ఆంధ్ర ప్రదేశ్

Viveka Murder Case: వివేకా హత్య కేసుకు సంబంధించి అవినాష్‌ రెడ్డి విడుదల చేసిన వీడియో ఇదిగో, పలు ప్రశ్నలను సంధించిన కడప ఎంపీ

Hazarath Reddy

వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. కాగా, వివేకా హత్యకు సంబంధించి ఎంపీ అవినాష్‌ రెడ్డి ఓ వీడియో రిలీజ్‌ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇస్తూ అవినాష్‌ రెడ్డి వీడియోను విడుదల చేశారు.

Kidney Racket Busted in Vizag: విశాఖలో కిడ్నీ అమ్మితే రూ. 8. 5 లక్షలు, నా కిడ్నీ అమ్మేశారంటూ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

విశాఖపట్నంలో కిడ్నీ రాకెట్ వ్యవహారం కలకలం సృష్టించింది. కిడ్నీ రాకెట్‌ ఘటనపై విశాఖ కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. ఈ దారుణానికి పాల్పడిన తిరుమల ఆసుపత్రి రిజిస్ట్రేషన్‌, అనుమతులపై ఆరా తీస్తున్నారు.

Visakha Woman Death Case: విశాఖ బీచ్‌లో గర్భిణి మహిళ మృతి కేసులో పురోగతి, అత్తమామల వేధింపులతో ఆత్మహత్య చేసుకుందని నిర్థారించిన పోలీసులు

Hazarath Reddy

విశాఖ వైఎంసీఏ బీచ్‌లో మహిళ మృతదేహం కలకలం రేపింది. మృతురాలిని పెదగంట్యాడకు చెందిన శ్వేతగా గుర్తించారు. ఈ కేసులో శ్వేత కాల్ రికార్డింగ్స్, పోస్టుమార్టం రిపోర్టు కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే శ్వేత తల్లి రమాదేవి స్టేట్‌మెంట్‌ను త్రీటౌన్‌ పోలీసులు నమోదు చేశారు.

AP Inter Results 2023: విద్యార్థులకు మరో అవకాశం, నేటి నుంచి ఇంటర్ ఫలితాల రీకౌంటింగ్‌, మార్కులు తక్కువ వస్తే రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు

Hazarath Reddy

ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని ఆందోళన చెందుతున్న వారికి మరో అవకాశం ఉంది. ఫలితాలపై ఏవైనా సందేహాలుంటే... ఇంటర్ బోర్డుకు అభ్యంతరాలు తెలియజేయవచ్చు. ఇంటర్ విద్యార్థులు తమ సందేహాలను నేటి నుండి మే 6 వరకు బోర్డుకు తెలియజేయవచ్చు. రీకౌంటింగ్ మరియు రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

Viveka Murder Case: వివేకా హత్య కేసుపై స్పందించిన షర్మిల, మా చిన్నాన్నది ఆస్తి కోసం జరిగిన హత్య కాదని వెల్లడి

Hazarath Reddy

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి ఆస్తులపై వైటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వివేకా పేరుపై ఉన్న ఆస్తులన్నీ ఎప్పుడో సునీత పేరు మీదే రాశారని తెలిపారు. ఆస్తులన్నీ ఎప్పట్నుంచో సునీత పేరు మీదే ఉన్నాయి. సునీత పేర ఆస్తులన్నీ ఉంటే వేరే వారికి రాస్తారనడంలో అర్థమే లేదు.

Minor Girl Suicide Case: విజయవాడ బాలిక ఆత్మహత్య కేసు, మాజీ టీడీపీ నేత వినోద్‌కుమార్‌ జైన్‌కు జీవిత కాల శిక్ష, రూ.3 లక్షల జరిమానా విధించిన పోక్సో కోర్టు

Hazarath Reddy

బాలిక ఆత్మహత్య కేసులో మాజీ టీడీపీ నేత వినోద్‌కుమార్‌ జైన్‌కు జీవిత కాల శిక్ష, రూ.3 లక్షల జరిమానా పోక్సో కోర్టు విధించింది. సెక్షన్‌ 305 కింద జీవితకాల జైలుశిక్షను విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. పోక్సో యాక్ట్‌ 9,10 సెక్షన్ల కింద ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

AP Inter Result 2023: ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల, ఫస్ట్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఒకేసారి, ఫలితాలను bie.ap.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Hazarath Reddy

ఏపీ ఇంటర్మీడియట్‌ ఫలితాలు (AP Inter Results) విడుదల అయ్యాయి. విజయవాడలో సాయంత్రం 6.40 గంటలకు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల (AP Inter Results) చేశారు. వృత్తి విద్య కోర్సుల పరీక్ష ఫలితాలనూ కూడా వెల్లడించారు.

