ఆంధ్ర ప్రదేశ్
Rains in Telugu States: బంగాళాఖాతంలో అల్పపీడనం.. వచ్చే మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు.. 7 జిల్లాలకు భారీ వర్ష సూచన.. తెలంగాణలోనూ మోస్తరు వర్షాలు
Rudraరానున్న మూడురోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని కారణంగా వచ్చే మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Tirumala Leopards: తిరుమల నడకమార్గంలో భయం.. భయం.. చిరుతలు, ఎలుగుబంట్ల హల్ చల్.. వీకెండ్ లో కెమెరాలకు చిక్కిన రెండు చిరుతలు, ఎలుగుబంట్లు
Rudraతిరుమల నడకమార్గంలో భక్తులు భయంభయంగా గడుపుతున్నారు. చిరుతలు, ఎలుగుబంట్ల సంచారం ఎక్కువవ్వడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు.
Jabardasth Actor Sandeep: ప్రేమ పేరుతో మోసం.. బాధితురాలిని పలుమార్లు వశపరుచుకున్న ‘జబర్దస్త్’ నటుడు సందీప్‌.. పెళ్లి ఊసెత్తకపోవడంతో యువతి ఫిర్యాదు.. కేసు
Rudraఈటీవీలో వచ్చే కామెడీ షో ‘జబర్దస్ట్’ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న నటుడు, గాయకుడు నవ సందీప్‌ పై హైదరాబాద్ మధురానగర్‌లోని పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు.
APSRTC Bus Accident: వైరల్ వీడియో, ఏపీలోని అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 100 అడుగుల లోయలో పడిపోయిన ఆర్టీసీ బస్సు, బస్సులో 60 మంది ప్రయాణికులు..
kanhaఅల్లూరి జిల్లా - పాడేరు ఘాట్ రోడ్డు వ్యూపోయింట్ వద్ద 100 అడుగుల లోయలో నుండి పడిపోయిన ఆర్టీసీ బస్సు. బస్సులో 60 మంది ప్రయాణికులు. నలుగురు మృతి, పలువురికి గాయాలు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Vallabhaneni Vamsi Escapes Major Accident: గన్నవరం ఎమ్మెల్యే వంశీకి తప్పిన పెను ప్రమాదం, సూర్యాపేట వద్ద కాన్వాయ్‌కు యాక్సిడెంట్, వేరే కారులో హైదరాబాద్‌ వెళ్లిన వంశీ
VNSఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం (Gannavaram) ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ (MLA Vallabhaneni Vamsi Mohan) తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. విజయవాడ (Vijayawada) నుంచి హైదరాబాద్‌కు (Hyderabad) వస్తున్న ఆయన కాన్వాయ్‌లోని (Convay) వాహనాలు సూర్యాపేట (Suryapet) జిల్లా చివ్వెంల మండలం కాసింపేట (Kasimpet) వద్ద ఒకదానికొకటి ఢీకొన్నాయి.
Gannavaram MLA Vallabhaneni Vamsi Accident Video: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌‌కు తృటిలో తప్పిన ప్రమాదం, వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..
kanhaగన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. అయితే ఎమ్మెల్యేకు పెద్దగా గాయాలు కాలేదు.
Allu Arjun: అల్లు అర్జున్ నా తరపున ప్రచారం చేస్తాడు.. పిల్లనిచ్చిన మామ చంద్రశేఖర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. రాజకీయంగా బన్నీ సేవలు అవసరమని వ్యాఖ్య
Rudraటాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ మామ (భార్య స్నేహ రెడ్డి తండ్రి), బీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవకాశం వస్తే వచ్చే ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలుస్తానని చెప్పారు. తన కోసం అల్లు అర్జున్ ప్రచారాన్ని నిర్వహిస్తారని తెలిపారు.
Disco Shanti: తాళి తప్ప ఇంకేమీ మిగల్లేదు.. శ్రీహరి భార్య డిస్కో శాంతి భావోద్వేగం.. తమ ఆర్థిక స్థితి తలకిందులైందని ఆవేదన
Rudraదివంగత టాలీవుడ్ నటుడు, రియల్ స్టార్ శ్రీహరి.. నటి శాంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శ్రీహరి సినిమాల్లో అన్ని తరహా పాత్రలు చేసి మెప్పించారు. అయితే ఆయన 2013లో మరణించడం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు.
Brahmanandam: అంగరంగ వైభవంగా బ్రహ్మానందం చిన్న కుమారుడి వివాహం.. నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం కేసీఆర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. వేడుకకు హాజరైన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు
Rudraప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్థ వివాహం శుక్రవారం హైదరాబాద్‌ లో అంగరంగ వైభవంగా జరిగింది. నగరానికి చెందిన డా. పద్మజ వినయ్‌ల కుమార్తె ఐశ్వర్యతో కలిసి సిద్ధార్థ వైవాహిక బంధంలో అడుగుపెట్టారు.
