ఆంధ్ర ప్రదేశ్
CM KCR on AP Power Supply: వీడియో ఇదిగో, ఏపీ కరెంట్ కోతలపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు, తెలంగాణ 24 గంటల కరెంటుతో వెలుగుతోందని వెల్లడి
Hazarath Reddyఆనాడు తెలంగాణ వస్తే చిమ్మచీకటి అయిపోతది అని శాపాలు పెట్టారు. ఈరోజు తెలంగాణ 24 గంటల కరెంటుతో వెలుగు జిలుగులతో వెలిగిపోతుంది. ఆంధ్ర ప్రదేశ్ మాత్రం చిమ్మచీకటి అయిపోయింది - సీఎం కేసీఆర్
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక సమావేశం, ఉద్యోగులపై వరాలు కురిసే అవకాశం, సీపీఎస్‌పై కీలక నిర్ణయం దిశగా కేబినెట్‌లో చర్చ, ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో ఉత్కంఠ
VNSసీఎం జగన్ మోహన్ రెడ్డి (CM jagan mohan reddy) ఆధ్వర్యంలో ఉదయం 11గంటలకు సెక్రటేరియట్‌లో ఏపీ మంత్రివర్గ సమావేశం (AP Cabinet meeting) జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనున్న నేపథ్యంలో కొత్త పథకాల అమలు, ప్రస్తుతం అమలవుతున్న పథకాలను మరింత ముందుకు తీసుకెళ్లడం వంటి అంశాలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది.
CM Jagan Mohan Reddy Action Plan : ఆంధ్రప్రదేశ్ ఐటీ హబ్‌గా విశాఖపట్నం, కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్న ఏపీ ప్రభుత్వం,
Hazarath Reddyజీఐఎస్ 23 (గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్)లో కుదుర్చుకున్న ఎంఓయూల అమలుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు
CM Jagan Mohan Reddy Polavaram Tour: పోలవరం నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కాలనీల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేయండి, అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు
Hazarath Reddyపోలవరం నిర్వాసిత కుటుంబాలకు పునరావాసంపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. పునరావాసం కాలనీల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. షెడ్యూల్‌ ప్రకారం నిర్వాసిత కుటుంబాలను తరలించాలని పేర్కొన్నారు.
TDP MLA Nimmala Ramanaidu Arrest: టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామా నాయుడు అరెస్ట్, ఏటి గట్టునే నిద్ర, స్నానం చేసి వినూత్న నిరసన తెలిపిన పాలకొల్లు ఎమ్మెల్యే
Hazarath Reddyదళితుల భూముల్లో మట్టి తవ్వకాలకు వ్యతిరేకంగా టీడీపీ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చేపట్టిన నిరసన ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దళితులకు మద్దతుగా రామానాయుడు చేపట్టిన ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో ఆయన్ను అరెస్ట్ చేయనీయకుండా టీడీపీ నాయకులు, స్థానికులు అడ్డుకున్నారు.
Andhra Pradesh: నరసన్నపేటలో ఆర్టీసీ బస్సు బోల్తా, స్టీరింగ్‌ విరగడంతో అదుపుతప్పి బోల్తాపడిన APSRTC బస్సు, డ్రైవర్‌, కండక్టర్‌తో సహా 19 మందికి గాయాలు
Hazarath Reddyశ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. బస్సు శ్రీకాకుళం నుంచి పాతపట్నం వైపు వెళ్తుండగా.. జాతీయ రహదారిపై కోమర్తి జంక్షన్‌ వద్ద స్టీరింగ్‌ విరిగిపోవడంతో బస్సు అదుపు తప్పింది. ఈ ఘటనలో డ్రైవర్‌, కండక్టర్‌ సహా 19 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి
CM Jagan Mohan Reddy Polavaram Visit: కొనసాగుతున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి పోలవరం పర్యటన, ప్రాజెక్ట్ పనులపై అధికారులతో సమీక్షా సమావేశం
Hazarath Reddyముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఏలూరు జిల్లా పోలవరంలో పర్యటించారు. పోలవరం ప్రాజెక్ట్‌ పనులను పరిశీలించి.. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ముందుగా పోలవరం ప్రాజెక్ట్‌ ప్రాంతంలో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే చేపట్టారు. ఏరియల్‌ సర్వే ద్వారా పోలవరం పనులను పరిశీలించారు.
Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు ఏపీ వాసులు మృతి, మరో 13 మందికి తీవ్ర గాయాలు
Hazarath Reddyకర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నంద్యాల జిల్లా వెలుగోడుకు చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు కలబురిగిలోని దర్గా ఉర్సుకు వెళ్లి వస్తుండగా యాదగిరి జిల్లాలో దుర్ఘటన చోటుచేసుకుంది. అదుపు తప్పిన జీపు రోడ్డు పక్కన ఆగివున్న లారీని బలంగా ఢీకొట్టింది.
Andhra Pradesh: వీడియో ఇదిగో, అనకాపల్లిలో మద్యం వ్యాన్ బోల్తా, బీర్ బాటిళ్ళ కోసం ఎగబడిన జనాలు, దాదాపు 200 కేసుల బీరు సీసాలు నేల పాలు
Hazarath Reddyఅనకాపల్లి - బయ్యవరం వద్ద జాతీయ రహదారిపై మద్యం లోడుతో వెళుతున్న వ్యాన్ అదుపుతప్పి ప్రమాదవశాత్తు రహదారిపై బోల్తా పడింది. అనకాపల్లి మద్యం డిపో నుంచి నర్సీపట్నానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 200 కేసుల బీరు సీసాలు నేల పాలయ్యాయి. వీటిలో పగలని సీసాలను తీసుకెళ్లేందుకు స్థానిక జనం ఎగబడ్డారు.
