాల ప్రయాణికులతో విడదీయలేని అనుబంధం

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల మధ్య పట్టాలపై పరుగులు పెడుతున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలు 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. గోదావరి ఎక్స్ ప్రెస్ సేవలు విశాఖ - హైదరాబాద్ డెక్కన్ మధ్య సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి. సాయంత్రం గోదావరి ఎక్స్‌ప్రెస్‌ గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు.

TTD Srivari Hundi: వంద కోట్ల మార్క్‌ దాటిన శ్రీవారి హుండీ ఆదాయం.. వరుసగా 23వ నెలలోనూ రికార్డ్

Rudra

కలియుగ ప్రత్యక్ష దైవం, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులు శ్రీవారికి భారీగా కానుకలు సమర్పిస్తుంటారు. ఇలా శ్రీవారికి హుండీ ద్వారా ప్రతీ రోజు కోట్లలో ఆదాయం వస్తుంటుంది. ఇక, తిరుమల వెంకన్నకు వరుసగా గత నెలలో కూడా ఆదాయం వంద కోట్ల మార్క్‌ ని దాటింది.

Advertisement

TDP Leader Jaleel Khan: నాకు టికెట్ ఇవ్వకపోతే ముస్లింలు ఉరివేసుకుంటారు, టీడీపీ నేత జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

టీడీపీ నేత జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. విజయవాడ వెస్ట్ టికెట్ నాదే. అందరూ టికెట్ అడుగుతారు. కానీ గెలిచే స్తోమత ఉండాలి.. నాకు సీటు ఇవ్వకపోతే ముస్లిం మైనార్టీలు ఉరి వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Andhra Pradesh Elections 2024: నరసారావు పేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్‌, ఏడు మందితో వైసీపీ ఐదో జాబితా లిస్టు ఇదిగో

Hazarath Reddy

ఐదో విడతలో.. నాలుగు ఎంపీ స్థానాలకు, మూడు ఎమ్మెల్యే నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిల మార్పును ప్రకటించారు వాళ్లు. నెల్లూరు టౌన్‌ ఎమ్మెల్యేగా ఉన్న పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్‌కు ప్రమోషన్ దక్కింది. నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటించింది పార్టీ.

Kodali Nani Slams Sharmila: మేమెందుకు..సీట్లు రాని అభ్యర్థులే టీడీపీ జనసేనను తగలబెడతారు, కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు, షర్మిల తెలంగాణలో జెండా ఎత్తేసి ఏపీకి వచ్చిదంటూ ఎద్దేవా

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ షర్మిలపై మాజీ మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు మతి భ్రమించిదని అందుకే ఏదేదో మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు.

21 Police Officers Transferred in AP: 21 మంది పోలీస్ ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు, లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే..

Hazarath Reddy

Advertisement

AP Cabinet Key Decisions: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 6,100 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలకు గ్రీన్‌సిగ్నల్‌, క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో..

Hazarath Reddy

ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 6,100 పోస్టులతో డీఎస్సీ నిర్వహణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

SIPB Approves Huge Investment in AP: ఏపీలో ఇంధన రంగంలో రూ.22,302 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం, 5,300 మందికి ఉద్యోగాలు..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా పలు ప్రాజెక్టులకు స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (State Investment Promotion Board) ఆమోదం తెలిపింది.

Andhra Pradesh Govt Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఏపీ వైద్య ఆరోగ్యశాఖలో 424 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(DME) పరిధిలోని మెడికల్ కాలేజీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు మొత్తం 424 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.

Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, సీఎం జగన్ పాలన సూపర్, చంద్రబాబు ముందే పొగిడిన టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్‌

Hazarath Reddy

Advertisement

Mahatma Gandhi Punyatithi 2024: జాతిపిత మహాత్మా గాంధీ వర్థంతి, ఘనంగా నివాళులు అర్పించిన సీఎం జగన్‌ మోహన్ రెడ్డి, ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సాకారం చేశామని వెల్లడి

Hazarath Reddy

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర రీజనల్‌ కోఆర్డినేటర్‌ వైవీ. సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Andhra Pradesh: షాకింగ్ సీసీటీవీ పుటేజీ ఇదిగో, 8 తులాల బంగారం కోసం వృద్ధురాలి మెడకు టవల్ బిగించి చంపేందుకు ప్రయత్నించిన అగంతకుడు

Hazarath Reddy

ఏపీలో దారుణ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ పుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పుటేజీలో అనకాపల్లి గవరపాలెం పార్క్ సెంటర్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలు లక్ష్మీ నారాయణమ్మ మెడకు టవల్ బిగించి హత్యాయత్నం చేసి 8 తులాల గోల్డ్ చైన్ ను యువకుడు కాజేశాడు .

Producer Kona Venkat on CM Jagan Ruling: సీఎం జగన్ పాలనపై ప్రశంసలు కురిపించిన ప్రముఖ నిర్మాత కోన వెంకట్, విద్యావ్యవస్థలో మార్పులు ఆశ్చర్యం కలిగిస్తున్నాయంటూ ట్వీట్

Hazarath Reddy

విద్యావ్యవస్థలో సీఎం జగన్ తీసుకొచ్చిన సమూల మార్పులను ప్రశంసిస్తూ టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత కోన వెంకట్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ నిర్మాత ఆంధ్రప్రదేశ్‌లోని తన సొంత గ్రామానికి వెళ్లి అక్కడి ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు.

Rajya Sabha Elections 2024: దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 56 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల, ఫిబ్రవరి 27న పోలింగ్

Hazarath Reddy

ఏపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, కనకమెడల రవీంద్ర కుమార్ ఎంపీలు రిటైర్ అవుతున్నారు. తెలంగాణ నుంచి వద్దిరాజు రవిచంద్ర, లింగయ్య యాదవ్, సంతోష్ ఎంపీలు రిటైర్‌ కానున్నారు. ఏప్రిల్ 4 తో పదవీకాలం ముగుస్తుంది.

Advertisement

TDP Ra Kadali Ra Meeting: వీడియో ఇదిగో, స్టేజ్‌ పైనుంచి కింద పడబోయిన చంద్రబాబు, సెక్యూరిటీ అలర్ట్ కావడంతో తప్పిన పెను ప్రమాదం

Hazarath Reddy

రాజానగరం టికెట్‌ జనసేనకు కేటాయించడంపై చంద్రబాబు సమక్షంలో బొడ్డు వెంకటరమణ వర్గీయులు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో స్టేజ్‌ పైనుంచి కార్యకర్తలు దూకుడుగా దిగే యత్నం చేయగా.. చంద్రబాబు కిందపడబోయారు. అయితే సెక్యూరిటీ ఆయన్ని కిందపడకుండా పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది.

YS Sharmila Slams CM Jagan: ఇప్పుడున్న జగన్ ఎవరో నాకు తెలియదు, వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు, రోజుకొక దొంగతో నన్ను తిట్టిస్తున్నారని మండిపాటు

Hazarath Reddy

నా అన్న జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా మారిపోయారని ఏపీసీసీ అధ్యక్షురాలు, ఆయన సోదరి వైఎస్‌ షర్మిల (YS Sharmila) ఆరోపించారు. వైసీపీ కోసం నిస్వార్థంగా పని చేస్తే.. ఇప్పుడు తనపైనే వ్యక్తిగత దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

TTD Annual Budget 2024-25: రూ.5141.75 కోట్ల వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన టీటీడీ పాలకమండలి, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయాలు ఇవిగో..

Hazarath Reddy

టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (TTD Chiarman Bhumana Karunakar Reddy) అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో 2024-25 సంవత్సర బడ్జెట్‌కు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది.రూ. 5141.75 కోట్లతో వార్షిక బడ్జెట్‌ రూపొందించింది.

Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, దమ్ముంటే నాపై పోటీ చేయాలని చంద్రబాబుకు సవాల్ విసిరిన కేశినేని నాని, 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని ధీమా

Hazarath Reddy

టీడీపీ అధినేత చంద్రబాబుపై విజయవాడ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani VS Chandrababu) మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. వచ్చే ఎన్నికల్లో (Andhra Pradesh Elections 2024) విజయవాడ నుంచి చంద్రబాబు పోటీ చేసినా గెలవరని చెప్పారు. చంద్రబాబుపై తాను మూడు లక్షల మెజారిటీతో గెలుస్తానని ప్రకటించారు.

Advertisement
Advertisement