ఆంధ్ర ప్రదేశ్
Andhra Pradesh: అయ్యన్నపాత్రుడికి సీఆర్‌పీసీ 41ఏ ప్రకారం నోటీసు ఇవ్వండి, సెక్షన్ 467 ఈ కేసులో వర్తించదని తీర్పు వెలువరించిన ఏపీ హైకోర్టు, సీఐడీ విచారించుకోవచ్చని స్పష్టం
Hazarath Reddyఏపీ హైకోర్టులో టీడీపీ సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడికి సంబంధించిన పిటిషన్ పై విచారణ జరిగింది. తన పైన సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు (High Court ) బుధవారం కీలక ఆదేశాలు ఇచ్చింది.
Andhra Pradesh: అల్లుడు ఆత్మహత్య, వైసీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, విషాదంలో బాధ్యతలను పర్యవేక్షించలేనని సీఎం జగన్‌కు లేఖ
Hazarath Reddyజగన్ కు రాసిన లేఖలో తన రాజీనామాకు గల కారణాలను రామచంద్రారెడ్డి వివరించారు. రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథరెడ్డి ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కూతురు భర్త ఆత్మహత్యతో రామచంద్రారెడ్డి తీవ్ర విషాదంలో కూరుకుపోయారు.
Raghuveera Reddy Dance Video: రఘువీరా రెడ్డి డ్యాన్స్ వీడియో వైరల్, మనుమరాలితో సరదాగా డ్యాన్స్ వేసిన ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి
Hazarath Reddyఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి రఘువీరా రెడ్డి ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తన మనుమరాలితో సరదాగా డ్యాన్స్ వేసిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. టీవీలో ఓ పాట పెట్టి.. దానికి అనుగుణంగా రఘువీరా తన మనుమరాలితో కలిసి డ్యాన్స్ వేశారు.
Andhra Pradesh: రాజమండ్రి వద్ద పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు, విశాఖ వెళ్లే తొమ్మిది రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ, 2 రైళ్లు పాక్షికంగా రద్దు
Hazarath Reddyరాజమండ్రి బాలాజీపేట వద్ద గూడ్స్‌ రైలు పట్టింది. విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా, బుధవారం తెల్లవారుజామున గూడ్స్‌ రైలు భోగి పూర్తిగా పట్టాలపై పడిపోయింది. ఇక, ఈ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు వెంటనే స్పందించారు.
Andhra Pradesh: రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, రద్దు అయిన తొమ్మిది రైళ్లు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఫలితంగా తొమ్మిది రైళ్లు రద్దు చేయబడ్డాయి. దక్షిణ మధ్య రైల్వే, విజయవాడ డివిజన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రాజమండ్రి యార్డు మెయిన్ లైన్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్షసూచన, రానున్న మూడు రోజుల పాటూ అప్రమత్తంగా ఉండాలంటూ సూచన, అల్పపీడనం ప్రభావం ఏయే జిల్లాలపై ఉంటుందో తెలుసా?
Naresh. VNSఈ ఆవర్తన ప్రభావంతో వచ్చే 48 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం (low pressure) ఏర్పడే అవకాశం ఉందంది. నవంబర్ 9 నుంచి 11 వరకు వాయువ్య దిశగా తమిళనాడు, పుదుచ్చేరి తీరం వైపు అల్పపీడనం కదిలే అవకాశం ఉందని, దీని కారణంగా రాగల మూడు రోజులపాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Obulapuram Mining Case: ఒబులాపురం మైనింగ్‌ కేసులో ఐఏఎస్‌ శ్రీలక్ష్మికి క్లీన్‌చిట్‌, శ్రీలక్ష్మిపై అభియోగాలను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు
Hazarath Reddyఐఏఎస్‌ శ్రీలక్ష్మికి ఓఎంసీ(ఒబులాపురం మైనింగ్‌)కేసులో తెలంగాణ హైకోర్ట్‌ క్లీన్‌చిట్‌ ఇచ్చింది.ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మిపై అభియోగాలను కోర్టు కొట్టివేసింది.కాగా, ఈ కేసులో శ్రీలక్ష్మి ఏడాది పాటు జైలులో ఉన్నారు. ఇక, 2004-09 వరకు శ్రీలక్ష్మి మైనింగ్‌ శాఖకు ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఉన్నారు.
Global Investors Summit 2023: వీడియో, గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌-2023 లోగోను ఆవిష్కరించిన ఏపీ సీఎం జగన్
Hazarath Reddyవిశాఖలో జరగనున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌-2023 లోగోను క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌. పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్ తదితర ఉన్నతాధికారులు హాజరు.
Global Investors Summit 2023: పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ సర్కారు మరో ముందడుగు, వచ్చే ఏడాది మార్చి 3,4వ తేదీల్లో విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌-2023, లోగో ఆవిష్కరించిన సీఎం జగన్
Hazarath Reddyరాష్ట్రానికి పెట్టుబడులే ధ్యేయంగా ముందుకెళ్తున్న ఏపీ ప్రభుత్వం మరో అడుగేసింది. విశాఖపట్నంలో జరగబోయే గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌- 2023 ( Global Investors Summit 2023) లోగోను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.
Hyderabad Shocker: రాత్రిపూట రోడ్డుపై కామాంధులు, ఒంటరిగా ఇంటికి వెళ్తున్న బాలికను స్కూలు వెనకకు లాక్కెళ్లి అత్యాచార యత్నం, బాలిక కేకలు వేయడంతో పారిపోయిన రేపిస్టులు
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన (Hyderabad Shocker) చోటు చేసుకుంది. ఇద్దరు మైనర్లు బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారయత్నానికి పాల్పడ్డారు.
Lunar Eclipse: విజయవాడ కనకదుర్గ ఆలయం మూసివేత, ఉదయం 8 గంటల నుంచి ఇంద్రకీలాద్రి పై అమ్మవారి ఆలయం మూసివేసినట్లు తెలిపిన అధికారులు
Hazarath Reddyచంద్ర గ్రహణము కారణంగా అమ్మవారి ప్రధానాలయం మూసివేశారు.ఉదయం 8 గంటల నుంచి ఇంద్రకీలాద్రి పై అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు మూసివేస్తునట్లు అధికారులు ప్రకటించారు. రేపు యథావిధిగా ఆలయాలు తలుపులు తెరుచుకుంటాయి.
Weather Forecast: ఏపీలో మళ్లీ వానలు, రేపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం, వచ్చే రెండు రోజుల నుంచి బలమైన ఈదురుగాలులతొ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన ఐఎండీ
Hazarath Reddyఏపీని ఇప్పట్లో వర్షాలు వీడేలా లేవు, మరో రెండు రోజుల్లో రాష్ట్రంలో మళ్లీ వానలు (IMD Predicts Rains) మొదలుకానున్నాయని ఐఎండీ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడిన తరువాత ఈ వర్షాలు మరింత ఊపందుకోనున్నాయి.
Koti Deepotsavam: విజయవాడలో కోటి దీపోత్సవం వీడియో, ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు
Hazarath Reddyకార్తీక మాసం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారుసర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కార్తీక మాసం, చంద్రగ్రహణం ఒకే రోజు రావడంతో భక్తులు ఆలయానికి పోటెత్తారు. అక్కడ కోటి దీపోత్సవం నిర్వహించారు. విజయవాడలో కోటి దీపోత్సవం వీడియో ఇదే..
Lunar Eclipse: నేడే చంద్ర గ్రహణం.. హైదరాబాద్‌లో సాయంత్రం 5.40 గంటలకు ప్రారంభం కానున్న గ్రహణం.. 46 నిమిషాలపాటు కొనసాగి ముగియనున్న వైనం.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం సంపూర్ణ చంద్రగ్రహణం.. ఈ ఏడాదికి ఇదే చివరి గ్రహణం
Sriyansh Sనేడు చంద్రగ్రహణం కావడంతో ప్రముఖ ఆలయాలన్నీ మూతపడ్డాయి. హైదరాబాద్‌లో గ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది. సాయంత్రం 5.40 గంటలకు ప్రారంభమయ్యే గ్రహణం 46 నిమిషాలపాటు కొనసాగి 7.26 గంటలకు ముగుస్తుందని జీపీ బిర్లా ఇనిస్టిట్యూట్ తెలిపింది.
Andhra Pradesh: వీడియో ఇదే, ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణలో భాగంగా వైఎస్సార్ విగ్రహం తొలగింపు, ఈ విగ్రహాన్ని వేరే చోటకు మార్చేందుకు ప్రయత్నాలు
Hazarath Reddyఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఏపీ ప్రభుత్వం అక్రమ నిర్మాణాలను తొలగించింది. అయితే కక్షపూరితంగానే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు.అయితే విస్తరణలో భాగంగా ప్రభుత్వ అధికారులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించారు. దానికి సంబంధించిన వీడియో ఇదే..
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వానికి మరో ప్రతిష్టాత్మక అవార్డు, ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థకి ఫ్యూచర్ ఎకానమీ లీడర్‌షిప్ అవార్డు, RySSకు ప్రపంచ స్థాయి గుర్తింపు
Hazarath Reddyఈజిప్టులో నవంబర్ 5 -6 రోజుల్లో నిర్వహించినటువంటి ఐక్యరాజ్యసమితి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (CoP27) లో ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ (RySS) 2022 కి ప్రతిష్టాత్మకమైన ‘ఫ్యూచర్ ఎకానమీ లీడర్‌షిప్ అవార్డు’ లభించింది.
CM Jagan in Action: రైతులకు అన్నీ సదుపాయాలు కల్పించండి, ప్రభుత్వానికి ఎక్కడా మాట రాకూడదు, వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష
Hazarath Reddyవ్యవసాయ శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోమవారం సమీక్ష (CM YS Jagan Review Meeting) నిర్వహిచారు. ఈ సమావేశానికి మంత్రులు కాకాణి గోవర్థన్‌రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
TTD Revenue: తిరుమల శ్రీవారి ఆస్తుల వివరాలు ఇవే, రూ.వివిధ రూపాల్లో 2.5 లక్షల కోట్లు ఉంటుదని అంచనా, శ్వేత పత్రం విడుదల చేసిన టీటీడీ
Hazarath Reddyకలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్తులు రూ.2.5 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. నగదు, బంగారం, బ్యాంకుల్లో డిపాజిట్లు తదితర ఆస్తుల ద్వారా వెంకటేశ్వర స్వామికి ఉన్న ఆస్తులు.. విప్రో, నెస్లే, ఓఎన్జీసీ, ఐవోసీతో పాటు తదితర కంపెనీల మార్కెట్‌ ఆస్తుల కంటే ఎక్కువ.
Visakha Airport Case: విశాఖ విమానాశ్రయ ఘటన.. ఏసీపీ, సీఐలపై సస్పెన్షన్ వేటు.. గత నెల 15న విశాఖ విమానాశ్రయంలో ఉద్రిక్తత.. మంత్రులపై జనసేన కార్యకర్తలు దాడిచేసినట్టు కేసుల నమోదు.. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఏసీపీ, సీఐ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు గుర్తింపు.. తాజాగా, వారిద్దరినీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు
Sriyansh Sగత నెల 15న విశాఖపట్టణం విమానాశ్రయంలో జరిగిన ఘటనకు సంబంధించి ఇద్దరు పోలీసులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.
Meta Layoffs: ట్విట్టర్‌ తర్వాత ఇప్పుడు ఫేస్‌బుక్ వంతు.. పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపునకు ‘మెటా’ సిద్ధం! 18 ఏళ్ల ఫేస్‌బుక్ చరిత్రలో ఇదే తొలిసారి.. బుధవారం ప్రకటన వచ్చే అవకాశం
Sriyansh Sఉద్యోగుల తొలగింపునకు ఇప్పుడు ఫేస్‌బుక్ మాతృసంస్థ ‘మెటా’ కూడా సిద్ధమైంది. ఈ వారంలో ఉద్యోగులకు పెద్ద ఎత్తున లేఆఫ్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్టు ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ పేర్కొంది. ఈ విషయంతో సంబంధం ఉన్న ఉద్యోగి ఒకరు ఈ విషయం చెప్పినట్టు తన కథనంలో తెలిపింది.