ఆంధ్ర ప్రదేశ్

Cyclone Michaung: కోస్తా తీరం వైపు దూసుకొస్తున్న మించౌంగ్ తుఫాను, తీరం వెంబడి హైఅలర్ట్, వచ్చే మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారానికి తీవ్రవాయుగుండంగా, ఆదివారానికి తుపానుగా (Cyclone Michaung) మారే అవకాశం ఉందని వెల్లడించింది. దీనికి మిచౌంగ్ తుపానుగా నామకరణం చేశారు.

Andhra Pradesh Fire: వీడియో ఇదిగో, కాకినాడ సముద్ర తీరంలో బోటులో భారీ అగ్నిప్రమాదం, సముద్రంలోకి దూకేసి ప్రాణాలు కాపాడుకున్న 11 మంది మత్స్యకారులు

Hazarath Reddy

కాకినాడ తీరంలో వేటకు వెళ్తున్న బోటులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బోటు నడి సంద్రంలో ఉండగా అందులోని గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. దీంతో మంటలు వ్యాపించాయి. 11 మంది మత్స్యకారులు బోటులో చిక్కుకున్నారు

Special Trains: తెలుగు రాష్ట్రాల మధ్య 10 ప్రత్యేక రైళ్లు ఈ నెలాఖరు వరకు పొడిగింపు.. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో నిర్ణయం

Rudra

తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఇప్పటికే సేవలందిస్తున్న 10 ప్రత్యేక రైళ్లను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది.

JEE Main 2024: జేఈఈ మెయిన్‌ దరఖాస్తుల గడువు పొడగింపు.. డిసెంబర్‌ 4 వరకు అవకాశం.. పూర్తి వివరాలు ఇవిగో!!

Rudra

జేఈఈ మెయిన్‌ -1 దరఖాస్తుల గడువును డిసెంబర్‌ 4 వరకు పొడిగించినట్టు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. తొలి విడత దరఖాస్తుల గడువు గురువారం ముగియగా, మరోసారి అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకొన్నది.

Advertisement

LPG Cylinder Price Hike: గ్యాస్‌ మంట.. 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ధరపై రూ.21 పెంపు.. హైదరాబాద్‌లో రూ.2024.5కు చేరిన గ్యాస్ బండ ధర

Rudra

గ్యాస్‌ సిలిండర్‌ (Gas Cylinder) వినియోగదారులకు షాక్ కలిగించే వార్త ఇది. దేశీయ చమురు కంపెనీలు 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ (Commercial Gas Cylinder) ధరను రూ.21 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

Andhra Pradesh Leaves: వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్‌ లో 20 సాధారణ సెలవులు.. సాధారణ లీవ్స్‌ తోపాటు 17 ఐచ్చిక సెలవులు.. పూర్తి వివరాలు ఇవే!

Rudra

ఆంధ్రప్రదేశ్‌ లో పండుగలు, జాతీయ సెలవులు కలుపుకొని వచ్చే ఏడాది 2024లో మొత్తం 20 సాధారణ సెలవులు రానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

Cyclone Michaung: ఏపీకి తుఫాను ముప్పు.. బంగాళాఖాతంలో అల్పపీడనం, త్వరలో తుఫాను బలపడనున్న వైనం.. నేటి నుంచి మూడు నాలుగు రోజుల పాటు కోస్తాతో పాటు రాయలసీమలోనూ వర్షాలు.. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దంటూ వాతావరణ శాఖ హెచ్చరిక

Rudra

ఏపీకి తుఫాను ముప్పు పొంచి ఉన్నది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే రోజుల్లో తుఫానుగా బలపడి ఏపీలో కోస్తా జిల్లాలను కుండపోత వర్షాలు ముంచెత్తుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

AP Fibernet Case: ఏపీ పైబర్ నెట్ కేసు, చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ డిసెంబర్ 12కి వాయిదా

Hazarath Reddy

ఏపీ పైబర్ నెట్ కేసులో (Fiber Net Case) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) ముందస్తు బెయిల్ పిటీషన్‌పై విచారణ సుప్రీంకోర్టులో (Supreme Court) వాయిదా పడింది. డిసెంబర్ 12కు ఈ కేసుపై విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.

Advertisement

Andhra Pradesh: సస్యశ్యామలం కానున్న రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలు, అవుకు రెండో టన్నెల్‌ను జాతికి అంకితం చేసిన సీఎం జగన్‌ మోహన్ రెడ్డి

Hazarath Reddy

రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగునీటిని పారించి సుభిక్షం చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో అడుగు ముందుకేశారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్‌ను సీఎం జగన్‌ మోహన్ రెడ్డి గురువారం జాతికి అంకితం చేశారు. తద్వారా ప్రస్తుత డిజైన్‌ మేరకు గాలేరు–నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించేందుకు మార్గం సుగమం చేశారు.

Drone cameras at Visakha Airport:విశాఖ విమానాశ్రయంలో డ్రోన్ కెమెరాలు కలకలం, విదేశీ డ్రోన్ కెమెరాలుగా గుర్తించిన అధికారులు, వాటిని సీజ్ చేసిన అధికారులు

Hazarath Reddy

విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రోన్ కెమెరాలు కలకలం సృష్టించాయి. విదేశీ డ్రోన్ కెమెరాలుగా అధికారులు గుర్తించారు. ఐఎన్‌ఎస్‌ డేగా విమానాశ్రయం కలిపి ఉండటంతో రక్షణ శాఖ అప్రమత్తమైంది. ప్రస్తుతం విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో రీ సర్ఫెసింగ్ పనులు కొనసాగుతున్నాయి.