AP Inter Result 2023: మే 24 నుంచి జూన్ 1 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు, రీవెరిఫికేషన్ కి మే 6 లోపు అప్లై చేసుకోవాలని తెలిపిన మంత్రి బొత్స

Hazarath Reddy

ఏపీలో ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులతో కలిసి ఫలితాలను విడుదల చేశారు. ఒకేసారి ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు విడుదల చేశారు. విద్యాశాఖ కేవలం 22 రోజుల వ్యవధిలో ఫలితాలు విడుదల చేసింది.

Advertisement

AP Inter Results 2023: ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు ఆలస్యం, అమరావతికి ఆలస్యంగా చేరుకున్న మంత్రి బొత్స...

kanha

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు గంటసేపు ఆలస్యం కానున్నాయి. ఈరోజు సాయంత్రం 6 గంటలకు విడుదల కావాల్సిన ఇంటర్మీడియట్ ఫలితాలు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అందుబాటులో లేకపోవడం వల్ల గంటపాటు నిలిపివేశారు.

Andhra Pradesh: చదువుల దేవుడు జగన్, జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తిన విద్యార్థిని

Hazarath Reddy

సీఎం జగన్ మోహన్ రెడ్డి లాంటి నాయకుడిని ఆంధ్రప్రదేశ్ యువత ఇష్టపడుతోంది.అనంతపురంలో జగనన్న వసతి దీవెన నిధులు విడుదల సందర్భంలో ఓ విద్యార్థిని జగన్ లాంటి నాయకుడ ఉండటం మా అదృష్టమని కొనియాడింది. వీడియో ఇదే..

Jagananna Vasathi Deevena: జగనన్న వసతి దీవెన నిధులు విడుదల, చంద్రబాబుపై పంచతంత్రం కథ వినిపించిన సీఎం జగన్

Hazarath Reddy

దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 9,55,662 మంది విద్యార్థుల తల్లుత ఖాతాల్లో రూ.912.71 కోట్లు జమ చేయనున్నాం. ఆంధ్రప్రదేశ్ లో భావితరాలను ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దే గొప్ప ఉద్దేశంతో జగనన్న వసతి దీవెన పథకం ప్రారంభించామని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు.

Chandrababu Praises PM Modi: బీజేపీతో పొత్తుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు, మోదీ విజన్ సూపర్ అంటూ ప్రశంసలు, రిపబ్లిక్ చర్చలో టీడీపీ అధినేత ఇంకా ఏమన్నారంటే..

Hazarath Reddy

జాతీయ మీడియా న్యూస్ ఛానల్స్‌ రిపబ్లిక్ టీవీ నిర్వహించిన చర్చా వేదికలో (Republic Summit) పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandra Babu) మోదీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఎన్ చంద్రబాబు నాయుడు బహిరంగంగానే గట్టిగా సమర్థించారు.

Advertisement

AP Schools Summer Holidays 2023: ఏపీలో మే 1 నుంచి జూన్ 11వ తేదీ దాకా వేసవి సెలవులు, జూన్ 12వ తేదీ నుండి కొత్త అకడమిక్ ఇయర్ పునఃప్రారంభం

Hazarath Reddy

ఏపీలో విద్యాసంస్థలకు వేసవి సెలవుల తేదీలపై విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. ఏప్రిల్‌ 30వ తేదీని ఈ అకడమిక్‌ ఇయర్‌ చివరి తేదీగా ప్రకటించిన విద్యాశాఖ.. మే 1 నుంచి జూన్‌ 11వ తేదీ దాకా పాఠశాలలకి వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు పేర్కొంది.