Steel Bridge: లోయర్ ట్యాంక్‌ బండ్ వద్ద రూ. 450 కోట్లతో స్టీల్‌ బ్రిడ్జ్ నిర్మాణం.. నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్.. హైదరాబాద్‌ లో ఇవాళ ఈ రూట్‌ లో వెళ్లొద్దు
Rudraహైదరాబాద్‌ లోని లోయర్ ట్యాంక్‌ బండ్ వద్ద స్టీల్‌ బ్రిడ్జ్ ప్రారంభం సందర్భంగా నేటి మధ్యాహ్నం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
AP Digital Certificates: వాహనదారులకు అలర్ట్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై డిజిటల్ సర్టిఫికేట్లనే జారీ చేసేందుకు నిర్ణయించిన ఏపీ రవాణా శాఖ
Rudraఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్సు, ఆర్‌ సీలను ఇకపై డిజిటల్ రూపంలోనే జారీ చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ ప్రకటించింది. ప్లాస్టిక్ కార్డుల జారీకి స్వస్థి పలికినట్టు వెల్లడించింది.
Telangana Rains: హైదరాబాద్ కు పట్టిన ముసురు.. నేడు, రేపు తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు
Rudraనిన్న సాయంత్రం నుంచి హైదరాబాద్ లో ముసురు పట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో జల్లులు, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తుంది. అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.
Govt Jobs in Andhra Pradesh: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్, త్వరలో 1,199 పోస్టుల భర్తీకి గ్రూప్‌–1, గ్రూప్‌–2 నోటిఫికేషన్లు, వివరాలను వెల్లడించిన ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌
Hazarath Reddyఏపీలో త్వరలో గ్రూప్‌–1, గ్రూప్‌–2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్‌–1, గ్రూప్‌–2 నోటిఫికేషన్లకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు.
YS Sharmila: గజ్వేల్ పర్యటనకు వెళ్తున్న షర్మిలను అడ్డుకున్న పోలీసులు.. హౌస్ అరెస్ట్.. పర్యటనకు అనుమతి లేదని వెల్లడి.. పోలీసులతో వాగ్వాదానికి దిగిన షర్మిల.. లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్త వాతావరణం
Rudraసిద్దిపేట జిల్లాలోని సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ లో పర్యటించేందుకు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల సిధ్ధమయ్యారు. ఈ క్రమంలో లోటస్ పాండ్ నుంచి బయటకు వస్తున్న ఆమెను పోలీసులు అడ్డుకున్నారు.
Tomato Price Drop: సామాన్యులకు గుడ్ న్యూస్.. రూ.60కి దిగొచ్చిన టమాటా ధర... కిలో రూ.30కే లభించే తరుణం రాబోతుంది!!
Rudraనిత్యావసరాల ధరల మంటతో కుదేలైన సామాన్యులకు శుభవార్త. దేశంలో ఇప్పటికే చాలా చోట్ల కిలో రూ.60-రూ.80 చొప్పున టమాటా కొనుగోలు చేస్తున్న ప్రజలకు మరింత ఉపశమనం లభించనుంది.
Tirumala Update: శ్రీవారి భక్తులకు కర్రల పంపిణీ.. చిన్నారులపై చిరుతల దాడుల కారణంగా నడక దారిలో తగ్గిన భక్తులు (వీడియోతో)
Rudraచిన్నారులపై చిరుతల దాడుల కారణంగా 15 ఏళ్ల లోపు పిల్లలను మధ్యాహ్నం 2 గంటల తర్వాత నడకదారిలోకి అనుమతించడం లేదు. దీంతో చాలా మంది పిల్లలతో బస్సుల్లో వెళ్తున్నారు. దీంతో తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తుల సంఖ్య తగ్గింది.
Rains in Telugu States: బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేటి నుంచి మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వానలు.. పూర్తి వివరాలు ఇదిగో..
Rudraతూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన నేడు అల్పపీడనంగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంలోఆంద్రప్రదేశ్ లోని కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాలతో పాటు తెలంగాణలోని మరికొన్ని జిల్లాల్లో నేటి నుంచి 21వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Weather Forecast: రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్, బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం, రేపు అల్పపీడనంగా బలపడే అవకాశం
Hazarath Reddyఆగ్నేయ బంగాళాఖాతం దాని అనుకొని తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం ఆవరించి ఉంది. ఇది రేపు అల్పపీడనంగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంలో కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
TDP MLA Jaleel Khan: తెలుగు ప్రజల కోసం ప్రధాని పదవిని వదిలేసుకున్న త్యాగమూర్తి చంద్రబాబు, ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన టీడీపీ సీనియర్ నాయకులు జలీల్ ఖాన్
Hazarath Reddyవిజయవాడ పశ్చిమ టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ చంద్రబాబు మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడుకు ప్రధాని పదవి ఇస్తానంటే నాకు నా తెలుగు రాష్ట్ర ప్రజలే కావాలని ప్రధాని పదవి వదులుకున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు.
Protest in Adani Gangavaram Port: కనీస వేతనం రూ.36వేలు చెల్లించాలంటూ గంగవరం పోర్టు ముట్టడించిన కార్మికులు, పలువురు కార్మికులు, పోలీసులకు తీవ్ర గాయాలు
Hazarath Reddyవిశాఖపట్నంలోని గంగవరం పోర్టు వద్ద కార్మికులు చేపట్టిన ‘పోర్టు బంద్‌’ ఉద్రిక్తతకు దారి తీసింది. కార్మికులు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి.తొలగించిన పోర్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు కనీస వేతనం రూ.36వేలు చెల్లించాలనే డిమాండ్లతో కార్మిక సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి.