ఆంధ్ర ప్రదేశ్
Tirumala Temple: రేపు చంద్రగ్రహణం... తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత.. 11 గంటల పాటు ఆలయం మూసివేత.. ఉదయం 8.40 నుంచి రాత్రి 7.20 వరకు మూసివేత.. సంప్రోక్షణ, ప్రదోష కాలపు పూజల అనంతరం దర్శనాలకు అనుమతి
Sriyansh Sఇటీవలే పాక్షిక సూర్యగ్రహణం కారణంగా మూతపడిన తిరుమల శ్రీవారి ఆలయం మరోసారి మూతపడనుంది. నవంబరు 8న చంద్ర గ్రహణం సంభవించనుండడంతో, తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని 11 గంటల పాటు మూసివేయనున్నారు. ఉదయం 8.40 గంటల నుంచి రాత్రి 7.20 గంటల వరకు ఆలయ తలుపులు మూసి ఉంచుతారు.
Tamilisai : సీరియళ్లు, సినిమాల్లో నటించి వచ్చిన వారికే కెమెరా, మైక్ మేనియా ఉంటుంది. అగ్నిపర్వతం.. హిమాలయాలను ఏమీ చేయలేదని గుర్తుంచుకోవాలి. డీఎంకే పత్రిక ‘మురసోలి’ వ్యాసంపై తీవ్రంగా మండిపడిన గవర్నర్ తమిళిసై
Sriyansh Sతెలంగాణలో గొప్పలు చెప్పేందుకు వీలుకాక, తమిళనాడును విమర్శిస్తున్నారంటూ తమిళిసైని ఉద్దేశించి డీఎంకే అధికార పత్రిక ‘మురసోలి’లో ప్రచురితమైన వ్యాసంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్రస్థాయిలో స్పందించారు.
Food Poisoning in Srikakulam IIIT: 16 మంది ప్రాణాల మీదకు తెచ్చిన చపాతీలు, శ్రీకాకుళం త్రిపుల్ ఐటీలో విద్యార్ధినుల ఆరోగ్యం విషమం, అందుబాటులో లేని వైద్యులు, ఫుడ్‌ పాయిజన్ ఘటనలో పెరుగుతున్న బాధితులు ఆందోళనలో పేరెంట్స్‌, దర్యాప్తునకు ఆదేశించిన ప్రభుత్వం
Naresh. VNSశ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లోని (Srikakulam IIIT campus) గర్ల్స్ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థుల్లో 16మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం వారిని క్యాంపస్ నుంచి ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్ (food poisoning) అయిన విద్యార్థులు నిన్నటి నుంచి ఇంకా కోలుకోలేదు.
Tirumala Srivari Properties: రూ.15వేల కోట్ల నగదు, 10వేల కేజీలకు పైగా బంగారం, వేంకటేశ్వరస్వామి ఆస్తులు ప్రకటించిన టీటీడీ, మూడేళ్లలోనే భారీగా పెరిగిన తిరుమల శ్రీవారి సంపద, ఏయే బ్యాంకుల్లో ఎంత డిపాజిట్ చేశారో తెలుసా?
Naresh. VNS2019 జూన్ నాటికి రూ. 13,025 కోట్లు ఉండగా.. ప్రస్తుతం రూ. 15,938 కోట్లుకు చేరినట్టుగా పేర్కొంది. 2019 జూన్ నాటికి 7,339.74 కేజీల బంగారం నిల్వలు ఉండగా.. అది ఇప్పుడు 10,258. 37కి చేరిందని తెలిపింది. టీటీడీ డిపాజిట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెడుతున్న ప్రచారం అవాస్తవమని వెల్లడించింది. టీటీడీ ఇలా ఎప్పుడూ చేయదని తెలిపింది.
Pawan Kalyan Visits Ippatam: ప్రజల్ని ఇలాగే వేధిస్తే.... ఇడుపులపాయలో హైవే వేస్తాం! వైసీపీకి పవన్ కల్యాణ్ వార్నింగ్, ఇప్పటంలో పర్యటించిన పవన్ , రోడ్డు విస్తరణలో ఇండ్లుకోల్పోయిన వారికి అండగా ఉంటామంటూ హామీ
Naresh. VNSవైసీపీ తమకు అధికారం శాశ్వతం అని అనుకుంటోందని కానీ ప్రజలను నానా కష్టాలుపాలు చేస్తున్న వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు పవన్ కల్యాణ్. ఇళ్లు కూల్చివేయటం వంటి దౌర్జాన్యాలకు పాల్పడటం హేయమైన చర్యగా అభివర్ణించిన పవన్ కల్యాణ్..మీరు ఇలా కక్షపూరితంగా వ్యవహరిస్తు ఇళ్లు కూల్చివేస్తుంటే మేం ఇడుపులపాయలో హైవే నిర్మిస్తాం అంటూ కౌంటర్ ఇచ్చారు.
No Recce on Pawan Kalyan: పవన్‌ హత్యకు కుట్ర జరుగలేదు! రెక్కీ నిర్వహించారనే పుకార్లపై తెలంగాణ పోలీసుల క్లారిటీ, ఇంతకీ పవన్ ఇంటి ముందు జరిగిన గొడవ ఏంటో తెలుసా? రెక్కీ అంశంపై జూబ్లీహిల్స్ పోలీసుల నివేదిక
Naresh. VNSగత నెల 31న రాత్రి ఘటనపై పవన్ సెక్యూరిటీ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు.. గొడవకు కారణమైన యువకులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా మద్యం మత్తులోనే తాము పవన్ కల్యాణ్ ఇంటి వద్ద కారు ఆపామని, ఆ సమయంలో తమ కారును అక్కడి నుంచి తీయమన్న పవన్ సెక్యూరిటీ సిబ్బందితో గొడవకు దిగామని ఆ యువకులు చెప్పినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు
Andhra Pradesh: నిబంధనల ప్రకారమే మంగళగిరిలో ఇళ్ల తొలగింపు, ఆక్రమణదారులకు అనేక సార్లు నోటీసులు ఇచ్చాం, వివరణ ఇచ్చిన అధికారులు
Hazarath Reddyమంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌లోని ఇప్పటం గ్రామంలో ఆక్రమణల తొలగింపుపై (Eviction of houses in Mangalagiri) అధికారులు వివరణ ఇచ్చారు. అక్రమణల తొలగింపు ప్రక్రియలో నివాస గృహాలు ఏవీ కూల్చివేయబడలేదు.
Andhra Pradesh: పార్ట్‌-1లో పవన్‌ మీద రెక్కీ, పార్ట్‌-2లో రాయి వేసినట్టు హడావుడి, రేపు ఇప్పటంలో పవన్‌ పార్ట్‌-3 మొదలుపెడతాడు, మంత్రి జోగి రమేష్ సెటైర్
Hazarath Reddyనందిగామలో చంద్రబాబు రోడ్ షోలో రాయి పడిందనే టీడీపీ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి జోగి రమేష్‌ మండిపడ్డారు. కాగా, మంత్రి జోగి రమేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘విషపూరిత రాజకీయాలకు చంద్రబాబు చిరునామా. రాళ్లు విసిరించుకోవడం బాబుకు సాధారణమే.
Andhra Pradesh: వైసీపీ రౌడీలకు భయపడేదే లేదని చంద్రబాబు హెచ్చరిక, ఏపీని సీఎం జగన్‌రెడ్డి నాశనం చేస్తున్నారని మండిపాటు, నందిగామలో టీడీపీ అధినేత రోడ్ షో
Hazarath Reddyఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో చంద్రబాబు రోడ్ షో కొనసాగింది. చంద్రబాబు మాట్లాడుతూ..వైసీపీ నేతల (YCP Leaders)పై ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu) విమర్శలు గుప్పించారు. వైసీపీ రౌడీలకు భయపడేదే లేదని చంద్రబాబు హెచ్చరించారు.
Andhra Pradesh: చంద్రబాబు రోడ్‌షోలో రాళ్ల దాడి, చీఫ్ సెక్యూరిటీ అధికారి మధుకు గాయాలు, నందిగామలో చంద్రబాబు రోడ్ షో
Hazarath Reddyనందిగామలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్‌షోలో రాళ్ల దాడి చేశారు. చంద్రబాబు కాన్వాయ్‌ (Chandrababu Convoy)పై ఓ దుండగుడు రాయి విసిరారు. ఈ దాడిలో చంద్రబాబు, చీఫ్ సెక్యూరిటీ అధికారి (Chief Security Officer) మధు గాయపడ్డారు
TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్, నవంబర్ 8న శ్రీవారి ఆలయం 12 గంటల పాటు మూసివేత, ఆ రోజున అన్ని రకాల దర్శనాలు, ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన టీటీడీ
Hazarath Reddyనవంబర్ 8న చంద్ర గ్రహణం సందర్భంగా తిరుమలలోని శ్రీవారి ఆలయాన్ని 12 గంటల పాటు మూసివేస్తున్నట్లు (Tirumala temple to remain closed) ఆలయ అధికారులు వెల్లడించారు. ఆ రోజున అన్ని రకాల దర్శనాలు, ఆర్జిత సేవలను నిలిపివేస్తున్నామని ప్రకటించారు.
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుపై గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తేసిన ఏపీ హైకోర్టు, నిర్మాణానికి లైన్‌ క్లియర్‌
Hazarath Reddyఏపీలో భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి లైన్‌ క్లియర్‌ అయ్యింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఏపీ హైకోర్టు ఎత్తేసింది. భోగాపురం ఎయిర్‌పోర్టుపై దాఖలైన అన్ని పిటిషన్లు కోర్టు కొట్టివేసింది.