Weather Forecast in AP: ఏపీ ప్రజలకు చల్లని కబురు, మరో వారం పాటు వడగాడ్పులు ఉండవని తెలిపిన వాతావరణ శాఖ

Hazarath Reddy

ఏపీ వాసులకు వాతావరణశాఖ చల్లని కబురును చెప్పింది. మరో వారం పాటు వడగాడ్పులు ఉండవని వాతావరణ­శాఖ ప్రకటించింది. ఇటీవలి వరకు రాష్ట్రంలో అనేక ప్రాం­తాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 3 నుంచి 7 డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యాయి.

DSP Transfers in AP: 77 మంది డీఎస్పీలను బదిలీ చేసిన జగన్ సర్కారు, ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో సుమారు 77 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ.. డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఈ ఉత్తర్వులను జారీ చేశారు. విశాఖకు సంబంధించి బదిలీ అయ్యిన వారిలో ..అనకాపల్లిలో ఏడీపీఓగా విధులు నిర్వర్తిస్తున్న సునీల్‌కి విశాఖ క్రైమ్‌ ఏసీపీగా బదిలీ, ఏసీబీ డీఎస్పీగా ఉన్న సుబ్బరాజుకి అనకాపల్లి ఎస్‌డీపీఓగా బదిలీ అయ్యారు.

AP Inter Results 2023: రేపు సాయంత్రం ఒకేసారి ఏపీ ఫస్ట్‌, సెకండియర్‌ ఫలితాలు విడుదల, bie.ap.gov.in ద్వారా మీ రిజల్ట్స్ చెక్ చేసుకోండి

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియేట్ ఫలితాలు బుధవారం వెలువడనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి శేషగిరి రావు వెల్లడించారు. ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సర ఫలితాలు ఒకేసారి విడుదల కానున్నాయి. ఇటీవల సంవత్సరాల్లో ఇలా ఒకేసారి ఫస్ట్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రిలీజ్ చేయడం ఇదే మొదటిసారి.

Advertisement

Weather Forecast: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్, రానున్న రోజుల్లో వాతావరణంలో తీవ్ర మార్పులు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల ప్రజలకు విశాఖ వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది. మునుపెన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపింది.

Maharashtra Farmer Meets CM Jagan: కాబోయే ప్రధాని జగన్, మహారాష్ట్ర రైతును ఆప్యాయంగా పలకరించిన ఏపీ ముఖ్యమంత్రి, 800 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన అభిమాని

Hazarath Reddy

మహారాష్ట్ర రైతు సీఎం జగన్ పై అభిమానంతో మహారాష్ట్ర నుంచి సైకిల్ తొక్కుతూ తాడేపల్లికి చేరుకున్నారు. ఆ రైతు పేరు కాకా సాహెబ్ లక్ష్మణ్ కాక్డే. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాకు చెందినవాడు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నా, ఆయన విధానాలు అన్నా లక్ష్మణ్ కాక్డే ఎంతో అభిమానించేవాడు. దాంతో జగన్ ను ఎలాగైనా కలవాలని నిశ్చయించుకున్నాడు.

JC Prabhakar Reddy Protest Video: వీడియో ఇదిగో, తాడిపత్రి మున్సిపల్‌ కార్యాలయం ఎదుటే బట్టలు విప్పి స్నానం చేసిన జేసీ ప్రభాకర్‌రెడ్డి

Hazarath Reddy

తాడిపత్రి మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలకు నిరసనగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి నిరసన కొనసాగిస్తున్నారు. సోమవారం రాత్రి నుంచి నిరసన చేపట్టిన ఆయన.. మంగళవారం ఉదయం మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో ఆరుబయటే స్నానం చేసి మళ్లీ నిరసన శిబిరంలో కూర్చున్నారు.

YS Sharmila Case Update:వైయస్ షర్మిలకు 14 రోజుల రిమాండ్... చంచల్ గూడ జైలుకు తరలింపు.. నిన్న పోలీసులతో వాగ్వాదం అనంతరం చేయి చేసుకున్న షర్మిల... కేసు నమోదు.. బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ

Rudra

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆమెను చంచల్ గూడ జైలుకు తరలించారు. మే 8వ తేదీ వరకు ఆమె రిమాండులో ఉండనున్నారు.

Advertisement
Advertisement