Tension prevailed at Nagarjuna Sagar Dam: నాగార్జునసాగర్ డ్యామ్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత, రెండు రాష్ట్రాల పోలీసులు ఫైటింగ్, గొడవపై రాజకీయ నేతలు ఎవరు మాట్లాడవద్దంటూ ఈసీ ఆదేశాలు

Hazarath Reddy

గత అర్ధరాత్రి దాటిన తర్వాత నాగార్జునసాగర్ డ్యామ్‌ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాగార్జునసాగర్ డ్యామ్‌పై తమ పరిధిలో ఫెన్సింగ్ వేసుకోవడానికి ఇరిగేషన్ అధికారులు పోలీసుల సహకారం కోరారు. వారికి సెక్యూరిటీ కల్పించడానికి సాగర్‌ డ్యామ్‌పై వెళ్లడానికి ఏపీ పోలీసులు ప్రయత్నించారు.

Nagarjuna Sagar: నాగార్జన సాగర్ ప్రాజెక్టు వద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత, డ్యామ్ మీదకు చేరుకున్న 700 మంది పోలీసులు, కంచె ఏర్పాటుతో ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య వాగ్వాదం

VNS

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు వద్ద (Nagarjuna Sagar Dam) ఉద్రిక్తత నెలకొన్నది. బుధవారం అర్ధరాత్రి సమయంలో సాగర్‌ వద్దకు ఏపీ పోలీసులు (AP Police) చేరుకున్నారు. దాంతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి. తెలంగాణ, ఏపీ మధ్య నీటి విషయంలో (Water Fight) వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Andhra Pradesh: పారిశ్రామిక రంగంపై దృష్టి మరల్చిన సీఎం జగన్ , ఏపీలో రూ1,072 కోట్ల విలువైన పరిశ్రమలకు శంకుస్థాపన, పరిశ్రమల ఏర్పాటుతో 21,079 మందికి ఉపాధి, ఏపీ ముఖ్యమంత్రి ఏమన్నారంటే..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ1,072 కోట్ల విలువైన పరిశ్రమలకు క్యాంప్ కార్యాలయం నుండి వర్చువల్‌గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ పరిశ్రమల ఏర్పాటుతో 21,079 మందికి ఉపాధి కలగనుంది

Andhra Pradesh Elections 2024: ఏపీలో మరో కొత్త పార్టీ, విశాఖ నుంచి పోటీ కోసం అవసరమైతే కొత్త పార్టీ పెడతానని తెలిపిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

Hazarath Reddy

2024లో ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీ చేస్తానని... అవసరం అయితే కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (Former CBI JD Lakshminarayana) స్పష్టం చేశారు. బోగస్ ఓట్లను కచ్చితంగా తొలగించాల్సిందేనని అన్నారు.

Rain Alert: రాబోయే నాలుగు రోజుల పాటూ భారీ వర్షాలు, అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ అలర్ట్

VNS

రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం (Rain Alert) ఉన్నట్టు వాతావరణశాఖ హెచ్చరికలు (IMD Alert) జారీచేసింది. బంగాళాఖాతంలోని దక్షిణ అండమాన్‌ సమీపంలోని మలక్కా జలసంధిలో సోమవారం ఏర్పడిన అల్పపీడనం బుధవారం పశ్చిమ వాయవ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

AP Weather Forecast: బంగాళాఖాతంలో అల్పపీడనం, 48 గంటల్లో తుపానుగా బలపడే అవకాశం, ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

Hazarath Reddy

బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్‌ సమీపంలోని మలక్కా జలసంధి ప్రాంతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ బుధవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందన్నారు

Advertisement

Skill Development Scam Case: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసు, డిసెంబర్‌ 8లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

Hazarath Reddy

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) బెయిల్‌ రద్దు కోరుతూ ఏపీ సీఐడీ (AP CID) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో (Supreme Court) విచారణ జరిగింది. ఈ కేసులో డిసెంబర్‌ 8లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని చంద్రబాబుకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది

Liquor Scam Case: రేపు సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ, మద్యం కేసులో తొందరపాటు చర్యలొద్దని ఏపీ సీఐడీకి హైకోర్టు ఆదేశం

Hazarath Reddy

మద్యం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును ఉన్నత న్యాయస్థానం రిజర్వు చేసింది. ఈ కేసులో తుది తీర్పు వచ్చే వరకు తొందరపాటు చర్యలొద్దని ఏపీ సీఐడీని హైకోర్టు ఆదేశించింది.

Andhra Pradesh: విశాఖ జూ పార్క్‌లో కేర్ టెకర్‌పై ఎలుగుబంటి దాడి, చికిత్స పొందుతూ మృతి

Hazarath Reddy

విశాఖపట్నంలోని జూ పార్క్‌లో దారుణం జరిగింది. ఎలుగుబంటి రూమ్‌ని శుభ్రం చేస్తుండగా కేర్ టెకర్‌పై దాడి చేసింది. ఈ ఘటనలో బనవారపు నగేష్ బాబు(25) మృతి చెందాడు. రోజూవారి పనుల్లో భాగంగా ఎలుగుబంటి రూంలోకి కేర్‌ టేకర్ ప్రవేశించాడు.

Yuvagalam Padayatra: పొదలాడ నుంచి ప్రారంభమైన నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర, రోజుకు 15 కి.మీ నుంచి 20 కి.మీ నడిచేలా ప్రణాళిక

Hazarath Reddy

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్ర మళ్లీ ప్రారంభమైంది. చంద్రబాబు అరెస్ట్‌తో తాత్కాలికంగా నిలిచిన పాదయాత్ర.. 79 రోజుల విరామం అనంతరం సోమవారం తిరిగి మొదలైంది. ఉదయం 10.19 గంటలకు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడ నుంచి లోకేశ్‌ తన పాదయాత్రను ప్రారంభించారు.

Advertisement
Advertisement