Andhra Pradesh: ఏపీలో రూ.270 కోట్లతో అసాగో ఇండస్ట్రీస్‌ ఏర్పాటు, గుమ్మళ్ళదొడ్డి వద్ద బయో ఇథనాల్‌ యూనిట్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం జగన్
Hazarath Reddyరాజమండ్రి సమీపంలోని గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి వద్ద సుమారు రూ.270 కోట్లతో అసాగో ఇండస్ట్రీస్‌ ఏర్పాటు (Rs 270 Crore BioEthanol Plant) చేస్తున్న బయో ఇథనాల్‌ యూనిట్‌ నిర్మాణ పనులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం శంకుస్థాపన (CM Jagan Lay Foundation) చేశారు.
Posani Krishna Murali: పోసాని కృష్ణమురళికి కీలక పదవి ఇచ్చిన సీఎం జగన్, ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం, ఏపీ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గా కొమ్మినేని శ్రీనివాసరావు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా పోసాని కృష్ణమురళీని నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పోసాని నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
Girls Missing in Visakha: మా కోసం వెతకవద్దు, మేము అబ్బాయిలతో వెళ్లడం లేదని లేఖ, విశాఖలో నలుగురు అమ్మాయిలు మిస్సింగ్, వెతికే పనిలో పడిన విశాఖ పోలీసులు
Hazarath Reddyవిశాఖలోని నలుగురు విద్యార్ధినిలు అదృశ్యం ( Four Girl Students Are Missing) అయ్యారు. వన్‌టౌన్‌ సమీపంలోని ప్రభుత్వ క్వీన్ మేరీ స్కూల్లో వీరంతా చదువుతున్నారు. నిన్న సాయంత్రం స్కూల్ పూర్తయిన తర్వాత ట్యూషన్‌కి వెళ్తాం అని చెప్పి.. తిరిగి (Missing In Visakhapatnam) కనిపించలేదు.
Andhra Pradesh: విజయవాడలో మసాజ్ సెంటర్ల పేరిట వ్యభిచారం, 23 మంది నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, 131 స్పా, మసాజ్‌ సెంటర్లు, హోటళ్లలో విస్తృతంగా తనిఖీలు
Hazarath Reddyఏపీలోని విజయవాడ నగరంలోని స్పా, మసాజ్, ఫిట్నెస్‌ సెంటర్‌లతో పాటు పలు హోటళ్లపై బుధవారం పోలీసులు దాడులు నిర్వహించారు. వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో 131 స్పా, మసాజ్‌ సెంటర్లు, హోటళ్లలో విస్తృతంగా తనిఖీలు (Police raid Vijayawada spas and massage centres) చేశారు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ, పోలీసులకు ఫిర్యాదు చేసిన పవన్ వ్యక్తిగత రక్షణ సిబ్బంది, కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు
Hazarath Reddyజూబ్లీ‌హిల్స్‌లోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రెండు రోజుల క్రితం వీరంగం సృష్టించారని ఆయన వ్యక్తిగత రక్షణ సిబ్బంది జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కొంతమంది వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తున్నారని చెప్పారు.
MLC Challa Dies: ఎమ్మెల్సీ చల్లా భగీరథ్‌రెడ్డి కన్నుమూత, గత కొంతకాలంగా న్యుమోనియాతో బాధడుతున్న వైసీపీ నేత, చికిత్ర పొందుతూ తిరిగిరాని లోకాలకు..
Hazarath Reddyగత కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతున్న నంద్యాల జిల్లా అవుకుకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ్‌రెడ్డి(46)కన్నుమూశారు. ఈ మధ్యనే అయ్యప్పమాల ధరించిన ఆయన.. శబరిమల వెళ్లొచ్చిన అనంతరం అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.
Ayyanna Patrudu Arrest: అయ్యన్నపాత్రుడు అరెస్ట్, ఆయనతో పాటు కొడుకు రాజేష్‌ను కూడా అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు, వారిద్దరినీ ఏలూరు కోర్టుకు తరలింపు
Hazarath Reddyటీడీపీకీ మరో షాక్ తగిలింది. ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆయన కుమారుడు రాజేష్‌ను సీఐడీ అధికారులు నర్సీపట్నంలో అదుపులోకి తీసుకున్నారు.
Andhra Pradesh: ఖరారైన సీఎం జగన్ గుమ్మళ్లదొడ్డి పర్యటన, రేపు అస్సాగో ఇండస్ట్రియల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్న ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (CM YS Jagan Mohan Reddy) శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాకు రానున్నారు. గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డిలో అస్సాగో ఇండస్ట్రియల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఇథనాల్‌) పరిశ్రమకు శంకుస్థాపన (lay foundation for ethanol industry) చేయనున్నారు.