AP CM YS Jagan Mohan Reddy Polavaram Visit: పోలవరం పర్యటనకు బయల్దేరిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. అధికారులకు కీలక సూచనలు చేసే అవకాశం
Rudraఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలవరం పర్యటనకు బయల్దేరారు. ఉదయం 10.15 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో అమరావతి నుంచి పోలవరం వద్దకు ఆయన చేరుకుంటారు. ఇప్పటికే అధికారులు పోలవరం ప్రాజెక్టు వద్ద హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేశారు.
AP CM YS Jagan Mohan Reddy: రేపు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి జగన్ ఏలూరు జిల్లా పర్యటన, పోలవరం ప్రాజెక్ట్‌ పనుల పరిశీలన
kanhaఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అలాగే అధికారులతో నిర్మాణ పనులపై చర్చించనున్నారు.
Prabhas In Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభాస్.. పట్టు వస్త్రాలతో సత్కరించిన ఆలయ అధికారులు.. వీడియో ఇదిగో
Rudraతిరుపతిలో నేడు ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రభాస్ ఈ తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. సుప్రభాత సేవలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.
Road Accident: కర్ణాటకలో ఆగివున్న లారీని ఢీకొట్టిన జీపు.. ఐదుగురు ఏపీవాసుల దుర్మరణం.. మరో 13 మందికి గాయాలు.. కలబురిగిలో దర్గా ఉర్సుకు వెళ్లి వస్తుండగా ఘటన
Rudraకర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీలోని నంద్యాల జిల్లా వెలుగోడుకు చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. అదుపు తప్పిన జీపు రోడ్డు పక్కన ఆగివున్న లారీని బలంగా ఢీకొట్టింది.
Guntur Road Accident: గుంటూరు జిల్లాలో ట్రాక్టర్ బోల్తా, ఆరుగురు అక్కడికక్కడే మృతి, పలువురికి గాయాలు, ట్రాక్టర్‌లో 30 మంది ఉన్నట్లు సమాచారం
Hazarath Reddyగుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వట్టిచెరుకూరు వద్ద ట్రాక్టర్ బోల్తా పడిన దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
Peddireddy on Early Elections: ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి, క్లారిటీ ఇచ్చిన మంత్రి పెద్దిరెడ్డి, వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని వెల్లడి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయంటూ వస్తున్న ఊహాగానాలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ముందస్తుకు వెళ్లే ఆలోచన వైసీపీకి లేదని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వస్తాయని చెప్పారు.
Odisha Triple Train Crash: ఒడిశా రైలు ప్రమాదం, ఇంకా తెలియని 28 మంది ఏపీ వాసుల ఆచూకి, మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్
Hazarath Reddyఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద దుర్ఘటన మృతుల్లో ఏపీకి చెందిన వారుంటే.. వారి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.5 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.1 లక్ష చొప్పున అందించాలన్నారు.
Fire In Train: మచిలీపట్నం నుండి తిరుపతి వెళుతున్న ట్రైన్ లో మంటలు.. అప్రమత్తతతో తప్పిన ముప్పు
Rudraఆదివారం రాత్రి మచిలీపట్నం (Machilipatnam) నుండి తిరుపతి (Tirupati) వెళుతున్న ట్రైన్ లో (Train) టంగుటూరు స్టేషన్ సమీపంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సిబ్బంది, ప్రయాణికులు అప్రమత్తమవడంతో ఎవరికి ఎటువంటి ఆపద లేకుండా సురక్షితంగా బయటపడినట్లు సమాచారం.
Temperatures To Sore In Telugu States: రేపటి నుంచి తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమే.. మంగళవారం నుంచి అల్లాడించనున్న సూరీడు.. జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిక
Rudraరేపటి నుంచి తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిగా మారనున్నాయి. తెలంగాణలో మంగళవారం నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
JEE Advanced 2023: నేడు జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ పరీక్ష.. జేఈఈ మెయిన్‌లో కటాఫ్‌ మార్కులు పొందిన 2.50 లక్షల మంది.. తెలుగు రాష్ట్రాల నుంచి పోటీపడనున్న 35 వేల మంది
Rudraదేశంలోని 23 ఐఐటీల్లో వచ్చే విద్యా సంవత్సరం (2023-24) బీటెక్‌ సీట్ల భర్తీకి ఆదివారం జేఈఈ అడ్వాన్స్‌ డ్‌ పరీక్ష నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్‌లో కటాఫ్‌ మార్కులు పొంది ఉత్తీర్ణులైన 2.50 లక్షల మంది అడ్వాన్స్‌ డ్‌ పరీక్ష రాయడానికి అర్హులు కాగా...వారిలో సుమారు 1.90 లక్షల మందే పోటీపడనున్నారు.
Odisha Train Tragedy Update: ఒడిశా రైలు దుర్ఘటనతో 90 రైళ్ల రద్దు.. 46 రైళ్ల దారి మళ్లింపు.. పూర్తి జాబితా ఇదిగో..
Rudraఒడిశాలో మూడు రైళ్ల ఘోర ప్రమాదంతో దక్షిణ, ఆగ్నేయ రైల్వేజోన్లలో 90 రైళ్లను రద్దు చేసి, 46 రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. సర్వీసులను రద్దు చేయడంతో చెన్నై సహా పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు విజయవాడ రైల్వేస్టేషనులో శనివారం ఉదయం నుంచి పడిగాపులు కాశారు.